న్యూఢిల్లీ: జాట్ల ఆందోళన 15రోజులు వాయిదా పడింది. సోమవారం తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం రద్దైంది. హరియాణా సీఎం ఎం.ఎల్.ఖట్టర్‌తో భేటీ అనంతరం జాట్ నేతలు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, కళాశాల సీట్లలో రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న జాట్లు సోమవారం చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రాక్టర్లలో వచ్చిన ఆందోళనకారులను ఆదివారం ధనిగోపాల్ గ్రామంలోని సిర్సా–హిస్సార్ ఢిల్లీ నేషనల్ హైవే వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
ఇరుపక్షాల మధ్య ఘర్షణ జరిగింది. ఎస్పీ, డీఎస్పీతో సహా 35 మందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో జాట్ నేతలతోæ ఖట్టర్, జాట్ వర్గానికి చెందిన కేంద్ర మంత్రులు బీరేంద్ర సింగ్, పీపీ చౌదరి ఆదివారం చర్చించారు. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం తర్వాత జాట్ కోటా ప్రక్రియ ప్రారంభమవుతుందని ఖట్టర్ హామీ ఇచ్చారు.
జాట్ల ఆందోళన వాయిదా
Published Mon, Mar 20 2017 3:48 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM
Advertisement