Harman Preet Singh
-
Paris Olympics 2024: సెమీస్‌లో.. భారత హాకీ జట్టు ఓటమి
పారిస్: నాలుగు దశాబ్దాల తర్వాత వరుసగా రెండోసారి ఒలింపిక్స్ సెమీఫైనల్‌కు చేరిన భారత పురుషుల జట్టు.. తుదిపోరుకు అర్హత సాధించడంలో మరోసారి విఫలమైంది. మంగళవారం హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆరంభం నుంచి ఆధిక్యంలో ఉండి.. టీమిండియా 2–3 గోల్స్‌తో జర్మనీ చేతిలో పరాజయం పాలైంది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (7వ నిమిషంలో), సుఖ్జీత్ సింగ్ (36వ నిమిషంలో) చెరో గోల్ చేశారు.జర్మనీ తరఫున పైలాట్ గోంజాలో (18వ నిమిషంలో), రుహెర్ క్రిస్టోఫర్ (27వ నిమిషంలో), మిల్కావు మార్కో (54వ నిమిషంలో) తలా ఒక గోల్ సాధించారు. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ఆట మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా.. జర్మనీ అనూహ్య గోల్‌తో ముందంజ వేయగా.. చివర్లో గోల్కీపర్ను తప్పించి అదనపు అటాకర్‌తో ప్రయతి్నంచినా భారత్ స్కోరు సమం చేయలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో జర్మనీపై విజయంతోనే మెడల్ దక్కించుకున్న టీమిండియా... ఈసారి మాత్రం అలాంటి ప్రదర్శన కనబర్చలేకపోయింది. మరో సెమీఫైనల్లో నెదర్లాండ్స్ 4–0తో స్పెయిన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. -
Hockey World Cup 2023: 48 ఏళ్ల కల నెరవేరేనా!
ఎప్పుడో 1975లో... భారత హాకీ జట్టు అజిత్‌పాల్ సింగ్ నాయకత్వంలో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా నాటి మేటి ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. ట్రోఫీ గెలవడం సంగతేమో గానీ ఆ తర్వాత 11 ప్రపంచ కప్‌లు జరిగినా మన టీమ్ కనీసం సెమీ ఫైనల్ కూడా చేరలేకపోవడం నిరాశ కలిగించే అంశం. వరుసగా రెండో సారి మనమే ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో భారత జట్టు రాత మారుతుందా... కొన్నాళ్ల క్రితం ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి కాంస్యం సాధించిన మన టీమ్ అదే జోరును చూపిస్తుందా అనేది ఆసక్తికరం. భువనేశ్వర్: భారత గడ్డపై మరో విశ్వ సంబరానికి సమయం ఆసన్నమైంది. 15వ హాకీ వరల్డ్ కప్ నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఒడిషాలోని రెండు వేదికలు భువనేశ్వర్, రూర్కెలాలలో 17 రోజుల పాటు మొత్తం 44 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. తొలి రోజే బరిలోకి దిగనున్న భారత్... స్పెయిన్‌ను ఎదుర్కోనుంది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం ఇప్పటికే అందుబాటులో ఉండగా... కొత్తగా ఈ టోర్నీ కోసం మరో పెద్ద హాకీ స్టేడియాన్ని రూర్కెలాలో నిర్మించారు. 24 మ్యాచ్‌లు భువనేశ్వర్‌లో, 20 మ్యాచ్‌లు రూర్కెలాలో జరుగుతాయి. మొత్తం 16 జట్లు బరిలోకి దిగుతుండగా వాటిని నాలుగు పూల్‌లుగా విభజించారు. ముందుగా తమ గ్రూప్‌లో ఇతర మూడు జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘క్రాస్ ఓవర్స్’, క్వార్టర్స్, సెమీస్ ఉంటాయి. జనవరి 29న ఫైనల్ నిర్వహిస్తారు. నేటి మ్యాచ్‌లు అర్జెంటీనా X దక్షిణాఫ్రికా (మ.గం. 1.00 నుంచి) ఆస్ట్రేలియా X ఫ్రాన్స్ (మం.గం. 3.00 నుంచి) ఇంగ్లండ్ X వేల్స్ (సా.గం. 5.00 నుంచి) భారత్ X స్పెయిన్ (సా.గం. 7.00 నుంచి) పూల్ల వివరాలు ‘ఎ’ – అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ‘బి’ – బెల్జియం, జర్మనీ, జపాన్, కొరియా ‘సి’ – చిలీ, మలేసియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ ‘డి’ – భారత్, స్పెయిన్, ఇంగ్లండ్, వేల్స్ * ప్రపంచకప్‌ను అత్యధికంగా పాకిస్తాన్ (4 సార్లు) గెలవగా...నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా చెరో 3 టైటిల్స్ సాధించాయి. జర్మనీ రెండు సార్లు విజేతగా నిలవగా...భారత్, బెల్జియం ఒక్కో సారి ట్రోఫీని అందుకున్నాయి. -
Womens Asia Cup T20: భారత మహిళలకు షాక్
సిల్హెట్ (బంగ్లాదేశ్): ఆసియా కప్ మహిళల టి20 టోర్నీలో జోరుగా దూసుకుపోతున్న భారత బృందానికి బ్రేక్ పడింది. ఫేవరెట్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ సేన పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా పరాజయంపాలై ఆశ్చర్యపర్చింది. శుక్రవారం మ్యాచ్‌కు ముందు టి20ల్లో పాక్‌తో 12 సార్లు తలపడి 10 సార్లు గెలిచిన భారత్... చివరిసారిగా 2016లో ఆ జట్టు చేతిలో ఓడింది. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత పాకిస్తాన్ మన జట్టుపై విజయం సాధించింది. చివరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో పాక్ 13 పరుగుల తేడాతో భారత్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా, భారత్ 19.4 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. గురువారం అనూహ్యంగా థాయ్‌లాండ్ చేతిలో ఓడిన పాక్ కోలుకొని ఆసియాకప్ టోర్నీలో తొలి సారి భారత్‌పై విజయాన్ని అందుకోవడం విశేషం. ఓపెనర్లు మునీబా (17; 1 ఫోర్), సిద్రా (11; 1 ఫోర్)తో పాటు ఒమైమా (0) కూడా విఫలం కావడంతో ఆరు ఓవర్ల లోపే 33 పరుగుల వద్ద పాక్ 3 వికెట్లు కోల్పోయింది. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నిదా దార్ (37 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ బిస్మా మారూఫ్ (35 బంతుల్లో 32; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 58 బంతుల్లో 76 పరుగులు జోడించారు. దీప్తి శర్మ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, పూజ వస్త్రకర్ 2 వికెట్లు తీసింది. ఛేదనలో ఓపెనర్లు సబ్బినేని మేఘన (15; 1 ఫోర్, 1 సిక్స్), స్మృతి మంధాన (17; 2 ఫోర్లు), హేమలత (20; 3 ఫోర్లు ) కొన్ని చక్కటి షాట్లు ఆడినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. ఫామ్‌లో ఉన్న జెమీమా (2) విఫలం కాగా, చెప్పుకోదగ్గ భాగస్వామ్యం ఒక్కటీ లేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్‌ను మారుస్తూ ఏడో స్థానంలో వచ్చిన హర్మన్ ప్రీత్ (12) ప్రయోగం విఫలమైంది. తీవ్ర ఎండ కారణంగా కీపింగ్ వదిలి మధ్యలోనే మైదానం వీడిన రిచా ఘోష్ (13 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. చివరి 3 ఓవర్లలో 43 పరుగులు చేయాల్సి ఉండగా నష్రా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లతో పాటు సాదియా ఓవర్లోనూ వరుసగా 6, 4 కొట్టి రిచా గెలుపుపై ఆశలు రేపింది. అయితే అదే ఓవర్లో ఆమెను సాదియా అవుట్ చేయగా... చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉండగా, భారత్ 4 పరుగులకే పరిమితమైంది. నష్రా 3 వికెట్లు తీయగా... నిదా, సాదియా చెరో 2 వికెట్లు పడగొట్టారు. నేడు జరిగే ఐదో లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
ప్రొ హాకీ లీగ్‌లో బెల్జియంతో భారత్ ‘ఢీ’
అమిత్ రోహిదాస్ కెప్టెన్సీలోని భారత జట్టు నేడు ఆంట్వర్ప్లో జరిగే ప్రొ హాకీ లీగ్‌లో బెల్జియం జట్టుతో ఆడనుంది. రెండు జట్లూ 27 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ప్రదర్శనపైనే అందరి దృష్టి ఉంది. ఈ లీగ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ మొత్తం 16 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1, డిస్నీ–హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. చదవండి:Indonesia Masters 2022: సింధు నిష్క్రమణIndonesia Masters 2022: సింధు నిష్క్రమణ -
జర్మనీపై భారత్ ఘన విజయం
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీలో భారత జట్టు కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 2 గోల్స్ (18వ నిమిషం, 27వ నిమిషం) చేయగా... 45వ నిమిషంలో అభి షేక్ మరో గోల్ నమోదు చేశాడు. తాజా ఫలితంతో 11 మ్యాచ్‌ల ద్వారా 24 పాయింట్లు సాధించిన భారత్ లీగ్‌లో అగ్ర స్థానంలోనే కొనసాగనుంది. లీగ్‌లో భాగంగా రెండో మ్యాచ్ నేడు జరుగుతుంది. చదవండి: IPL 2022 RR Vs GT: హార్ధిక్ పాండ్యాకు ఏమైంది.. ? మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు! -
భారత్‌కు ‘డ్రా’నందం
భారత్ బాగా ఆడింది. తమకన్నా మెరుగైన ర్యాంకులో ఉన్న బెల్జియం జట్టును దాదాపు ఓడించినంత పని చేసింది. కానీ చివరి నిమిషాల్లో తడబడే అలవాటు ఆతిథ్య జట్టును మళ్లీ వెంటాడింది. తుదకు గెలవాల్సిన చోట ‘డ్రా’తో సరిపెట్టుకుంది. భువనేశ్వర్ ప్రపంచకప్ హాకీలో భారత్ మరో స్ఫూర్తిదాయక పోరాటం చేసింది. రియో ఒలింపిక్స్ రన్నరప్ బెల్జియం జట్టును నిలువరించింది. పూల్ ‘సి’లో భాగంగా ఆదివారం భారత్, బెల్జియం జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. ఆరంభంలో తడబడినప్పటికీ మ్యాచ్ జరిగేకొద్దీ ఆతిథ్య జట్టు ఆటగాళ్లు పుంజుకున్నారు. ఒక దశలో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంను కంగుతినిపించే స్థితిలో నిలిచింది. అయితే చివరి క్షణాల్లో గోల్స్ సమర్పించుకొనే అలవాటును భారత్ కొనసాగించి మూల్యం చెల్లించుకుంది. ఆతిథ్య జట్టులో హర్మన్‌ప్రీత్ సింగ్ (39వ ని.లో), సిమ్రన్‌జీత్ సింగ్ (47వ ని.లో) చెరో గోల్ చేయగా, బెల్జియం తరఫున హెన్డ్రిక్స్ (8వ ని.లో), సైమన్ గోనర్డ్ (56వ ని.లో) గోల్స్ సాధించారు. ఆఖరి నిమిషాల్లో భారత డిఫెన్స్ కాస్త డీలా పడటంతో ఇదే అదనుగా భావించిన సైమన్ బెల్జియంను ఓటమి నుంచి తప్పించాడు. ఫలితం ‘డ్రా’ అయినా... ఈ పూల్‌లో భారతే అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాతో 5–0తో గెలుపు, గోల్స్ పరంగా బెల్జియం కంటే భారత్‌నే ముందువరుసలో నిలబెట్టింది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత బెల్జియం తొలి మ్యాచ్‌లో (2–1తో) కెనడాను ఓడించినా... గోల్స్ రేట్లో భారతే ఎంతో ముందుంది. ఈ పూల్‌లో ఇరుజట్లకు ఇక ఒకే మ్యాచ్ మిగిలుంది. ఈ నెల 8న జరిగే మ్యాచ్‌ల్లో కెనడాతో భారత్, దక్షిణాఫ్రికాతో బెల్జియం తలపడతాయి. ఇవి ముగిశాక తొలి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుతుంది. ఈ నేపథ్యంలో భారత్ అగ్రస్థానంలోనే ఉంటే నేరుగా క్వార్టర్స్ చేరుకుంటుంది. కెనడా, దక్షిణాఫ్రికా మ్యాచ్ కూడా... ఇదే పూల్‌లో కెనడా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ కూడా 1–1తో ‘డ్రా’ అయింది. ఇరు జట్ల ఆటగాళ్లు దీటుగా కదంతొక్కడంతో రెండు క్వార్టర్లు గోల్ లేకుండానే ముగిశాయి. మూడో క్వార్టర్ చివర్లో దక్షిణాఫ్రికా తరఫున ఎన్కొబిలి ఎన్తులి (43వ ని.) గోల్ చేయగా, రెండు నిమిషాల వ్యవధిలోనే కెనడా కెప్టెన్ స్కాట్ టపర్ (45వ ని.) గోల్ చేసి స్కోరును సమం చేశాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్; న్యూజిలాండ్‌తో అర్జెంటీనా తలపడతాయి. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
భారత్‌కు రెండో గెలుపు
► కెనడాపై 3-1తో విజయం ► అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ ఇఫో (మలేసియా): ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన భారీ ఓటమి నుంచి భారత్ తేరుకుంది. అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 3-1 గోల్స్ తేడాతో కెనడాను ఓడించింది. తద్వారా ఈ టోర్నీలో తమ ఖాతాలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. భారత్ తరఫున చందన నికిన్ తిమ్మయ్య, హర్మన్‌ప్రీత్ సింగ్, తల్విందర్ సింగ్ ఒక్కో గోల్ చేయగా... కెనడా జట్టుకు కీగన్ పెరీరా ఏకైక గోల్‌ను అందించాడు. మొత్తం ఏడు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆదివారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ 4-1తో జపాన్‌పై, ఆస్ట్రేలియా 4-0తో పాకిస్తాన్‌పై గెలిచాయి. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. రియో ఒలింపిక్స్‌లో తమ గ్రూప్‌లోనే ఉన్న కెనడాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరంభం నుంచే దూకుడు కనబరిచింది. ఫలితంగా మూడో నిమిషంలో తిమ్మయ్య చేసిన గోల్‌తో ఖాతా తెరిచింది. అయితే 23వ నిమిషంలో కీగన్ పెరీరా గోల్‌తో కెనడా స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. ఈ క్రమంలో ఆట 41వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచాడు. 57వ నిమిషంలో తల్విందర్ సింగ్ రివర్స్ షాట్‌తో భారత్ ఖాతాలో మూడో గోల్‌ను చేర్చాడు. మిడ్ ఫీల్డ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత కెప్టెన్ సర్దార్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.