Heavy irrigation department
-
మోదీ పుణ్యమా అని ఊడుతున్న ఉద్యోగాలు
భారీ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఆందోళన నారాయణఖేడ్: ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో హైదరాబాద్‌లో ఉద్యోగాలన్నీ పోతున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌లో నూతన మార్కెట్ యార్డు, గోడౌన్లను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. ఇన్నాళ్లూ పనుల కోసం పట్నం బాట పట్టిన వారు మోదీ పుణ్యమా అని పల్లెబాట పడుతున్నారన్నారు. హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణాలన్నీ నిలిచిపోయాయన్నారు. ఏది ఏమైనా గ్రామాల్లో రైతులకు పనులు కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకే వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే చర్యలు సాగుతున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. కోటి ఎకరాల మాగాణి కావాలని, ప్రభుత్వం వ్యవసాయానికి రూ.2,500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల కోసం డీడీలు చెల్లించిన రైతులు ఏఈలను సంప్రదిస్తే వాటిని అందజేస్తారని అన్నారు. ఎవరైనా లంచాలు అడిగితే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని, అలాంటి అధికారిని సస్పెండ్ చేస్తానని మంత్రి హెచ్చరించారు. పక్షం రోజులకోమారు నారాయణఖేడ్ వస్తానని, గెస్ట్‌హౌస్‌లో కుర్చీ వేసుకొని ప్రజల కోసం కూర్చుంటానని తెలిపారు. కాగా, నారాయణ ఖేడ్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ బిడెకన్నె హన్మంతును సన్మానించారు. -
దశాబ్దం తర్వాత బుగ్గ కారు
- హరీష్‌రావుకు మంత్రి పదవి - క్యాబినెట్లో సిద్దిపేటకు సముచిత స్థానం - భారీ నీటిపారుదల శాఖ కేటాయింపు సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: సరిగ్గా దశాబ్ద కాలం తర్వాత సిద్దిపేట నియోజకవర్గానికి రాజయోగం పట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం తొలివిడత ప్రమాణం చేసిన 11 మంది మంత్రుల్లో ఎమ్మెల్యే హరీష్‌రావుకు అవకాశం దక్కింది. భారీ నీటి పారుదల శాఖను హరీష్‌రావుకు కేటాయించించారు. సిద్దిపేట నియోజకవర్గానికి పది సంవత్సరాలుగా మంత్రి పదవి కరువైంది. ఈ క్రమంలో హరీష్‌రావుకు తొలివిడతలో మంత్రివర్గంలో బెర్తు ఖాయం కావడంతో నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. సిద్దిపేట శాసనసభకు 2004 ఉప ఎన్నిక ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన హరీష్‌రావు అప్పట్లోనే దివంగత నేత వైఎస్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. కూటమిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పక్షాన హరీష్‌రావు ఎమ్మెల్యే కాకుండానే వైఎస్ కేబినెట్లో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేశారు. తొలిసారి మంత్రి హోదాలోనే అప్పట్లో నియోజకవర్గ అభివృద్ధికి పుష్కలంగా నిధులను విడుదల చేయించుకున్నారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుచిత వైఖరిని నిరసిస్తూ కొద్ది నెలల తర్వాతనే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. దీంతో హరీష్‌రావు తన మంత్రి పదవిని వదులుకున్నారు. కాలక్రమేనా 2009 సార్వత్రిక ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిచిన హరీష్‌రావు టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా శాసనసభలో పార్టీ పక్షాన కీలక పాత్ర పోషించారు. ఈ పదేళ్ల పాటు శాసన సభ్యుని హోదాలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటంతో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడే తొలి మంత్రివర్గ కూర్పులో సిద్దిపేటకు సముచిత స్థానం దక్కింది. తెలంగాణ ప్రాంతంలో జలవనరుల అభివృద్ధిని మరింత పెంపొందించే దిశగా కేసీఆర్ తన మేనల్లుడు హరీష్‌రావుకు భారీ నీటి పారుదల శాఖతో పాటు అదనంగా మరో శాఖను కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.