16 నుంచి ఒంటిపూట బడి
హైదరాబాద్: వేసవి ఎండల నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం (16వ తేదీ) నుంచి ఒక్క పూట బడులను నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా విద్యా శాఖ అధికారులకు పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. 16వ తేదీ నుంచి పాఠశాలలు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయన్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లలో.. పరీక్షలు జరిగే 11 రోజుల పాటు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 వరకు తరగతులను నిర్వహిస్తారని చెప్పారు. కాగా వేసవి ఎండల దృష్ట్యా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి నడిచే స్కూళ్ల విషయంలో పునరాలోచించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు పాఠశాల విద్యా డెరైక్టర్కు విజ్ఞప్తి చేశాయి.