
కుల్‌దీప్ యాదవ్ హ్యాట్రిక్
♦ విజయం దిశగా టీమిండియా..
సాక్షి,కోల్‌కతా: ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డేలో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్స్ వేడ్, అగర్, కమిన్స్‌లను అవుట్ చేసి వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో భారత బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. అంతకు ముందు చేతన్ శర్మ, కపీల్ దేవ్ ఈ ఘనత సాధించగా చైనామన్ కుల్దీప్ తాజాగా ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కపీల్ దేవ్ కూడా 1991లో ఈడెన్ గార్డెన్‌లోనే హ్యాట్రిక్ సాధించడం విశేషం.
26 ఏళ్ల తర్వాత భారత్ బౌలర్ హ్యాట్రిక్ తీయడం మరో విశేషం. ఈ హ్యాట్రిక్‌తో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ నడ్డివిరిగింది. ఒకవైపు వికెట్లు పడుతున్న అర్ధ సెంచరీతో క్రీజులో నిలదొక్కుకున్న స్మిత్ 59 (76 బంతుల్లో)ను 29.5 ఓవర్‌లో హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఆస్ట్రేలియా పతనం మొదలైంది. ఆసీస్ 38 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. క్రీజులో స్టోయినీస్(37), కౌల్టర్‌నీల్(8)లు పోరాడుతున్నారు.