Gurukul Degree College
-
‘గురుకుల’ విద్యార్థినికి గర్భం
సాక్షి, ఆసిఫాబాద్: కుమురం భీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లోని గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని గర్భం దాల్చడం కలకలం సృష్టించింది. అయితే.. ప్రేమ వ్యవహారమే కారణమని అధికారుల విచారణలో తేలింది. వివరాలు.. గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుతున్న 10 మంది విద్యార్థినులకు ఇటీవల రుతుస్రావం సమస్య ఎదురైంది. దీంతో నవంబర్ 21న కళాశాల సిబ్బంది ఆదిలాబాద్ రిమ్స్‌లో పరీక్షలు చేయించారు. ఇందులో ముగ్గురిపై అనుమానంతో గర్భనిర్దారణ పరీక్షలు చేయించారు. వారికి మొదట పాజిటివ్ వచ్చింది. ధ్రువీకరణ కోసం మళ్లీ వారం తర్వాత రావాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే.. కళాశాల సిబ్బంది మళ్లీ రిమ్స్‌కు వెళ్లకుండా స్థానికంగా ఉన్న ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించారు. ఇందులో ఒక విద్యార్థిని మాత్రమే గర్భం దాల్చినట్లు తేలింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆదివాసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాగా, శనివారం ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు, గిరిజన సంక్షేమ శాఖ జీసీడీవో శంకుతల, డీసీపీవో మహేశ్, ఐసీడీఎస్ పీడీ సావిత్రి శనివారం విచారణ చేపట్టగా.. గర్భానికి ప్రేమ వ్యవహారమే కారణమని సదరు విద్యార్థిని ఒప్పుకుంది. మా కళాశాలను బద్నాం చేస్తారా? గురుకుల కళాశాలలో విద్యార్థిని గర్భం దాల్చడంపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆ కళాశాల విద్యార్థినులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కళాశాల పేరుప్రఖ్యాతులు భంగం కలిగేలా మీడియాలో ప్రచారం చేశారని, ఇందులో ప్రిన్సిపాల్ పాత్ర ఏమీ లేదని వసతిగృహ భవనం ఎదుట ధర్నాకు దిగారు. ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ విద్యార్థినులతో మాట్లాడి శాంతిపజేశారు. కాగా, ఈ ఘటనపై విచారణ కోసం ఆర్డీఓ లక్ష్మయ్య ఆలస్యంగా రావడంపై విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని ఆందోళన చేశారు. -
7,259 సీట్లు మిగిలాయి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో సీట్లు అధిక సంఖ్యలో మిగిలిపోయాయి. రాష్ట్రంలో పాత గురుకులాలతో పాటు ఈసారి కొత్తగా ఏర్పాటు చేసిన గురుకులాలు కలుపుకొని మొత్తంగా 52 ప్రభుత్వ గురుకుల డిగ్రీ కాలేజీలు ఉండగా వాటిల్లో 15,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 8,101 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో 7,259 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. 52 కాలేజీల్లో కొత్తగా ఏర్పాటు చేసినవే 40కి పైగా కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో విద్యా బోధన పట్ల విద్యార్థులకు పెద్దగా అవగాహన లేని కారణంగా సీట్లన్నీ భర్తీ కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 1,186 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 4,48,457 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 2,23,427 సీట్లు భర్తీ కాగా, మరో 2,25,030 సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. ప్రభుత్వ కాలేజీల్లోనూ మిగులు: వివిధ ప్రైవేటు కాలేజీలతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ సీట్లు మిగిలిపోయాయి. ప్రభుత్వ కాలేజీల్లో 60 వేల వరకు సీట్లు అందుబాటులో ఉండగా, 29 వేల వరకు సీట్లు మిగిలిపోయాయి. ఇక ప్రైవేటు కాలేజీల్లో 3.22 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 1.70 లక్షల సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఈసారే కాదు ఏటా మిగిలిపోతున్న నేపథ్యంలో అవసరం లేని సీట్లకు కోత పెట్టాలని ఉన్నత విద్యా మండలి ఇదివరకే నిర్ణయించింది. వచ్చే ఏడాది లక్ష సీట్లను తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఈసారి 30 శాతం సీట్లు కూడా భర్తీ కాని కాలేజీల్లో ప్రవేశాలను రద్దు చేసి, ఆ విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి పంపించాలని ఇదివరకే వర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. -
నియోజకవర్గానికో గురుకుల డిగ్రీ కాలేజీ
మండలానికో జూనియర్ కాలేజీ ఏర్పాటు: కడియం సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో నియోజకవర్గానికో గురుకుల డిగ్రీ కాలేజీ, మండలానికో గురుకుల జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. పాఠశాల విద్యా డైరెక్టరేట్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. 2018–19 విద్యా సంవత్సరంలో ఈ కళాశాలలను ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారని, వాటిని పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ మేరకు భవన నిర్మాణాలకు స్థలాలను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 84 గురుకుల పాఠశాలలను ఆగస్టు 15 నాటికి ప్రారంభిస్తామన్నారు. కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) 12వ తరగతి వరకు కొనసాగించేందుకు కేంద్రం అంగీ కరించలేదని, అయితే వచ్చే విద్యా సంవత్సరం నాటికి కేజీబీవీల ను 10వ తరగతి వరకు పెంచే అవకాశం ఉంద ని, అపుడు రాష్ట్రంలో 12వ తరగతి వరకు ప్రవేశపెట్టేందుకు యోచి స్తున్నామన్నారు. కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్ల వేతనాలను రూ.20 వేల నుంచి రూ.25వేలకు పెంపు, కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్ల (సీఆర్టీ) వేతనాలను రూ.15 వేల నుంచి రూ.20 వేలకు పెంచే ప్రతిపాదనల ఫైలు ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉందన్నారు. కేజీబీవీల్లో వసతులకు రూ.548 కోట్లు.. 525 గురుకులాలను ఒకేసారి ప్రారంభించి నందునా కొన్నింటిని అద్దె భవనాల్లో ఏర్పా టు చేశామని, త్వరలోనే వాటికి శాశ్వత ఏర్పాట్లు పూర్తి చేస్తామని కడియం చెప్పారు. కేజీబీవీల హాస్టల్ విద్యార్థులకు ట్రంక్ పెట్టెలు, గ్లాసులు, ప్లేట్లు కూడా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కొత్తగా వచ్చిన వాటిల్లో 34 కేజీబీవీల పక్కా భవనాలకు కేంద్రం రూ.90.72 కోట్లు మంజూరు చేసిందన్నారు.