No Respite For Uttarakhand, Himachal Pradesh From Extremely Heavy Rainfall - Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న వర్ష బీభత్సం.. రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం.. 

Published Thu, Aug 17 2023 9:15 AM | Last Updated on Thu, Aug 17 2023 10:26 AM

No Respite for Uttarakhand Himachal Pradesh From Sxtremely Heavy Rain - Sakshi

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఇంకా వర్ష బీభత్సం కొనసాగుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో బుధవారం ఉదయం సమ్మర్‌ హిల్‌ ప్రాంతంలో మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్టుగా సమాచారం. సహాయ బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాయి. గత వారం రోజులుగా సమ్మర్‌ హిల్, కృష్ణానగర్, ఫగ్లీ ప్రాంతాలు కొండచరియల బీభత్సంతో వణికిపోతున్నాయి. ఇప్పటివరకు 71 మంది మరణించారు. దాదాపుగా 10 వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్‌ సింగ్‌ సుఖు తెలిపారు.

ఖంగ్రా జిల్లాలో వర్షబీభత్స ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అధికారులతో సమావేశమై పునరుద్ధరణ పనులపై చర్చించారు. ‘‘ఈ ఏడాది వర్షాలు చాలా నష్టాన్ని మిగిల్చాయి. పునరుద్ధరణకు ఏడాది సమయం పట్టేలా ఉంది. అయినా యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహిస్తాం’’ అని చెప్పారు. రోడ్లు, నీటి ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలు అతి పెద్ద సవాల్‌గా మారాయని, ఏడాదిలోగా అన్ని పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా వివరించారు.  
చదవండి: రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో రాహుల్‌ గాంధీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement