Heavy arrangements
-
బోనాలకు ముమ్మర ఏర్పాట్లు
యాకుత్‌పురా: బోనాల పండుగ సందర్భంగా అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఆయన పాతబస్తీలోని ప్రధాన ఆలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా హరిబౌలి శ్రీ బంగారు మైసమ్మ ఆలయం, అక్కన్న మాదన్న మహంకాళి ఆలయాల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం బేలా ముత్యాలమ్మ, గౌలిపురా మహంకాళి, లాల్‌దర్వాజా సింహవాహిణి ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బోనాల పండుగ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లను చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని, ఇందులో భాగంగా రూ.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి ఆలయం, ఢిల్లీలో నిర్వహించిన ఉత్సవాలకు ప్రభుత్వ సహకారం అందించామన్నారు. బోనాల పండుగ, ఘటాల ఊరేగింపు రోజున ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 30, 31, ఆగస్టు 1వ తేదీల్లో మంచినీటిని సరఫరా చేయాలని జలమండలిని ఆదేశించినట్లు తెలిపారు. దమయంతి తివారీ టవర్స్, నయాపూల్ వద్ద్ద త్రీ డీ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. బందోబస్తులో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోనాల ఉత్సవాలపై ప్రతి సినిమా థియేటర్లో మూడు నిమిషాల పాటు ప్రసారాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి,అదనపు డీసీపీ బాబురావు, జలమండలి, ట్రాన్స్‌కో, ఆర్అండ్బి, సాంసృ్కతిక శాఖ, రెవెన్యూ తదితర విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. సింహవాహిణికి 70 తులాల రజత హారం చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి అమ్మవారికి హనుమాన్ చారి అనే స్వర్ణకారుడు 70 తులాల వెండి పూల దండను కానుకగా సమర్పించారు. హనుమాన్ చారి 45రోజుల పాటు స్వయంగా ఈ పూలదండను తయారు చేశాడు. బుధవారం ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారికి అలంకరించారు. గతేడాది అమ్మవారికి సమర్పించిన బంగారు కిరీటాన్ని తయారు చేసింది హనుమాన్ చారి కావడం విశేషం. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నర్సింహయ్య శర్మ, కార్తీకేయ శర్మ ఆయనను ఘనంగా సన్మానించారు. 29న 1100 మంది మహిళలచే మహా కుంకుమార్చన. బోనాల ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 29న ఆలయంలో 1100 మంది మహిళా భక్తులతో మహా కుంకుమార్చన నిర్వహించనున్నట్లు ఆల య కమిటీ అధ్యక్షుడు సి.రాజ్‌కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు విడతల వారీగా కుంకుమార్చన చేస్తారన్నారు. కార్యక్రమానికి మహిళా భక్తులు తరలిరావాలని కోరారు. అదే రోజు అమ్మవారికి ఢిల్లీ మిఠాయి వాటిక ఆధ్వర్యంలో చప్పన్‌బోగ్ (56రకాల మిఠాయిలు) నైవేద్యాన్ని సమర్పించనున్నామన్నారు. -
బ్రహ్మాండ నాయకునికి రెండు బ్రహ్మోత్సవాలు
-
బ్రహ్మాండ నాయకునికి రెండు బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుమల: ఈ ఏడాది అధిక మాసం సందర్భంగా తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 16 నుంచి 24వ తేదీ వరకు వార్షిక, అక్టోబర్ 14 నుంచి 22వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా భారీ ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. టీటీడీ ఈవో డి.సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్వో నాగేంద్రకుమార్, చీఫ్ ఇంజనీరు చంద్రశేఖరరెడ్డి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఆ మేరకు శుక్రవారం నుంచి ఆలయం వద్ద బ్యారికేడ్ల నిర్మాణం పనులు ప్రారంభించారు. రాజమండ్రి పుష్కర స్నానాల్లో చోటుచేసుకున్న విషాదకర సంఘటనను దృష్టిలో ఉంచుకుని తిరుమల బ్రహ్మోత్సవాల్లో పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. వాహన సేవలు ఊరేగే ఆలయ వీధుల్లో చేపట్టే బ్యారికేడ్ల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో అన్ని రకాల ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేశారు. -
పుష్కరాలకు 75 బస్సులు
నల్లగొండ గోదావరి పుష్కరాలకు ఆర్టీసీ నల్లగొండ రీజియన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం నుంచి 25 తేదీ వరకు జరగనున్న పుష్కరాలకు జిల్లోలోని ఆరు డిపోల నుంచి 75 బస్సులు నడపాలని నిర్ణయించింది. 2003లో జరిగిన పుష్కరాలకు రీజియన్ నుంచి 30 బస్సులు ఆపరేట్ చేశారు. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరుగుతున్న పుష్కరాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే వేలాది మంది భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ప్రత్యేక బస్సులు నడపనున్నారు. భద్రాచలం, కాళేశ్వరం వరకు బస్సుల రాకపోకలు ఏడు డిపోల నుంచి 75 బస్సులు భద్రాచలం, కాళేశ్వరం వరకు బస్సులు రాకపోకలు సాగిస్తాయి. అయితే పుష్కరాలు ప్రారంభమయ్యే ముందు మూడు రోజులు... చివరి మూడు రోజుల్లో భక్తులు ఎక్కువ మంది తరలివెళ్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని 17,18,19,23,24,25 తేదీల్లో ప్రత్యేక బస్సులను అవసరాన్ని బట్టి పెంచుతారు. పుష్కరాలు జరిగే 12 రోజుల్లో ప్రయాణికుల రాకపోకలు అంచనా వేస్తూ రోజుకు వంద మంది ప్రయాణికుల చొప్పున 800 ట్రిప్పులు నడపనున్నారు. ఈ పుష్కరాలకు జిల్లా నుంచి 80 వేల మంది భక్తులు తరలివెళ్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరు డిపోల నుంచి ప్రయాణ సౌకర్యాలు రేపటి నుంచి 25 తేదీ వరకు బస్సుల ఆపరేటింగ్ భద్రాచలం, కాళేశ్వరం ఘాట్లకు ప్రత్యేక బస్సులు 80 వేల మంది భక్తులు వెళ్తారని అంచనా ప్రయాణికుల నుంచి రెట్టింపు చార్జీలు వసూలు