లాడ్ సోదరులకు అమేజింగ్ షాక్
అటవీ భూమిని ఆక్రమించుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు
47.24 ఎకరాల్లో రిసార్ట్ ఏర్పాటు
కోర్టు ఆదేశాలతో వెలుగు చూసిన వాస్తవాలు
భారీ బందోబస్తు మధ్య స్వాధీనం చేసుకున్న అధికారులు
సాక్షి, బళ్లారి : అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల అక్రమాలు బహిర్గతమయ్యాయి. బళ్లారి సిటీ ఎమ్మెల్యే, గనుల యజమాని అనిల్‌లాడ్, కలఘటిగి ఎమ్మెల్యే సంతోష్‌లాడ్ కుటుంబసభ్యులు సండూరు - మురారీపుర మధ్య అటవీ భూమిని ఆక్రమించుకుని ఏర్పాటుచేసిన రిసార్ట్‌ను అధికారులు సీజ్ చేశారు. బళ్లారి జిల్లా సహాయ అటవీ సంరక్షణాధికారి బసవరాజప్ప నేతృత్వంలో భారీ బందోబస్తు మధ్య సండూరు శివారులోని అమేజింగ్ వ్యాలీ రిసార్ట్‌ను అధికారులు గురువారం ఉదయం చేరుకున్నారు. మొత్తం 47.24 ఎకరాల్లో రిసార్ట్ ఏర్పాటు చేసి నెలకు రూ. లక్షల్లోనే గడిస్తున్నట్లు గుర్తించారు. చుట్టూ సుందరమైన కొండలు, పక్కనే నది ఉన్న అటవీ భూమిలో రిసార్ట ఏర్పాటు చేసుకుని, అక్రమార్జనకు తెరలేపారన్న ఫిర్యాదులు అందడంతో విచారణకు
లాడ్ సోదరులకు ‘అమేజింగ్’ షాక్
న్యాయస్థానం ఆదేశించింది. దీంతో వాస్తవాలు బహిర్గతమయ్యాయి. జూలై 30 లోపు రిసార్ట ఖాళీ చేయాలని అదే నెల 10న అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై అనిల్‌లాడ్ కుటుంబసభ్యులు స్పందించకపోవడంతో అధికారిక చర్యలు చేపట్టారు. రిసార్‌టకు చేరుకుని సీజ్ చేశారు. అక్కడ ఆదేశ పత్రాలు అతికించారు.
అనిల్‌లాడ్ అన్న భార్య పేరుపై...
అమేజింగ్ వ్యాలీ రిసార్ట అనిల్‌లాడ్ అన్న భార్య రజనీలాడ్ పేరుపై ఉంది. ఈ రిసార్‌టకు అనుకుని ఉన్న సర్వే నంబర్ 410లో 3.65 ఎకరాల భూమిని అప్పట్లో అనిల్ సోదరుడు అశోక్ లాడ్ కొనుగోలు చేశాడు. 1999-2000లో అప్పటి అసిస్టెంట్ కమిషనర్ నుంచి ఈ భూమిని వ్యవసాయేతర కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు ఎన్ఓ కూడా పొందారు. అనంతరం ఆ భూమి పక్కనే ఉన్న 47.24 ఎకరాల భూమిని ఆక్రమించుకుని విలాసవంతమైన రిసార్ట నిర్మించారు. అశోక్‌లాడ్ మరణానంతరం ఆ రిసార్టను అతని భార్య రజనీ లాడ్ పేరిట బదిలీ చేయించారు. అటవీ భూమి చుట్టు పక్కల వంద మీటర్ల పరిధిలో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు లేకుండా చేశారు.
నిబంధనలు అతిక్రమించి రిసార్ట నిర్మించారంటూ 2012లో హైకోర్టులో బెంగళూరుకు చెందిన ఆర్టీ కార్యకర్త శ్రీనివాస్.... పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అటవీ భూమిని ఖాళీ చేయించాలని ఆదేశించింది. అంతేగాకుండా ఈ కేసును అటవీ శాఖ కోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించింది. ఆ మేరకు ముఖ్య అటవీ సంరక్షణ న్యాయాలయం జూలై 30లోగా రిసార్ట్‌ను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. స్వాధీన ప్రకియలో వలయ అటవీ అధికారి గణేష్, మంజునాథ్, భాస్కర్, సిబ్బంది పాల్గొనగా, వీరికి డీఎస్పీ పీడీ గజకోశ, సీఐ రమేష్ రావ్, ఎస్ఐ షన్ముఖప్ప, సిబ్బంది పాల్గొన్నారు.