Heart disease prevention
-
నడకతో గుండె పదిలం..!
వాషింగ్టన్ : ప్రతిరోజూ ఉదయం లేవగానే కాస్త అటూ ఇటూ నడిస్తే మీ గుండెకు వచ్చే ముప్పు తగ్గుతుందని మరోసారి తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోజుకి 6 వేల నుంచి 9 వేల అడుగులు వేసే వారిలో గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం సగానికి సగం తగ్గిపోతోందని ఆ అధ్యయనం తెలిపింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన జర్నల్ సర్క్యులేషన్ తాజా అధ్యయనం వివరాలను ప్రచురించింది..ఆ అధ్యయనం ప్రకారం రోజుకి 9 వేల అడుగులు నడిచే వారిలో గుండె వ్యాధులు వచ్చే ముప్పు 40–50 శాతం తగ్గిపోతుంది. మధ్య వయస్కులు రోజుకి 6 వేల నుంచి 9 వేల అడుగులు నడిస్తే గుండె సంబంధిత వ్యాధులు సోకే అవకాశం 50% తగ్గిపోతుంది. ఇక 60 ఏళ్ల వయసు పైబడిన వారు ఎంత ఎక్కువ నడిస్తే వారి గుండెకు అంత మంచిది. యుక్త వయసులో ఉన్న వారి గుండె ఆరోగ్యానికి, వారి నడకకు ఎలాంటి సంబంధమూ లేదు. నడకకి, గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న లింకుపై ఇప్పటివరకు జరిగిన ఎనిమిది అధ్యయనాల ఫలితాల్ని క్రోడీకరించి తాజా అధ్యయనాన్ని రూపొందించారు. 18 ఏళ్లకు పైబడిన వయసున్న వారు 20,152 మంది ఇందులో పాల్గొన్నారు. ఆరేళ్లపాటు వారి స్మార్ట్ వాచ్‌లు, ఫోన్ల్లో రికార్డయిన వివరాల ద్వారా తాజా అధ్యయనాన్ని రూపొందించారు. -
వాల్‌నట్స్‌తో హృద్రోగాలు, క్యాన్సర్‌కు చెక్
లండన్ : రోజూ గుప్పెడు వాల్‌నట్స్‌తో హృద్రోగాలతో పాటు పేగు క్యాన్సర్‌ను నివారించవచ్చని తాజా అథ్యయనం పేర్కొంది. ఆరు వారాల పాటు రోజూ మూడోవంతు కప్పు వాల్నట్స్ తీసుకుంటే చెడు కొలెస్ర్టాల్ తగ్గడంతో పాటు ప్రమాదకర ఆమ్లాలు పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయని అథ్యయనం తేల్చింది. ఈ తరహా ఆమ్లాలు పేగు క్యాన్సర్‌కు దారితీస్తాయని గత పరిశోధనలు పేర్కొన్న క్రమంలో ఆ ముప్పును కూడా వాల్నట్స్ తగ్గిస్తాయని పేర్కొంది. కొవ్వుశాతాన్ని కరిగించడంతో హృద్రోగాల ముప్పు తగ్గుతుందని పరిశోధకులు విశ్లేషించారు. అధిక ఫైబర్ కలిగి ఉండే వాల్‌నట్స్‌తో కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని, ఇది గుండె, జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా నిర్వహిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. వాల్‌నట్స్‌లో క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ఇవి దోహదపడతాయని శాస్త్రవేత్తలు సైతం గుర్తించారు. ఇక వాల్‌నట్స్‌లో ప్రమాదకర ఆమ్లాలు శరీరంలో పేరుకుపోవడాన్ని నియంత్రించే గుణం ఉండటంతో పేగు క్యాన్సర్‌ను నివారిస్తాయని అథ్యయన రచయిత, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్కు చెందిన ప్రొఫెసర్ హన్నా హల్చర్ చెప్పారు. -
గుండెజబ్బుల నివారణకోసం...
ఆయుర్వేద కౌన్సెలింగ్ ఆయుర్వేద మార్గంలో గుండె జబ్బుల నివారణ ఎలాగో సూచించగలరు. - సంకా పవన్‌కుమార్, తెనాలి ఆయుర్వేద శాస్త్ర ప్రాథమిక సిద్ధాంతాలలో శరీర నిర్మాణం, శరీర క్రియ అత్యంత ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. వివిధ అంగప్రత్యంగాలను విశదీకరించడంలో సుశ్రుతాచార్యులు అగ్రగామి. హృదయం ఆకారాన్ని ‘అధోముఖపుండరీకం’ (తామరపువ్వుని తలకిందులుగా చేస్తే కనపడే రూపం)తో పోల్చిచెప్పాడు. సంస్కృత శబ్ద నిరుక్తుల విశిష్టత ప్రకారం ‘హృ’ అంటే పుచ్చుకునేది (రక్తాన్ని) ‘ద’ అంటే ఇచ్చేది (రక్తాసరఫరా), ‘య’ అంటే నిలిపేది (రక్తాగారం). ఆ విధంగా ఆ భాగం క్రియావిశేషం ద్యోతకమవుతోంది. ఆయుర్వేద పరిభాషలో ‘మర్మ’ అంటే అత్యంత కీలకమైన ప్రాంతం అని అర్థం. చరకాచార్యులవారు ‘త్రిమర్మలు’ వివరించారు. అవి ‘శిరస్సు, హృదయం, వస్తి’ (మూత్రాశయం). ఆ విధంగా గుండెకు ఎంతో ప్రాధాన్యముంది. గుండెకండరం పోషణ కోసం రక్తం కావాలి. అది, గుండె సంకోచించినప్పుడు, మొదటి శాఖ అయిన ‘కరొనరీ’ ధమని ద్వారా చేరవలసిందే. గుండె పొరలు, కవాటాలు, నాడులు, సిరాధమనుల కార్యక్రమం చక్కగా ఉండటానికి ‘రస’ధాతువు ఉపకరిస్తుంది. దీని ద్వారా పోషకాలు, అంబరపీయూషం (ఆక్సిజన్) అందుతాయి. అలాంటి సరధాతువు ‘సారం’ మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. గుండెజబ్బుల నివారణకు ఈ కింద సూచించిన ఆహార, విహారాలు, ఔషధాలు అత్యంత ప్రధానమైనవి. ఆహారం : సాత్వికాహారమైన శాకాహారం మంచిది. ఉప్పు, పులుపు, కారాలు చాలా మితంగా తినాలి. తగినంత ద్రవాహారం (కొబ్బరినీళ్లు, చెరకురసం, బార్లీ జావ మొదలైనవి) సేవించాలి. మొలకలు, ఆకుకూరలు, ఇతర కందమూలాలు, తాజాపండ్లు, శుష్కఫలాలు అనునిత్యం తగుప్రమాణంలో తినాలి. అప్పుడే సమీకృత పోషకాలు లభిస్తాయి. పెరుగు, పాలు, వెన్న, నెయ్యి, మజ్జిగలు ‘ఆవు’ నుంచి లభించేవి చాలా బలకరం. పిండిపదార్థాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే బయటి పదార్థాల జోలికి వెళ్లకండి. విహారం : రాత్రి నిద్ర కనీసం ఎనిమిది గంటలుండాలి. వయసు, వృత్తిని బట్టి తగురీతిని వ్యాయామం చేయాలి. పొగతాగడం, మద్యపానాల వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. మానసిక ఉల్లాసం, ప్రశాంతత, సానుకూల ఆశావహ దృక్పథం చాలా అవసరం. శోక చింతా భయ రాగ ద్వేషాలకు దూరంగా ఉండాలి. ఔషధాలు : నిత్య దైనందిన కార్యక్రమాలలో భాగంగా సూర్యదర్శనం చేసుకోవాలి. లేత సూర్యకిరణాల వల్ల మనకెంతో ఆరోగ్యమని శాస్త్రం చెప్పింది. రోజూ ఐదు తులసి ఆకులు నమిలి మింగాలి. దీనికి రక్తం గడ్డకట్టకుండా ఉంచే శక్తి ఉంది. క్రిమిహరం, కఫహరం కూడా. సూర్యనమస్కార యోగ క్రియల వల్ల, వ్యాయామం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అల్లం, వెల్లుల్లి కషాయం : 5 చెంచాలు రోజు విడిచి రోజు తాగితే కొలెస్త్రాల్, ఇతర కొవ్వులు రక్తాన్ని పాడుచేయవు. బీపీ ఎక్కువ కాకుండా నివారితమవుతుంది. త్రిఫలా చూర్ణం : ఒక చెంచా ప్రతి రాత్రి నీటితో సేవిస్తే సప్త ధాతువులకు బలం. మహాకోష్ఠం శుద్ధి అవుతుంది. రోజూ విరేచనం సాఫీగా అవుతుంది. అర్జున (తెల్లమద్ది) వృక్షపు కాండం మీది పట్టను (బెరడు) ఎండబెట్టి, చూర్ణం చేసి, ఒక చెంచా చూర్ణాన్ని ఆవుపాలలో మరిగించి, వడగట్టి ప్రతిరోజూ తాగితే గుండె ధమనుల్లో రక్తప్రసరణ బహుచక్కగా ఉండి, గుండె కండరానికి బలం పెంపొంది గుండెజబ్బులు దరిచేరవు. దీన్ని ‘అర్జున క్షీరపాకం’ అంటారు. అత్యవసర పరిస్థితి లేనప్పుడు స్టెంట్స్ వేయించుకున్న వారు దీన్ని ఆరుమాసాలు సేవించి, పరిస్థితిని సమీక్షించుకుంటే చక్కటి మార్పు కనిపిస్తుంది. పుష్కర మూల చూర్ణాన్ని (ఒక చెంచా) నీళ్లతో సేవిస్తే దాదాపు పైన చెప్పిన ఫలితం కనిపిస్తుంది. ఇతర ఔషధాలు : హృదయార్ణవరస (మాత్రలు) నాగార్జునాభ్రరస (మాత్రలు) ప్రభాకరవటి (మాత్రలు) గమనిక : ఈ మందుల గురించి ఆయుర్వేద వైద్యుని సంప్రదించాకే వాడాలి. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
హార్ట్...డైట్... హెల్త్...
గుండెజబ్బుల నివారణ... ఆహారం! ఆధునిక జీవనశైలితో ఇటీవల డయాబెటిస్ ఉండటం, హైబీపీతో బాధపడటం ఎక్కువ. ఇవి వచ్చేయంటే గుండెజబ్బు ఖాయంగా ఉన్నట్లుగా భావించి, డాక్టర్లు ముందునుంచే నివారణ చర్యలు చేపడుతుంటారు. ఆహారంతో వీటిని నివారించడమూ తేలికే. డయాబెటిస్ ఉన్న వాళ్లూ, హైబీపీ ఉన్నవాళ్లు తమ ఆహారంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండెజబ్బులను నివారించవచ్చు. అలాగని కేవలం వాళ్లు మాత్రమే కాదు... ఆరోగ్యవంతులూ వీటిని పాటిస్తే గుండెజబ్బులను చాలా వరకు దూరంగా ఉంచుకోవచ్చు. ♦ మీరు తీసుకునే ఆహారంలో పీచు, కార్బొహైడ్రేట్స్ వంటి పదార్థాలు ఎక్కువగా లభ్యమయ్యేలా చూసుకోండి. ఇందుకోసం జొన్న, మొక్కజొన్న, గోధుమ, దంపుడుబియ్యం, మొలకెత్తిన గింజలు, పళ్లూ, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలైన నెయ్యి, వెన్న, జున్ను, మీగడ వంటి పదార్థాలను బాగా తగ్గించాలి. ♦ తక్కువగా కొవ్వులు ఉండే లో-ఫ్యాట్ పాల ఉత్పాదనలు వాడాలి. ♦ మాంసాహారం తీసుకునేవారు స్కిన్లెస్ చికెన్‌ను తినాలి. వాటిని ఆరోగ్యకరంగా వండాలి. అంటే వేపుళ్లు వంటివి కాకుండా ఉడికించినవి అన్నమాట. ♦ ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే సాల్మన్, హెర్రింగ్ వంటి చేపలను వారంలో కనీసం రెండు సార్లు తినాలి. ♦ ఆహారపదార్థాలు కొనేప్పుడు తక్కువ సోడియమ్ ఉన్నవాటినే చూసి కొనాలి. ♦ తాము ఇప్పటికే ఎక్కువ బరువు ఉన్నామని కొందరు నట్స్ తీసుకోరు. అయితే చాలా అధ్యయనాల ప్రకారం నట్స్‌లో పీచుపదార్థాలు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఎక్కువ. పైగా అవి చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తాయి కూడా. అందుకే పరిమితంగానైనా తీసుకోవాలి. ♦ అవిశెలను (ఫ్లాక్స్ సీడ్స్‌ను) ఆహారంలో తప్పక తీసుకోవాలి. ♦ ఇక తీపి పదార్థాల విషయానికి వస్తే చక్కెర, తేనె, బెల్లం చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ♦ {బెడ్స్, బేకరీ ఫుడ్స్, కార్న్‌ఫ్లేక్స్ వంటి పీచు తక్కువగా ఉండేవి, మైక్రోన్యూట్రియెంట్స్ తక్కువగా ఉండే పదార్థాలను పూర్తిగా తగ్గించాలి. ♦ తాజా కూరగాయల్లో పీచు పదార్థాలు, కొన్ని విటమిన్లు, ఫైటోన్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవాలి. ♦ కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు అనే ఆహార నియమం మంచిది. బెడ్ టైంలో తేలిగ్గా ఉండే ఆరోగ్యకరమైన శ్నాక్స్ తీసుకోవడం ఉత్తమం. వ్యాయామం: చురుగ్గా ఉండటానికీ, షుగర్‌ను అదుపులో ఉంచుకోడానికీ ఎక్సర్సైజ్ బాగా దోహదపడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం అవసరం. అయితే ఇవన్నీ సాధారణ నియమాలు మాత్రమే. ఒక్కొక్కరికీ తమ వ్యక్తిగతమైన అంశాలకు తగినట్లుగా వ్యక్తిగతమైన డైట్ ప్లాన్... అంటే డీటెయిల్డ్ న్యూట్రిషనల్ ప్లాన్ అవసరం. ఒకరు ఎంత బరువున్నారు, వారి దైనందిన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి. వాళ్లలో ప్రస్తుత బ్లడ్ సుగర్ లెవెల్స్ ఏమిటి, చక్కెరను కంట్రోల్ చేయడానికి వారు వాడుతున్న మందులు ఏమిటి... అనేక రకరకాల అంశాల ఆధారంగా ఎవరికైనా చక్కటి డీటెయిల్డ్ న్యూట్రిషన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ‘డ్యాష్’ ఆహార నియమావళి... ♦ అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియువూలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. హైబీపీకి ఇప్పుడు అవుల్లో ఉన్న ఆహార నియువూవళిని ’డ్యాష్’ అంటారు. ‘డయుటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అన్న వూటలకు సంక్షిప్తరూపమే ‘డ్యాష్’. ♦ హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లకు పళ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా ఇవ్వాలి. వాటిలో పొటాషియుమ్ పాళ్లు ఎక్కువ కాబట్టి ఆ ఆహారం తీసుకోవడం ప్రధానం. తాజాపళ్లు, పొట్టు ఉన్న తృణధాన్యాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ♦ అలాగే వాళ్లకు క్యాల్షియుం కూడా అవసరం. ఇందుకోసం వాళ్లు కొవ్వు పాళ్లు (వెన్నపాళ్లు) తక్కువగా ఉన్న పాలూ, పాల ఉత్పాదనలు తీసుకోవాల్సి ఉంటుంది. ♦ ఉప్పు (సోడియుం) పాళ్లను గణనీయంగా తగ్గించాలి. ఉప్పుతో పాటు సోడియుం పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలైన నిల్వ ఆహారం (ప్రిజర్వ్డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. ♦ హై బీపీ ఉంటే దాన్ని నియుంత్రించుకోవడం కోసం జీవన విధానంలోనూ (లైఫ్స్టైల్లో) వూర్పులు విధిగా పాటించాల్సి ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ఆపేయూలి. పొగతాగే అలవాటును పూర్తిగా మానేయాలి. ♦ బరువు పెరగకుండా శారీరక శ్రమ (ఫిజకల్ యూక్టివిటీస్) ఉండేలా చూసుకోవాలి.