Hansraj Gangaram Ahir
-
నిమ్స్‌లో దీక్ష విరమించిన లక్ష్మణ్..!
హైదరాబాద్: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ, ఇంటర్ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ గత 5 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. సోమవారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమైన ఆయన దీక్ష శుక్రవారం నిమ్స్ ఆస్పత్రిలో ముగిసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం ఆహిర్ లక్ష్మణ్‌ను పరామర్శించి ఆయనతో దీక్ష విరమింపజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన లక్ష్మణ్‌ను అదేరోజు అరెస్ట్ చేసిన పోలీసులు నిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే, విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని పేర్కొన్నారు. కాగా, లక్ష్మణ్‌ను పరామర్శించిన వారిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, బీజేపీ తెలంగాణ ఇన్చార్జి కృష్ణదాస్, ఎంపీ దత్తాత్రేయ ఉన్నారు. (చదవండి : అరెస్ట్‌లను ఖండించిన మురళీధర్ రావు) కేంద్రమంత్రి హన్సరాజ్ మాట్లాడుతూ.. 5 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండటంతో లక్ష్మణ్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దీక్ష విరమింపజేశాం. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరం. విద్యార్థుల కుంటుంబాలకు మా సానుభూతి ఉంటుంది. తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్రం తరపున విద్యార్థులకు నా విజ్ఞప్తి. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాని తెలంగాణ సర్కార్‌ను కోరుతున్నా. ఉద్యమం ఉధృతం.. 9 లక్షల మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన సమస్యపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉంది. పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆందోళనపై కేసీఆర్ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. ఒక జాతీయ పార్టీగా బాధితుల పక్షాన నిలబడ్డాం. వారి నిరసనలకు మద్దతు తెలుసుతున్నాం. లక్ష్మణ్‌తో అమిత్‌షా ఫోన్లో మాట్లాడారు. ఆయన దీక్షను హన్సరాజ్‌తో విరమింపజేయాలని వర్తమానం పంపారు. విద్యార్థుల పోరాటాలపై భరోసానివ్వడంతో లక్ష్మణ్ దీక్ష విరమించారు. వారికి న్యాయం జరిగేదాకా పోరాటం ఆపేది లేదు. ఉద్యమం ఇంకా తీవ్రం చేస్తాం. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను పరామర్శిస్తాం. 119 అసెంబ్లీ కేంద్రాల్లో దీక్షలు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఢిల్లీకి వెళ్లి, హోంమంత్రి, రాష్ట్రపతిని కూడా కలుస్తాం. -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు -
నిమ్స్‌లో దీక్ష విరమించిన లక్ష్మణ్..!
-
తిత్లీ బాధితులను ఆదుకుంటాం
శ్రీకాకుళం , వజ్రపుకొత్తూరు రూరల్/ టెక్కలి:తిత్లీ తుపానుతో నష్టపోయిన అందరినీ కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర హోం శాఖ సహా యమంత్రి హన్సరాజ్ గంగారాం ఆహిర్ అన్నారు. టెక్కలి, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఆయన సోమవారం పర్యటించారు. వజ్రపుకొత్తూరు మండలం చినవంక, డోకులపాడు గ్రామాల్లో పర్యటించిన అయన తుపాను పాడైన కొబ్బరి తోటలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఇంతవరకు నష్టపరిహారం అందలేదని, పూర్తిగా పంటలు, ఇళ్లు నష్టపోయిన తమకు ఎవరూ ఆదుకోలేదని బాధితులు కేంద్రమంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా కేంద్ర మంత్రి కలిశారు. నష్టపరిహారాన్ని పెంచాలని, సాముహిక వ్యవసాయ బోర్లు మంజూరు చేయాలని, నష్టపోయిన ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందించాలని, వ్యవసాయకూలీ కుటుంబాలకు 5 సంవత్సరాల పాటు నెలకు రూ.5 వేలు భృతి అందించాలని మత్య్సకారులకు తీర ప్రాం తంలో భూములకు పట్టాలు ఇప్పించాలని మండల వైఎస్సార్ సీపీ మహిళ కన్వీనర్ తామాడ సరస్వతి,జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పరపల్లి నీలవేణి, అగ్ని కుల క్షత్రియ జిల్లా ఉపాధ్యక్షుడుయు. ఉదయ్‌కుమార్‌లు వినతిపత్రాలను అందజేశారు. డోకులపాడులో తుపానుతో దెబ్బతిన్న ఇళ్లను మంత్రి పరిశీలించారు. బాధితులు మడ్డు రాజు, మడ్డు యర్రమ్మలతో మాట్లాడి ఎంత పరిహారం అం దిందని అడిగారు. వారు తమకు రూ.10 వేలు మాత్రమే అందిందని బదులు ఇచ్చారు. అలాగే బత్సలవానిపేట గ్రామానికి చెందిన బత్సల దా లమ్మ తమ అవేదనను హిందీలో చెప్పుకుంది. నష్టం కలిగిన వివరాలను అధికారులకు అందిస్తే న్యాయం చేస్తామని మంత్రి హా మీ ఇచ్చారు. అనంతరం విలేకర్లతో కేం ద్రమంత్రి మాట్లాడుతూ నష్టపోయిన తీరును చూశానని, ఉద్దాన ప్రజలకు జరిగిన తీవ్ర నష్టం తనను బాధించిందన్నారు. నష్ట తీవ్రతను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులందరినీ ఆదుకుంటామన్నారు. శారదపురంలో రోడ్డుపైన అధిక సంఖ్యలో రైతులు ఉండటం తో వారితో మాట్లాడి పర్యటనను ముగిం చారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాల్, ఎంఎల్సీ మాధ వ్, విశాఖపట్నం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కణితి విశ్వనాథం, బీజేపీ పలాస నియోజకవర్గ ఇన్చార్జి కొర్రాయి బాలకృష్ణయాదవ్, ఇన్చార్జి కలెక్టర్ చక్రధర్‌బాబు ఉన్నారు. బాధితులను ఆదుకోండి: వైఎస్ఆర్సీపీ వినతి టెక్కలి: తుపానుతో సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని కనీసం కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ఆదుకోవాలని వైఎ స్సార్సీపీ నాయకులు బగాది హరి, పినకాన వైకుంఠరావు కేంద్ర సహాయ మంత్రి గంగారాం అహిర్‌ను కోరారు. అయోధ్యపురం జంక్షన్ వద్ద కేంద్ర సహాయ మంత్రికి వినతిపత్రం అందజేశారు. తుపానుతో రైతులు, సామాన్య ప్రజలు పూర్తిగా నష్టపోయారని.. వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్షపాతం చూపిం దని కేంద్రం మంత్రికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని విన్నవించారు. -
నకిలీ కరెన్సీ ఎక్కువగా దొరికింది అక్కడే..!
న్యూఢిల్లీ : నకిలీ కరెన్సీ నిర్మూలించడానికి, అవినీతిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నోట్ల రద్దు అనంతరం దర్యాప్తు సంస్థలు పెద్ద ఎత్తున్న నకిలీ కరెన్సీని పట్టుకున్నాయి. అయితే అత్యధిక నకిలీ కరెన్సీని గుజరాత్‌లోనే సీజ్ చేసినట్టు కేంద్రం నేడు లోక్‌సభకు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.13.87 కోట్లకు పైగా నకిలీ కరెన్సీని సీజ్ చేస్తే, వాటిలో ఎక్కువగా గుజరాత్లో రూ.5.94 కోట్లను సీజ్ చేసినట్టు వెల్లడించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ)లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం హోం వ్యవహారాల సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారం అహిర్ ఈ విషయాన్ని లోక్‌సభలో వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్ 9 నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ బోర్డర్లతో పాటు, రాష్ట్రాల్లో మొత్తం రూ.13.87 కోట్ల విలువైన కరెన్సీ నోట్లను(ఎఫ్ఐసీఎన్) సీజ్ చేశామని చెప్పారు. దీనిలో అత్యధికంగా గుజరాత్లో రూ.5.94 కోట్లను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. గుజరాత్ అనంతరం ఉత్తరప్రదేశ్‌లో రూ.2.19 కోట్లను, పశ్చిమ బెంగాల్లో రూ.2 కోట్లను, మిజోరాంలో కోటి రూపాయలను సీజ్ చేసినట్టు చెప్పారు. నకిలీ కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకొస్తున్నట్టు అనుమానం ఉన్న వారిపై కేంద్ర, రాష్ట్రాల ఇంటెలిజెన్స్, సెక్యురిటీ ఏజెన్సీలు నిఘా ఉంచాయని, వారిపై చర్యలు కూడా తీసుకున్నాయని మంత్రి తెలిపారు. నకిలీ కరెన్సీని సృష్టించడం, స్మగ్లింగ్ చేయడం, చలామణిలోకి తీసుకురావడం చట్టవిరుద్ధ చర్యలు (నివారణ) చట్టం, 1967 కింద ఉగ్రవాద కార్యకలాపాల కిందకు వస్తాయి. -
జవాన్లకు ఆధునిక ఆయుధాలు: హన్స్‌రాజ్
సాక్షి, సుకుమా : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం బుధవారం ఉదయం శ్రద్ధాంజలి ఘటించారు. కాగా ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రంతోపాటు, నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు వామపక్ష తీవ్రవాదాన్ని సవాలుగా తీసుకున్నాయని హన్స్‌రాజ్ తెలిపారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు సమన్వయంతో నక్సల్స్ ఏరివేత చేపడతున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమర జవాన్లకు సంతాపం తెలిపారన్నారు. బలగాలను ఆధునీకరిస్తాం నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో జవాన్లకు రక్షణగా సాంకేతికతను వాడుకుంటామని హన్స్‌రాజ్ వెల్లడించారు. మందుపాతరలను గుర్తించేందుకు ఐఈడీ డిటెక్షన్ టెక్నిక్‌ను వినియోగిస్తామన్నారు. ఆయాప్రాంతాల్లో బలగాలను పెంచడానికి బదులు ఆధునిక ఆయుధాలను జవాన్లకు అందచేస్తామన్నారు. కాగా సుకుమా జిల్లాలో మంగళవారం సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 9 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. -
సీట్లు పెంచాలని రెండు రాష్ట్రాలు అడిగాయి
⇒ ఏపీఆర్ఏ ప్రకారం పెంచడం సాధ్యం కాదు: కేంద్ర హోం శాఖ సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టం-2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అసెంబ్లీ సీట్లను పెంచాలని కోరాయని కేంద్ర హోం శాఖ తెలిపింది. మంగళవారం ఈమేరకు టీఆర్ఎస్ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. ‘తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అసెంబ్లీ సీట్లు పెంచాలని అడిగాయా, అయితే వివరా లేంటి? కేంద్ర స్పందన ఏంటి?’ అని సభ్యు లు కోరిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ‘ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సీట్లు పెంచాలని అడిగాయి. ఈ అంశాన్ని కేంద్ర న్యాయ శాఖ దృష్టికి తీసుకెళ్లాం. న్యాయ శాఖ కేంద్ర అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 తర్వాత తొలి జనగణనను ప్రచురించే వరకు రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్ల సంఖ్యను సర్దుబాటు చేయడం కుదరదని అటార్నీ జనరల్ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఆర్టికల్ 170ని సవరించనంత వరకు.. విభజన చట్టంలోని సెక్షన్ 26ను అనుసరించి అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు. -
కశ్మీర్లో అంగుళం జాగాను కూడా వదులుకోం
కేంద్ర మంత్రి గంగారాం అహిర్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కశ్మీర్లో అంగుళం జాగాను కూడా వదులుకునేందుకు భారత్ సిద్ధంగా లేదని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జెడ్పీ మైదానంలో జరిగిన తిరంగాయాత్రసభలో ఆయన ప్రసంగించారు. హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్రవాద సంస్థలు కశ్మీర్లో అశాంతికి కుట్రలు చేస్తున్నాయని అన్నారు. తెలంగాణలో నిజాం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమని అన్నా రు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బైక్ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలసి అహిర్ పాల్గొన్నారు. -
'అసదుద్దీన్‌ను చంకనెత్తుకోవడం సరికాదు'
నాగారం: దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చంకనెత్తికున్నాడని కేంద్ర ఎరువులు, రసాయనాల సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం ఆహిర్ విమర్శించారు. ప్రతి ఒక్కరూ దేశాన్ని గౌరవించాలనీ, భారత్ మాతాకు జై అనాల్సిందేనని అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఎక్కువ మొత్తంలో రాయితీలు ఉన్నాయని, ప్రచారం అంతగా లేకపోవడంతో ప్రజలకు తెలియడం లేదన్నారు. గోధుమలకు 27 శాతం కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోందన్నారు. ఒక్కశాతమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంతా తామే చేస్తున్నామని గొప్పలు చేప్పుకోవడం విడ్డూరమన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 1700 ఎకరాల్లో పెద్ద ఎత్తున సీమెంట్ ఫ్యాక్టరీనీ నిర్మాణించడాకి కషి చేస్తున్నామన్నారు. రామగుండంలో ఫ్యాక్టరీకి రూ. 5 వేల కోట్లు మంజురు చేశామన్నారు. దేశంలోని రోడ్లపై గల రైల్వే లైన్‌పై ఆర్ఓబీ బ్రీడ్జీలు నిర్మిస్తున్నామన్నారు. ప్రధాన రహదారులను అభివద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్ నుంచి నారాయాణపేట్ రహదారికి రూ. 1900 కోట్లు కేంద్ర మంత్రి గడ్కరీ మంజూరు చేశారని, మరో రూ. 160 కోట్లతో రహదారులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అమృత సిటీ పథకంలో నిజామాబాద్ నగరం ఉందన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ఇందుర్ అభివృద్ధి చెందుతుందన్నారు. సురక్షిత త్రాగునీరు అందిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు స్కిల్‌డెవలప్‌మెంట్ ద్వారా 50 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన కేసీఆర్ వాటిని అమలు చేయడం లేదన్నారు. బోధన్ షుగర్‌ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. -
'కేసీఆర్‌కి అలవాటుగా మారింది'
వరంగల్ : తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్ని అభివృద్ది చేస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి హన్స్ రాజ్ గంగారామ్ తెలిపారు. ఆదివారం వరంగల్‌లో ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హన్స్ రాజ్ గంగారామ్ మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మాటమాటకు ఎన్నికలు జరగడం తెలంగాణ సీఎం కేసీఆర్‌కి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో అటు అధికార టీఆర్ఎస్.... ఇటు టీడీపీ - బీజేపీతోపాటు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు తమ అభ్యర్థుల కోసం ముమ్మర ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 21న వరంగల్ ఉప ఎన్నిక జరగనుంది. 24వ తేదీన ఓట్లు లెక్కింపు జరుగుతుంది. -
ఆదిలాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రి హన్స్‌రాజ్
ఆదిలాబాద్: కేంద్ర ఎరువులు, రసాయన శాఖల మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ బుధవారం ఉదయం ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. ఆదిలాబాద్ చేరుకున్న ఆయనకు బీజేపీ జిల్లా నేతలు చాంద్‌టీ వద్ద ఘనస్వాగతం పలికారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్మల్ పట్టణంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన జిల్లాకు వచ్చారు.