gurmith RamRahim Singh
-
అనూహ్య పరిణామం: ఎన్నికల వేళ డేరా బాబా బయటకు!
హత్య కేసులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు స్వల్ప ఊరట లభించింది. డేరా సచ్ఛ సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఫర్లాగ్(తాత్కాలిక సెలవు) మంజూరు అయ్యింది. అదీ ఎన్నికల వేళ కావడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.. 2017లో అత్యాచార కేసులో ఇరవై ఏళ్ల శిక్ష, మేనేజర్‌తో పాటు ఓ జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్ఛ సౌధా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జీవిత ఖైదు విధించింది పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. అప్పటి నుంచి హర్యానాలోని రోహ్తక్ జిల్లా సునారియా జైలులో ప్రస్తుతం డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో జైళ్ల శాఖ అధికారులు 21 రోజుల ఫర్లాగ్ జారీ చేశారు. దీంతో ఈ సాయంత్రం(సోమవారం) గుర్మీత్ సింగ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు తన మెడికల్ చెకప్‌ల కోసం, ఆరోగ్యం బాగోలేని తల్లిని చూసుకోవడానికి 54 ఏళ్ల డేరా బాబాకు ఎమర్జెన్సీ పెరోల్ (సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం) వరకు మాత్రమే జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు 21 రోజులపాటు ఫర్లాగ్ జారీ కావడం విశేషం. చట్టం ప్రకారం ఫర్లాగ్ ప్రతీ ఖైదీ హక్కు.. అందుకే ఆయనకు జారీ చేశాం అని హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్‌సింగ్ చౌతాలా తెలిపారు. అయితే ప్రత్యేకించి కారణం ఏంటన్నది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. అయితే పొరుగు రాష్ట్రం పంజాబ్‌లో ఎన్నికలకు రెండు వారాల ముందే రహీమ్‌సింగ్ విడుదలకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. పంజాబ్ మాల్వా రీజియన్‌లో డేరా బాబాకు ఫాలోవర్లు ఎక్కువ. పైగా పంజాబ్ అసెంబ్లీ 117 స్థానాల్లో.. 69 మాల్వా రీజియన్‌లోనే ఉన్నాయి. ఇక హర్యానా బీజేపీ పాలిత రాష్ట్రంకాగా.. డేరా బాబా ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఎలాగైనా పంజాబ్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న వాదన ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే డేరా సచ్ఛ సౌధా మద్దతుతోనే 2007లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాన్ని సాధించింది. డేరా బాబా జైల్లో ఉన్నప్పటికీ.. ఆయన అనుచరులు మాత్రం భారీ ఎత్తున్న కార్యక్రమాల్ని నిత్యం నిర్వహిస్తూ.. సోషల్ మీడియాలో డేరాబాబాను, డేరా సచ్ఛ సౌధాను ట్రెండ్ చేస్తూ ఉంటారు. -
హరియాణాలో డేరా రాజకీయం
హరియాణా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని ప్రధాన పార్టీలు ఆధ్యాత్మిక బాట పట్టాయి. డేరాలు, బాబాల చుట్టూ తిరుగుతూ మద్దతు కోసం పోటీ పడుతున్నాయి. హరియాణాలో ఆధ్మాత్మిక సంస్థల ప్రభావం ఓటర్లపై విపరీతంగా ఉంటుంది. తమ ఆ«ధ్యాత్మిక గురువులు ఏ పార్టీకి ఓటు వెయ్యమని చెబితే వారికే గుడ్డిగా ఓటు వేసే అనుచరగణం అధిక సంఖ్యలోనే ఉంది. అందుకే రాజకీయాలన్నీ డేరాల చుట్టూ తిరుగుతున్నాయి. డేరా సచ్చా సౌదా గురువు: గుర్మీత్ రామ్ రహీమ్ అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలి జైల్లో ఊచలు లెక్కపెడుతున్న గుర్మీత్ రామ్ రహీమ్ ఈ సారి ఏ పార్టీకి మద్దతివ్వాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఈ డేరాలో 15 మంది సభ్యులతో కూడిన ఒక రాజకీయ వ్యవహారాల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ సమావేశాల్లో వచ్చే ఫలితాలకనుగుణంగా ఏ పార్టీకి మద్దతివ్వాలో నిర్ణయిస్తామని కమిటీ సభ్యుడు జోగిందర్ సింగ్ చెప్పారు. డేరా సచ్చా సౌదా ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో నియోజకవర్గాల్లో ఉంది. సత్లోక్ ఆశ్రమ్స్ గురువు: రామ్‌పాల్ ఈ డేరా గురు రామ్‌పాల్ కూడా 2014 నవంబర్ నుంచే జైల్లో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన రాజకీయాలను శాసిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రామ్‌పాల్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. కానీ ఈ సారి ఏ పార్టీకి మద్దతివ్వాలో అన్న మీమాంసలో ఉన్నారు. ‘‘లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల అంశాల్లో చాలా తేడా ఉంది. అక్టోబర్ 15న సర్వసభ్య సమావేశంలో చర్చించి ఏ పార్టీకి మద్దతునివ్వాలో తేల్చుకుంటాం‘‘అని గురు రామ్‌పాల్ డేరా మీడియా ఇన్చార్జ్ చాంద్ రథి వెల్లడించారు. రోహ్తక్ చుట్టుపక్కలున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురు రామ్‌పాల్ డేరా ప్రభావం ఎక్కువగా ఉంది. డేరా బాబా శ్రీ బాలక్ పురి గురువు: కరణ్ పురి ఈ సారి ఎన్నికల్లో కరణ్ పురి డేరా ఎన్నికలకు దూరంగా ఉండా లని నిర్ణయించుకుంది. హరియాణా లో నివసిస్తున్నా పంజాబీల్లో అధిక ప్రభావం కలిగిన ఈ డేరా తమ అనుచరులకు ఎలాంటి పిలుపు ఇవ్వడం లేదు. అయితే ఈ డేరాను బీజేపీ నాయకులు అత్యధికంగా సందర్శిస్తున్నారు. డేరా గౌకరణ్ ధామ్ గురువు: కపిల్ పురి కాంగ్రెస్‌కు కపిల్పురి మద్దతుదారు. కాంగ్రెస్ నేత భూపీందర్ హూడాకు అనుకూలం. ఈ సారి ఎన్నికల్లో జోక్యం చేసుకోమని చెబుతున్నప్పటికీ బీజేపీకి మద్దతు ఇవ్వాలంటూ గౌకరణ్ ధామ్ డేరా తమ అనుచరగణానికి సంకేతాలు పంపుతోంది. -
డేరా బాబాపై ఛార్జిషీటు దాఖలు
చండీగఢ్: రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం, ఆయన ఇద్దరు అనుచరులపై సీబీఐ గురువారం ఛార్జిషీటు దాఖలు చేసింది. గుర్మీత్ రామ్ రహీం తన ఆశ్రమంలో పని చేసే ఇద్దరు యువతులపై అత్యాచారం చేయడంతో కోర్టు ఆయనకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మరో రెండు హత్య కేసుల్లో కూడా గుర్మీత్ రామ్ రహీం నిందితుడిగా ఉన్నాడు. డేరా ఆశ్రమంలోని తన అనుచరులను నపుంసకులుగా మార్చారనే ఆరోపణలపై పంజాబ్, హర్యానా హైకోర్టు విచారణకు ఆదేశించిన 3 సంవత్సరాల తర్వాత సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. డేరా ఆశ్రమ చీఫ్ గుర్మీత్ మాజీ అనుచరుడు హన్స్‌రాజ్ చౌహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తనతో పాటు ఆశ్రమంలో పనిచేస్తున్న 400 మంది అనుచరులను డేరా ఆశ్రమంలో నపుంసకులుగా మార్చివేశాడని హన్స్‌రాజ్ చౌహన్ పిటిషన్లో పేర్కొన్నారు. గుర్మీత్ రామ్ రహీం రోహ్తక్లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. -
మీడియా ముందుకు హనీప్రీత్..
సాక్షి, న్యూఢిల్లీ: జైలుపాలైన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ మంగళవారం అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చారు. తాను దేశం వదిలి ఎక్కడికీ పారిపోలేదని, త్వరలోనే కోర్టులో లొంగిపోతానని ఆమె వెల్లడించారు. మీడియాలో కథనాలు వస్తున్నట్టుగా గుర్మీత్.. తనను లైంగికంగా వేధించలేదని చెప్పారు. గుర్మీత్‌కు శిక్షపడిన అనంతరం చెలరేగిన అలర్ల కేసులో హనీప్రీత్ కోసం హర్యానా పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమెపై కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం కోర్టు ముందు లొంగిపోతారని కథనాలు వచ్చాయి. ఈక్రమంలో ఆమె అన్యూహంగా 'సీఎన్ఎన్ న్యూస్18', 'ఇండియా టుడే' చానల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె కోసం వెతుకుతున్న హర్యానా పోలీసుల కళ్లుగప్పి మరీ ఆమె ఈ ఇంటర్వ్యూలు ఇవ్వడం గమనార్హం. గుర్మీత్, తనకు మధ్య ప్రవిత్ర అనుబంధం ఉందని, తన మధ్య బంధాన్ని కావాలనే తప్పుగా చిత్రీకరిస్తున్నారని హనీప్రీత్ ఆవేదన వ్యక్తం చేశారు. ' మా గురించి చెప్తున్నదంతా అబద్ధమే. ఒక తండ్రి తన కూతురి తలపై ప్రేమగా చేయి పెట్టడం కూడా తప్పేనా? భావోద్వేగాలు చనిపోయాయా? తండ్రి-కూతుళ్ల అనుబంధం పవిత్రమైనది కాదా? ఎందుకు వారు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు' అని హనీప్రీత్ పేర్కొన్నారు. గుర్మీత్‌కు శిక్షపడిన అనంతరం పంచకులలో అల్లర్ల రెచ్చగొట్టినట్టు పోలీసులు ఆరోపణలు చేస్తున్నారని, కానీ అందుకు ఆధారాలు ఎక్కడ అని ఆమె ప్రశ్నించారు. గుర్మీత్ అమాయకుడని, ఆయనకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళుతామని ఆమె చెప్పారు. దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, గుర్మీత్ విడుదల అవుతారని ఆమె అన్నారు. ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిపిన కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. గుర్మీత్‌తో తనకు అక్రమ సంబంధం ఉందంటూ తన మాజీ భర్త విశ్వాస్ గుప్తా చేసిన ఆరోపణలపై ఆమె స్పందించడానికి నిరాకరించారు. అతని గురించి మాట్లాడబోనని ఆమె తెలిపారు. -
'గుర్మీత్ రాంరహీం సింగ్‌ను ఉరితీయాలి'
పంజాబ్, హరియాణాలో క్షణక్షణం ఉత్కంఠ రెండు రాష్ట్రాల్లోనూ హై అలర్ట్ వారణాసిలో గుర్మీత్‌కు వ్యతిరేకంగా సాధువుల నిరసన సాక్షి, పంజాబ్, హరియాణా: అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ (50)కు మరికాసేపట్లో శిక్ష పడనున్న నేపథ్యంలో పంజాబ్, హరియాణ రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గుర్మీత్‌కు శిక్ష నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు పోలీసుల నిఘా నీడలో గడుపుతున్నాయి. డేరా మద్దతుదారులను ఎదుర్కొనేందుకు అడుగడుగునా పోలీసులు, భద్రతాదళాలు భారీగా మోహరించారు. బలగాల కవాతు నిర్వహిస్తూ.. ప్రజలు శాంతియుతంగా, సంయమనంతో ఉండాలని, వీధుల్లోకి, రోడ్లమీదకు రావొద్దని పిలుపునిస్తున్నారు. ఇక గుర్మీత్ జైలులో ఉన్న రోహతక్‌లో బలగాలు కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీచేశారు. రోహతక్ జైలుకు ప్రత్యేక హెలికాప్టర్లో రానున్న సీబీఐ జడ్జీ కారాగారంలోనే గుర్మీత్‌కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో రోహతక్ పూర్తిగా భద్రతా దళాల చేతుల్లోకి వెళ్లింది. పంజాబ్, హరియాణాలోని చాలా పట్టణాలు, నగరాల్లోనూ భద్రతా దళాలు, పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహిస్తూ..పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. మరోవైపు గుర్మీత్ రాంరహీం సింగ్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం సోమవారం అత్యున్నత భద్రతా సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, కేంద్ర హోంశాఖ అధికారులు పాల్గొన్నారు. గుర్మీత్‌కు శిక్ష నేపథ్యంలో పంజాబ్, హరియాణాలో భద్రతా పరిస్థితులపై చర్చించారు. 'గుర్మీత్‌ను ఉరితీయాలి' అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్ రాంరహీం సింగ్‌పై హిందూ సాధువులు, స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్మీత్‌ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం వారణాసిలో సాధువులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుర్మీత్‌ను ఉరితీయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.