hand ball team
-
తెలంగాణ–హరియాణా గెలుపు
సాక్షి, హైదరాబాద్: ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ హ్యాండ్‌బాల్ పురుషుల చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో తెలంగాణ– హరియాణా జట్టు గెలుపొందింది. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తెలంగాణ– హరియాణా జట్టు 44–39తో పంజాబ్– ఆంధ్రప్రదేశ్ జట్టుపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడల కార్యదర్శి, తెలంగాణ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ నోడల్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ ఎ. దినకర్ బాబు, తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షులు జగన్మోహన్ రావు, కార్యదర్శి పవన్ కుమార్, తెరాస నాయకులు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా జరుగుతోన్న ఈ క్రీడా కార్యక్రమం ఆగస్టు వరకు జరుగనుంది. ఇందులో దేశంలోని 29 రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన పురుషుల జట్లు పాల్గొంటున్నాయి. దాదాపు 500 మంది క్రీడాకారులు ఇందులో తలపడనున్నారు. హైదరాబాద్, చండీగఢ్, గాంధీనగర్, ఢిల్లీ, డెహ్రాడూన్, ఇండోర్, లక్నో, అండమాన్ నికోబాద్ వేదికలుగా ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ క్రీడాపోటీలు జరుగుతాయి. -
అంచెలంచెలుగా ఎదిగి..
నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన ఆ బాలిక జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో ఆడే స్థాయికి ఎదిగింది. తొమ్మిదో తరగతి చదువుతుండగానే రెండుసార్లు జాతీయ పోటీలకు అర్హత సాధించింది. మొదటిసారి జాతీయ క్రీడల్లో క్వార్టర్ ఫైనల్లో ఆడి ప్రతిభను చాటింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు , సైదాపురం: మండల కేంద్రమైన సైదాపురానికి చెందిన మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న దాడిశెట్టిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కూలీ బుజ్జా వెంకటరత్నం, సుమతీల కుమార్తె గాయత్రి. ఆమె సైదాపురం ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. దీంతో తల్లిదండ్రులు కూడా చేయూతనందించా రు. సైదాపురం ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న కోటేశ్వరరావు క్రీడల పట్ల గాయత్రికి ఉన్న ఆసక్తిని గుర్తించి హ్యాండ్‌బాల్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. పలు పోటీలకు.. పీడీ శిక్షణతో గాయత్రి మండల, జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి తర్వాత రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే స్థాయికి చేరుకుంది. 2015లో జరిగిన సెలెక్షన్లో జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై ఢిల్లీలో పోటీల్లో పొల్గొంది. అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్‌గా స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈనెల 4వ తేదీన తూర్పుగోదావరిలో జరిగిన 63వ స్కూల్ గేమ్స్‌లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనగా రాష్ట్ర జట్టు గెలుపొంది జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. దీంతో గాయత్రికి మరోసారి జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. వచ్చే నెలలో ఉత్తరప్రదేశ్‌లో జరిగే పోటీల్లో పాల్గొననుంది. ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉంటుంది. వారిని ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు సాధిస్తారు. గాయత్రి ఎంతో క్రమశిక్షణతో ఆట నేర్చుకుంది. ఆమె జాతీయ జట్టులో చోటు సంపాదించడం చాలా ఆనందంగా ఉంది. – కోటేశ్వరరావు, పీడీ జిల్లాకు మంచి పేరు తెస్తా జాతీయ పోటీల్లో బాగా ఆడి మన జిల్లాకు మంచి పేరు తీసుకువస్తా. తల్లిదండ్రులు, పీడీ, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే జాతీయస్థాయి పోటీలు ఆడగలుగుతున్నా. –›గాయత్రి -
కృష్ణా హ్యాండ్‌బాల్ మహిళల జట్టు ఎంపిక
విజయవాడ (వన్‌టౌన్) : కృష్ణా విశ్వవిద్యాలయం హ్యాండ్‌బాల్ (మహిళలు) జట్టును ఎంపిక చేసినట్లు కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల క్రితం తమ కళాశాలలో జరిగిన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల (మహిళల) హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ ముగిసిన తరువాత ఎంపిక కమిటీ విశ్వవిద్యాలయం జట్టును ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఆంధ్ర లయోల కళాశాలకు చెందిన జె.సుశ్రీ, టి.నవ్య, ఎన్.మనీషా, కేబీఎన్ కళాశాలకు చెందిన టి.సాయివినీత, జి.సాయిలక్ష్మి, ఎస్.గౌరీపార్వతి, సిద్ధార్థ మహిళా కళాశాలకు చెందిన డి.తారాబాయి, ఎస్.దివ్యవల్లి, మారీస్ స్టెల్లా కళాశాలకు చెందిన కె.వంశీప్రియ, నూజివీడు ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్‌కు చెందిన ఈ.కల్యాణి, విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు చెందిన ఎం.కోటేశ్వరి, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాలకు చెందిన పి.అశ్విని తదితులు ఎంపికయ్యారని పేర్కొన్నారు. స్టాండ్‌బైస్‌గా పి.శివనాగలక్ష్మి (కేబీఎన్), కె.సుష్మాస్వరాజ్, జె.రాణి (ఆంధ్ర లయోల), ఎస్.శాంతి (మారీస్ స్టెల్లా), వీఎల్ భవ్య (సిద్ధార్థ మహిళా)ఎంపికైనట్లు వివరించారు. వీరు తమళనాడు సేలంలోని పెరియార్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి నిర్వహించే అంతర్ విశ్వవిద్యాలయ హ్యాండ్‌బాల్ పోటీలకు కృష్ణా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. -
హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక
హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగే హ్యాండ్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే అండర్-17 రాష్ట్రస్థాయి బాలుర జట్టును సోమవారం ప్రకటించారు. సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి. రమేశ్ రెడ్డి జట్టు సభ్యుల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట వ్యాయామవిద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు (పీఈటీఏ)రాఘవ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా పీఈటీఏ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు. జట్టు: ఆర్.బాలరాజు, చిన్న, శ్రీశైలం, నవీన్, వంశీ, విజయ్, ఉదయ్, భాస్కర్, అభినవ్, అజయ్, సంతోశ్, లోకేశ్, ఎ.వంశీ, రాజేశ్, రాహుల్, ఎం.అజయ్, విశాల్, ఆకాశ్, వేణుగోపాల్, అభిషేక్, ప్రసాద్, నరేశ్ కుమార్.