Oliver Whitehouse, 12 Year Old, Claims Double Hat Trick In One Over - Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన 12 ఏళ్ల కుర్రాడు.. ఒకే ఓవర్‌లో 6 వికెట్లు

Published Fri, Jun 16 2023 5:29 PM | Last Updated on Fri, Jun 16 2023 5:46 PM

Oliver Whitehouse, 12 year old, claims double hat trick in one over - Sakshi

క్రికెట్‌లో ఓ బౌలర్‌ ఒక హ్యాట్రిక్‌ సాధించడం మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అటువంటింది ఇంగ్లండ్‌కు చెందిన ఓ జూనియర్‌ క్రికెటర్‌ ఒకే ఓవర్‌లో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించి చరిత్ర సృష్టించాడు. ఒలివర్ వైట్‌హౌజ్ అనే 12 ఏళ్ల కుర్రాడు ఒకే ఓవర్‌లో 6 వికెట్లు పడగొట్టి సంచలనం నమోదు చేశాడు.

ఓ క్రికెట్‌ టోర్నీలో బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైట్‌హౌజ్..  కుక్‌హిల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో వైట్‌హౌజ్ ఒకే ఓవర్లో ఆరు వికెట్లు తీయడంతోపాటు రెండు ఓవర్లలో మొత్తం 8 వికెట్లు తీసి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు.

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలి సారి. ఇక ఈ విషయాన్ని బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ‍ట్వీట్‌ వైరల్‌ మారింది. కాగా వైట్‌హౌజ్ అమ్మమ్మ అయిన యాన్ జోన్స్ 1969లో వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్ విశేషం.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌ టూర్‌లో రోహిత్‌కు విశ్రాంతి.. మరి కోహ్లి సంగతి ఏంటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement