నిమ్స్‌లో దీక్ష విరమించిన లక్ష్మణ్‌..! | Bjp Leader Laxman put on fluids, fast ends | Sakshi
Sakshi News home page

నిమ్స్‌లో దీక్ష విరమించిన లక్ష్మణ్‌..!

Published Fri, May 3 2019 11:18 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ, ఇంటర్‌ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ గత 5 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. సోమవారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమైన ఆయన దీక్ష శుక్రవారం నిమ్స్‌ ఆస్పత్రిలో ముగిసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్‌ గంగారాం ఆహిర్‌ లక్ష్మణ్‌ను పరామర్శించి ఆయనతో దీక్ష విరమింపజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన లక్ష్మణ్‌ను అదేరోజు అరెస్ట్‌ చేసిన పోలీసులు నిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే, విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని పేర్కొన్నారు. కాగా, లక్ష్మణ్‌ను పరామర్శించిన వారిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి కృష్ణదాస్‌, ఎంపీ దత్తాత్రేయ ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement