Health rules
-
చిక్కుల చక్కెర
డయాబెటి పేరు వినగానే బెంబేలెత్తిపోతారు. ఆరోగ్య నియమాలు పాటించకుండా, ఆహారం విషయంలో ఇష్టం వచ్చిన రీతిలో ఉంటూ, వ్యాయామం చేయని వారిలో డయాబెటిస్ ఎక్కుగా కనిపిస్తుంటుంది. దీని కారణంగా గుండె జబ్బులూ, కిడ్నీ సమస్యలూ, పక్షవాతం... ఇలా ఇతరత్రా జబ్బులెన్నో వస్తుంటాయి. అన్ని అవయవాలు ప్రభావితమవుతాయి. డయాబెటిస్‌ను గురించి తప్పక తెలుసుకొని, వీలైనంతమేరకు దానిబారిన పడకుండా ఉండాలి. ఈ నెల 14న వరల్డ్ డయాబెటిస్ డే. ఈ సందర్భంగా... డయాబెటిస్‌పై అవగాహన కోసమే ఈ కథనం. ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి బాగా మారిపోవ డం వల్ల డయాబెటిస్ విస్తృతంగా కనిపిస్తోంది. డయాబెటిస్‌లో ప్రధానంగా మూడు రకాలు అనుకుంటారు. టైప్–1, టైప్–2లతో పాటు గర్భవతులకు వచ్చే జస్టేషనల్ డయాబెటిస్ అనే ప్రధాన రకాలను వర్గీకరిస్తుంటారు. కానీ డయాబెటిస్ ప్రధానంగా ఈ మూడు రూపాల్లోనే గాక... లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ (లాడా) అనీ, మెచ్యురిటీ ఆన్సెట్ ఆఫ్ ద యంగ్ (మోడీ) అనీ ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ మూడు రకాల్లోనూ టైప్–1 డయాబెటిస్ అన్నది చిన్నపిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది జన్యులోపం వల్ల వస్తుంది. చిన్నారుల రోగనిరోధక వ్యవస్థ... వారి పాంక్రియాస్‌లోని బీటా సెల్స్‌ను శత్రుకణాలుగా భావించి, వాటిని నాశనం చేస్తుంది. ఫలితంగా పాంక్రియాస్ పనిచేయక దానిలోని ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీనినే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్ అని అంటారు. అలా పాంక్రియాస్ కార్యకలాపాలు మందగించగానే డయాబెటిస్ వస్తుందన్నమాట. ఇక సాధారణంగా కొంత వయసు గడిచాక పాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌కు మన శరీరంలోని జీవకణాలు తగిన రీతిలో స్పందించడం మానేస్తాయి. ఇలా జరిగినప్పుడు తలెత్తే మధుమేహాన్ని టైప్–2 డయాబెటిస్ అంటారు. ఇదే పరిస్థితి చాలాకాలం కొనసాగితే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి దానంతట అది పూర్తిగా నిలిచిపోతుంది. దీనిని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్ లేదా అడల్డ్ ఆన్సెట్ డయాబెటిస్ అంటారు. డయాబెటిస్ రోగుల్లో దాదాపు 90 శాతం మంది ఈ రకానికే చెందుతారు. కొంతమంది మహిళల్లో గర్భం ధరించిన సమయంలో డయాబెటిస్ కనిపిస్తుంటుంది. దాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇలాంటి వారిలో ప్రసవం అయిన తర్వాత డయాబెటిస్ కూడా కనిపించదు. అయితే ఇలా గర్భవతిగా ఉన్నప్పుడు జెస్టెషనల్ డయాబెటిస్ వచ్చిన వారిలో వయసు పెరిగాక అది మళ్లీ వచ్చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చికిత్స : ►డీ ఫర్ డయాబెటిస్, డీ ఫర్ డేంజర్... అందుకే ఈ డేంజరస్ డయాబెటిస్ ట్రబుల్‌ను వీలైనంత దూరంగా ఉంచాలి. ►టైప్–1 డయాబెటిస్‌కు వైద్యుల సూచనపై ఇన్సులిన్ ఇవ్వడం మాత్రమే ఏకైక మార్గం. ►ఎక్కువ మందిలో కనిపించే టైప్–2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్‌ను స్రవింపజేసే క్లోమగ్రంథిని ప్రేరేపించే మందులు ఇస్తుంటారు. అవి కూడా పనిచేయని సమయాల్లో డాక్టర్లు అవసరమైన మోతాదులో ఇన్సులిన్ సిఫార్సు చేస్తుంటారు. ఇలా ఇన్సులిన్ తీసుకోవాల్సి రావడం చాలా తీవ్రమైన దశగా చెప్పుకోవచ్చు. ఇలాంటి దశకు చేరి... ఒంటిని ప్రమాదకరమైన పరిస్థితికి గురిచేయడం కంటే కొద్దిపాటి జాగ్రత్తలతో అది రాకుండానే చాలావరకు నియంత్రించుకోవచ్చు. నివారణ... ►అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్‌ను మంచి కొవ్వులుగా పరిగణిస్తారు. వీటిలో మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అనే రకాలు ఉంటాయి. ఈ రెండు రకాలూ మంచివే. ►చేపలు, అవిసెగింజలు, వాల్నట్స్లతో పాటు రై స్బ్రాన్ ఆయిల్ వంటి శా కాహార నూనెల్లో మంచి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ►చక్కెరలు మోతాదుకు మించి ఉండే కూల్‌డ్రింక్స్, స్వీట్స్, చాక్లెట్లు వంటి వాటికి దూరంగా ఉండటంతో పాటు పొగతాగడా న్ని మానేయడం ద్వారా కూడా రక్తంలో చక్కెర ల స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. చివరగా... డయాబెటిస్ గురించి ఆందోళన పడాల్సి న పనిలేదు. హెల్దీ లైఫ్‌స్టైల్‌ను అనుసరిస్తూ, వై ద్యుల సలహాలపై మందులు వాడుతూ ఉంటే పూర్తి ఆరోగ్యంతో నిండు నూరేళ్లూ బతకవచ్చు. లక్షణాలు డయాబెటిస్ ఉన్నవారిలో బాగా ఆకలి పెరగడంతో పాటు విపరీతంగా దాహం వేయడం కనిపిస్తాయి. తరచు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు చాలామందిని బాధిస్తుంటాయి. అసలు ఈ లక్షణం నుంచే డయాబెటిస్‌కు ఆ పేరు వచ్చిందని చెబుతుంటారు. ఎందుకంటే... వాస్తవానికి ‘డయాబెటిస్’ అంటే మూత్రపు ఫౌంటేన్ అనే అర్థం కూడా ఉందట. ►డయాబెటిస్ రాగానే చాలామందిలో దాని తాలూకు నిర్దిష్టమైన లక్షణాలేవీ చాలాకాలం పాటు కనిపించకపోవచ్చు. అందుకే 40 ఏళ్లు దాటాక క్రమం తప్పకుండా ఏడాదికి ఒకసారైనా రక్తపరీక్షలు చేయించుకుంటే డయాబెటిస్ గురించీ, దాని ఉనికి ఏదైనా ఉంటే దాని గురించి తెలుస్తుంది. ►డయాబెటిస్ ఉన్నవారికి గాయాలు అంత త్వరగా మానవు. ఎందుకంటే ఒంట్లోని చక్కెర రక్తప్రవాహంలో కలవడం వల్ల హాని చేసే బ్యాక్టీరియాకు ఆ పుండ్లనూ, గాయాలను ఆశ్రయించినప్పుడు ఆ ప్రదేశాలు వాటికి చాలా రుచిగా, తియ్యగా అనిపిస్తాయి. దాంతో ఆ బ్యాక్టీరియా అలాంటి ప్రదేశాలను వదలడానికి ఇష్టపడవు. అంతేగాక డయాబెటిస్ ఉన్నవారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఆ బ్యాక్టీరియా/హానికారక క్రిములను తుదముట్టించే శక్తి లోపిస్తుంది కాబట్టి... ఇలాంటి డయాబెటిస్ ఉన్నవారి దేహాలు ఆ క్రిములకు మంచి ఆవాసమవుతాయి. ఫలితంగా గాయలు ఒక పట్టాన తగ్గవు. అందుకే డయాబెటిస్తో బాధపడుతున్న వారు తమ ఒంటిపైన ఉంటే గాయలు/పుండ్ల వంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గాయమైన సదరు అవయవానికే ముప్పు వాటిల్లి... ఆ అవయవాన్నే తొలగించాల్సిన దుస్థితి రావచ్చు. డయాబెటిస్‌ను నియంత్రించే యోగాసనాలివే... యోగా మన ఆరోగ్య సంరక్షణకు ఉపకరిస్తుందన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రత్యేక యోగాసనాలు సైతం చక్కెర వ్యాధిని నివారిస్తాయి... ఒకవేళ అప్పటికే చక్కెర వ్యాధి ఉన్నప్పటికీ దాన్ని నియంత్రించడానికి చాలావరకు ఉపయోగపడతాయన్నది యోగా నిపుణుల మాట. ఇందులో 1) అర్ధమత్సేంద్రాసనం, 2) చక్రాసనం... డయాబెటిస్ నివారణ/నియంత్రణకు తోడ్పడతాయి. డయాబెటిస్ కనుగొనేందుకు పరీక్షలివి... చక్కెర వ్యాధిని గుర్తించడానికి ఈ కింద పేర్కొన్న కొన్ని రకాల రక్తపరీక్షలు చేస్తారు. ►ఫాస్టింగ్ సుగర్ టెస్ట్ : కనీసం 8గంటల సేపు ఏమీ తినకుండా ఈ పరీక్ష చేయించుకోవాలి. ►పోస్ట్ ఫుడ్ సుగర్ టెస్ట్: ఆహారం తీసుకున్న గంటన్నర లోగా పరీక్ష చేయించుకోవాలి. ►ర్యాండమ్ సుగర్ టెస్ట్ : తిన్నా, తినకున్నా ఏదో ఒకవేళ ఈ పరీక్ష చేస్తారు. ►ఓరల్ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) : బార్డర్‌లైన్‌లో ఉన్నవారికి ఈ పరీక్ష చేస్తారు. ►డయాబెటిస్‌ను తెలుసుకోవడం కోసం హెచ్‌బీఏ1సీ అనే పరీక్షను సైతం చేస్తారు. ఇది 8 నుంచి 12 వారాల వ్యవధిలో చెక్కెర పాళ్లను సగటును తెలిపే పరీక్ష. దీన్ని పరగడుపున చేయాల్సిన అవసరం ఉండదు. ఇది చక్కెర వ్యాధిని నిర్ధారణ చేయడంతోపాటు మందులు వాడుతున్నప్పుడు చికిత్స వల్ల చక్కెర అదుపులోనే ఉంటోందా లేదా అన్న విషయం కూడా తెలుస్తుంది. డయాబెటిస్ తీవ్రత కూడా తెలుస్తుంది. డయబెటిక్ డైట్... మనం గతంలో దంపుడుబియ్యం, రాగులు, జొన్నలు, సజ్జల వంటివి తినేవాళ్లం. పాలిష్డ్ రైస్ తినడం మొదలుపెట్టగానే ప్రపంచంలో ఎక్కడా లేనంతగా డయాబెటిస్ మన దగ్గర కనపించడం మొదలైంది. డయాబెటిస్ నుంచి బయటపడటానికి... ►లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాల్లో బ్రౌన్‌రైస్, క్వినోవా రైస్, దంపుడుబియ్యం, బొంబాయిరవ్వ ఉప్మా వంటివి ముఖ్యమైనవి. కాకపోతే ఇవి అందరికీ నచ్చవు. వీటికి మనం అలవాటుపడటానికి క్రమంగా వాటిని మన రుచిమొగ్గలకు అలవాటు చేయాలి. దీన్నే సిస్టమాటిక్ డీ–సెన్సిటైజేషన్ ఆఫ్ పాలెట్ అని అంటారు. దీనికోసం... మనం పాలిష్‌రైస్ ఒక గిన్నెలో వండాలి. బ్రౌన్‌రైస్ మరో గిన్నెలో వండాలి. మూడో గిన్నె తీసుకొని అందులో మొదట 75% పాలిష్రైస్తో వండిన అన్నం, 25% బ్రౌన్ రైస్‌తో వండిన అన్నం కలిపి... రెండు నుంచి మూడు వారాలు ఇలా తినాలి. దాని తర్వాత 60% పాలిష్‌రైస్, 40% బ్రౌన్‌రైస్... ఇలా మరో మూడు వారాలు తినాలి. ఇలా క్రమంగా పాలిష్‌రైస్ శాతాన్ని తగ్గించుకుంటూ, బ్రౌన్‌రైస్ శాతాన్ని పెంచుకుంటూ వెళుతూ... మూడు నుంచి నాలుగు నెలల తర్వాత మొత్తం బ్రౌన్ రైస్ తినాలి. ఇలా చేయడం వల్ల మన నాలుక బ్రౌన్‌రైస్ రుచికి అలవాటు పడుతుంది. ఇలా చేయడం ద్వారా మనం శాశ్వతంగా బ్రౌన్‌రైస్ మళ్లవచ్చు. (ఇదే పద్ధతి క్వినోవా, దంపుడుబియ్యానికి కూడా వర్తిస్తుంది). ఈ ప్రక్రియతో తెల్లఅన్నం కోసం క్రేవింగ్ కూడా తగ్గుతుంది. ►బ్రేక్‌ఫాస్ట్‌లో తినగలిగేవి : రాగి ఇడ్లీ, రాగి దోశ, పెసరట్టు, గోధుమరవ్వ ఉప్మా, చపాతి, పొట్టుతీయని గింజలతో చేసిన బ్రెడ్, పొట్టుతియ్యని గింజల గారెలు. ►డయాబెటిస్ ఉన్నవారితో పాటు.. దాన్ని నివారించుకోవాలనుకునేవారు తినాల్సిన పండ్లు : జామ, గ్రీన్ ఆపిల్, ఓ మోస్తరుగా పండిన పుచ్చకాయలు, మోస్తరుగా పండిన బొప్పాయి, దానిమ్మ, కివి, ఆరెంజెస్, నేరేడుపండ్లు. తీపి పదార్థాలు తినాలని బాగా అనిపించినప్పుడు బెర్రీస్ (బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీలు తింటే క్రేవింగ్ తగ్గుతుంది. వారానికి రెండున్నర గంటలకు తగ్గకుండా వ్యాయామమూ చేయాలి. ప్రీ–డయాబెటిస్ కండిషన్ అంటే... కనీసం ఎనిమిది గంటలు ఏమీ తినకుండా జరిపే ఫాస్టింగ్ పరీక్షలో రక్తంలో చక్కెర 70–100 స్థాయిలో ఉంటే సాధారణ పరిస్థితిలో ఉన్నట్లు లెక్క. దానికి మంచి 126 వరకు ఉన్నా... ఇక ఆహారం తీసుకున్న గంటన్నర లోగా పరీక్ష చేయించుకునే పోస్ట్ లంచ్ పరీక్షలో చక్కెర పాళ్లు 140 కంటే మించి 180 వరకు ఉన్నా కాస్త జాగ్రత్త పడాలి. ఫాస్టింగ్‌లో రక్తంలో చక్కెర 100–126 లోపు, పోస్ట్ లంచ్ 140–180 లోపు ఉంటే అది డయాబెటిస్ వచ్చేందుకు ముందు దశ (ప్రీ డయాబెటిక్ స్టేజ్)గా చెబుతారు. అలాంటివారు మంచి జీవనశైలి నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తే సాధ్యమైనంతవరకు డయాబెటిస్‌ను నివారించవచ్చు. డాక్టర్ టి.ఎన్.జె. రాజేశ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ ఇంటర్నల్ మెడిసిన్ – ఇన్ఫెక్షియస్ డిసీజెస్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నేస్తాలు
పెరుగుతున్న పెట్ సంస్కృతి మూగ జీవాలను అక్కున చేర్చుకుంటున్న ప్రజలు విశ్వాసపాత్రమైన జంతువుల్లో కుక్క ప్రధానం. శునకం ఇంటి యజమానికి విశ్వాసంగా, నమ్మకంగా, అతి సన్నిహితంగా కుటుంబంలో ఓ సభ్యునిలా ఉంటూ ఇంట్లో అందరి ఆదరాభిమానాలు చూరగొంటోంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కుక్కల పెంపకాన్ని ఇష్టపడతారు. అయితే ఒకప్పుడు సంపన్న హోదాకు చిహ్నంగా అతి కొద్ది మంది ధనికులు మాత్రమే తమ ఇళ్లలో శునకాలను పెంచుకునేవారు. మారిన పరిస్థితుల్లో నేడు మధ్యతరగతితోపాటు సామాన్యులు సైతం కుక్కలను పెంచుకుంటున్నారు. సమాజంలో నేడు వీటి పోషణ సాధారణంగా మారింది. ఆ మూగ జీవుల యజమానులు వాటి ఆరోగ్యం కాపాడుకోవడానికి తిరుపతి గంగమ్మగుడి సమీపంలోని పశువైద్యశాలను సంప్రదిస్తున్నారు. అక్కడ వైద్యులు సైతం వాటికి సేవలు అందిస్తున్నారు. తిరుపతి మెడికల్: జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె తదితర నగరాల్లో గత కొంతకాలంగా పెంపుడు జంతువుల పెంపకం సంస్కృతి పెరుగుతోంది. మానవతావాదులు మూగ జీవాలను కన్నబిడ్డలా పోషిస్తున్నారు. వీటిలో ప్రధానమైనవి కుక్కలే. నగరాల్లో పెరుగుతున్న ‘పెట్’ సంస్కృతి రోజు రోజుకూ పెరుగుతోంది. పెంపుడు జంతువుల (పెట్)ను పెంచుకోవడం గొప్ప కాదు. వాటిని సరైన పద్ధతిలో ఒక క్రమశిక్షణతో ఆ రోగ్యంగా పెంచితే వాటితో పాటు ఆ యజ మాని కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నగరంలోని పలువురు సంపన్నులు అరుదైన జాతులకు చెందిన కుక్క పిల్లలను పెంచుకుంటున్నారు. అలాంటి వారు వాటి పెంపకంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య నియమాలు తప్పనిసరి ఒక కుక్క పిల్లను పుట్టినప్పటి నుంచి పెంచుకుంటుంటే దానికి 15 రోజుల వయసు రాగానే పురుగుల నివారణ మందు తాగించాలి. ఆరు నెలల పాటు నెలకోసారి విధిగా తాగించాలి. అది కూడా కుక్క బరువు ఆధారంగా సంబంధి త డాక్టర్‌ను సంప్రదించిన తరువాతే తాపాలి. పుట్టిన 45 రోజులకు రక్త బేదులు, దగ్గు, జలుబు, నరాల బలహీనత వంటి వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి. ఆపై అదే టీకాలను 3 నుంచి 4 వారాల తరువాత, మరోసారి 3 నెలల వయసులో వేయించాలి. కుక్కకు 2 సంవత్సరాల నుంచి బతికున్నంత వరకు క్రమం తప్పకుండా టీకాలు వేయించా ల్సి ఉంటుంది. పెంపుడు కుక్కను ఏదైనా వీధి కుక్క కరిస్తే నిర్లక్ష్యంగా చేయకూడదు. ముందుగా గాయం వద్ద సోపుతో శుభ్రంగా కడగాలి. ఆపై 24 గంటల్లోగా దగ్గరలోని సంబంధి త పశువైద్యుని వద్ద వైద్యం చేయించాలి. తొలిరోజు నుంచి 3, 7, 14, 28 ఐదు సార్లు టీకాలు వేయించడం ఉత్తమం. ఆహార నియమమూ అవసరమే చాలా మంది మైదాపిండితో చేసిన బిస్కెట్లను కుక్కలకు పెడుతుంటారు. అది ప్రమాదమే అంటున్నారు వైద్యులు. బి స్కెట్ల వల్ల ఆకలి మందగించడంతోపాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బిస్కెట్ల బదులు డ్రైఫుడ్ (పెల్లెట్స్), చూస్టిక్స్లను తినిపిస్తే ఆరోగ్యంతో పాటు దంత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే చాలా మంది కుక్కలకు లై ఫ్ బాయ్ లాంటి కార్బొటిక్ యాసిడ్ వంటివి వాడుతుం టా రు అలాంటివి వాడకూడదు. కుక్కలకు సంబంధించిన ప్ర త్యేకమైన సోపును వాడాలి. అలాగే మనుషులు వాడే షాం పులు కాకుండా, కుక్కల షాంపును మాత్రమే ఉపయోగించా లి. బొచ్చు కుక్కలకు రోజూ రెండు సార్లు దువ్వెనతో దువ్వా లి. తద్వారా శరీరంలో రక్తప్రసరణ సాఫీగా ఉంటుంది. వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి మనం ఎంతో ముచ్చటగా పెంచుకునే కుక్కలకు మనకు తెలియకుండానే వ్యాధుల బారిన పడతాయి. అయితే ముం దుగానే ఆ వ్యాధి లక్షణాలను పసిగట్టి వైద్యుడికి చూపిస్తే మొదటిలోనే ఆ వ్యాధిని నయం చేయవచ్చు. ప్రధానంగా వచ్చే వ్యాధులలో జీర్ణకోశ వ్యాధి, చర్మ వ్యాధి, పాల్కోడి, హెపటైటిస్, లెప్టోస్పైరా, రేబీస్‌తో పాటు శ్వాస కోశ వ్యాధులు వస్తుంటాయి. ముందస్తుగా టీకాలు, వైద్య సేవలు అందిస్తే జబ్బులకు చెక్ప్టెచ్చు. మా ‘చిట్టి’కి పెద్ద కథే ఉంది మాకు చిట్టి(కుక్కపేరు) రో డ్డుపై దొరికిన అపురూపం. ఎందుకం టే దానికి ఓ కథ ఉంది. చిట్టి త ల్లి (వీధికుక్క)కి మొత్తం ఐదు పి ల్లులు. చిట్టికి నెల వయసులో తల్లి తో పాటు మిగిలిన నాలుగు పిల్లలు చనిపోవడంతో చిట్టి ఒంటరైంది. దీన్ని వీధి కుక్కలు కర వడంతో చనిపోయిందని కుప్పతొట్టిలో పడేశారు. ఈ దృ శ్యం నన్ను కలచివేసింది. వెళ్లి చూడగా బతికే ఉంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే బతకదన్నారు. ఎలాగోలా ఆపరేషన్ చేశారు. ఇంటికి తీసుకెళ్లి 2 నెలలు కంటికి రెప్పలా కాపాడుకుంటే కోలుకుంది. అప్పటి నుంచి చిట్టే నా ప్రాణంగా మారిపోయింది. – సుధీర్, పెద్ద కాపు వీధి, తిరుపతి ప్రేమకు ప్రతిరూపమే ‘బ్రౌని’ లాసిక్ జాతికి చెందిన 4 నెలల బ్రౌని మా కుటుంబానికి ఒక వెలుగు లాంటిది. మాతో ఎం తో అన్నోన్యంగా ఉంటూ, ప్రే మానురాగాలను చూపిస్తుం టుం ది. ఒక వేళ మేము బ్రౌనిని వదిలి ఎక్కడికైనా బయటకు వెళుతున్నామంటే ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ అలుగుతుంది. బయటకు వెళ్లి ఇంటికి వచ్చామంటే పైకి ఎగబడుతూ ప్రేమను చూపిస్తుంది. ఆ సమయంలో రక్తబంధం కంటే ఎక్కువగా బ్రౌనిపై ఆత్మీయతను చూపిస్తాం. బ్రౌనీ అంటే అంతటి అభిమానం. – మాధవి, ఎస్వీ నగర్, తిరుపతి వేసవిలో ‘ పెట్ ’ జాగ్రత్త సుమా... వాతావరణంలో ఉష్ణోగ్రతలు మారే కొద్దీ ఇళ్లలోని పెంపు డు జంతువుల ఆరోగ్యంపై యజమానులు దృష్టి సారిం చాలి. ప్రధానంగా వేసవిలో వడదెబ్బ నుంచి మూగ జీవులను కాపాడుకోవాలి. చల్లటి నీ రు, ఎలక్ట్రోలైట్, ఉప్పుతో మజ్జిగ, కొబ్బరి నీళ్లను తర చూ తాగించడం మంచిది. ముఖ్యంగా వేడి ప్రాంతంలో ఉండకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే వడ్డదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. – డాక్టర్ పీ ఈశ్వర ప్రసాద్, అసోసియేట్ డీన్, వెటర్నరీ కళాశాల మూగ జీవాలకు వైద్యం ఎంతో పుణ్యం మూగ జీవాలకు వైద్యం చేయడం ఎంతో పుణ్యంగా భావిస్తాను. కుక్క పాలు కొవ్వులేకుండా పలుచగా ఉంటాయి. తల్లి లేని పిల్లలకు కొవ్వు శాతం తక్కువగా ఉన్న పాలను మాత్రమే తాగించాలి. తద్వారా కుక్క పిల్లలకు జీర్ణం బాగా అవడంతో పాటు ఆరోగ్యంగా పెరుగుతుంది. చాలా మందికి కుక్కలకు పెరుగన్నం పెట్టకూడదన్న అపోహ ఉంది. అది సరైంది కాదు. 2,3 నెలల వయసు దాటిన కుక్కలకు మాత్రమే పెరుగన్నం తినిపించాల్సి ఉంటుంది. అదికూడా కారం, మసాలాలు ఉన్న ఆహారం పెట్టకుండా, ఉప్పు, పసుపు వేసిన మాంసాన్ని ఉడికించి పెట్టాలి. – డాక్టర్ కామినేని సురేష్, అసోసియేట్ ప్రొఫెసర్, వెటర్నరీ వైద్యశాల -
ఒకప్పుడు చెడ్డవి... ఇప్పుడు అవే మంచివి!
తిండి గోల ఒకప్పుడు ఆ పదార్థాలను కాస్త ప్రతికూలమైనవిగా పరిగణించేవారు. తిన్నా పరిమితి పాటించమంటూ పెద్దలు సుద్దులు చెప్పేవారు. ఆరోగ్యనియమాలు పాటించేవారైతే వాటిని చాలా దూరంగా ఉంచేవారు కూడా. అవే... గుడ్లు, ఆలూ (బంగాళాదుంప). ఇప్పుడు ఆహార నిపుణులంతా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం గుడ్లు, ఆలుగడ్డ (బంగాళదుంప)లను విరివిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకనాడు హెల్త్ పాలిటి విలన్లుగా పరిగణించిన పదార్థాలనే మళ్లీ హీరోలను చేస్తున్నారు. లండన్‌లోని ప్రతిష్ఠాత్మకమైన కింగ్స్ కాలేజ్‌లో స్కాట్ హెర్డింగ్ అనే నిపుణుడు ‘ద కన్వర్సేషన్’ అనే జర్నల్ కోసం రాసిన పరిశోధన పత్రంలోని ముఖ్య అంశాలపై ప్రసంగించారు. అందులోని కొన్ని ప్రధానాంశాలివి... ఒకప్పుడు ఒక గుడ్డులో కనీసం 185 ఎంజీ కొలెస్ట్రాల్ ఉంటుందనీ, గుండెకు అదెంతో కీడు అని చెప్పేవారు. అయితే గత 20 ఏళ్ల వ్యవధిలో జరిగిన వైద్యపరిశోధనల ప్రకారం క్రమం తప్పకుండా గుడ్లు తినేవారి కొలెస్ట్రాల్ పాళ్లు క్రమబద్ధంగా ఉంటాయని పేర్కొంటున్నారట. గుడ్లు తినకపోవడం వల్ల కోల్పోయే మినరల్స్, విటమిన్స్ ఎక్కువన్నది పరిశోధకుల తాజా మాట. ఆలుగడ్డ (బంగాళదుంప)లను చాలా అనారోగ్యకరమైనవిగా ఇటీవలి వరకూ పరిగణిస్తూ వస్తున్నారు. వాటిలో చక్కెరను పెంచే గుణం ఉన్నందున వాటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఆహార పదార్థాలుగా చెబుతూ వీలైనంత తక్కువగా వాడాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే వాటిల్లో కార్బోహైడ్రేట్లతో పాటు, విటమిన్-సి, కొన్ని రకాల విటమిన్-బిలు, కొన్ని ఖనిజాలూ ఉన్నాయనీ, ఆరోగ్యానికి అవి అవసరమంటూ ఇప్పుడు ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. పైగా ఆలుగడ్డలను మనం ఎలా వండుకుంటామన్న అంశమే అనారోగ్యకరం తప్ప అవి అనారోగ్య కారకాలు కావంటూ ఆహార నిపుణులు కితాబిస్తున్నారు. మన జీర్ణవ్యవస్థలో నివాసం ఉండే మనకు మేలు చేసే బ్యాక్టీరియా విషయంలోనూ బంగాళదుంపతో సానుకూలం ప్రభావం ఉంటుందంటున్నారు స్కాట్ హెర్డింగ్. -
పిల్లల ఆరోగ్యం కోసం... ఈ జాగ్రత్తలు!
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ మా బాబు వయసు పన్నెండేళ్లు. ఇటీవల వాడు పిజ్జా, బర్గర్లను మాత్రమే ఇష్టపడుతున్నాడు. వాడి బరువు క్రమంగా పెరగడంతో పాటు ఊబకాయంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. వాడి విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి. - నళిని, కందుకూరు ఈమధ్య ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి డాక్టర్ల నుంచి ప్రజలకు ఎన్నో సూచనలు పత్రికలూ, టీవీల వంటి వాటి ద్వారా అందుతూ ఉన్నాయి. కానీ ఇంకా చాలా మంది అంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటి ఆరోగ్య నియమాలను పాటించడం లేదు. దాంతో పిల్లల మీద, వాళ్ల భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పిల్లలు టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. వ్యాయామాలు, ఆటల వంటి కార్యకలాపాలపై ఎక్కువ సమయం వెచ్చించడం లేదు. కౌమార బాలబాలికలు ఆహార నియమాలు సరిగా పాటించకపోగా... అనారోగ్యకరమైనవీ, పోషకాలు సరిగా లేనివి అయిన ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. దాంతో ఒబేసిటీ, ఆస్తమా వంటి శారీరక రుగ్మతలతో పాటు వాళ్ల వికాసం, మానసిక ఆరోగ్యంపై కూడా దుష్ర్పభావం పడుతోంది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపుకంటే ఎక్కువగా పిల్లలు దీర్ఘకాలికమైన వ్యాధుల బారిన పడుతున్నట్లు పన్నెండేళ్ల పాటు జరిగిన అధ్యయనంలో తెలుస్తోంది. 2003లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పిల్లలు 12.8 శాతం ఉండగా... 2015 నాటికి వారి సంఖ్య 26.6 శాతానికి పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇలా పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల పిల్లలు భవిష్యత్తులో స్థూలకాయం, హైబీపీ, హైకొలెస్ట్రాల్, టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు తీసుకోకపోవడం ద్వారా పిల్లలను పైన పేర్కొన్న లైఫ్‌స్టైల్ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. మీరు మీ పిల్లలకు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు ఎక్కువగా తినేలా చూడండి. తాజా పండ్లు ఎక్కువగా అందేలా జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వెళ్లి ఆటలు ఎక్కువ ఆడేలా ప్రోత్సహించండి. టెలివిజన్, కంప్యూటర్, మొబైల్, ఐపాడ్ వంటి వాటితో ఎక్కువగా ఆడనివ్వకండి. రోజూ ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేలా చూడండి. బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండే పానీయాలను చాలా పరిమితంగా అందేలా చూడండి. ఇవి మీ బాబు విషయంలో తప్పక అనుసరించాల్సిన జాగ్రత్తలు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. నాకు కాళ్లు పాదాల నుంచి మోకాళ్ల వరకు తిమ్మిర్లుగా ఉంటున్నాయి. నేను నాలుగు నెలలుగా ఈ సమస్యతో బాధపడుతున్నాను. కింద కూర్చొని టక్కున పైకి లేవలేకపోతున్నాను. చేతులు కూడా బలహీనమైపోతున్నాయి. ఎన్ని మందులు వాడినా రోజురోజుకీ బలం తగ్గిపోతోంది. చేతులు, కాళ్లు సన్నబడిపోతున్నాయి. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పగలరు. - రమేశ్, నిడదవోలు మీకు షుగర్, హైబీపీ వంటివి ఉన్నాయా లేదా అన్నది మీ ఉత్తరంలో తెలపలేదు. షుగరు వ్యాధి ఉన్నవారిలో కూడా మీరు చెబుతున్న లక్షణాలు ఉండవచ్చు. షుగరు లేదంటే మీకు క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలీ న్యూరోపతీ (సీఐడీపీ) అనే జబ్బుతో బాధపడుతుండవచ్చు. నరం మీద ఉండే పైతొడుగు ఊడిపోవడం వల్ల ఈ జబ్బు వస్తుంది. ఇది వచ్చిన వాళ్లకు కాళ్లు, చేతులతో తిమ్మిర్లు ఉండటం, నడుస్తున్నప్పుడు పాదాలకు స్పర్శ తెలియకపోవడం, కళ్లు మూసుకుంటే కింద పడిపోవడం, కింద కూర్చొని పైకి లేవలేకపోవడం, చేతులలోని బరువైన వస్తువులను తలపైకి ఎత్తలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నర్వ్ కండక్షన్ స్టడీ అనే పరీక్ష ద్వారా ఈ జబ్బు ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. కొన్ని రక్తపరీక్షల ద్వారా ఏ కారణం వల్ల ఇలా నరాలు దెబ్బతిన్నాయన్న విషయం తెలుసుకోవచ్చు. స్టెరాయిడ్ ఇంజెక్షన్, ప్లాస్మా పెరిసిసి, ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజక్షన్స్ ద్వారా ఈ జబ్బును తగ్గించవచ్చు. అయితే ఆ తర్వాత కూడా కొన్ని నెలల నుంచి, సంవత్సరా పాటు టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ జబ్బును దాదాపు నయం చేయవచ్చు. మీరు కొన్ని నెలల నుంచి ఈ జబ్బుతో బాధపడుతున్నారని చెబుతున్నారు కాబట్టి వీలైనంత త్వరగా న్యూరాలజిస్ట్‌కు చూపించి, అవసరమైన పరీక్షలు చేయించుకొని, తగిన చికిత్స తీసుకుంటే ఇది నయమయ్యే అవకాశాలు ఎక్కువ. మా అబ్బాయికి పదేళ్లు. ఆరో ఏడాది నుంచి నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు. కూర్చొని పైకి లేవలేకపోతున్నాడు. కాళ్ల పిక్కలు లావయ్యాయి. మా అబ్బాయికి జబ్బు నయమయ్యే అవకాశం ఉందా? నాది, మా ఆయనది చాలా దగ్గరి సంబంధం. మేనరికం వల్ల ఈ జబ్బు వచ్చిందంటున్నారు. నిజమేనా? - సుశాంతి, నకిరేకల్లు మీ అబ్బాయి డీఎమ్డీ అనే జబ్బుతో బాధపడుతున్నాడు. మేనరికం వంటి దగ్గరి సంబంధాలలో పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల, జన్యుపరమైన కారణాలతో ఈ జబ్బు వచ్చిందన్న మాట వాస్తవమే. ఇది చిన్నవయసులోనే ప్రారంభమై, పిల్లలకు పదిహేనేళ్లు వచ్చేసరికి పూర్తిగా బలహీనమయ్యేలా చేస్తుంది. దీనికి సరైన మందులంటూ ఏవీ లేవు. ఈ జబ్బు తీవ్రతను స్టెరాయిడ్స్ వల్ల తగ్గించవచ్చు. అయితే వాటిన సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువ. ఫిజియోథెరపీ ద్వారా కండరాలు బలహీనం కాకుండా చేయవచ్చు. ఒకసారి వచ్చాక జబ్బును తగ్గించడం సాధ్యం కాదు. మీరు అధైర్యపడకుండా ఒకసారి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. నా కుడిచెంప మీద మూడువారాల క్రితం ఒక మొటిమ వచ్చింది. దాన్ని గట్టిగా నొక్కాను. అప్పట్నుంచి దాని పరిమాణం పెరిగి నల్ల మచ్చలా మారింది. చాలా అసహ్యంగా కనిపిస్తోంది. నాకు తగిన చికిత్స సూచించండి. - నవీన్, అనంతపురం మీరు చెప్పిన లక్షణాలను బట్టి అది ‘యాక్నే వల్గారిస్’అలా అనిపిస్తోంది. దాన్ని గిల్లకండి. అలా చేస్తే ఇన్ఫెక్షన్ మరింత పెరుగుతుంది. మీరు కొన్నిరోజులు అజిథ్రోమైసిన్ 500 ఎంజీ వంటి యాంటీబయాటిక్ మాత్రలను మూడురోజులకు ఒకసారి చొప్పున మూడు వారాల పాటు వాడాలి. మీరు క్లిండామైసిన్, అడాపలీన్ కాంబినేషన్ ఉండే జెల్‌ను రోజూ రాత్రివేళ మొటిమపై రాయండి. ఎస్పీఎఫ్ 40 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్‌లోషన్‌ను ప్రతి మూడు గంటలకోసారి చొప్పున ప్రతిరోజూ ముఖంపై రాసుకోండి. నేను గత కొన్నేళ్లుగా కళ్లజోడు వాడుతున్నాను. అది ఆనుకునే చోట ముక్కు ఇరువైపులా నల్లటి మచ్చలు వచ్చాయి. కొన్ని క్రీములు కూడా వాడి చూశాను. అయినా ఎలాంటి ఫలితం లేదు. ముక్కుకు ఇరువైపుల ఉన్న ఈ మచ్చలు తగ్గిపోయే మార్గం చెప్పండి. - ధరణి, విశాఖపట్నం కళ్లజోడును ఎప్పుడూ తీయకుండా, నిత్యం వాడేవారికి, ముక్కుపై అది రాసుకోపోవడం (ఫ్రిక్షన్) వల్లఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అక్కడి చర్మంలో రంగుమార్చే కణాలు ఉత్పత్తి (పిగ్మెంటేషన్) జరిగి, ఇలా నల్లబారడం మామూలే. కొన్నిసార్లు అలా నల్లబడ్డ చోట దురద కూడా రావచ్చు. మీ సమస్య తొలగడానికి ఈ కింది సూచనలు పాటించండి. మీకు వీలైతే కళ్లజోడుకు బదులు కాంటాక్ట్ లెన్స్ వాడండి కోజిక్ యాసిడ్, లికోరిస్, నికోటినెమైడ్ ఉన్న క్రీమును మచ్చ ఉన్న ప్రాంతంలో రాయండి అప్పటికీ ఫలితం కనిపించకపోతే మీకు దగ్గర్లోని డెర్మటాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డెర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి హైదరాబాద్