Health Department officers
-
మైక్రో కంటైన్మెంట్పై దృష్టి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలకు సూచించారు. చిన్న, చిన్న కంటెయిన్మెంట్ జోన్ల వల్ల వైరస్ వ్యాప్తి తగ్గడంతో పాటు, ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలగబోదని వివరించారు. కొన్ని రాష్ట్రాలు ఒకటి, రెండు రోజులు లాక్డౌన్ విధించడాన్ని ప్రస్తావిస్తూ.. ఆ నిర్ణయం ఎంత మేరకు సత్ఫలితాలనిచ్చిందో సమీక్షించాలని కోరారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణలో ఇది ఇబ్బందులు సృష్టించిందేమో పరిశీలించమన్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో పంజాబ్, పశ్చిమబెంగాల్ సçహా పలు రాష్ట్రాలు స్థానికంగా కొన్ని రోజుల పాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. వైరస్‌తో పోరు సాగిస్తూనే ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని కోరారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు/ ఆరోగ్యశాఖ మంత్రులతో బుధవారం ప్రధాని వర్చువల్‌గా సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయని, ఆ సమయాల్లో కోవిడ్–19 నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూడాలని ప్రధాని కోరారు. కరోనా మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు జరపడం, అనుమానితులను గుర్తించడం, చికిత్స అందించడం, వ్యాధిపై ప్రజలకు సరైన సమాచారమివ్వడం.. అనే విషయాలపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. లక్షణాలు లేని వారే అధికంగా ఉంటున్నారని, కోవిడ్ వ్యాధిని కొందరు తేలికగా తీసుకుంటున్నారని మోదీ పేర్కొన్నారు. అందువల్ల సరైన, స్పష్టమైన సమాచారం అందించడం వల్ల ప్రజల్లో వ్యాధికి, నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన అపోహలను తొలగించవచ్చని తెలిపారు. తొలి రోజుల్లో అమలు చేసిన లాక్‌డౌన్‌తో మెరుగైన ఫలితాలను సాధించామన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 700 జిల్లాల్లో.. ఈ ఏడు రాష్ట్రాల్లోని 60 జిల్లాల్లోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని మోదీ గుర్తు చేశారు. ఈ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లోని అధికారులతో స్వయంగా మాట్లాడి, పరిస్థితిని సమీక్షించేలా వారం రోజుల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో అధికారుల్లో చైతన్యం మరింత పెరుగుతుందన్నారు. పేదలకు ఉచితంగా చికిత్స అందించే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు సెప్టెంబర్ 25 నాటికి రెండేళ్లు పూర్తవుతాయని, ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 1.25 కోట్ల మంది పేద రోగులు లబ్ధి పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పాల్గొన్నారు. దేశవ్యాప్త యాక్టివ్ కేసుల్లో 63% ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మొత్తం నిర్ధారిత కేసుల్లో 65.5%, మొత్తం మరణాల్లో 77% ఈ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని వెల్లడించారు. -
మహమ్మారిపై మరోసారి పోరు
సాంబమూర్తినగర్ (కాకినాడ) :జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదేళ్లలోపు చిన్నారులు జిల్లాలో 5,30,884 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. సంచార జాతులు, మత్స్యకారవాడలపై ప్రత్యేకదృష్టి సారించనున్నారు. పల్స్ పోలియో నిర్వహణకు జిల్లాలో 7,520 మంది వైద్య, ఏడు వేల మంది అంగన్వాడీ, ఐకేపీ, డ్వాక్రా యానిమేటర్లను 11 రూట్లలో నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,112, పట్టణాల్లో 594, గిరిజన ప్రాంతంలో 876 పోలియో చుక్కల బూత్‌లను ఏర్పాటు చేశారు. ఆదివారం ఆయా బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయడమే కాకుండా సోమ, మంగళ వారాల్లో ఇంటింటా సర్వే నిర్వహించి పోలియో చుక్కలు వేసేలా కార్యాచరణ రూపొందించారు. రాజమండ్రిలో బుధవారం కూడా పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లాలో 149 హైరిస్క్ ప్రాంతాలలో 26,273 కుటుంబాల్లో 10, 496 మంది ఐదేళ్లలోపు చిన్నారులున్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వారందరికీ పూర్తిస్థాయిలో పోలియో చుక్కలు వేయాల్సిందిగా సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పోలియో చుక్కలు ప్రతి చిన్నారికీ అందించేందుకు సుమారు ఏడు లక్షల డోసుల వ్యాక్సిన్‌ను ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 8 గంటలకు కాకినాడ దుమ్ములపేట రాజీవ్ గృహకల్పలోని దుర్గాదేవి గుడి వద్ద కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ లాంఛనంగా ప్రారంభిస్తారని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అనిత తెలిపారు. కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు ఆయా రూట్లలో ప్రత్యేకాధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. పలుమార్లు అధికారులు, వైద్య సిబ్బందితో సమావేశాలు ఏ ర్పాటు చేశామని, ర్యాలీలు, కరపత్రాలు, బ్యానర్లు, వాల్‌పోస్టర్లతో విస్తృత ప్రచారం చేశామని చెప్పారు. జిల్లాలోని ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించడాన్ని వైద్య సిబ్బంది, తల్లిదండ్రులు బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాకినాడలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులతో శనివారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.పవన్‌కుమార్, కార్పొరేషన్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి ప్రారంభించారు. విద్యార్థులు పోలియో చుక్కలు వేయించాలని నినదించారు. -
‘పల్స్ పోలియో’కు రంగం సిద్ధం
కాకినాడ క్రైం :జిల్లాలో 60వ విడత పల్స్ పోలియో నిర్వహణకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. 2008లో చిట్టచివరి పోలియో కేసు కాకినాడ జగన్నాథపురం ఏటిమొగలో నమోదు కావడంతో అక్కడి నుంచే ఈ కార్యక్రమాన్ని ఇన్చార్జ్ కలెక్టర్‌తో లాంఛనంగా ప్రారంభింపజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18వ తేదీన బూత్‌లలో 19, 20 తేదీల్లో ఇంటిం టా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. అయితే రాజమండ్రి నగర పరిధిలో అవాసా లు అధికంగా ఉండడంతో అక్కడ 21వ తేదీన కూడా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో 5 ఏళ్లలోపు చిన్నారులు 5, 30,884 మంది ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందుకుగాను 6.65 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇప్పటికే తరలించారు. పల్స్‌పోలియో నిర్వహణకు జిల్లాలో 3,250, విలీన మండలాల్లో 332 బూత్‌లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి విలీన మండలాలకు 22 వేల డోసుల వ్యాక్సిన్‌ను సరఫరా చేశారు. 320 మంది సూపర్వైజర్ల ను పది రూట్లలో నియమించారు. రాజమండ్రికి టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసన్న కుమార్, కాకినాడకు ఎయిడ్స్ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. పవన్ కుమార్, రామచంద్రపురానికి ఎన్ఆర్హెచ్ఎం డీపీఎం డాక్టర్ మల్లిక్‌తో పాటు మండపేట, అమలాపురం, ముమ్మిడివరం, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల డిప్యూటీ డీఎంహెచ్ఓలను ఈ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా నియమించారు. ప్రచార సామగ్రి పంపిణీ పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు అవసరమైన ప్రచార సామగ్రి బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయానికి చేరింది. దీంతో ఆ సామాగ్రిని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులతో పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించే బూత్‌లకు తరలించే సన్నాహాల్లో డెమో సెక్షన్ అధికారులు నిమగ్నమయ్యారు. మత్స్యకార పల్లెలు, ఇటుక బట్టీలు, ఇతర సంచార జాతులు నివసించే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పూర్తిస్థాయిలో బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు డెమో ప్రసాదరాజు తెలిపారు. నూరు శాతం లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు ప్రణాళికలు రచించామన్నారు. బాధ్యతగా వ్యవహరించాలి ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడాన్ని తల్లిదండ్రులంతా బాధ్యతగా స్వీకరించాలి. అలాగే ఇరుగు పొరుగు పిల్లలకు కూడా చుక్కలు వేయించేలా విద్యార్థులు, విద్యావంతులు, ఉద్యోగులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం నుంచి పోలియోను పూర్తి స్థాయిలో తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం. సావిత్రమ్మ ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. వ్యాక్సిన్, ప్రచార సామగ్రిని పీహెచ్‌సీలు, ఆరోగ్య కేంద్రాలకు చేరవేశాం. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో వైద్య సిబ్బంది కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. -డాక్టర్ అనిత, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి