కృష్ణా నదిలో గుర్రెపు డెక్కతో అవస్థలు
విజయవాడ(వన్‌టౌన్) :
కృష్ణానది ఎగువ నుంచి భారీగా గుర్రపుడెక్కా దుర్గాఘాట్ వైపు తోసుకొచ్చింది. దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. బుడమేరు నీటిని నదిలోకి వదలటంతో గుర్రపు డెక్కా భారీగా వచ్చింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ అదంతా దుర్గాఘాట్ వైపుకు రావటంతో అధికారులు దానిని తొలగించాలని ఆదేశించారు. మత్స్యశాఖ, నీటిపారదుల శాఖ, నగరపాలకసంస్థ సిబ్బంది తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు దానిని పరిశీలించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. గజ ఈతగాళ్లునుlరప్పించి గుర్రపు డెక్కాను ఘాట్లలోకి వెళ్లకుండా ఒడ్డుకు చేర్చారు. అనంతరం దానిని లారీలలో బయటకు తరలించారు. సుమారు 15 టన్నుల గుర్రపుడెక్కాను ప్రవాహం నుంచి తీసి బయటకు పంపినట్లు అధికారులు చెప్పారు.