Harvesting budget
-
సాగు బడ్జెట్ రెట్టింపు చేశాం
న్యూఢిల్లీ: 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంలో భాగంగా 2014–19 మధ్యకాలంలో వ్యవసాయ రంగానికి రూ.2.12 లక్షల కోట్లను కేటాయించామని వెల్లడించారు. ఇది గత ప్రభుత్వం కేటాయించినదానికి రెట్టింపు మొత్తమన్నారు. దేశానికి ఆహార భద్రతను కల్పించిన ఘనత పూర్తిగా రైతులదేనని ప్రధాని ప్రశంసించారు. అయితే గతంలో ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం రైతన్నల పరిస్థితి దయనీయంగా తయారయిందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన కీలక పథకాలపై ఆయా లబ్ధిదారులతో మోదీ సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం దాదాపు 600 జిల్లాల్లోని పలువురు రైతులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ‘2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని చెప్పగానే చాలామంది మమ్మల్ని వేళాకోళం చేశారు. అది సాధ్యమయ్యే పనికాదని పెదవి విరిచారు. వాళ్లు వినాశకరమైన వాతావరణాన్ని దేశంలో సృష్టించారు. కానీ రైతన్నలపై నాకున్న విశ్వాసమే ఈ విషయంలో ముందుకు వెళ్లేలా చేసింది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ఓ విస్తృతమైన, సమతౌల్య విధానం ఆధారంగా రైతుల ఆదాయం పెంచేందుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, నీరు, విద్యుత్‌ను అందించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు తగిన మార్కెట్ కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నాం. వాటిలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన ధర అందించడం, కోత తర్వాత పంట నష్టపోకుండా చర్యలు తీసుకోవడం, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల్ని కల్పించడం ఉన్నాయి’ అని ప్రధాని చెప్పారు. నాడు రూ.1.21 లక్షల కోట్లే... యూపీఏ–2 హయాంలో ఐదేళ్లలో వ్యవసాయానికి రూ.1.21 లక్షల కోట్లు కేటాయిస్తే.. 2014–19 కాలంలో వ్యవసాయ రంగానికి రెట్టింపు మొత్తాన్ని అంటే రూ.2.12 లక్షల కోట్లను కేటాయించామని మోదీ వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని పెంచడంలో భాగంగా చేపలు, తేనెటీగల పెంపకం, పశుపోషణ వంటి ప్రత్యామ్నాయ రంగాలపై దృష్టి సారించామని మోదీ అన్నారు. తొలుత ఏ పొలంలో ఏ ఎరువులు వాడాలో తెలుసుకునేందుకు వీలుగా 12.5 కోట్ల మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డుల్ని జారీచేశామని చెప్పారు. ఆ తర్వాత నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసేందుకు వీలుగా బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేశామని వెల్లడించారు. యూరియాకు వేపపూత వేయడం ద్వారా ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా నిరోధించామన్నారు. దళారుల బెడద లేకుండా పంట ఉత్పత్తుల్ని బహిరంగ మార్కెట్లో లాభసాటి ధరలకు అమ్ముకునేందుకు వీలుగా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ‘ఈ–నామ్’ను ఆవిష్కరించామని మోదీ పేర్కొన్నారు. అలాగే దాదాపు 22,000 గ్రామీణ మార్కెట్లను హోల్‌సేల్ మార్కెట్లతో అనుసంధానం చేశామని చెప్పారు. -
సాగు బడ్జెట్ రూ.26,700 కోట్లు
ప్రభుత్వానికి ప్రతిపాదించిన నీటిపారుదల శాఖ కాళేశ్వరానికి రూ.9 వేల కోట్లు, పాలమూరుకు రూ.4,748 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన బడ్జెట్ తుది ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుత పురోగతి, వాటి ప్రాధాన్య తలను పరిగణనలోకి తీసుకుంటూ బడ్జెట్ ప్రతిపాదనలను నీటి పారుదల శాఖ సిద్ధం చేసి గురువారం ప్రభుత్వానికి సమర్పిం చింది. మొత్తంగా రూ.26,700 కోట్లతో ప్రతి పాదనలు అందించింది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యధికంగా రూ.9వేల కోట్లు, పాలమూరు ప్రాజెక్టుకు రూ.4,748 కోట్లు ప్రతిపాదించింది. రూ.4 వేల కోట్ల మేర కుదింపు... నిజానికి గత ఏడాది డిసెంబర్లోనే నీటి పారుదల శాఖ రూ.31,300 కోట్లతో ప్రాథ మిక బడ్జెట్ అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికిచ్చింది. ఈ ప్రతిపాదనలపై అధ్యయనం చేసిన ఆర్థిక శాఖ ప్రస్తుతం జరుగుతున్న పను లు, భూసేకరణ అంశంతో ముడిç ³డివున్న ప్రాజె క్టులు, తక్షణ ఆయకట్టు నిచ్చే ప్రాజెక్టులు వంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని తుది అంచనాలు సమర్పించాలని నీటిపారుదల శాఖకు సూచించింది. ఈ సూచనలకు అనుగుణంగా రూ.26,700 కోట్ల తో తాజా ప్రతిపాదనలు వెళ్లాయి. వీటిపై గురువారం సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్ని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతో విడివిడిగా భేటీ నిర్వహించి పనులు, భూసే కరణ, సహాయ పునరావాసం, కరెంట్ చార్జీ లకు అవసరమైన నిధులపై చర్చించారు. గత ప్రతిపాదనల్లో కాళేశ్వరానికి రూ.11 వేల కోట్ల ప్రతిపాదనలు ఇవ్వగా, ప్రస్తుత ప్రతిపాద నల్లో దాన్ని రూ.9 వేల కోట్లకు కుదించారు. పాలమూరుకు గతంలో రూ.6 వేల కోట్లు కేటాయించాలని కోరగా, ప్రస్తుతం రూ.4,748 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చారు. మహబూబ్ నగర్‌లోని కల్వకుర్తి, భీమా, నెట్టెం పాడులకు కలిపి రూ.1,300 కోట్ల మేర మొదట కోరినా ప్రస్తుతం రూ.1,100 కోట్లకు పరిమితమయ్యారు. ఇందులో నెట్టెంపాడుకు రూ.225 కోట్లు, కల్వకుర్తికి రూ.770 కోట్లు, భీమాకు రూ.200కోట్లు ప్రతిపాదించారు. మొత్తంగా గత ప్రతిపాదనలను రూ.4వేల కోట్ల మేర కుదించారు. ప్రస్తుతం బడ్జెట్ ప్రతిపాదనల్లో నాగార్జునసాగర్ పరిధి సీఈ కింద రూ.1,623 కోట్లు, ఆదిలాబాద్ సీఈ పరిధిలోని ప్రాజెక్టుకు రూ.1,591కోట్లు ప్రతి పాదించారు. సాగునీటి శాఖకు ప్రతిపాదిం చిన బడ్జెట్లో సింహభాగం భూసేకరణకే అవసరం ఉంటుందని సాగునీటి శాఖ తేల్చి చెప్పింది. మొత్తంగా రూ.2,996 కోట్లు భూసేకరణకే అవసరమవుతాయని, సహాయ పునరావాస కార్యక్రమాలకు రూ.1,290 కోట్లు, విద్యుత్ చార్జీలకు రూ.1,065 కోట్ల మేర అవసరం ఉంటుందని తెలిపింది. వీటన్నింటిపై సమీక్షించిన స్మితా సబర్వాల్ ఇటీవల భూసేకరణపై ఇచ్చిన జీవో 38ను ఉపయోగించుకుని భూసేకరణ ప్రక్రియను వేగిరం చేయాలని, ప్రాజెక్టుల పూర్తికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించినట్లు నీటిపారుదల వర్గాలు తెలిపాయి.