hanumantha vahanam
-
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు హనుమంత వాహనంపై శ్రీనివాసుడు (ఫొటోలు)
-
బ్రహ్మోత్సవాలు : హనుమంత వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
-
హనుమంత వాహనంపై స్వామివారు వైభవం
-
హనుమంత వాహనంపై ఖాద్రీశుడు
కదిరి : బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి హనుమంత వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నరసింహావతారంలో హిరణ్యకశ్యపుడి సంహారం అనంతరం మహావిష్ణువును సాక్షాత్తు హనుమంతుడే దిగివచ్చి తన భుజస్కందాలపై మోస్తాడని భక్తుల నమ్మకం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విల్లంబులు ధరించి హనుమంతుని భుజాలపై కొలువుదీరిన శ్రీవారిని చూడడానికి రెండు కల్లు చాలవు. . త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుని వాహనంగా చేసుకొని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. హనుమంతుని భక్తి తత్పరతను ఈ కాలం వారికి వివరిస్తూ రాముడు, కృష్ణుడు, నారసింహుడు అన్నీ తానేనని స్వామివారు తెలియజేస్తారని అర్చకులు వివరించారు. తిరువీధుల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి ఆలయానికి రాలేని వృద్ధులు, వ్యాధిగ్రస్తులకు దర్శన మిచ్చేందుకు శ్రీవారే తన భక్తుల చెంతకు విచ్చేస్తారని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఉభయ దారులుగా మాజీ శాసనసభ్యుడు జొన్నా రామయ్య కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు, ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. -
నేడు హనుమంత వాహనంపై ఊరేగనున్న ఖాద్రీశుడు
కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రçహ్మోత్సవాల్లో భాగంగా శనివారం హనుమంత వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన రామావతారంలో రాక్షస సంహారం అనంతరం రామలక్ష్మణులను హనుమంతుడు తన భుజస్కందాలపై ఎత్తుకొని భక్తిని చాటుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. నరసింహావతారంలోనూ హిరణ్యకశ్యపుడి సంహారం అనంతరం శ్రీ మహావిష్ణువును హనుమంతుడే సాక్షాత్తూ దిగి వచ్చి తన భుజస్కందాలపై మోస్తాడని భక్తుల నమ్మకం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విల్లంబులు ధరించి హనుమంతుడి భుజాలపై కొలువుదీరిన శ్రీవారిని చూడడానికి రెండు కళ్లూ చాలవు. లక్ష్మీ నారసింహుడిని దర్శించుకోవడానికి ఆలయానికి రాలేకపోతున్న ముసలి, ముతక, వ్యాధిగ్రస్తులకు దర్శనం ఇవ్వడానికి భక్తుల చెంతకే శ్రీవారు విచ్చేస్తారని అర్చకులు చెబుతున్నారు. అందుకే రోజూ బ్రహ్మోత్సవాల సమయంలో తిరువీధుల గుండా భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారంటున్నారు. ఉభయదారులుగా జొన్నా వీరయ్య, జొన్నా వీర శేషయ్య కుటుంబ సభ్యులు వ్యవహరిస్తారని ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి, చైర్మన్ పచ్చి పులుసు నరేంద్రబాబు పేర్కొన్నారు.