heavy rainfal
-
కొనసాగుతున్న వర్ష బీభత్సం.. రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఇంకా వర్ష బీభత్సం కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో బుధవారం ఉదయం సమ్మర్ హిల్ ప్రాంతంలో మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్టుగా సమాచారం. సహాయ బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాయి. గత వారం రోజులుగా సమ్మర్ హిల్, కృష్ణానగర్, ఫగ్లీ ప్రాంతాలు కొండచరియల బీభత్సంతో వణికిపోతున్నాయి. ఇప్పటివరకు 71 మంది మరణించారు. దాదాపుగా 10 వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు. ఖంగ్రా జిల్లాలో వర్షబీభత్స ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. అధికారులతో సమావేశమై పునరుద్ధరణ పనులపై చర్చించారు. ‘‘ఈ ఏడాది వర్షాలు చాలా నష్టాన్ని మిగిల్చాయి. పునరుద్ధరణకు ఏడాది సమయం పట్టేలా ఉంది. అయినా యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహిస్తాం’’ అని చెప్పారు. రోడ్లు, నీటి ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలు అతి పెద్ద సవాల్‌గా మారాయని, ఏడాదిలోగా అన్ని పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా వివరించారు. చదవండి: రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో రాహుల్ గాంధీ! Massive devastation due to heavy rains in Mandi of Himachal Pradesh. #HimachalPradesh #HimachalDisaster pic.twitter.com/U7H4ZTYkIs — Inside India (@_InsideIndia) August 17, 2023 Incessant rainfalls have been thrashing the states of Himachal Pradesh and Uttarakhand with landslides and flood like situations In l last 3 days death tolls have gone up to 71. More than 1000 peoples have been evaluated from vulnerable areas#floods #WeatherUpdate #omshanti pic.twitter.com/f3Tnf4R5uv — Hamara Bharat (@AvyuktKrisha) August 17, 2023 'Gods must be angry': Spine-chilling videos show houses, people being washed away in Himachal Pradesh. "We Stand With Himachal" Let's Pray for the Speedy Recovery @CMOFFICEHP @SukhuSukhvinder @BJP4Himachal #floods #HimachalDisaster #HimachalPradesh pic.twitter.com/fyiq5oW9t2 — Hardik (@Hardik742639398) August 17, 2023 -
హిమాచల్ ప్రదేశ్‌లో వరదల బీభత్సం.. 22 మంది మృతి
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఆకస్మిక వరదలతో కొండచరియలు విరిగిపడటం ప్రమాదాల తీవ్రతను మరింత పెంచుతోంది. గత 24 గంటల్లో ఒకే కుటుంబంలో ఎనిమిది మందితో సహా దాదాపు 22 మంది మరణించారు, 9 మంది గాయపడ్డారు. మరో ఆరుగురు కనిపించకుండా పోయారు. వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే ఆ రోడ్డులో కొండ చరియలు విరిగిపడడం వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిలిచిపోయింది. ప్రస్తుతం రహదారిని క్లియర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రా, చంబా, బిలాస్పూర్, సిర్మౌర్, మండి జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండి జిల్లాలోని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఆగస్టు 25 వరకు హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ సుధేష్ కుమార్ వెల్లడించారు. WATCH: 2 killed, at least 15 missing after heavy rain #triggers #cloudburst, flash floods, landslides in several parts of Mandi district in #HimachalPradesh#Himachal #mandi #Flood #heavyrain pic.twitter.com/C6JpfVo8mp — BNN India (@BNNIN) August 20, 2022 మండి వద్ద మనాలి-చండీగఢ్ జాతీయ రహదారి, షోఘిలోని సిమ్లా-చండీగత్ హైవే సహా 743 రోడ్లు ట్రాఫిక్ కారణంగా బ్లాక్ చేశారు. ఒక్క మండిలోనే భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మరణించగా, ఐదుగురు గల్లంతయ్యారని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చౌదరి తెలిపారు. ఇదిలా ఉండగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కంగ్రా జిల్లాలో ఉన్న చక్కి బ్రిడ్జ్ శనివారం ఉదయం కూలిపోయిన విషయం తెలిసిందే. Dharampur @ Beas River Many peoples missing in Baggi of Mandi District 🙏🏻 Damaging Rains over parts of #Uttarakhand & #HimachalPradesh pic.twitter.com/UaAyr3a0Jx — Weatherman Shubham (@shubhamtorres09) August 20, 2022 -
గోల్కొండ ఖిల్లా.. ఇలా అయితే ఎలా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం తొలిరూపు గోల్కొండ.. భాగ్యనగరం అనగానే ముందుగా గుర్చొచ్చే చారిత్రక నిర్మాణం. కాకతీయులు పునాది వేయగా, కుతుబ్‌షాహీలు ఆక్రమించుకుని మరింత అభివృద్ధి చేశారు. ఆ తర్వాత అసఫ్జాహీలు ఏలారు. ఇన్ని రాజవంశాల చేతులు మారినా.. పదిలంగా నిలిచిన ఆ మహా కోటకు ఇప్పుడు ప్రమాదం ముంచుకొచ్చింది. చాలా ఏళ్లు కావడంతో స్వతహాగా ఏర్పడుతున్న పగుళ్లు క్రమంగా పెరిగి మూలాలనే పెకిలిస్తున్నాయి. వాటికి వేగంగా మరమ్మతులు జరగక క్రమంగా కోటకు బీటలు వేస్తున్నాయి. ఇంతటి ప్రమాదపు అంచుల్లో ఉన్న కోటకు ఇటీవలి భారీ వర్షాలు పెద్ద కుదుపునే ఇచ్చాయి. రికార్డు స్థాయి వర్షంతో ఒక్కసారిగా గోడలన్నీ కదిలిపోయి నిట్టనిలువునా కూలిపోయేందుకు సిద్ధమయ్యాయి. ఆ వర్షాల సమయంలోనే ఓ బురుజు, మరో మహా కోట ప్రాకారం, నవాబులు జలకాలాడిన కటోరా హౌస్ ప్రహరీ నేలమట్టమైంది. మరికొన్ని గోడలు కూడా కూలే ప్రమాదం ఉంది. వాన కాదు కదా బలంగా గాలివీచినా రాళ్లు జారిపడేలా మారింది ఈ మహా కట్టడం. కేంద్రం వెంటనే స్పందించకుంటే కోటలోని చాలాప్రాంతాలు మట్టిదిబ్బగా మారటం ఖాయం. రూ.6 నుంచి రూ.8 కోట్లు కావాలి ఇటీవలి వర్షాలకు కూలిన ప్రాంతాలను పునరుద్ధరించాలంటే రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు అవసరం అవుతాయని సమాచారం. ప్రస్తుతం స్థానిక అధికారులు అంచనాలు రూపొందించి మరమ్మతు కోసం అనుమతి కోరుతూ ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. దానికి సమ్మతిస్తూ సరిపడా నిధులు కేటాయిస్తేనే వీలైనంత తొందరలో పునరుద్ధరణ పూర్తవుతుంది. వచ్చే వానాకాలం లోపు ప్రధాన పనులు చేపట్టడంతో పాటు, బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతు చేయకపోతే ఏడాదిలో మరిన్ని గోడలు కూలడం ఖాయం. నిధులేవి.. ఇంతపెద్ద గోల్కొండ నిర్వహణకు కేంద్ర పురాతత్వ సర్వేక్షణ విభాగం కేటాయిస్తున్న నిధులు సంవత్సరానికి రూ.కోటిన్నర మాత్రమే. శతాబ్దాల నాటి నిర్మాణం కావటంతో అడుగడుగునా మరమ్మతు చేస్తే తప్ప నిర్మాణం పదిలంగా ఉండని పరిస్థితిలో ఈ నిధులు ఏ మూలకూ చాలట్లేదు. మరోవైపు ఏ చిన్న మరమ్మతు చేయాల్సి వచ్చినా ఢిల్లీకి అనుమతి కోసం పంపి, అక్కడి నుంచి అనుమతి వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతోంది. ఇక మరమ్మతు పనుల్లో నైపుణ్యం ఉన్న పనివారు దొరక్కపోవటం జాప్యానికి మరో కారణం. నిత్యం నిశితంగా పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు మరమ్మతులు వేగంగా చేపడితేనే ఈ కట్టడం పదిలంగా ఉంటుంది. చారిత్రక కట్టడాలను దత్తత ఇచ్చేందుకు గతేడాది కేంద్రం శ్రీకారం చుట్టింది. గోల్కొండ బాధ్యత జీఎమ్మార్‌కు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఎవరైనా దాతలు ముందుకొస్తే దత్తత ఇచ్చేందుకు ఏఎస్ఐ సిద్ధంగా ఉన్నా ఎవరూ స్పందిచట్లేదు. (చదవండి: టూరిస్టుల గోల్కొండ) జారిపోయిన బండరాళ్లు.. గోల్కొండ కోట పైభాగంలో జగదాంబ దేవాలయం వైపు వెళ్లే దారిలో 50 అడుగుల ఎత్తయిన కోట గోడ నిలువునా జారిపోయింది. గతంలో ఇక్కడ కొన్ని పగుళ్లు ఏర్పడ్డాయి. దానికి మరమ్మతు చేయటంలో జాప్యం జరిగింది. ఆ తర్వాత కూడా పైభాగంలోనే పనులు చేపట్టారు. బలహీనంగా ఉన్న కింది భాగానికి పూర్తిస్థాయి మరమ్మతు జరగలేదు. దీంతో భారీ వర్షాలకు కిందిభాగం మరింత బలహీనపడి కూలింది. దీంతో పైనుంచి రాళ్లు జారి పడిపోయాయి. ఫలితంగా గోడ వెనుక ఉండే మట్టి పూర్తిగా జారిపోయింది. మజ్నూ బురుజు.. దాదాపు కనుమరుగు మజ్నూ బురుజు. నయాఖిల్లాలో ఉంది. ప్రస్తుతం దీని చుట్టూ గోల్ఫ్ కోర్సు అభివృద్ధి అయి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు సరిగ్గా 20 రోజుల ముందు దీనికి పైభాగంలో భారీ పగులు ఏర్పడింది. బురుజు పైభాగంలో 18 అడుగుల పొడవైన ఫిరంగి ఉంది. ఇది ఔరంగజేబు సైన్యం ఏర్పాటు చేసింది. దాని వెనుకవైపు పిట్టగోడ తరహాలో ఓ గోడ అప్పట్లోనే కట్టారు. ఆ గోడ నుంచి పగులు మొదలైంది. భారీ వర్షాల సమయంలో ఆ పగులు నుంచి నీరు లోపలికి చేరటంతో మట్టి జారి పైనుంచి దిగువ వరకు సగం బురుజు కూలిపోయింది. సగం బురుజు కూలగా, మిగతా సగం కూడా బలహీనపడింది. దానిపై టన్నుల బరువుండే ఫిరంగి ఉంది. ప్రస్తుతం అది కొంత భాగం గాలిలో వేళ్లాడుతోంది. క్రేన్‌తో దాన్ని పదిలంగా తీసి పనులు చేపట్టాలి. (చదవండి: గోల్కొండ కోట వద్ద నిర్మాణాలా..?) ఇలా అయితే కష్టమే.. జగదాంబ దేవాలయానికి మరోవైపు వెళ్లే మార్గం. ఆ పక్కన కూలిన గోడ లాగానే ఇక్కడ కూడా ప్రధాన కట్టడానికి పైనుంచి దిగువ వరకు భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు దీనికి అత్యవసరంగా శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతు అవసరం. లేకుంటే, సాధారణ వర్షాలకు కూడా అది కూలిపోయే ప్రమాదం ఉంది. ఇటీవల కురిసిన స్థాయి భారీ వర్షం భవిష్యత్తులో కురిస్తే ఈ గోడ నామరూపాల్లేకుండా పోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. రోడ్డు నిర్మాణంలో లోపం? కుతుబ్‌షాహీ నవాబుల కుటుంబం జలకాలాడేందుకు 460 ఏళ్ల కింద రూపుదిద్దుకున్న భారీ జలాశయాన్ని కటోరా హౌస్ అంటారు. దీన్ని ఆనుకునే రోడ్డు ఉంది. దానివైపు దాదాపు 5 అడుగుల ఎత్తుతో 60 మీటర్ల పొడవైన గోడ ఉంది. గతంలో రోడ్డు నిర్మించినప్పుడు, ఆ తర్వాత మరమ్మతులు చేసినప్పుడు వరద నీటి ప్రవాహ మార్గం చెదిరిపోయింది. వర్షాల వరద ప్రవాహం గతి తప్పి, గోడను ఆనుకుని ఉన్న మట్టి జారింది. ఇటీవలి వర్షాలకు ఆ గోడ దాదాపు 40 మీటర్ల మేర కటోరా హౌస్‌లోకి పడిపోయింది. ఇక్కడ నిర్వహణలో శాస్త్రీయత లోపించటం వల్లే ఈ గోడ కూలిందని స్పష్టమవుతోంది. -
గుజరాత్‌కు ‘వాయు’ గండం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఉత్తరభారతంలో ఒక వైపు సూర్యుడి ప్రతాపంతో జనం అల్లాడుతుండగా మరోవైపు ‘వాయు’తుపాను గుజరాత్ వైపు ప్రచండ వేగంతో దూసుకువస్తోంది. గుజరాత్ తీరంలోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతంపై ‘వాయు’ ప్రభావం మరో 24 గంటలు ఉంటుందని, భారీ వర్షాలు కురియడంతోపాటు గంటకు 170 కిలోమీటర్ల వేగంతో తీవ్రగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా తీరం ప్రాంతాల్లోని పది జిల్లాల లోతట్టు ప్రాంతాలకు చెందిన 3 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, నావికా దళం, వాయుసేన ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. ప్రభుత్వం, స్థానిక విభాగాలు అందించే సూచనలు, సలహాలను పాటించి సురక్షితంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను ట్విట్టర్లో కోరారు. వాతావరణ శాఖ హెచ్చరిక ‘వాయు’తుపాను అతితీవ్రంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పోర్బందర్, కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూల మధ్య గురువారం ఉదయం భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. తీరం దాటిన తర్వాత తుపాను సాధారణంగా బలహీన పడుతుంది. ఇందుకు విరుద్ధంగా, ‘వాయు’మరింత తీవ్రంగా మారనుందని తెలిపింది. వెరావల్‌కు దక్షిణంగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ‘వాయు’ గురువారం మధ్యాహ్నం వెరావల్, దక్షిణ ద్వారక మధ్య తీరాన్ని తాకే అవకాశ ముందని తెలిపింది. అరేబియా సముద్రంలో అలలు ఉవ్వెత్తున లేచి తీరాన్ని తాకుతాయని తెలిపింది. అధికార యంత్రాంగం అప్రమత్తం తుపాను హెచ్చరికలతో గుజరాత్, డయ్యూ యంత్రాంగాలతోపాటు కేంద్రం అప్రమత్తమైంది. జాతీయ విపత్తు నిర్వహణ సహాయ దళం(ఎన్డీఆర్ఎఫ్), సైన్యం ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. యుద్ధ నౌకలు, నావికా దళ విమానాలను కూడా సిద్ధం చేశారు. తీరంలోని నౌకాశ్రయాలను ముందు జాగ్రత్తగా మూసివేయాలని ఆదేశించినట్లు ప్రభుత్వం పేర్కొంది. పోర్బందర్, డయ్యూ, భావ్‌నగర్, కెశోద్, కాండ్లా ఎయిర్‌పోర్ట్‌లను 13వ తేదీ అర్ధరాత్రి వరకు మూసివేస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కొన్ని బస్ సర్వీసులను రద్దు చేసింది. విద్యా సంస్థలకు 12, 13 తేదీల్లో సెలవులిచ్చారు. ఇప్పటికే 70 రైళ్లు రద్దుచేశారు. వచ్చే రెండు రోజులపాటు కొన్ని రైళ్లను రద్దు చేయడమో లేక దారిమళ్లించడమో చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ముంబైకి రాకపోకలు సాగించే 400 విమానాలకు అంతరాయం కలిగింది. జామ్‌నగర్‌కు విమానంలో బయల్దేరిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు -
కోలుకోని చెన్నపట్నం