Hafeez Khan
-
అభివృద్ధిపై నాన్ స్టాప్ స్పీచ్..టీడీపీకి దమ్ముంటే..
-
బాబుకు హఫీజ్ ఖాన్ వార్నింగ్
-
కూటమి కట్టినా వారికి ఓటమి తప్పదు
-
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ముస్లింలకు అన్యాయం చేశారు
-
అడుగడుగునా బ్రహ్మరథం..
-
సీఏఏపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు
-
సీఏఏపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కీలక ప్రకటన చేశారు. తాము కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏను అంగీకరించబోమన్నారు. సీఏఏ చట్టం ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘సీఏఏ చట్టం వలన ముస్లిం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. సీఎం జగన్ కూడా మాకు అనునిత్యం అండగా నిలుస్తున్నారు. కులాలు, మతాల మీద వివక్ష చూపటం కరెక్టు కాదు. వైఎస్సార్సీపీకి అన్ని వర్గాలూ ముఖ్యమే. .. అందరికీ భద్రత, న్యాయం కల్పించటమే సీఎం జగన్ లక్ష్యం. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారు. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే ఓట్లు వస్తాయని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ సీఏఏ తెచ్చిన బీజేపీతో కలవటం కరెక్టు కాదు. ప్రజలు దీనికి సరైన సమాధానం చెప్తారు’ అని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. -
చంద్రబాబు, లోకేష్ పై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్
-
సంక్షేమం కోసం CM జగన్ ప్రభుత్వం పని చేస్తోంది: MLA
-
చంద్రబాబుపై హఫీజ్ ఖాన్ కామెంట్స్..
-
పెత్తందారీ వ్యవస్థపై జ'గన్'
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో పెచ్చరిల్లిన పెత్తందారీ వ్యవస్థను సీఎం జగన్ సమూలంగా పెకలించివేశారని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా రాజ్యాధికారంలో సముచిత స్థానం కల్పించారని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అంటరానివారుగా చిత్రీకరించి పెత్తందార్ల కాళ్ల కింద ఉంచితే, సీఎం జగన్ అదే పేదలకు పట్టం కట్టారని తెలిపారు. కావలిలో గురువారం నిర్వహించిన సామాజిక సాధికార సభలో మంత్రి మాట్లాడారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు విపరీతమైన అహంకారంతో మత్స్యకారులను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను తీవ్రంగా అవమానించారని గుర్తు చేశారు. మత్స్యకారుల తోకలు కత్తిరిస్తానని, ఎస్సీ, ఎస్టీలుగా ఎవరూ పుట్టాలని కోరుకోరని బహిరంగంగా అవమానించడంతో పాటు బీసీలు జడ్జీలుగా పనికిరారని ఏకంగా లేఖ రాసిన దుర్మార్గుడు చంద్రబాబు అని తెలిపారు. ఆయన పదవీ కాలంలో పేదలకు, అట్టడుగు వర్గాలకు పనికివచ్చేలా ఒక్క పనీ చేయలేదన్నారు. జన్మభూమి కమిటీలనే అసాంఘిక శక్తులను పేదల నెత్తిన పెట్టి స్వైరవిహారం చేయించాడని అన్నారు. ప్రజలు బాబు పాలనను ఛీకొట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పగించిన తరువాత పేదల జీవితాల్లో వెలుగులు వచ్చాయని చెప్పారు. రేషన్‌కార్డు, పింఛను, ఇంటి స్థలం, సంక్షేమ పథకాలు ఏది కావాలన్నా అర్హత ఉంటే చాలు నేరుగా వలంటీర్లు ఇళ్ళ వద్దకు వెళ్ళి అందిస్తున్నారని, ఈ ఘనత సీఎం జగన్‌దేనని చెప్పారు. కావలిలో జరిగిన సామాజిక సాధికార యాత్ర సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం సామాజిక న్యాయానికి రోల్ మోడల్ జగన్ : ఎంపీ మస్తాన్‌రావు సామాజిక న్యాయానికి, సాధికారతకు సీఎం వైఎస్ జగన్ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు అన్నారు. ఎనిమది మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బీసీలు ఉన్నారన్నా, కేబినెట్లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారంటే అందుకు జగన్మోహన్ రెడ్డి దార్శనికతే కారణమన్నారు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్‌దే: జూపూడి ప్రభాకర్ రాష్ట్రంలో అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుని అందలం ఎక్కించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వ హయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అధికార మదంతో అణగదొక్కితే.., సీఎం జగన్ మాత్రం ఈ వర్గాలను ఆదరించి, అభివృద్ధిలోకి తెస్తున్నారని తెలిపారు. జగన్‌తోనే బడుగు, బలహీన వర్గాల సంక్షేమం: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం సీఎం జగన్‌తోనే ప్రారంభమైందని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌ను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కనకపట్నంగా మారనున్న కావలి: ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి సీఎం వైఎస్ జగన్ పాలనలో కావలి కనకపట్నంగా మారనుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి అన్నారు. రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, దామవరం ఎయిర్‌పోర్టులతో నియోజకవర్గం రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. పారిశ్రామిక ప్రగతి కూడా ఊపందుకుంటుందని వివరించారు. 21న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభం మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈనెల 21న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి అప్పలరాజు అన్నారు. ఈ హార్బర్ అందుబాటులోకి వచ్చిన తరువాత మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తాయన్నారు. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, సామాజిక సాధికార బస్సు యాత్రలకు వస్తున్న స్పందనను చూసి టీడీపీ, ఆపార్టీకి వంతపాడుతున్న పచ్చమీడియాకు నిద్రపట్టడం లేదన్నారు. పేదల సంక్షేమమే సీఎం జగన్ అజెండా: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు పేదల సంక్షేమమే ఏకైక అజెండాగా వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తెలిపారు. రాష్ట్రంలో సామాజిక సాధికారతతో పాటు సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలంతా అండగా నిలిచి, రానున్న ఎన్నికల్లో 175 స్థానాలను బహుమానంగా అందించాలని ప్రజలను ఆయన కోరారు. వెనుకబడిన వర్గాలు ఎల్లవేళలా మంచిగా ఉండాలంటే మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి కావాలని హఫీజ్‌ఖాన్ అన్నారు. -
బాబు పేరు చెబితే స్కాములు.. జగన్ పేరు చెబితే స్కీములు గుర్తుకొస్తాయి
-
బీసీలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది
-
యువతను మభ్య పెట్టడానికే పవన్ ప్రయత్నం : ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
-
చంద్రబాబుపై ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ఫైర్
-
కర్నూలు ప్రజలు చంద్రబాబు ట్రాప్ లో పడలేదు : ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
-
డబుల్ గేమ్ ఆడటంలో చంద్రబాబు దిట్ట: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
సాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుకుంటారా? అంటూ చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడతారా? అంటూ దుయ్యబట్టారు. ‘‘శాంతియుతంగా నిరసన చేస్తే దాడులకు దిగుతారా?. చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడినా కర్నూలు ప్రజలు రెచ్చిపోలేదు. గూండాల అవసరం చంద్రబాబుకే ఉంటుంది. డబుల్ గేమ్ ఆడటంలో చంద్రబాబు దిట్ట. వైఎస్సార్సీపీ నేతలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. విద్యార్థులపై చంద్రబాబు తన గూండాల చేత దాడులు చేయించారు’’ అని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ నిప్పులు చెరిగారు. చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? -
చంద్రబాబు రాయలసీమ ద్రోహి: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
సాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలుకు చంద్రబాబు ఏం మొహం పెట్టుకుని వచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గురించి చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజలపైన బాదుడే బాదుడు చేసింది.. బాబే కాదా. మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. తన రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు తాపత్రయం అంటూ మండిపడ్డారు. ‘‘కర్నూలుకు ఏం చేయని చంద్రబాబు.. ఇప్పుడు ఓట్ల కోసం వచ్చాడు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి. మూడు రాజధానులను అడ్డుకుంటుంది చంద్రబాబు కాదా?. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదా?. రాయలసీమపై ప్రేమ ఉంటే న్యాయ రాజధానికి బాబు మద్దతివ్వాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం’’ అని హఫీజ్‌ఖాన్ అన్నారు. చదవండి: ‘టీడీపీ కుట్ర.. ఆక్వా పాలిట విలన్ చంద్రబాబే’ -
30 వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతం
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఏపీలో వక్ఫ్‌బోర్డుకు 65 వేల ఎకరాల భూములున్నాయని, వాటిలో దాదాపు 30 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని ఏపీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఖాదర్‌బాషా చెప్పారు. వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఏపీలో వక్ఫ్ ఆస్తులు, భూముల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు తమ పాలకవర్గం కృషిచేస్తోందన్నారు. విజయవాడలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. బుధ, గురువారాల్లో విజయవాడలో జరిగిన బోర్డు సమావేశంలో 150 అంశాలను చర్చించినట్లు తెలిపారు. వక్ఫ్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలిస్తున్నామని, అందుకోసం పెండింగ్‌లో ఉన్న 220 కమిటీలు వేశామని చెప్పారు. దర్గా (దౌలత్)లకు సంబంధించి ఈ 2 రోజుల్లో 200 కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వక్ఫ్ భూముల్లో సుమారు వందవరకు కమర్షియల్ ఆస్తులు ఉన్నాయన్నారు. వాటినుంచి వక్ఫ్‌బోర్డుకు ఆదాయాన్ని మరింత పెంచేందుకు తన అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సీఎం కమిటీ ఏర్పాటు చేశారన్నారు. వక్ఫ్ కేసులకు సంబంధించి కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటవుతోందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే, వక్ఫ్‌బోర్డు సభ్యుడు హాఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న తెలంగాణ బీజేపీ నేత రాజాసింగ్‌ని కఠినంగా శిక్షించాలన్నారు. -
ఆ ధైర్యం చంద్రబాబుకి ఉందా?
తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి గతంలో మాట్లాడింది ఈరోజు గుర్తుండదని, రేపు ఏమి మాట్లాడతాడో ఎవరికీ తెలియదని కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విమర్శించారు. అధికారం లేకుంటే చంద్రబాబు బతకలేడని, అబద్ధాలు చెప్పకుంటే ఉండలేడని హఫీజ్ ఖాన్ ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన..‘మాకు గర్వంగా ఇంటింటికీ వెళ్ళే ధైర్యం ఉంది..చంద్రబాబుకి ఆ ధైర్యం ఉందా..?, రేపు మా మంత్రులు కూడా జిల్లాల పర్యటన చేసి ఎవరికేం చేశామో చెప్పే శక్తి మాకుంది. 14 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అంతే ధైర్యంగా చేసింది ఏమైనా చెప్పగలడా...?, ఎక్కడా గెలవలేని పుత్రుడు, దత్తపుత్రుడితో అబద్దాల ప్రచారం చేయిస్తున్నాడు. ఎక్కడా లేని సంక్షేమ ఫలాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఆ కడుపుమంట తట్టుకోలేక చంద్రబాబు ఇష్టారీతిన మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ బీసీలను చంద్రబాబు కించపరిచాడు. సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్‌కి మీరు ఎలా సీటు ఇచ్చారు. టీజీ వెంకటేష్ వద్ద ఎంత తీసుకుని సీటు ఇచ్చావ్..?, సుజనా చౌదరి లాంటి వారు నీకు మేధావులా ..?, సామాజిక న్యాయం చేస్తుంటే చంద్రబాబుకి బాధ...అందుకే దుష్ప్రచారం’ అని మండిపడ్డారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఏపీలో ప్రజలు చారిత్రాత్మక తీర్పుతో జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్నారనే విషయం చంద్రబాబు తెలుసుకుంటే మంచిదని హఫీజ్‌ఖాన్ స్పష్టం చేశారు. చదవండి👉చంద్రబాబు ఎప్పటికీ సీఎం కాలేరు: మంత్రి అంబటి