Hariyana CM khattar
-
ముసుగు వీరుడిలా హరియాణా సీఎం, ఎందుకిలా? వీడియో వైరల్
హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పంచకులలోని జాతరలో మారువేషంలో కనిపించడం వైరల్‌గా మారింది. రాష్ట్రంలో స్థానికంగా నిర్వహించే జాతరకు హాజరయ్యారు. ఈ సందర్బంగా తనను ఎవరు గుర్తు పట్టకుండా ముఖానికి కండువాతో కప్పుకొని మరీ మంగళవారం సాయంత్రం దర్శమనిచ్చారు. వాచ్మెన్ వేషంలో ఈ వేడుక మైదానంలో షికారు చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. నిజంగా ఈ వీడియోలో ఉన్నది ఖట్టర్ అని ముఖ్యమంత్రి మీడియా కార్యదర్శి తర్వాత ధృవీకరించారు. స్థానిక వేడుకలో ఎవరికీ అనుమానం రాకుండా వాచ్‌మెన్‌లా అది కూడా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సీఎం ఖట్టర్ జనాల మధ్య ఖాకీ రంగు దుస్తులలో , కాషాయ రంగు టోపీతో ఈ వీడియోలో కనిపించారు. అయితే హరియాణాలోని పంచకులలోని షాలిమార్ మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో రావణ్ దహనం దృశ్యాలని తెలుస్తోంది. हरियाणा के मुख्यमंत्री मनोहर लाल खट्टर पंचकूला के सेक्टर-5 के दशहरा ग्राउंड में मेला देखने के लिए पहुंचे। यह दावा उनके एक वीडियो को लेकर किया जा रहा है। सीएम इस वीडियो में बिना सिक्योरिटी के मेले में घूमते नजर आ रहे हैं।#ManoharLalKhattar #haryana pic.twitter.com/1Z17xXgdZB — Parmeet Bidowali (@ParmeetBidowali) November 8, 2023 హాట్ బెలూన్ ప్రాజెక్ట్ ఇది ఇలా ఉంటే ఈరోజు ఉత్తర హరియాణాలో హాట్ బెలూన్ ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక వృద్ధితోపాటు, అక్కడి సాహస ప్రియులను ఆకర్షించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసినట్టు సీఎం చెప్పారు. హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణించి, లాంచ్ సందర్భంగా ప్రకృతి సఫారీ ప్రాజెక్ట్‌న ఎంజాయ్ చేయడం విశేషం. విమానాల్లో, హెలికాప్టర్లలో ప్రయాణించాం.. కానీ హాట్ ఎయిర్ బెలూన్ సఫారీ అనేది ప్రత్యేకమైన అనుభూతి అంటూ ట్వీట్ చేశారు. హరియాణాలో పర్యాటకులకు స్వాగతం! గత తొమ్మిదేళ్లుగా రాష్ట్ర టూరిజం అభివృద్ధికి ఎంతో కృషి చేశామని సీఎం పేర్కొన్నారు. हरियाणा में पर्यटकों का स्वागत है! पर्यटन के मानचित्र पर हरियाणा को उभारने के लिए हमने पिछले 9 वर्षों से अभूतपूर्व कार्य किए हैं। आज एक और कदम आगे उठाते हुए पर्यटन की रोमांचक गतिविधियों को बढ़ावा देने हेतु पिंजौर में हॉट एयर बैलून सफारी का शुभारंभ कर इसका लुत्फ भी उठाया।… pic.twitter.com/mX7YCzIrJe — Manohar Lal (@mlkhattar) November 8, 2023 -
హరియాణా సీఎంతో వైఎస్ జగన్ మర్యాదపూర్వక భేటీ
సాక్షి, విశాఖపట్నం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మ.1.05 గంటలకు విశాఖ రుషికొండ పెమా వెల్నెస్ కేంద్రానికి చేరుకున్న జగన్‌కు హరియాణా సీఎం ఖట్టర్ బయటకు వచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు వైఎస్ జగన్ ఆత్మీయ సత్కారం చేసి జ్ఞాపికను అందించారు. ఇరువురు కాసేపు మాట్లాడుకున్న అనంతరం వైఎస్ జగన్ తిరిగి విజయవాడకు పయనమయ్యారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సెక్రటరీ ధనుంజయ్‌రెడ్డి.. సీఎం ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం కూడా విశాఖ వచ్చారు. అంతకుముందు.. విశాఖ ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ శ్రేణుల్ని సీఎం జగన్ ఆత్మీయంగా పలకరించారు. సుమారు 50 నిమిషాల పాటు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లతో ఆయన ముచ్చటించారు. గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌కు ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, మంత్రులు గుడివాడ అమర్నా«థ్, దాడిశెట్టి రాజాతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. నేచురోపతి కోసం వచ్చా ఈ సందర్భంగా మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ.. తన మిత్రుడు సూచన మేరకు తాను ఇక్కడకు నేచురోపతి చికిత్స కోసం వచ్చానన్నారు. ఇక్కడైతే ఎలాంటి హడావుడి ఉండదని, ప్రశాంతత కోసం వచ్చానని ఆయన చెప్పారు. వైజాగ్ చాలా బాగుందని ఖట్టర్ కితాబిచ్చారు. అలాగే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను కలవడానికి వచ్చారని.. ఇరువురం కలిసి లంచ్ చేశామని.. సుహృద్భావ వాతావరణంలో తమ భేటీ జరిగిందని.. ఎలాంటి రాజకీయాలు చర్చకు రాలేదని ఆయన తెలిపారు. -
కిసాన్ మహా ‘పంచాయితీ’
చండీగఢ్/కర్నాల్: బీజేపీ పాలిత రాష్ట్రమైన హరియాణాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కొత్త సాగు చట్టాల ప్రయోజనాలను వివరించి, రైతన్నలను శాంతింపజేసేందుకు ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది. ముఖ్యమంత్రి నిర్వహించతలపెట్టిన ‘కిసాన్ మహాపంచాయత్’ను నిరసనకారులు భగ్నం చేశారు. ఇందుకోసం వారు పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా కదం తొక్కారు. జల ఫిరంగులకు, బాష్ప వాయువుగోళాలకు ఎదురొడ్డి మరీ అనుకున్నది చేసి చూపించారు. హెలిప్యాడ్‌పై బైఠాయింపు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల ఒనగూరే లాభాలను రైతులకు స్వయంగా తెలియజేయడానికి కర్నాల్ జిల్లాలోని కైమ్లా గ్రామంలో మనోహర్‌లాల్ ఖట్టర్ ఆదివారం కిసాన్ మహాపంచాయత్ నిర్వహిస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని, కచ్చితంగా అడ్డుకొని తీరుతామని రైతులు ప్రతిజ్ఞ చేశారు. ముందు నిర్ణయించినట్లుగానే ఆదివారం కైమ్లాలో కిసాన్ మహాపంచాయత్ వేదికను అధికారులు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారతీయ కిసాన్ యూనియన్(చారుణి) ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో రైతులు కైమ్లాకు బయలుదేరారు. గ్రామ శివారులో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, వారిని ముందుకు సాగకుండా ఆంక్షలు విధించారు. కోపోద్రిక్తులైన నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ రైతులు వినిపించుకోలేదు. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కేనన్లు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. అయినప్పటికీ రైతులు లెక్కచేయలేదు. బారికేడ్లను ఛేదించుకొని కిసాన్ మహాపంచాయత్ వేదిక వద్దకు పరుగులు తీశారు. అప్పటికే అక్కడికి కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. రైతులు అక్కడున్న కుర్చీలు, పూల కుండీలు, మైకులను విరగ్గొట్టారు. వేదికను పూర్తిగా ధ్వంసం చేశారు. బీజేపీ హోర్డింగ్‌లు, బ్యానర్లను చించేశారు. నల్ల జెండాలు పట్టుకుని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక హెలిప్యాడ్‌పై రైతులు బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చేసేది లేక కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. మహా పంచాయత్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం తమ గాయాలపై కారం చల్లేందుకు ప్రయత్నిస్తోందని రైతులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతాం.. హరియాణాలో రైతులపై వాటర్ కేనన్లు, బాష్ప వాయువు ప్రయోగించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం భూపీందర్‌సింగ్ హుడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తేల్చిచెప్పారు. రైతులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. హరియాణా ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. శాసనసభను వెంటనే సమావేశపర్చాలని, ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు. సీఎం ఖట్టర్ తలపెట్టిన మహా పంచాయత్‌కు ప్రజల మద్దతు లేదని హరియాణా పీసీసీ అధ్యక్షురాలు కుమారి సెల్జా చెప్పారు. మహా పంచాయత్ అసలు రంగును రైతులు బయటపెట్టారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలే బాధ్యులు: ఖట్టర్ కైమ్లా గ్రామంలో ఉద్రిక్తతకు కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులే బాధ్యత వహించాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇలాంటి అనుచిత ప్రవర్తనను సహించబోమని చెప్పారు. కిసాన్ మహా పంచాయత్‌కు అడ్డంకులు సృష్టించబోమని హామీ ఇచ్చిన కొందరు రైతు సంఘాల నేతలు మాట తప్పారని విమర్శించారు. దేశంలో బలమైన ప్రజాస్వామ్యం ఉందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. నిజానికి రైతులు అనుచితంగా వ్యవహరించరని చెప్పారు. కొందరు వ్యక్తులు రైతులను అప్రతిష్టపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మహా పంచాయత్‌లో తాను చెప్పాలనుకున్న విషయాలను తమ పార్టీ నాయకులు ప్రజలకు తెలిపారన్నారు. తాజా ఘటనలో నిఘా వర్గాల వైఫల్యం ఏమీ లేదన్నారు. కైమ్లాలో ఉద్రిక్తతల పరిస్థితుల దృష్ట్యా హెలికాప్టర్‌ను కర్నాల్‌లో దింపాలని తానే సూచించానన్నారు. -
ఆధార్ కోసం చంపేశారు!
చండీగఢ్: ఆధార్ కార్డు తీసుకురానందుకు ఓ అమర జవాన్ భార్యకు ఆస్పత్రి సిబ్బంది చికిత్స నిరాకరించిన అమానవీయ ఘటన హరియాణాలోని సోనిపట్‌లో జరిగింది. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో పరిస్థితి విషమించి బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించామనీ, దోషులుగా తేలినవారిని కఠినంగా శిక్షిస్తామని హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ శనివారం తెలిపారు. సోనిపట్ జిల్లాలోని మెహలానా గ్రామానికి చెందిన శకుంతలా దేవీ(55) భర్త హవల్దార్ లక్ష్మణ్ దాస్ కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. శకుంతలా దేవీ గుండె సమస్యతో బాధపడుతున్నట్లు ఆమె కుమారుడు పవన్ తెలిపారు. దీంతో ఆమెను ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ఈసీహెచ్ఎస్) ఆస్పత్రికి గురువారం తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈసీహెచ్ఎస్ వర్గాలు ఆమెను తులిప్ మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. ‘కౌంటర్లో పేషెంట్ ఆధార్‌కార్డు ఇవ్వాల్సిందిగా ఆస్పత్రి సిబ్బంది నన్ను కోరారు. కార్డును ఇంట్లో మర్చిపోయాననీ ఈలోగా చికిత్స ప్రారంభించాలని వేడుకున్నాను. నా మొబైల్లో ఉన్న ఆధార్ కార్డు చూపించా. అసలైన ఆధార్ కార్డు ఇస్తేనే చికిత్స చేస్తామని సిబ్బంది స్పష్టంచేశారు’ అని కుమార్ చెప్పారు. నచ్చజెప్పినా వినకపోవడంతో తన తల్లిని తీసుకుని ఈసీహెచ్ఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లగా... ఆమె అదేరోజు ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు. ఈసీహెచ్ఎస్ అధికారులకు తులిప్ ఆస్పత్రి నిర్వాకంపై ఫిర్యాదు చేశానన్నారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఓ బృందం సోనిపట్‌కు బయలుదేరిందని రాష్ట్ర ఆరోగ్యమంత్రి అనీల్ విజ్ వెల్లడించారు. -
జాట్ల ఆందోళన వాయిదా
న్యూఢిల్లీ: జాట్ల ఆందోళన 15రోజులు వాయిదా పడింది. సోమవారం తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం రద్దైంది. హరియాణా సీఎం ఎం.ఎల్.ఖట్టర్‌తో భేటీ అనంతరం జాట్ నేతలు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, కళాశాల సీట్లలో రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న జాట్లు సోమవారం చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రాక్టర్లలో వచ్చిన ఆందోళనకారులను ఆదివారం ధనిగోపాల్ గ్రామంలోని సిర్సా–హిస్సార్ ఢిల్లీ నేషనల్ హైవే వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య ఘర్షణ జరిగింది. ఎస్పీ, డీఎస్పీతో సహా 35 మందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో జాట్ నేతలతోæ ఖట్టర్, జాట్ వర్గానికి చెందిన కేంద్ర మంత్రులు బీరేంద్ర సింగ్, పీపీ చౌదరి ఆదివారం చర్చించారు. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం తర్వాత జాట్ కోటా ప్రక్రియ ప్రారంభమవుతుందని ఖట్టర్ హామీ ఇచ్చారు.