నేస్తాలు
పెరుగుతున్న పెట్ సంస్కృతి
మూగ జీవాలను అక్కున చేర్చుకుంటున్న ప్రజలు
విశ్వాసపాత్రమైన జంతువుల్లో కుక్క ప్రధానం. శునకం ఇంటి యజమానికి విశ్వాసంగా, నమ్మకంగా, అతి సన్నిహితంగా కుటుంబంలో ఓ సభ్యునిలా ఉంటూ ఇంట్లో అందరి ఆదరాభిమానాలు చూరగొంటోంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కుక్కల పెంపకాన్ని ఇష్టపడతారు. అయితే ఒకప్పుడు సంపన్న హోదాకు చిహ్నంగా అతి కొద్ది మంది ధనికులు మాత్రమే తమ ఇళ్లలో శునకాలను పెంచుకునేవారు. మారిన పరిస్థితుల్లో నేడు మధ్యతరగతితోపాటు సామాన్యులు సైతం కుక్కలను పెంచుకుంటున్నారు. సమాజంలో నేడు వీటి పోషణ సాధారణంగా మారింది. ఆ మూగ జీవుల యజమానులు వాటి ఆరోగ్యం కాపాడుకోవడానికి తిరుపతి గంగమ్మగుడి సమీపంలోని పశువైద్యశాలను సంప్రదిస్తున్నారు. అక్కడ వైద్యులు సైతం వాటికి సేవలు అందిస్తున్నారు.
తిరుపతి మెడికల్: జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె తదితర నగరాల్లో గత కొంతకాలంగా పెంపుడు జంతువుల పెంపకం సంస్కృతి పెరుగుతోంది. మానవతావాదులు మూగ జీవాలను కన్నబిడ్డలా పోషిస్తున్నారు. వీటిలో ప్రధానమైనవి కుక్కలే. నగరాల్లో పెరుగుతున్న ‘పెట్’ సంస్కృతి రోజు రోజుకూ పెరుగుతోంది. పెంపుడు జంతువుల (పెట్)ను పెంచుకోవడం గొప్ప కాదు. వాటిని సరైన పద్ధతిలో ఒక క్రమశిక్షణతో ఆ రోగ్యంగా పెంచితే వాటితో పాటు ఆ యజ మాని కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నగరంలోని పలువురు సంపన్నులు అరుదైన జాతులకు చెందిన కుక్క పిల్లలను పెంచుకుంటున్నారు. అలాంటి వారు వాటి పెంపకంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆరోగ్య నియమాలు తప్పనిసరి
ఒక కుక్క పిల్లను పుట్టినప్పటి నుంచి పెంచుకుంటుంటే దానికి 15 రోజుల వయసు రాగానే పురుగుల నివారణ మందు తాగించాలి. ఆరు నెలల పాటు నెలకోసారి విధిగా తాగించాలి. అది కూడా కుక్క బరువు ఆధారంగా సంబంధి త డాక్టర్‌ను సంప్రదించిన తరువాతే తాపాలి. పుట్టిన 45 రోజులకు రక్త బేదులు, దగ్గు, జలుబు, నరాల బలహీనత వంటి వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి. ఆపై అదే టీకాలను 3 నుంచి 4 వారాల తరువాత, మరోసారి 3 నెలల వయసులో వేయించాలి. కుక్కకు 2 సంవత్సరాల నుంచి బతికున్నంత వరకు క్రమం తప్పకుండా టీకాలు వేయించా ల్సి ఉంటుంది. పెంపుడు కుక్కను ఏదైనా వీధి కుక్క కరిస్తే నిర్లక్ష్యంగా చేయకూడదు. ముందుగా గాయం వద్ద సోపుతో శుభ్రంగా కడగాలి. ఆపై 24 గంటల్లోగా దగ్గరలోని సంబంధి త పశువైద్యుని వద్ద వైద్యం చేయించాలి. తొలిరోజు నుంచి 3, 7, 14, 28 ఐదు సార్లు టీకాలు వేయించడం ఉత్తమం.
ఆహార నియమమూ అవసరమే
చాలా మంది మైదాపిండితో చేసిన బిస్కెట్లను కుక్కలకు పెడుతుంటారు. అది ప్రమాదమే అంటున్నారు వైద్యులు. బి స్కెట్ల వల్ల ఆకలి మందగించడంతోపాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బిస్కెట్ల బదులు డ్రైఫుడ్ (పెల్లెట్స్), చూస్‌టిక్స్‌లను తినిపిస్తే ఆరోగ్యంతో పాటు దంత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే చాలా మంది కుక్కలకు లై ఫ్ బాయ్ లాంటి కార్బొటిక్ యాసిడ్ వంటివి వాడుతుం టా రు అలాంటివి వాడకూడదు. కుక్కలకు సంబంధించిన ప్ర త్యేకమైన సోపును వాడాలి. అలాగే మనుషులు వాడే షాం పులు కాకుండా, కుక్కల షాంపును మాత్రమే ఉపయోగించా లి. బొచ్చు కుక్కలకు రోజూ రెండు సార్లు దువ్వెనతో దువ్వా లి. తద్వారా శరీరంలో రక్తప్రసరణ సాఫీగా ఉంటుంది.
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మనం ఎంతో ముచ్చటగా పెంచుకునే కుక్కలకు మనకు తెలియకుండానే వ్యాధుల బారిన పడతాయి. అయితే ముం దుగానే ఆ వ్యాధి లక్షణాలను పసిగట్టి వైద్యుడికి చూపిస్తే మొదటిలోనే ఆ వ్యాధిని నయం చేయవచ్చు. ప్రధానంగా వచ్చే వ్యాధులలో జీర్ణకోశ వ్యాధి, చర్మ వ్యాధి, పాల్‌కోడి, హెపటైటిస్, లెప్టోస్పైరా, రేబీస్‌తో పాటు శ్వాస కోశ వ్యాధులు వస్తుంటాయి. ముందస్తుగా టీకాలు, వైద్య సేవలు అందిస్తే జబ్బులకు చెక్‌ప్టెచ్చు.
మా ‘చిట్టి’కి పెద్ద కథే ఉంది
మాకు చిట్టి(కుక్కపేరు) రో డ్డుపై దొరికిన అపురూపం. ఎందుకం టే దానికి ఓ కథ ఉంది. చిట్టి త ల్లి (వీధికుక్క)కి మొత్తం ఐదు పి ల్లులు. చిట్టికి నెల వయసులో తల్లి తో పాటు మిగిలిన నాలుగు పిల్లలు చనిపోవడంతో చిట్టి ఒంటరైంది. దీన్ని వీధి కుక్కలు కర వడంతో చనిపోయిందని కుప్పతొట్టిలో పడేశారు. ఈ దృ శ్యం నన్ను కలచివేసింది. వెళ్లి చూడగా బతికే ఉంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే బతకదన్నారు. ఎలాగోలా ఆపరేషన్ చేశారు. ఇంటికి తీసుకెళ్లి 2 నెలలు కంటికి రెప్పలా కాపాడుకుంటే కోలుకుంది. అప్పటి నుంచి చిట్టే నా ప్రాణంగా మారిపోయింది. – సుధీర్, పెద్ద కాపు వీధి, తిరుపతి
ప్రేమకు ప్రతిరూపమే ‘బ్రౌని’
లాసిక్ జాతికి చెందిన 4 నెలల బ్రౌని మా కుటుంబానికి ఒక వెలుగు లాంటిది. మాతో ఎం తో అన్నోన్యంగా ఉంటూ, ప్రే మానురాగాలను చూపిస్తుం టుం ది. ఒక వేళ మేము బ్రౌనిని వదిలి ఎక్కడికైనా బయటకు వెళుతున్నామంటే ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ అలుగుతుంది. బయటకు వెళ్లి ఇంటికి వచ్చామంటే పైకి ఎగబడుతూ ప్రేమను చూపిస్తుంది. ఆ సమయంలో రక్తబంధం కంటే ఎక్కువగా బ్రౌనిపై ఆత్మీయతను చూపిస్తాం. బ్రౌనీ అంటే అంతటి అభిమానం.
– మాధవి, ఎస్వీ నగర్, తిరుపతి
వేసవిలో ‘ పెట్ ’ జాగ్రత్త సుమా...
వాతావరణంలో ఉష్ణోగ్రతలు మారే కొద్దీ ఇళ్లలోని పెంపు డు జంతువుల ఆరోగ్యంపై యజమానులు దృష్టి సారిం చాలి. ప్రధానంగా వేసవిలో వడదెబ్బ నుంచి మూగ జీవులను కాపాడుకోవాలి. చల్లటి నీ రు, ఎలక్ట్రోలైట్, ఉప్పుతో మజ్జిగ, కొబ్బరి నీళ్లను తర చూ తాగించడం మంచిది. ముఖ్యంగా వేడి ప్రాంతంలో ఉండకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే వడ్డదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ పీ ఈశ్వర ప్రసాద్, అసోసియేట్ డీన్, వెటర్నరీ కళాశాల
మూగ జీవాలకు వైద్యం ఎంతో పుణ్యం
మూగ జీవాలకు వైద్యం చేయడం ఎంతో పుణ్యంగా భావిస్తాను. కుక్క పాలు కొవ్వులేకుండా పలుచగా ఉంటాయి. తల్లి లేని పిల్లలకు కొవ్వు శాతం తక్కువగా ఉన్న పాలను మాత్రమే తాగించాలి. తద్వారా కుక్క పిల్లలకు జీర్ణం బాగా అవడంతో పాటు ఆరోగ్యంగా పెరుగుతుంది. చాలా మందికి కుక్కలకు పెరుగన్నం పెట్టకూడదన్న అపోహ ఉంది. అది సరైంది కాదు. 2,3 నెలల వయసు దాటిన కుక్కలకు మాత్రమే పెరుగన్నం తినిపించాల్సి ఉంటుంది. అదికూడా కారం, మసాలాలు ఉన్న ఆహారం పెట్టకుండా, ఉప్పు, పసుపు వేసిన మాంసాన్ని ఉడికించి పెట్టాలి. – డాక్టర్ కామినేని సురేష్, అసోసియేట్ ప్రొఫెసర్, వెటర్నరీ వైద్యశాల