నల్లగొండ
గోదావరి పుష్కరాలకు ఆర్టీసీ నల్లగొండ రీజియన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం నుంచి 25 తేదీ వరకు జరగనున్న పుష్కరాలకు జిల్లోలోని ఆరు డిపోల నుంచి 75 బస్సులు నడపాలని నిర్ణయించింది. 2003లో జరిగిన పుష్కరాలకు రీజియన్ నుంచి 30 బస్సులు ఆపరేట్ చేశారు. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరుగుతున్న పుష్కరాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే వేలాది మంది భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
భద్రాచలం, కాళేశ్వరం వరకు బస్సుల రాకపోకలు
ఏడు డిపోల నుంచి 75 బస్సులు భద్రాచలం, కాళేశ్వరం వరకు బస్సులు రాకపోకలు సాగిస్తాయి. అయితే పుష్కరాలు ప్రారంభమయ్యే ముందు మూడు రోజులు... చివరి మూడు రోజుల్లో భక్తులు ఎక్కువ మంది తరలివెళ్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని 17,18,19,23,24,25 తేదీల్లో ప్రత్యేక బస్సులను అవసరాన్ని బట్టి పెంచుతారు. పుష్కరాలు జరిగే 12 రోజుల్లో ప్రయాణికుల రాకపోకలు అంచనా వేస్తూ రోజుకు వంద మంది ప్రయాణికుల చొప్పున 800 ట్రిప్పులు నడపనున్నారు. ఈ పుష్కరాలకు జిల్లా నుంచి 80 వేల మంది భక్తులు తరలివెళ్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆరు డిపోల నుంచి ప్రయాణ సౌకర్యాలు
రేపటి నుంచి 25 తేదీ వరకు
బస్సుల ఆపరేటింగ్
భద్రాచలం, కాళేశ్వరం ఘాట్‌లకు
ప్రత్యేక బస్సులు
80 వేల మంది భక్తులు వెళ్తారని అంచనా
ప్రయాణికుల నుంచి రెట్టింపు చార్జీలు వసూలు
పుష్కరాలకు 75 బస్సులు
Published Mon, Jul 13 2015 1:22 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement