సాక్షి, హైదరాబాద్: ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ హ్యాండ్‌బాల్ పురుషుల చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో తెలంగాణ– హరియాణా జట్టు గెలుపొందింది. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తెలంగాణ– హరియాణా జట్టు 44–39తో పంజాబ్– ఆంధ్రప్రదేశ్ జట్టుపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడల కార్యదర్శి, తెలంగాణ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ నోడల్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ ఎ. దినకర్ బాబు, తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షులు జగన్మోహన్ రావు, కార్యదర్శి పవన్ కుమార్, తెరాస నాయకులు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా జరుగుతోన్న ఈ క్రీడా కార్యక్రమం ఆగస్టు వరకు జరుగనుంది. ఇందులో దేశంలోని 29 రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన పురుషుల జట్లు పాల్గొంటున్నాయి. దాదాపు 500 మంది క్రీడాకారులు ఇందులో తలపడనున్నారు. హైదరాబాద్, చండీగఢ్, గాంధీనగర్, ఢిల్లీ, డెహ్రాడూన్, ఇండోర్, లక్నో, అండమాన్ నికోబాద్ వేదికలుగా ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ క్రీడాపోటీలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment