havildar hangpan dada
-
నా కూతురు, కొడుకు కూడా...
సైన్యంలో చేరాలని కోరిక అశోక్చక్ర అవార్డు గ్రహీత హవల్దార్ హంగ్పన్ దాదా భార్య లోవాంగ్ న్యూఢిల్లీ: దేశం కోసం తన భార్త ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందని, అయితే, తన కూతురు, కుమారుడు కూడా సైన్యంలో చేరాలని కోరుకుంటున్నానని అశోక్చక్ర అవార్డు గ్రహీత, అస్సాం రెజిమెంట్‌కు చెందిన దివంగత హవల్దార్ హంగ్పన్ దాదా భార్య చాసెన్ లోవాంగ్ అన్నారు. తన పిల్లలు సైన్యంలో చేరి తండ్రి మాదిరిగా దైర్యసాహసాలను ప్రదర్శించాలని ఆమె కోరుకుంటోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆమె అందుకున్నారు. గత మే 26న హంగపన్ దాదా జమ్ము, కశ్మీర్లో టెర్రరిస్టులతో హోరాహోరీ పోరాడి ముగ్గురిని హతమార్చి తాను అసువులు బాసిన విషయం తెలిసిందే. టెర్రరిస్టులను ఎదుర్కోవడంలో దాదా ప్రదర్శించిన దైర్యసాహసాలకుగాను ఆయనకు అశోక్చక్ర అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తన భర్త దైర్యసాహసాలకు అత్యున్నత పురస్కారం రావడం ఆనందంగా ఉందని, అదే సందర్భంలో బాధగా కూడా ఉందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. పిల్లలు కూడా సైన్యం చేరాలని తన భర్త తరచూ అనేవారని ఆమె గుర్తు చేశారు. విష సర్పాల కంటే ఉగ్రవాదులు ప్రమాదకారులని వ్యాఖ్యానించారు. -
హవిల్దార్ హాంగ్పాన్కు అశోకచక్ర పురస్కారం
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల తూటాలకు వెరవకుండా యుద్ధక్షేత్రంలోకి చొచ్చుకుపోయి నలుగురు ముష్కరులను మట్టుపెట్టి, తానూ అమరుడైన హవిల్దార్ హాంగ్పాన్ దాదాకు సముచిత గౌరవం దక్కింది.. దేశ రక్షణ కోసం అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆ వీర సైనికుడికి ప్రతిష్టాత్మక 'అశోకచక్ర' పురస్కారం లభించింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ప్రభుత్వం పురస్కారానికి ఎంపికైనవారి జాబితాను ప్రకటించింది. (నలుగురిని హతమార్చి.. ప్రాణాలు వదిలాడు) 35 రాష్ట్రీయ రైఫిల్స్‌లో జవాన్‌గా పనిచేసిన దాదా.. ఈ ఏడాది మేలో జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులతో తలపడి ప్రాణాలు కోల్పోయాడు. తాను మరణించడానికి ముందు నలుగురు ఉగ్రవాదులను కాల్చిచంపాడు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన దాదాకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సోమవారం జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో రాషష్ట్రపతి ప్రణబ్.. దాదా కుటుంబసభ్యులకు పురస్కారాన్ని అందజేస్తారు. కాగా, సైనిక రంగంలో విశిష్టసేవలు అందించిన మరో 11 మందికి శౌర్యచక్ర పురస్కారాలు లభించాయి. వీరిలో పఠాన్ కోట్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కూడా ఉన్నారు. 'సత్తర్ సాల్ ఆజాదీ.. యాద్ కరో ఖుర్బానీ' నినాదంతో 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్నవేళ జాతియావత్తూ పోరాటయోధులు, సైనిక అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటున్నది. (ఆర్మీ దుస్తులే ప్రాణంగా బతికాడు..) -
నలుగురిని హతమార్చి.. ప్రాణాలు వదిలాడు
శ్రీనగర్: శత్రువులు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా ఏమాత్రం బెదరకుండా పోరాడాడు. శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్తున్నా లెక్కచేయకుండా తుపాకీ ఎక్కుపెట్టి యుద్ధం చేశాడు. పెద్ద ఎత్తున ఆయుధాలతో దేశంలోకి చొరబడుతున్న నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాడు. ఈ పోరాటంలో తీవ్రంగా గాయపడి దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. వీరమరణం చెందిన భారత సైనికుడు 36 ఏళ్ల హవీల్దర్ హంగ్పాన్ దాదా సాహసానికి మారు పేరుగా నిలిచాడు. జమ్ము కశ్మీర్లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉత్తర కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హవీల్దర్.. నలుగురు ఉగ్రవాదులను చంపాడు. అరుణాచల్ ప్రదేశ్‌లోని బొడురియా హవీల్దర్ సొంత గ్రామం. దాదా అని పిలుచుకునే హవీల్దర్ 1997లో అసోం రెజిమెంట్‌లో చేరాడు. 35 రాష్ట్రీయ రైఫిల్స్‌లో జవాన్‌గా సేవలందించాడు. 13 వేల అడుగుల ఎత్తున ఉన్న శంసబరి రేంజ్లో పనిచేశాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో హవీల్దర్ తీవ్రంగా గాయపడినట్టు ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. హవీల్దర్ ధైర్యసాహసాలు ప్రదర్శించి, శత్రువులతో భీకరయుద్ధం చేసి నలుగురిని హతమార్చాడని ప్రశంసించారు. దేశంకోసం ప్రాణత్యాగం చేశాడని చెప్పారు. హవీల్దర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అతనికి భార్య లొవాంగ్, కుమార్తె రోకిన్, కొడుకు సెన్వాంగ్ ఉన్నారు.