Hayley Matthews
-
పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ రన్ ఛేజింగ్.. అతి భారీ లక్ష్యాన్ని ఊదేసిన విండీస్
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో అత్యుత్తమ రన్ ఛేజింగ్ నమోదైంది. ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 2) జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో అత్యంత విజయవంతమైన రన్ ఛేజింగ్ రికార్డును నెలకొల్పింది. దీనికి ముందు మహిళల టీ20 క్రికెట్లో అత్యంత విజయవంతమైన రన్ ఛేజింగ్ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉండింది. 2018లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. తాజాగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ చేసిన ఛేజింగ్ టీ20 చరిత్రలోనే అత్యుత్తమ ఛేజింగ్‌లో ఒకటిగా మిగిలిపోనుంది. West Indies chase down 213 runs in a T20I match against Mighty Australia....!!!! - Hayley Matthews is the star with 132 runs from just 64 balls. One of the greatest chase ever in T20 history. pic.twitter.com/KPaw2wzRfW — Johns. (@CricCrazyJohns) October 2, 2023 మహిళల టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు సమం ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసి, కివీస్ ప్లేయర్ సోఫీ డివైన్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేసింది. లిచ్‌ఫీల్డ్‌తో పాటు ఎల్లిస్ పెర్రీ (46 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జార్జియా వేర్హమ్ (13 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు), బెత్ మూనీ (22 బంతుల్లో 29; 5 ఫోర్లు), సథర్లాండ్ (6 బంతుల్లో 13; 3 ఫోర్లు) రాణించారు. విండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3, షమీలియా కొన్నెల్ 2, చినెల్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు. First T20I: 99* runs from 74 balls. Second T20I: Hundred from 53 balls. Hayley Matthews, the star, missed out well deserving hundred by just 1 run on Sunday and today she smashed hundred from 53 balls in the series against Mighty Australia.pic.twitter.com/iSvs2R2Fzc — Johns. (@CricCrazyJohns) October 2, 2023 భారీ లక్ష్య ఛేదనలో బెదురులేకుండా.. 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ హేలీ మాథ్యూస్ ఏమాత్రం బెదురులేకుండా ఆడి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించింది. ఈ మ్యాచ్‌లో హేలీ విధ్వంసకర సెంచరీతో (64 బంతుల్లో 132; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడింది. ఈ మ్యాచ్‌లో హేలీ సెంచరీ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా మిగిలిపోనుంది. HAYLEY MATTHEWS, THE STAR OF WEST INDIES....!!!! She smashed 132 runs from just 64 balls including 20 fours & 5 sixes while chasing 213 runs against Mighty Australia - A knock for the ages. She missed out hundred for just 1 run on Sunday by scoring 99*(74). pic.twitter.com/KPawraBPJt — Johns. (@CricCrazyJohns) October 2, 2023 53 బంతుల్లోనే శతక్కొట్టిన హేలీ.. ఈ మ్యాచ్‌లో హేలీ 53 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, తన జట్టును గెలుపు ట్రాక్‌పై ఉంచింది. ఆమెకు స్టెఫానీ టేలర్ (41 బంతుల్లో 59; 11 ఫోర్లు) తోడవ్వడంతో విండీస్ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నిన్న ఒక్క పరుగు తేడాతో మిస్ అయ్యింది..! ఆసీస్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో సైతం హేలీ సెంచరీకి అతి సమీపంగా వెళ్లింది. కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీని మిస్ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 74 బంతులు ఎదుర్కొన్న హేలీ 99 పరుగులతో అజేయంగా నిలిచింది. తొలి టీ20లో సెంచరీని మిస్ చేసుకున్న హేలీ, రెండో టీ20లో ఆ ఘనతను సాధించింది. Player of the match awards for West Indies in the last 7 T20I: - Hayley Matthews won POTM. - Hayley Matthews won POTM. - Hayley Matthews won POTM. - Hayley Matthews won POTM. - Hayley Matthews won POTM. - Hayley Matthews won POTM. - Hayley Matthews won POTM. pic.twitter.com/4FaQkTnyNF — Johns. (@CricCrazyJohns) October 2, 2023 వరుసగా 7 మ్యాచ్‌ల్లో.. ఆసీస్‌తో రెండో టీ20లో సెంచరీతో మెరిసిన హేలీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకుంది. గడిచిన 7 టీ20ల్లో వెస్టిండీస్ తరఫున హేలీనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోవడం విశేషం. -
టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సమం
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సమం అయ్యింది. వెస్టిండీస్‌తో ఇవాళ (అక్టోబర్ 2) జరిగిన మ్యాచ్‌లో 20 ఏళ్ల ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేసింది. ఈ మ్యాచ్‌లో లిచ్‌ఫీల్డ్ కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుని, అప్పటివరకు సోల్‌గా ఫాస్టెస్ట్ టీ20 హాఫ్ సెంచరీ రికార్డును హోల్డ్ చేసిన కివీస్ ప్లేయర్ సోఫీ డివైన్ సరసన చేరింది. 2015 ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో సోఫీ కూడా 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తంగా 19 బంతులు ఎదుర్కొన్న లిచ్‌ఫీల్డ్ 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో లిచ్‌ఫీల్డ్‌కు ముందు ఎల్లిస్ పెర్రీ (46 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు అర్ధసెంచరీతో మెరవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (13 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు) కూడా చెలరేగడంతో ఆసీస్ 200 పరుగుల మార్కును దాటింది. అంతకుముందు బెత్ మూనీ (22 బంతుల్లో 29; 5 ఫోర్లు), సథర్లాండ్ (6 బంతుల్లో 13; 3 ఫోర్లు) వేగంగా పరుగులు సాధించారు. విండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3, షమీలియా కొన్నెల్ 2, చినెల్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు. ఫాస్టెస్ట్ ఫిఫ్టి వృధా.. ఆసీస్ ప్లేయర్ లిచ్‌ఫీల్డ్ టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టితో చెలరేగినప్పటికీ విండీస్‌పై ఆసీస్ విజయం సాధించలేకపోయింది. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. కెప్టెన్ హేలీ మాథ్యూస్ సూపర్ సెంచరీతో (64 బంతుల్లో 132; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. మాథ్యూస్‌కు జతగా స్టెఫానీ టేలర్ (41 బంతుల్లో 59; 11 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో విండీస్ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా విండీస్ 7 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో మెగన్ షట్ 2, జొనాస్సెన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్, రెండో మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించాయి. నిర్ణయాత్మకమైన మూడో టీ20 అక్టోబర్ 5న జరుగుతుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్ అనంతరం వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. -
డబ్ల్యూపీఎల్: అవార్డులు ఎవరికి? విన్నర్ ప్రైజ్‌మనీ ఎంతంటే! పీఎస్ఎల్ విజేత కంటే..
Womens Premier League 2023: మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విజేతగా నిలిచి ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ అరంగేట్ర చాంపియన్‌గా రికార్డులకెక్కింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి హర్మన్ సేన ఈ మేరకు చరిత్ర సృష్టించింది. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది మొట్టమొదటి డబ్ల్యూపీఎల్ ట్రోఫీని ముద్దాడి సంబరాల్లో మునిగిపోయింది. మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రవేశపెట్టిన డబ్ల్యూపీఎల్ తొలి సీజన్‌ను మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంది. ఇక ఈ విజయంతో చాంపియన్ ముంబై, వివిధ విభాగాల్లో సత్తా చాటిన క్రికెటర్లు గెలుచుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?! డబ్ల్యూపీఎల్-2023 అవార్డులు, ప్రైజ్‌మనీ ►విజేత- ముంబై ఇండియన్స్ వుమెన్- గోల్డెన్ ట్రోఫీ- రూ. 6 కోట్లు ►రన్నరప్- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- రూ. 3 కోట్లు ►మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ హేలీ మాథ్యూస్(ముంబై ఇండియన్స్)- రూ. 5 లక్షలు ►ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు)- మెగ్ లానింగ్(ఢిల్లీ క్యాపిటల్స్)- 9 ఇన్నింగ్స్‌లో 345 పరుగులు- రూ. 5 లక్షలు ►పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు)- హేలీ మాథ్యూస్(ముంబై ఇండియన్స్)- 16 వికెట్లు ►ఫెయిర్ ప్లే అవార్డు- ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ►క్యాచ్ ఆఫ్ ది సీజన్: హర్మన్‌ప్రీత్ కౌర్(ముంబై)- యూపీ వారియర్జ్ దేవికా వైద్య క్యాచ్- రూ. 5 లక్షలు ►సఫారీ పవర్ఫుల్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్- సోఫీ డివైన్ (ఆర్సీబీ)- 8 ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు- రూ. 5 లక్షలు ►ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్- యస్తికా భాటియా(ముంబై)- రూ. 5 లక్షలు. పాకిస్తాన్ సూపర్ లీగ్ విజేత కంటే మహిళా ప్రీమియర్ లీగ్ విజేతకు అందిన మొత్తం పీఎస్ఎల్ చాంపియన్ లాహోర్ కలందర్స్ గెల్చుకున్న మొత్తం కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఈ ఏడాది పీఎస్ఎల్ విన్నర్‌గా అవతరించిన లాహోర్ రూ. 3.4 కోట్లు ప్రైజ్‌మనీ అందుకోగా.. రన్నరప్ ముల్తాన్ సుల్తాన్స్ సుమారు 1.37 కోట్ల రూపాయలు గెలుచుకుంది. The young promising wicketkeeper-batter shined bright in a victorious season for @mipaltan 👏👏@YastikaBhatia becomes the emerging player of the season 👌#TATAWPL pic.twitter.com/hO8qMDUkty — Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023 చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు IPL 2023: ఐపీఎల్ తోపులు వీరే.. సింహభాగం రికార్డులు యూనివర్సల్ బాస్‌వే..! Raw emotions 🎥 A moment to savor for @mipaltan 👌 👌 #TATAWPL | #Final | #DCvMI pic.twitter.com/wdf7t07NMJ — Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL 2023: ముంబై సూపర్ షో
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ధనాధన్ ఆల్‌రౌండ్ షోతో వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం జరిగిన పోరులో 9 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ను చిత్తు చేసింది. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టిన హేలీ మాథ్యూస్ బ్యాటింగ్‌లో (38 బంతుల్లో 77 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. టాపార్డర్ బ్యాటర్ నట్ సీవర్ బ్రంట్ (29 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరుపు అర్ధ సెంచరీ సాధించడంతో ఛేదన సులువైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్ (26 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, సయిక ఇషాక్, అమెలియా కెర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ హేలీ, బ్రంట్‌ల అజేయ అర్ధ సెంచరీలతో 14.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 159 పరుగులు చేసింది. అందరూ అంతంతే! బెంగళూరు స్కోరైతే 150 దాటింది కానీ... ఏ ఒక్క బ్యాటర్‌ది చెప్పుకోదగ్గ స్కోరుగానీ, ఇన్నింగ్స్‌ను కుదుటపర్చిన భాగస్వామ్యంగానీ లేవు. అదే బెంగళూరు పాలిట శాపమైంది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (17 బంతుల్లో 23; 5 ఫోర్లు) మొదలు మేగన్ షట్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) దాకా ఐదుగురు బ్యాటర్లు రిచా, కనిక ఆహుజా (13 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయాంక పాటిల్ (15 బంతుల్లో 23; 4 ఫోర్లు) 20 పైచిలుకు పరుగులు చేశారు. అందరు ఇలా వచ్చి అలా షాట్లు బాదేసి పెవిలియన్‌కు వెళ్లినవారే! ఇందులో ఏ ఒక్కరు నిలబడినా, మెరుపుల భాగస్వామ్యం నమోదైనా పరిస్థితి మరోలా ఉండేది. అయితే ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంలో సమష్టిగా సఫలమయ్యారు. హేలీ, బ్రంట్ ఫిఫ్టీ–ఫిఫ్టీ ముంబై ముందున్న లక్ష్యం 156 పరుగులు. అంత సులభమైందేమీ కాదు. కానీ యస్తిక భాటియా (19 బంతుల్లో 23; 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన హేలీ మాథ్యూస్ తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగింది. స్కోరు జోరందుకున్న సమయంలో యస్తికను ప్రీతి బోస్ వికెట్ ముందు దొరకబుచ్చుకుంది. 45 పరుగుల వద్ద తొలి వికెట్ కూలగా, బెంగళూరుకు అదే ఆఖరి ఆనందం అయ్యింది. తర్వాత నట్ సీవర్ వచ్చాక హేలీ వేగం మరో దశకు చేరింది. బెంగళూరు కెప్టెన్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఫలితం లేకపోయింది. అటు బ్రంట్, ఇటు హేలీ బౌండరీలను అవలీలగా బాదేస్తుంటే ఆద్యంతం ‘పవర్ ప్లే’నే కనిపించింది. పదో ఓవర్లోనే హేలీ 26 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. 10.2 ఓవర్లోనే జట్టు స్కోరు 100 దాటింది. మేగన్ షట్ వేసిన 12, శ్రేయాంక పాటిల్ వేసిన 13వ ఓవర్లలో బ్రంట్, హేలీలు ఫోర్లతో చెలరేగిపోయారు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే ముంబై 40 పరుగులు చేయడంతో లక్ష్యాన్ని 5.4 ఓవర్ల ముందే ఛేదించింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) వాంగ్ (బి) హేలీ 23; సోఫీ (సి) అమన్‌జోత్ (బి) సయిక 16; దిశ (బి) సయిక 0; ఎలైస్ పెర్రీ రనౌట్ 13; హీథెర్‌నైట్ (బి) హేలీ 0; రిచాఘోష్ (సి) నట్ సీవర్ (బి) హేలీ 28; కనిక (సి) యస్తిక (బి) పూజ 22; శ్రేయాంక (ఎల్బీ) (బి) నట్ సీవర్ 23; మేగన్ (స్టంప్డ్) యస్తిక (బి) అమెలియా 20; రేణుక (బి) అమెలియా 2; ప్రీతి నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 155. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–43, 4–43, 5–71, 6–105, 7–112, 8–146, 9–154, 10–155. బౌలింగ్: హేలీ 4–0–28–3, నట్ సీవర్ 3–0–34–1, సయిక ఇషాక్ 4–0–26–2, ఇసి వాంగ్ 2–0–18–0, అమెలియా కెర్ 3.4–0–30–2, కలిత 1–0–10–0, పూజ 1–0–8–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ నాటౌట్ 77; యస్తిక (ఎల్బీ) (బి) ప్రీతి 23; నట్ సీవర్ నాటౌట్ 55; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (14.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 159. వికెట్ల పతనం: 1–45. బౌలింగ్: రేణుక 3–0–28–0, ప్రీతి బోస్ 4–0–34–1, మేగన్ షట్ 3–0–32–0, ఎలైస్ పెర్రీ 1.2–0–18–0, శ్రేయాంక 2–0–32–0, సోఫీ డివైన్ 1–0–11–0. డబ్ల్యూపీఎల్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ X లక్నో విజార్డ్స్ రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం.