Hatrick wicket
-
చరిత్ర సృష్టించిన 12 ఏళ్ల కుర్రాడు.. ఒకే ఓవర్లో 6 వికెట్లు
క్రికెట్లో ఓ బౌలర్ ఒక హ్యాట్రిక్ సాధించడం మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అటువంటింది ఇంగ్లండ్‌కు చెందిన ఓ జూనియర్ క్రికెటర్ ఒకే ఓవర్లో డబుల్ హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఒలివర్ వైట్‌హౌజ్ అనే 12 ఏళ్ల కుర్రాడు ఒకే ఓవర్లో 6 వికెట్లు పడగొట్టి సంచలనం నమోదు చేశాడు. ఓ క్రికెట్ టోర్నీలో బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైట్‌హౌజ్.. కుక్‌హిల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో వైట్‌హౌజ్ ఒకే ఓవర్లో ఆరు వికెట్లు తీయడంతోపాటు రెండు ఓవర్లలో మొత్తం 8 వికెట్లు తీసి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలి సారి. ఇక ఈ విషయాన్ని బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ మారింది. కాగా వైట్‌హౌజ్ అమ్మమ్మ అయిన యాన్ జోన్స్ 1969లో వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్ విశేషం. చదవండి: IND vs WI: వెస్టిండీస్ టూర్లో రోహిత్‌కు విశ్రాంతి.. మరి కోహ్లి సంగతి ఏంటి? What an achievement for our u12 player. His final match figures were 2–2-8-0 ! Only 2 wickets in his second over 🐗🏏 pic.twitter.com/0L0N36HIcI — Bromsgrove Cricket Club (@BoarsCricket) June 11, 2023 -
తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా..!
టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్లో వేసిన తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించిన మొదటి ఆటగాడిగా బ్రేస్‌వెల్ రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన బ్రేస్‌వెల్ ఈ ఘనత సాధించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన బ్రేస్‌వెల్.. మూడు, నాలుగు, ఐదు బంతుల్లో వరుస వికెట్లు తీసి తొలి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా తన టీ20 కెరీర్లో ఇదే అతడికి తొలి ఓవర్. మూడో బంతికి మార్క్ అడైర్ బౌండరీ వద్ద క్యాచ్ రూపంలో వెనుదిరిగగా.. నాలుగో బంతికి మెక్ గ్రాతీ, ఐదో బంతికి క్రెగ్ యంగ్ పెవిలియన్‌కు చేరారు. ఈ మ్యాచ్‌లో కేవలం 5 బంతులే వేసిన అతడు ఐదు పరుగులతో పాటు మూడు వికెట్లు సాధించాడు. కాగా జూలై 18న ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రేస్‌వెల్‌కు ఆ మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అదే విధంగా అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో న్యూజిలాండ్ బౌలర్‌గా బ్రేస్‌వెల్ నిలిచాడు. అంతకుమందు జాకబ్ ఓరమ్,టిమ్ సౌథీ ఈ ఘనత సాధించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌ను 88 పరుగుల తేడాతో కివీస్ చిత్తు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 91 పరుగులకే కుప్ప కూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఇష్ సోధి, మైఖేల్ బ్రేస్‌వెల్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. జాకబ్ డఫీ రెండు, లాకీ ఫెర్గూసన్ ఒక్క వికెట్ సాధించారు. ఐర్లాండ్ బ్యాటర్లలో మార్క్ అడైర్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 179 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో వికెట్ కీపర్ క్లీవర్ 78 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఇక మూడు మ్యాచ్‌లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో కివీస్ సొంతం చేసుకుంది. చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..! Michael Bracewell can't Do anything Wrong Hat-trick in his First Over of T20 Internationals is just amazing and Unbelievable 🥵pic.twitter.com/nIPmvgCmjM — ⚡ (@Visharad_KW22) July 20, 2022 -
రెండో వన్డే కూడా భారత్‌దే..
► హ్యాట్రిక్ సాధించిన కుల్దీప్ ►పోరాడిన స్టోయినీస్, స్మిత్ సాక్షి, కోల్‌కతా: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. చైనామన్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్‌తో విజృంభించడంతో ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులకే చాప చుట్టేసింది. 253 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్(1), కార్ట్‌రైట్(1)లు తీవ్రంగా నిరాశపరిచారు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్, ట్రావిస్ హెడ్లు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. హెడ్ ఇచ్చిన సునాయసమైన క్యాచ్‌ను రోహిత్ శర్మ నేలపాలు చేశాడు. క్రీజులో నిలదొక్కుకుంటున్న ఈ జంటను చాహల్ అద్బుత బంతితో హెడ్(39)ను అవుట్ చేసి విడగొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్ కుల్దీప్ బౌలింగ్‌లో వరుస రెండు సిక్సులతో దాటిగా ఆడుతూ స్మిత్‌కు అండగా నిలిచే ప్రయత్నం చేశాడు. కానీ చాహల్ మరో అద్బుత బంతికి మాక్స్వెల్(14) స్టంప్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ దశలో స్మిత్ 65 బంతుల్లో కెరీర్లో 18వ అర్ధసెంచరీ నమోదు చేశాడు. అనంతరం (59) పాండ్యా బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుటవ్వడంతో ఆసీస్ వికెట్ల పతనం మెదలైంది. ఆవెంటనే క్రీజులోకి వచ్చిన వేడ్(2), అగర్(0), కమిన్స్(0)లను అవుట్ చేసి కుల్దీప్ హ్యాట్రిక్ సాధించాడు. చివర్లో స్టోయినీస్ 62 నాటౌట్(65 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు) ఒంటరి పొరాటం చేశాడు. ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం అందకపోవడంతో స్టోయినీస్ పొరాటం వృధా అయింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్‌లకు మూడేసి వికెట్లు దక్కగా, చాహల్, పాండ్యాలకు రెండు వికెట్లు దక్కాయి. అంతకు ముందు భారత్ 252 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ కోహ్లి(92),రహానే(55) లు రాణించారు. మ్యాన్ఆఫ్ ది మ్యాచ్ కోహ్లిని వరించింది. -
కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్
-
కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్
♦ విజయం దిశగా టీమిండియా.. సాక్షి,కోల్‌కతా: ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డేలో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్స్ వేడ్, అగర్, కమిన్స్‌లను అవుట్ చేసి వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో భారత బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. అంతకు ముందు చేతన్ శర్మ, కపీల్ దేవ్ ఈ ఘనత సాధించగా చైనామన్ కుల్దీప్ తాజాగా ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కపీల్ దేవ్ కూడా 1991లో ఈడెన్ గార్డెన్‌లోనే హ్యాట్రిక్ సాధించడం విశేషం. 26 ఏళ్ల తర్వాత భారత్ బౌలర్ హ్యాట్రిక్ తీయడం మరో విశేషం. ఈ హ్యాట్రిక్‌తో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ నడ్డివిరిగింది. ఒకవైపు వికెట్లు పడుతున్న అర్ధ సెంచరీతో క్రీజులో నిలదొక్కుకున్న స్మిత్ 59 (76 బంతుల్లో)ను 29.5 ఓవర్లో హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఆస్ట్రేలియా పతనం మొదలైంది. ఆసీస్ 38 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. క్రీజులో స్టోయినీస్(37), కౌల్టర్‌నీల్(8)లు పోరాడుతున్నారు.