కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రçహ్మోత్సవాల్లో భాగంగా శనివారం హనుమంత వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన రామావతారంలో రాక్షస సంహారం అనంతరం రామలక్ష్మణులను హనుమంతుడు తన భుజస్కందాలపై ఎత్తుకొని భక్తిని చాటుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. నరసింహావతారంలోనూ హిరణ్యకశ్యపుడి సంహారం అనంతరం శ్రీ మహావిష్ణువును హనుమంతుడే సాక్షాత్తూ దిగి వచ్చి తన భుజస్కందాలపై మోస్తాడని భక్తుల నమ్మకం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విల్లంబులు ధరించి హనుమంతుడి భుజాలపై కొలువుదీరిన శ్రీవారిని చూడడానికి రెండు కళ్లూ చాలవు.
లక్ష్మీ నారసింహుడిని దర్శించుకోవడానికి ఆలయానికి రాలేకపోతున్న ముసలి, ముతక, వ్యాధిగ్రస్తులకు దర్శనం ఇవ్వడానికి భక్తుల చెంతకే శ్రీవారు విచ్చేస్తారని అర్చకులు చెబుతున్నారు. అందుకే రోజూ బ్రహ్మోత్సవాల సమయంలో తిరువీధుల గుండా భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారంటున్నారు. ఉభయదారులుగా జొన్నా వీరయ్య, జొన్నా వీర శేషయ్య కుటుంబ సభ్యులు వ్యవహరిస్తారని ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి, చైర్మన్ పచ్చి పులుసు నరేంద్రబాబు పేర్కొన్నారు.
నేడు హనుమంత వాహనంపై ఊరేగనున్న ఖాద్రీశుడు
Published Fri, Mar 10 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM
Advertisement