Hair Salon
-
సిగకారుడు.. సావియో జాన్ పరేరా
సావియో జాన్ పరేరా.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హెయిర్ స్టయిలిస్ట్. బాలీవుడ్ స్టార్స్, స్పోర్ట్స్ లెజెండ్స్ జుట్టు ఆయన చేతుల్లోనే ఉంటుంది. సినిమా ప్రమోషన్, అవార్డ్ ఫంక్షన్, రెడ్ కార్పెట్ వాక్.. ఏ ఈవెంట్‌కైనా.. సావియో వచ్చి సెలబ్రిటీల కొప్పు ముడిస్తేనే వాళ్లు గడప దాటేది! అంతెందుకు ఇంగ్లిష్ యాక్ట్రెస్ లిజ్ హార్లీ.. తన పెళ్లిలో కేశాలంకరణకు ఏరికోరి మరీ సావియో జాన్నే అపాయింట్ చేసుకుంది! అదీ ఈ ముంబై వాసి రెప్యుటేషన్!!హెయిర్ డ్రెసింగ్‌లో సావియోది దాదాపు ముప్పై ఏళ్ల అనుభవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ హెయిర్ డ్రెసర్స్, హెయిర్ స్టయిలిస్ట్‌లు అందరి దగ్గరా శిక్షణ పొంది వచ్చాడు. నైపుణ్యం సాధించాడు. హెయిర్ సెలూన్స్ పెట్టాడు. ఫ్యాషన్ షోస్‌కి, అడ్వర్టయిజ్మెంట్ క్యాంపెయిన్స్కి, ఎల్, వోగ్, హార్పర్స్ బజార్, కాస్మోపాలిటన్ లాంటి మేగజీన్స్ ఫొటో షూట్స్‌కి పనిచేశాడు. బాంబే టైమ్స్, హిందుస్తాన్ టైమ్స్, మిడ్–డే, ముంబై మిర్రర్, సినీ బ్లిట్జ్ వంటి పత్రికలకు కాలమ్స్ రాస్తుంటాడు. జూమ్, ఎన్డీటీవీ గుడ్ టైమ్స్ వంటి చానల్స్కీ పానలిస్ట్గా ఉన్నాడు. ఎన్నో బ్యూటీ కాంటెస్ట్‌లకు జడ్జిగా వ్యవహరించాడు. ఎన్నో బాలీవుడ్ చిత్రాలకు హెయిర్ డ్రెసర్‌గా పనిచేశాడు. ప్రియంకా చోప్రా, ప్రీతి జింటా, కంగనా రనౌత్, సోనాక్షీ సిన్హా, శిల్పా శెట్టీ, నేహా ధూపియా, అదితీరావ్ హైదరీ, డింపుల్ కపాడియా, మేరీ కోమ్, ఇంతియాజ్ అలీ, యువరాజ్ సింగ్ లాంటి సెలబ్రిటీలకు పర్సనల్ హెయిర్ డ్రెసర్‌గా ఉన్నాడు. హెయిర్ డ్రెసింగ్‌లో మెలకువలు సంపాదించుకోవాలనుకునేవాళ్ల కోసం ‘సావియో జాన్ పరేరా.. ది అకాడమీ’నీ నెలకొల్పాడు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో గెలుచుకున్నాడు.‘నాకు పనే దైవం. అందులో నిత్యం ఏదో కొత్తదనాన్ని చూపించడానికి ఇష్టపడతాను. నా క్లయింట్స్ కాన్ఫిడెన్స్‌ను పెంచే స్టయిల్స్‌ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటా. స్టయిల్ అనేది వ్యక్తిగతం. పరిశీలన, మెలకువలతో ఎవరికివారే తమదైన సిగ్నేచర్ స్టయిల్ని క్రియేట్ చేసుకోవాలి. అలాంటి సృజనకు ఆకాశం కూడా హద్దు కాదు. స్టయిల్ అనేది ఒక ఐడెంటిటీ. అది వ్యక్తిత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది’ అంటాడు సావియో జాన్ పరేరా. -
నెత్తిన భగ్గుమంటున్న మంటలు.. ఇప్పుడు ఇదో స్టైల్
సాక్షి, కైలాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని కొత్త రకం ఫైర్ హెయిర్ కటింగ్ అందుబాటులోకి వచ్చింది. ప్రధాన నగరాల్లోనే ఉండే ఈ పద్ధతి ఇప్పుడు పట్టణాల్లో అందుబాటులోకి రావడంతో యువత ఆసక్తి చూపున్నారు. స్థానిక భుక్తాపూర్‌లోని ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో అమెరికన్ హెయిర్ కటింగ్ షాపులో శేర్లవార్ నర్సింహులు అనే యువకుడు జట్టుకు నిప్పు పెట్టి కొత్త తరహా కటింగ్ చేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఫైర్ కటింగ్‌లో ప్రావీణ్యం పొంది సొంతగా క్షవరశాలను ఏర్పాటు చేసుకున్నాడు. మహారాష్ట్రలోని పూణే నగరం నుంచి హెయిర్ ఫైర్ లిక్విడ్‌ను తెప్పిస్తున్నాడు. దీంతో తను ఉపాధి పొందుతూ.. మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఫైర్ కటింగ్ రూ.500 రింగులు తిరిగిన జట్టుకు ప్రత్యేకమైన లిక్విడ్ పెట్టి నిప్పంటిస్తాడు. ఈరకం కట్టింగ్‌కు రూ.500 చార్జీ అవుతుంది. పిట్టెగూడులా ఉన్న వెంట్రుకలు ఫైర్ కటింగ్‌తో ఒక్కసారిగా సిల్కీ స్మూత్ హెయిర్‌గా మారుతుంది. దీంతో ఈ తరహ కట్టింగ్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొదటి సారి కొత్త తరహా కటింగ్ చేసుకున్న వారు దాని ప్రాధాన్యత తెలుసుకుని తరువాత ఫైర్ కటింగ్ చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఫైర్ కటింగ్ బాగుంది ఫైర్ కటింగ్ అంటే మొదట్లో కొంత బయమేసింది. తలపై నిప్పు పెట్టడంతో కొద్దిపాటి వేడి కావడంతో బయపడిన. తరువాత నీటితో తలను కడగానే చల్లగా ఉంది. వెంట్రుకలు చాలా స్మూత్, సాఫ్ట్‌గా అయ్యాయి. ఫైర్ కటింగ్ చాలా బాగుంది. – అజార్ ఖాన్, ఇందిరానగర్ చాలా మందికి తెలువదు ఆదిలాబాద్‌లో ఫైర్ కటింగ్ చేస్తున్నట్లు చాలా మందికి తెలువదు. ఈమధ్య కాలంలోనే కొత్తగా ఫైర్ కటింగ్ చేస్తున్నారని తెలిసి వచ్చాను. కొత్త తరహా కటింగ్‌తో ఎలాంటి నష్టం ఉండదు. వెంట్రుకలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. – సాయికిరణ్, భీంపూర్ హైదరాబాద్‌లో నేర్చుకున్న హైదరాబాద్‌లోని నేచురల్ హెయిర్ సెల్యూన్లో పనిచేసిన సమయంలో ఫైర్ కటింగ్ గురించి తెలుసుకున్నాను. అక్కడ అనుభవాజ్ఞుల వద్ద శిక్షణ పొంది నేర్చుకున్నాను. మొదటి సారి ఫైర్ కటింగ్ చేసుకుంటున్న వారు బయపడుతారు. తరువాత ఈపద్ధతి కటింగ్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. – శేర్లవార్ నర్సింహులు, యజమాని -
ఎన్నికల ఎత్తుగడల్ ఎన్నెన్నో విధముల్
ప్రచారానికి క్షురకులను సైతం వాడుకోనున్న కమలం న్యూఢిల్లీ: ఈసారి మీరు క్షౌరశాలకు వెళ్లినపుడు బీజేపీ గొప్పదనం గురించి ఒకవేళ సదరు దుకాణ యజమాని కనుక వివరిస్తే సంభ్రమాశ్చర్యాలకు లోనుకాకండి. ఎందుకంటే త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కమ ల దళం అందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. ఇందులోభాగంగా ఈసారి క్షురకుల సేవలను సైతం వినియోగించుకోనుంది. వారితో నూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ విషయమై ఆ పార్టీ బార్బర్ సెల్ అధ్యక్షుడు విజేందర్‌సింగ్ మాట్లాడుతూ నగరపరిధిలో దాదాపు 20 వేలమంది క్షురకులున్నారన్నారు. ‘మాది పెద్ద నెట్వర్క్. బీజేపీకి గరిష్టంగా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు శ్రమిస్తాం. ఢిల్లీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే ఇక్కడ సుస్థిర ప్రభుత్వ ఎంతో అవసరం’ అని అన్నారు. ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోలేదు ‘బార్బర్ సెల్ సభ్యత్వ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తాం. క్షౌరశాలలకు వచ్చేవారికి క్షౌర విభాగం సభ్యులు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తారు. మా సమాజాన్ని ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోలేదు. మా సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఓ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతాం. హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు క్షురకుల కోసం ఇప్పటికే ప్రత్యేక బోర్డులను ఏర్పాటుచేశాయి.’ త్వరలో ప్రచారసామగ్రి అందజేత నగరంలోని క్షురకులకు బీజేపీ రాష్ట్ర శాఖ పోస్టర్లు, పాంప్లేట్లు, బ్యానర్లు తదితర ప్రచార సామగ్రిని అందజేయనుంది. ఈ విషయమై విజేందర్ మాట్లాడుతూ ‘నగరానికి చెందిన క్షురకులకు సోమవారం ఓ వర్క్‌షాప్‌ను నిర్వహించాం. ప్రభుత్వం సాధించిన పురోగతిని వారితో ప్రచారం చేయిస్తాం’అని అన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
కరడుగట్టిన ముఠా గుట్టురట్టు
ముఠా సభ్యుడి పట్టివేత 24 తులాల బంగారు నగలు స్వాధీనం నాగోలు,న్యూస్‌లైన్: ఇళ్లల్లోకి చొరబడి కత్తులు, మారుణాయుధాలు చూపించి దాడిచేసి దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యుడిని, బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన వ్యక్తిని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 24 తులాల నగలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వనస్థలిపురం ఏసీపీ ఆనందభాస్కర్‌తో కలిసి డీసీపీ విశ్వప్రసాద్ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ మీరట్ ప్రాంతానికి చెందిన పాతనేరస్తుడు మహ్మద్‌ఆసిఫ్ (38) కొన్నేళ్లక్రితం నగరానికి వలసొచ్చి బాబానగర్‌లో స్థిరపడి ఈ ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఇక్కడే రెండు హెయిర్‌సెలూన్ దుకాణాలతోపాటు 20 ఆటోలను కిరాయికిస్తూ జీవిస్తున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్తులు ఆసిఫ్‌కు బావ వరసయ్యే జావిద్ (32),అల్తాఫ్ (22),వసీం, (22),శివ (23)లను నగరానికి పిలిపించి తన ఇంట్లో ఆశ్రయం కల్పించి దొంగత నాలకు పథకం పన్నారు. తన ఆటోలో రెండురోజులపాటు నగరంలో వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఇలా ఫిబ్రవరి 19న మీర్‌పేట జిల్లెలగూడ మిథులానగర్‌లో నివాసముంటున్న శ్రీధర్ ఇంట్లోకి చొరబడిన వీరు భార్యాభర్తలపై దాడిచేసి కత్తులు చూపించి కాళ్లు చేతులు కట్టేసి 10 తులాల నగలు, సెల్ఫోన్లు ఇతర సామగ్రి దోచుకెళ్లారు. అదేనెల 22న తెల్లవారుజామున మీర్‌పేట విరాట్‌నగర్‌లో నివాసముంటున్న డాక్టర్ వామనరావు ఇంట్లోకి చొరబడి కత్తులు,ఆయుధాలతో దాడిచేసి 20 తులాల నగలు, నగదు, ఇతర వస్తువులు దోచుకెళ్లారు. దొంగిలించిన నగలను యాకుత్‌పురాలోని మహ్మద్ ఇంతియాజుద్దీన్ అలియాస్ సంరోజ్ వద్ద తాకట్టుబెట్టి వచ్చిన డబ్బుతో ఉత్తరప్రదేశ్ ముఠా వెళ్లిపోగా మిగిలిన డబ్బులను ఆసిఫ్ తీసుకున్నాడు. మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా..సైబరాబాద్, హైదరాబాద్ పోలీసుస్టేషన్ పరిధుల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఈ-ఛానల్‌కు పట్టుబడిన ఆటోల వివరాలు తెప్పించారు. ఆటోనెంబర్ (ఏపీ11టీఏ199)తో రెండు ఆటోలు ఉండడంతో.. దాని యజమాని ఆసిఫ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టి అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. కాగా బంగారం తాకట్టు పెట్టుకున్న ఇంతియాజుద్దీన్ ను కూడా అరెస్టు చేసి 24 తులాల నగలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు డీసీపీ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మీర్‌పేట సీఐలు శ్రీధర్‌రెడ్డి, సుబ్బయ్య, ఎస్ఐలు భాస్కర్, శ్రీకాంత్‌లు పాల్గొన్నారు. -
కరడుగట్టిన ముఠా గుట్టురట్టు
ముఠా సభ్యుడి పట్టివేత 24 తులాల బంగారు నగలు స్వాధీనం నాగోలు,న్యూస్‌లైన్: ఇళ్లల్లోకి చొరబడి కత్తులు, మారుణాయుధాలు చూపించి దాడిచేసి దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యుడిని, బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన వ్యక్తిని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 24 తులాల నగలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వనస్థలిపురం ఏసీపీ ఆనందభాస్కర్‌తో కలిసి డీసీపీ విశ్వప్రసాద్ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ మీరట్ ప్రాంతానికి చెందిన పాతనేరస్తుడు మహ్మద్‌ఆసిఫ్ (38) కొన్నేళ్లక్రితం నగరానికి వలసొచ్చి బాబానగర్‌లో స్థిరపడి ఈ ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఇక్కడే రెండు హెయిర్‌సెలూన్ దుకాణాలతోపాటు 20 ఆటోలను కిరాయికిస్తూ జీవిస్తున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్తులు ఆసిఫ్‌కు బావ వరసయ్యే జావిద్ (32),అల్తాఫ్ (22),వసీం, (22),శివ (23)లను నగరానికి పిలిపించి తన ఇంట్లో ఆశ్రయం కల్పించి దొంగత నాలకు పథకం పన్నారు. తన ఆటోలో రెండురోజులపాటు నగరంలో వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఇలా ఫిబ్రవరి 19న మీర్‌పేట జిల్లెలగూడ మిథులానగర్‌లో నివాసముంటున్న శ్రీధర్ ఇంట్లోకి చొరబడిన వీరు భార్యాభర్తలపై దాడిచేసి కత్తులు చూపించి కాళ్లు చేతులు కట్టేసి 10 తులాల నగలు, సెల్ఫోన్లు ఇతర సామగ్రి దోచుకెళ్లారు. అదేనెల 22న తెల్లవారుజామున మీర్‌పేట విరాట్‌నగర్‌లో నివాసముంటున్న డాక్టర్ వామనరావు ఇంట్లోకి చొరబడి కత్తులు,ఆయుధాలతో దాడిచేసి 20 తులాల నగలు, నగదు, ఇతర వస్తువులు దోచుకెళ్లారు. దొంగిలించిన నగలను యాకుత్‌పురాలోని మహ్మద్ ఇంతియాజుద్దీన్ అలియాస్ సంరోజ్ వద్ద తాకట్టుబెట్టి వచ్చిన డబ్బుతో ఉత్తరప్రదేశ్ ముఠా వెళ్లిపోగా మిగిలిన డబ్బులను ఆసిఫ్ తీసుకున్నాడు. మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా..సైబరాబాద్, హైదరాబాద్ పోలీసుస్టేషన్ పరిధుల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఈ-ఛానల్‌కు పట్టుబడిన ఆటోల వివరాలు తెప్పించారు. ఆటోనెంబర్ (ఏపీ11టీఏ199)తో రెండు ఆటోలు ఉండడంతో.. దాని యజమాని ఆసిఫ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టి అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. కాగా బంగారం తాకట్టు పెట్టుకున్న ఇంతియాజుద్దీన్ ను కూడా అరెస్టు చేసి 24 తులాల నగలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు డీసీపీ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మీర్‌పేట సీఐలు శ్రీధర్‌రెడ్డి, సుబ్బయ్య, ఎస్ఐలు భాస్కర్, శ్రీకాంత్‌లు పాల్గొన్నారు.