Health formulas
-
‘సన్యాసులు’ అవుతున్న టెకీలు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరం పేరు వినగానే ‘సిలికాన్ వ్యాలీ’ గుర్తుకు వస్తోంది. అది టెకీలుండే ప్రాంతం. టెకీలంటే రోజంతా కష్టపడి రాత్రంతా, తాగి తందనాలు ఆడుతారని, ముఖ్యంగా వారాంతంలో గర్ల్ ఫ్రెండ్స్‌తో బార్లకు, పబ్‌లకు వెళ్లి కులుకుతారని మిగతా సమాజం కుళ్లు పడేది. అందుకు విరుద్ధంగా సిలికాన్ వాలీ టెకీ (ఐటీ నిపుణులు)ల్లో ఓ సరికొత్త ట్రెండ్ మొదలయింది. అదే ‘డొపోమైన్ ఫాస్టింగ్’. ‘డొపోమైన్’ అనేది మెదడులో ఆనందానుభూతికి కల్గించే హార్మోన్. దీన్ని ‘ఆనంద రసాయనం’ అని కూడా వ్యవహరిస్తున్నారు. ఈ హార్మోన్ ఆనందం అనుభూతిని కలిగించడమే కాకుండా ఆ ఆనందానికి బానిసను కూడా చేస్తుంది. మద్యం, ఇతర మత్తులకు అలాగే బానిసలవుతారు. వ్యాయామం చేయడం వల్ల, ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్, జాగింగ్, స్విమ్మింగ్‌ల వల్ల, ఇష్టమైన ఆహారం తినడం వల్ల నరాల ప్రేరణ ద్వారా ఏ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ కారణంగానే మొబైల్ ఫోన్లకు, వాట్సాప్, ట్విట్టర్, టిక్‌టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాకు బానిసలవుతున్నామని కూడా టెకీలు భావించారు. గ్రహించారు. మెదడు నరాల్లో ‘డొపోమైన్’ అనే హార్మోన్‌ను ఉత్పత్తి కాకుండా అడ్డుకోవడం ద్వారా ఇలాంటి వ్యసనాలకు కొంతకాలం విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ‘డొపోమైన్ ఫాస్టింగ్’ను మొదలు పెట్టారు. జిమ్ములు, క్లబ్బులు, పబ్బులు, ఫుడ్‌కోర్టులకు వెళ్లడం మానేశారు. గర్ల్ ఫ్రెండ్స్‌తో ముద్దూ ముచ్చట్లకు గుడ్‌బై చెప్పారు. మొబైల్ ఫోన్లను, సోషల్ మీడియాను ముట్టుకోవడం లేదు. మ్యూజిక్‌తోపాటు మిత్రులకు దూరంగా ఉంటున్నారు. ఆఫీసులకు పోవడానికి సైకిళ్లను, అత్యవసర ఫోన్ల కోసం మాత్రమే మొబైల ఫోన్లను వాడుతున్నారు. మాంసాహారం, శాకాహారాలను కూడా పక్కన పెట్టి పండ్లతోని పచ్చి మంచి నీళ్లతోని పత్తెం ఉంటున్నారు. కొందరైతే విద్యుత్ లైట్లను కూడా ఉపయోగించకుండా చీకట్లో, వెన్నెల్లో గడుపుతున్నారు. కొకైన్ అనే మాదక ద్రవ్యం తీసుకోవడం వల్ల మెదడు మొద్దు బారినట్లయ్యి, సహనం పెరుగుతుందని, అలాగే డొపోమైన్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోయినట్లయితే సహనం పెరగడంతోపాటు చేసే పనిమీద దష్టి కేంద్రీకతం అవడమే కాకుండా, అదేంటో స్పష్టంగా అవగతమవుతుందని ప్రస్తుతం ఈ ఫాస్టింగ్‌లో ఉన్న సిలికాన్ వాలీ టెకీ, 24 ఏళ్ల జేమ్స్ సింకా తెలిపారు. ఉపవాసం వదిలేశాక మళ్లీ డొపొమైన ఉత్పత్తి పెరుగుతుందని ఆయన చెప్పారు. అప్పుడు మళ్లీ యథావిధి జీవితాన్ని కొనసాగించవచ్చని చెప్పారు. ఈ ఫాస్టింగ్ వల్ల ఓ అధ్యాత్మిక స్థితి మనస్సుకు ఆవరిస్తుందని, అందువల్ల మనస్సు పరిపరి విధాల పోకుండా, చేసే వత్తిపై కేంద్రీకతం అవుతుందని, తద్వారా కంపెనీల్లో ఉత్పత్తి పెరిగి ప్రశంసల వర్షం కురుస్తుందని, మరోపక్క మానసిక ప్రశాంతత లభించి మనిషి ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందని భావించడం వల్ల ఎక్కువ మంది టెకీలు ఈ ఫాస్టింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా సిలికాన్ వాలీలో మొదలైన ఈ ఫాస్టింగ్ ట్రెండ్, భారత సిలికాన్ వ్యాలీగా వ్యవహరించే బెంగుళూరుకు పాకి, ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌కు తాకింది. ఈ ‘డొపోమైన్ ఫాస్టింగ్’కు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని సిలికాన్ వ్యాలీ సైకాలజిస్ట్ డాక్టర్ కమెరాన్ సిపా కొట్టివేశారు. పోషక పదార్థాలు కలిగిన ఆహారం, వ్యాయామం వల్ల డొపోమైన్ హార్మోన్ పెరుగుతుందనడంలో సందేహం లేదని, ఈ రెండింటికి దూరంగా ఉండడం వల్ల, సామాజిక మీడియాకు, సామాజిక సంబంధాలకు దూరంగా ఉండడం వల్ల తగ్గుతుందనడం తప్పని ఆయన చెప్పారు. కాలిఫోర్నియా యూనివర్శిటీలోని న్యూరాలోజీ, సైకాలోజీ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ జోష్ బెర్క్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొద్దికాలం అన్నింటికి దూరంగా ఉండి, మళ్లీ వాటిని ఆస్వాదించినప్పుడు ఎక్కువ ఆనందానుభూతి కలిగే అవకాశం మానసికంగా ఉందని వారు చెప్పారు. ఏదీ శతి మించి రాగాన పడనీయ రాదని, అలవాట్లు అదుపులో ఉంటే అంతకన్నా మంచి మరోటి ఉండదని, ఇలాంటి ఫాస్టింగ్ల వల్ల ఆరోగ్యం నశించే అవకాశమే ఎక్కువగా ఉందని వారు హెచ్చరించారు. శ్రమ, శ్రమకు తగ్గ విశ్రాంతి, ఆ తర్వాత మిగిలే సమయాన్ని సామాజిక సంబంధాలకు, ఇతర అభిరుచులకు కేటియిస్తే మానసికంగా ప్రశాంత జీవితాన్ని గడపవచ్చని వారు సూచించారు. -
సిటీలో సెన్సేషనల్ మిసైల్.. లెట్స్ మూవ్
- కిక్ బాక్సింగ్‌కు మహిళలు ఫిదా - ‘గిమ్మీ ఫైవ్’ అంటూ జిమ్స్‌కు పయనం - క్రేజీ వర్కవుట్స్‌తో ఉత్తేజం నగరవాసులకు ఆరోగ్యపరమైన సూత్రాలను ఇప్పుడు బాగా వంటబట్టించుకుంటున్నారు. ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్నట్టు.. ఇలాంటివి ఎవరు చెప్పినా ఆసక్తిగా పాటిస్తున్నారు. చెప్పేది మిస్ ఇండియా అయినా మిషెల్ ఒబామా అయినా.. ‘ఫిట్నెస్’ అంటే సిటీ మహిళలు సై అంటున్నారు. అలాగే ‘లెట్స్ మూవ్’ అంటూ మిషెల్ సంధించిన మిసైల్ లాంటి పంచ్‌లకు ఫిదా అయిపోయి కిక్స్‌తో రఫ్ఫాడించేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రేజీగా మారిన వర్కవుట్ కిక్ బాక్సింగ్ విశేషాలవి.. గత నెలలో అమెరికా దేశపు ప్రధమ మహిళ మిషెల్ ఒబామా ఒక వర్కవుట్ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. స్వల్ప కాలంలోనే కోటి మందికి పైగా వీక్షకుల్ని సంపాదించిన ఆ వీడియోలో తన వర్కవుట్స్‌ని ఆమె పరిచయం చేశారు. మిషెల్ చేసిన 5 ఎక్సర్సైజ్ల్లో.. జంపింగ్ రోప్, మెడిసిన్ బాల్‌తో అబ్డామినల్ క్రంచెస్, బెంచ్ స్క్వాట్స్, డంబెల్ ప్రెసెస్, బాక్సింగ్.. ఉన్నాయి. కేవలం రెండు నిమిషాలు మించి లేని ఈ క్లిప్‌లో మిషెల్‌తో పాటు ఆమె ఫ్యామిలీ ట్రైనర్ కార్నెల్ మెకెల్లన్ కూడా కనిపిస్తారు. స్క్వాట్స్, క్రంచెస్ అయిపోయాక మిషెల్ బ్లూ బాక్సింగ్ గ్లవ్స్ ధరించి కిక్స్ మొదలుపెట్టారు. ఆమె ఇందులో ఒక టు-పంచ్ కాంబోను చూపించి ఆ తర్వాత గిర్రున తిరుగుతూ బ్యాగ్‌పై ఓ రౌండ్ హౌజ్ కిక్ ఇచ్చారు. మిగతావి ఎలా ఉన్నా... ఆమె పంచ్ బ్యాగ్‌పై పంజా విసురుతూ ఇచ్చిన రౌండ్ హౌజ్ కిక్స్..ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మిషెల్ వీడియో నగర మహిళల్లో కిక్ బాక్సింగ్ పట్ల అమాంతం క్రేజ్ పెంచేసింది. మరెందరికో ‘కిక్’.. తను ఏం తిన్నా తనను ఫిట్‌గా ఉంచే శక్తి కిక్ బాక్సింగ్‌కి ఉన్నట్టు గ్రహించానని టాలీవుడ్ సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్ అంటోంది. ఫుడ్ డబుల్ అయినప్పుడు శాండ్బాగ్స్కి కిక్స్ ఇస్తూ రెట్టింపు సమయం గడుపుతానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మిషెల్ ఒబామా అప్లోడ్ చేసిన ‘లెట్స్మూవ్’ వీడియో మహిళల్ని ఎక్సర్సైజ్ల వైపు మళ్లించేలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు సిటీ సోషలైట్ సుశీలా బొకాడియా. తాను రోజూ 2 గంటల పాటు వర్కవుట్ చేస్తానని, తన వర్కవుట్‌లో ఇప్పుడు కిక్ బాక్సింగ్ ప్రధానమైన భాగమని చెప్పారు. యోగా ట్రైనర్‌గా రోప్ యోగా వంటి వెరైటీ శైలుల్ని పరిచయం చేసిన రినా హిందోచా కూడా తాను ఇటీవలే కిక్ బాక్సింగ్‌ను సాధన చేస్తున్నానన్నారు. ఇది మహిళల్ని శక్తివంతం చేయడం మాత్రమే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపకరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మిక్స్ చేస్తే మస్తు మస్తే.. చూడ్డానికి కష్టంగా అనిపించినా ఈ కిక్స్, పంచ్‌లు తేలిగ్గా చేయగలిగినవేనని జరీర్ చెప్పారు. ఇది మోకాలు, లోయర్ బ్యాక్‌లపై తక్కువ భారాన్ని వేసే వ్యాయామం. ఎప్పటికప్పుడు ఆసక్తిని పెంచుకునేందుకు వీలుగా దీనిని విభిన్న మార్గాల్లో చేయవచ్చు. ఏరోబిక్స్, వెయిట్ ట్రైనింగ్‌ను కూడా జత కలిపి చేయడం అలాంటి ఒక వైవిధ్యమార్గం. అయితే, కొత్తగా సాధన చేసేవారు తప్పనిసరిగా మంచి కార్డియో కిక్ బాక్సింగ్ ట్రైనర్‌ను ఎంచుకోవాలి. కొంత కాలం పాటు ట్రైనర్ శిక్షణలో కొనసాగి పరిణితి సాధించాక ఒక పంచ్ బ్యాగ్‌ను మాత్రం ఏర్పాటు చేసుకుని స్వయంగా సాధన కొనసాగించవచ్చు. ఫటాఫట్.. బెని‘ఫిట్’ ఒక క్రీడగా చాలా మంది అభిమానించే బాక్సింగ్‌ను ఆరోగ్య సాధనంగా మార్చడం ద్వారా చక్కని ఫిట్- వర్కవుట్‌గా మార్చవచ్చు. ఇపుడు జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలో దీన్ని ‘కార్డియో కిక్ బాక్సింగ్’గా వ్యవహరిస్తున్నారు. కరాటే కిక్‌లు, బ్లాక్స్ పంచ్‌లు వంటివి సంప్రదాయ ఎరోబిక్స్‌తో మిళితం చేసిన ఫిట్నెస్ ప్రోగ్రామ్.. ఈ కార్డియో కిక్ బాక్సింగ్. కరాటే, బాక్సింగ్‌ను మేళవించిన ఏరోబిక్ వ్యాయామ శైలి ఇది. బాడీ బ్యాలెన్సింగ్‌కి ఉపకరిస్తుంది. దీని ద్వారా ప్రారంభంలో గంటకి 400 నుంచి 500 క్యాలరీలు, రెగ్యులర్‌గా చేసేవారికి 800-900 క్యాలరీల వరకూ ఖర్చవుతాయి. ఇది ఫ్యాట్‌ని కరిగించే అత్యుత్తమ సాధనగా నగరానికి చెందిన ఫిట్నెస్ గురు జరీర్ పటేల్ చెబుతున్నారు. ఈ వర్కవుట్ కదలికల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. పొట్ట భాగాన్ని సున్నితంగా బిగించి కిక్స్, పంచ్‌లు ఇవ్వడం ద్వారా అబ్డామినల్ మజిల్ బాగా పటిష్టమవుతుంది. అప్పర్ కట్, జాబ్, ఎల్బోహుక్, స్నాచ్, రివర్స్కిక్, రౌండ్ కిక్.. నేర్చుకుంటే స్వీయ రక్షణకూ ఉపకరిస్తుంది. లెట్స్ మూవ్.. చిన్నారులు బయటకు వెళ్లాలి, యాక్టివ్‌గా మారాలి అనే ఉద్దేశంతో అమెరికా ఫస్ట్ లేడీ ప్రారంభించిన ‘లెట్స్ మూవ్’ క్యాంపెయిన్‌లో భాగంగా ఓ వీడియోను మిషెల్ అప్లోడ్ చేశారు. దీనిలోనే ఆమె ప్రముఖులను, సాధారణ ప్రజలను ‘గిమ్మీ ఫైవ్’ అంటూ కోరుతున్నారు. అంటే ఫిట్-యాక్టివ్‌గా ఉండేందుకు 5 సూత్రాల మార్గం ఇవ్వమని అర్ధం. దీనికి స్పందనగా బరాక్ ఒబామా సైతం తన వీడియోను పోస్ట్ చేశారు. అందులో యాక్టివ్‌గా ఉండడానికి తాను చేసేవి జాగింగ్, కూర్చుని కాకుండా ‘వాక్ అండ్ టాక్’ మీటింగ్స్ వంటివి ఆయన పొందుపరచారు. -
సిటీలో సెన్సేషనల్ మిసైల్.. లెట్స్ మూవ్
♦ కిక్ బాక్సింగ్‌కు మహిళలు ఫిదా ♦ ‘గిమ్మీ ఫైవ్’ అంటూ జిమ్స్‌కు పయనం ♦ క్రేజీ వర్కవుట్స్‌తో ఉత్తేజం నగరవాసులకు ఆరోగ్యపరమైన సూత్రాలను ఇప్పుడు బాగా వంటబట్టించుకుంటున్నారు. ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్నట్టు.. ఇలాంటివి ఎవరు చెప్పినా ఆసక్తిగా పాటిస్తున్నారు. చెప్పేది మిస్ ఇండియా అయినా మిషెల్ ఒబామా అయినా.. ‘ఫిట్నెస్’ అంటే సిటీ మహిళలు సై అంటున్నారు. అలాగే ‘లెట్స్ మూవ్’ అంటూ మిషెల్ సంధించిన మిసైల్ లాంటి పంచ్‌లకు ఫిదా అయిపోయి కిక్స్‌తో రఫ్ఫాడించేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రేజీగా మారిన వర్కవుట్ కిక్ బాక్సింగ్ విశేషాలవి.. గత నెలలో అమెరికా దేశపు ప్రధమ మహిళ మిషెల్ ఒబామా ఒక వర్కవుట్ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. స్వల్ప కాలంలోనే కోటి మందికి పైగా వీక్షకుల్ని సంపాదించిన ఆ వీడియోలో తన వర్కవుట్స్‌ని ఆమె పరిచయం చేశారు. మిషెల్ చేసిన 5 ఎక్సర్సైజ్ల్లో.. జంపింగ్ రోప్, మెడిసిన్ బాల్‌తో అబ్డామినల్ క్రంచెస్, బెంచ్ స్క్వాట్స్, డంబెల్ ప్రెసెస్, బాక్సింగ్.. ఉన్నాయి. కేవలం రెండు నిమిషాలు మించి లేని ఈ క్లిప్‌లో మిషెల్‌తో పాటు ఆమె ఫ్యామిలీ ట్రైనర్ కార్నెల్ మెకెల్లన్ కూడా కనిపిస్తారు. స్క్వాట్స్, క్రంచెస్ అయిపోయాక మిషెల్ బ్లూ బాక్సింగ్ గ్లవ్స్ ధరించి కిక్స్ మొదలుపెట్టారు. ఆమె ఇందులో ఒక టు-పంచ్ కాంబోను చూపించి ఆ తర్వాత గిర్రున తిరుగుతూ బ్యాగ్‌పై ఓ రౌండ్ హౌజ్ కిక్ ఇచ్చారు. మిగతావి ఎలా ఉన్నా... ఆమె పంచ్ బ్యాగ్‌పై పంజా విసురుతూ ఇచ్చిన రౌండ్ హౌజ్ కిక్స్..ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మిషెల్ వీడియో నగర మహిళల్లో కిక్ బాక్సింగ్ పట్ల అమాంతం క్రేజ్ పెంచేసింది. మరెందరికో ‘కిక్’.. తను ఏం తిన్నా తనను ఫిట్‌గా ఉంచే శక్తి కిక్ బాక్సింగ్‌కి ఉన్నట్టు గ్రహించానని టాలీవుడ్ సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్ అంటోంది. ఫుడ్ డబుల్ అయినప్పుడు శాండ్బాగ్స్కి కిక్స్ ఇస్తూ రెట్టింపు సమయం గడుపుతానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మిషెల్ ఒబామా అప్లోడ్ చేసిన ‘లెట్స్మూవ్’ వీడియో మహిళల్ని ఎక్సర్సైజ్ల వైపు మళ్లించేలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు సిటీ సోషలైట్ సుశీలా బొకాడియా. తాను రోజూ 2 గంటల పాటు వర్కవుట్ చేస్తానని, తన వర్కవుట్‌లో ఇప్పుడు కిక్ బాక్సింగ్ ప్రధానమైన భాగమని చెప్పారు. యోగా ట్రైనర్‌గా రోప్ యోగా వంటి వెరైటీ శైలుల్ని పరిచయం చేసిన రినా హిందోచా కూడా తాను ఇటీవలే కిక్ బాక్సింగ్‌ను సాధన చేస్తున్నానన్నారు. ఇది మహిళల్ని శక్తివంతం చేయడం మాత్రమే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపకరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మిక్స్ చేస్తే మస్తు మస్తే.. చూడ్డానికి కష్టంగా అనిపించినా ఈ కిక్స్, పంచ్‌లు తేలిగ్గా చేయగలిగినవేనని జరీర్ చెప్పారు. ఇది మోకాలు, లోయర్ బ్యాక్‌లపై తక్కువ భారాన్ని వేసే వ్యాయామం. ఎప్పటికప్పుడు ఆసక్తిని పెంచుకునేందుకు వీలుగా దీనిని విభిన్న మార్గాల్లో చేయవచ్చు. ఏరోబిక్స్, వెయిట్ ట్రైనింగ్‌ను కూడా జత కలిపి చేయడం అలాంటి ఒక వైవిధ్యమార్గం. అయితే, కొత్తగా సాధన చేసేవారు తప్పనిసరిగా మంచి కార్డియో కిక్ బాక్సింగ్ ట్రైనర్‌ను ఎంచుకోవాలి. కొంత కాలం పాటు ట్రైనర్ శిక్షణలో కొనసాగి పరిణితి సాధించాక ఒక పంచ్ బ్యాగ్‌ను మాత్రం ఏర్పాటు చేసుకుని స్వయంగా సాధన కొనసాగించవచ్చు. ఫటాఫట్.. బెని‘ఫిట్’ ఒక క్రీడగా చాలా మంది అభిమానించే బాక్సింగ్‌ను ఆరోగ్య సాధనంగా మార్చడం ద్వారా చక్కని ఫిట్- వర్కవుట్‌గా మార్చవచ్చు. ఇపుడు జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలో దీన్ని ‘కార్డియో కిక్ బాక్సింగ్’గా వ్యవహరిస్తున్నారు. కరాటే కిక్‌లు, బ్లాక్స్ పంచ్‌లు వంటివి సంప్రదాయ ఎరోబిక్స్‌తో మిళితం చేసిన ఫిట్నెస్ ప్రోగ్రామ్.. ఈ కార్డియో కిక్ బాక్సింగ్. కరాటే, బాక్సింగ్‌ను మేళవించిన ఏరోబిక్ వ్యాయామ శైలి ఇది. బాడీ బ్యాలెన్సింగ్‌కి ఉపకరిస్తుంది. దీని ద్వారా ప్రారంభంలో గంటకి 400 నుంచి 500 క్యాలరీలు, రెగ్యులర్‌గా చేసేవారికి 800-900 క్యాలరీల వరకూ ఖర్చవుతాయి. ఇది ఫ్యాట్‌ని కరిగించే అత్యుత్తమ సాధనగా నగరానికి చెందిన ఫిట్నెస్ గురు జరీర్ పటేల్ చెబుతున్నారు. ఈ వర్కవుట్ కదలికల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. పొట్ట భాగాన్ని సున్నితంగా బిగించి కిక్స్, పంచ్‌లు ఇవ్వడం ద్వారా అబ్డామినల్ మజిల్ బాగా పటిష్టమవుతుంది. అప్పర్ కట్, జాబ్, ఎల్బోహుక్, స్నాచ్, రివర్స్కిక్, రౌండ్ కిక్.. నేర్చుకుంటే స్వీయ రక్షణకూ ఉపకరిస్తుంది. లెట్స్ మూవ్.. చిన్నారులు బయటకు వెళ్లాలి, యాక్టివ్‌గా మారాలి అనే ఉద్దేశంతో అమెరికా ఫస్ట్ లేడీ ప్రారంభించిన ‘లెట్స్ మూవ్’ క్యాంపెయిన్‌లో భాగంగా ఓ వీడియోను మిషెల్ అప్లోడ్ చేశారు. దీనిలోనే ఆమె ప్రముఖులను, సాధారణ ప్రజలను ‘గిమ్మీ ఫైవ్’ అంటూ కోరుతున్నారు. అంటే ఫిట్-యాక్టివ్‌గా ఉండేందుకు 5 సూత్రాల మార్గం ఇవ్వమని అర్ధం. దీనికి స్పందనగా బరాక్ ఒబామా సైతం తన వీడియోను పోస్ట్ చేశారు. అందులో యాక్టివ్‌గా ఉండడానికి తాను చేసేవి జాగింగ్, కూర్చుని కాకుండా ‘వాక్ అండ్ టాక్’ మీటింగ్స్ వంటివి ఆయన పొందుపరచారు.