సాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలుకు చంద్రబాబు ఏం మొహం పెట్టుకుని వచ్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గురించి చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజలపైన బాదుడే బాదుడు చేసింది.. బాబే కాదా. మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. తన రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు తాపత్రయం అంటూ మండిపడ్డారు.
‘‘కర్నూలుకు ఏం చేయని చంద్రబాబు.. ఇప్పుడు ఓట్ల కోసం వచ్చాడు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి. మూడు రాజధానులను అడ్డుకుంటుంది చంద్రబాబు కాదా?. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదా?. రాయలసీమపై ప్రేమ ఉంటే న్యాయ రాజధానికి బాబు మద్దతివ్వాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం’’ అని హఫీజ్‌ఖాన్ అన్నారు.
చదవండి: ‘టీడీపీ కుట్ర.. ఆక్వా పాలిట విలన్ చంద్రబాబే’
Comments
Please login to add a commentAdd a comment