heavy temperature
-
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
-
AP: అలర్ట్.. అత్యవసరమైతేనే బయటకు రావాలి
సాక్షి, విశాఖపట్నం: మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భానుడి ప్రతాపం ఉంటుందని, అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారిణి సునంద వెల్లడించారు. కర్నూలు అనంతపురం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొన్నారు. కోస్తా తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత నమోదు అవుతాయని, వడగాల్పుల తీవ్రత ఉంటుందని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని ప్రజలకు వాతావరణం కేంద్రం సూచించింది. రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. పలుచోట్ల 42 నుంచి 45 డిగ్రీలకుపైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంకంటే 3–6 డిగ్రీలు అధికంగా ఇవి రికార్డవుతుండడంతో అనేక మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం అత్యధికంగా వైఎస్సార్ జిల్లా కొంగలవీడులో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మూడురోజులు తేలికపాటి వర్షాలు మరోవైపు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు తమిళనాడు, రాయలసీమల మీదుగా వ్యాపించి ఉన్న ద్రోణి సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడురోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించవచ్చని పేర్కొంది. అందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, శుక్రవారం ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, శనివారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. -
ఏపీలో హై అలర్ట్.. రాబోయే ఐదు రోజులూ అప్రమత్తంగా ఉండాల్సిందే..!
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 302 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం, కె.కోటపాడు, కశింకోట, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం, సబ్బవరం మండలాలు, కాకినాడ జిల్లా కోటనందూరు, తుని మండలాలు, విజయనగరం జిల్లా జామి, కొత్తవలస మండలాలు, విశాఖలోని పద్మనాభం మండలంలో వడగాడ్పుల తీవ్రత ఉంటుందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వడగాడ్పులు, అకాల వర్షాలు, పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్ల కింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చదవండి: ప్రమాదాన్ని ముందే పసిగట్టిన గజరాజు.. గోవిందరాజు స్వామి ఆలయంలో ఏం జరిగింది? -
రాజధానిలో 45 .. నిజామాబాద్‌లో 46.1..
-
రాజధానిలో 45 .. నిజామాబాద్‌లో 46.1..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మే నెల ఎండలు జనంపై ప్రతాపం చూపిస్తున్నాయి. ఎండ తీవ్రతకు వడగాల్పులు తోడవటంతో జనం విలవిల్లాడుతున్నారు. మంగళవారం అత్యధికంగా నిజామాబాద్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ రికార్డు బుధవారం తుడిచిపెట్టుకుపోయింది. నిజామాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం అత్యధికంగా 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాజధాని హైదరాబాద్‌లో కూడా 45 డిగ్రీలకు చేరుకుంది. ఇంకా ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకున్నాయి. -
వడదెబ్బకు వ్యక్తి మృతి
విజయనగరం: ఎండాకాలం మొదలవగానే భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల ఎండలకు చాలామంది పేదలు ప్రాణాలు వదులుతున్నారు. అవగాహన లోపమా ? లేక తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లటం చేస్తుండటమే ప్రజలు చేస్తున్న తప్పిదంలా ఉంది. తాజాగా బుధవారం విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పి.కోనవలస గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తూ వడదెబ్బకు ఓ కూలీ మృతిచెందాడు. ఆ గ్రామ సమీపంలోని పనసలపాడు చెరువు పనులు చేస్తుండగా.. కోరాడ అప్పలస్వామి (62) అనే ఉపాధిహామీ కూలీ సొమ్మసిల్లి పడిపోయాడు. తన తోటి కూలీలు అతణ్ని గ్రామానికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలోనే అప్పలస్వామి తుదిశ్వాస విడిచాడు. సమాచారం అందుకున్న ఎంపీడీవో రామారావు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. (సాలూరు) -
అబ్బా... ఇవేం ఎండలు
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలంలోనూ రాష్ట్ర రాజధాని ఉడికిపోతోంది. రికార్డు స్థాయిలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జల్లుల కాలంలోనూ సీజన్ మార్పులు సిటీజనులను ఇబ్బందులు పెడుతున్నాయి. మరోవైపు కరెంట్ కోతలు... నీటి వెతలు అవస్థలకు గురిచేస్తున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులూ విజృంభిస్తున్నాయి. వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు కనీవినీ ఎరగని రీతిలో పెరుగుతుండడంతో గ్రేటర్ పరిధిలో పెంపుడు జంతువులు, ముఖ్యంగా కుక్కల శరీర ధర్మాల్లో మార్పులొస్తున్నాయి. దీంతో ఇటీవలికాలంలో కుక్కకాటు కేసులు బాగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఐదేళ్ల తరవాత రికార్డు ఉష్ణోగ్రత నమోదు.. గ్రేటర్ పరిధిలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఐదేళ్ల తరువాత సోమవారం గరిష్టంగా 34.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2009లో ఆగస్టు 8న 36.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తరవాత ఇదే అత్యధికం. ఈసారి వర్షపాతం గణనీయంగా తగ్గడం, తరచూ ఆకాశం మేఘావృతమై ఉండడం, గాలిలో తేమ అధికం కావడం, రుతుపవనాలు సకాలంలో ముఖం చాటేయడం వంటి కారణాలతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త సీతారాం ‘సాక్షి’కి తెలిపారు. ఈ వర్షాకాలం సీజన్లో ఇక అరకొర జల్లులు మినహా భారీ వర్షాలు కురిసే అవకాశాలు మృగ్యమేనని స్పష్టంచేశారు. గ్రేటర్ పరిధిలో ఈ సీజన్లో వర్షపాతంలో 63 శాతం తగ్గుదల నమోదైందన్నారు. తెలంగాణా ప్రాంతంలో వర్షపాతంలో తగ్గుదల 53 శాతంగా ఉందని పేర్కొన్నారు. నీటి వెతలు.. తీవ్ర వర్షాబావ పరిస్థితుల కారణంగా గ్రేటర్ దాహార్తిని తీరుస్తోన్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, సింగూరు, మంజీరా, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో జలమండలి పొదుపు మంత్రం పాటిస్తోంది. ఇప్పటికే ఆయా జలాశయాల నుంచి నిత్యం పేరుకు 300 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నామని ప్రకటిస్తున్నా.. సరఫరా నష్టాలు 40 శాతం పోను వాస్తవ సరఫరా 180 మిలియన్ గ్యాలన్లు మించడం లేదు. ఈ నీటినే సుమారు 8.25 లక్షల కుళాయిలకు అరకొరగా సరఫరా చేస్తున్నారు. కాప్రా, ఎల్బీనగర్, అల్వాల్, మల్కాజ్‌గిరీ, కూకట్పల్లి, హౌజింగ్‌బోర్డు, గడ్డిఅన్నారం, రాజేంద్రనగర్, కుత్భుల్లాపూర్, శేరిలింగంపల్లి మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని వందలాది కాలనీలు, బస్తీలు నిత్యం పానీపరేషాన్తో సతమతమౌతున్నాయి. వేసవి అవసరాల దృష్ట్యా జలాశయాల్లోని నీటిని పొదుపుగా వాడుకోక తప్పడం లేదని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ప్రస్తుతం గ్రేటర్లో విలీనమైన 11 మున్సిపల్ సర్కిళ్లకుగాను ఒక్కో సర్కిల్‌కు నిత్యం సుమారు ఐదు నుంచి 10 మిలియన్ గ్యాలన్ల నీటికి అనధికారికంగా కోతలు విధిస్తుండడంతోనే పానీపరేషాన్ తీవ్రమౌతోందని స్పష్టమౌతోంది. కరెంట్ కోత.. ఉక్కపోత గ్రేటర్లో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు ఒకవైపు.. ఉక్కపోత.. విద్యుత్ కోతలు మరోవైపు నగరజీవిని ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గ్రేటర్ లో 38 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 32 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు, నాలుగు లక్షల వాణిజ్య కనెక్షన్లు, లక్ష వీధి దీపాలు, 40 వేలకుపైగా పరిశ్రమలు, 3200 హోర్డింగ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం నగరవాసుల అవసరాలు పూర్తిస్థాయిలో తీర్చాలంటే రోజుకు కనీసం 46-47 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాగా, 40-42 మిలియన్ యూనిట్లకు మించి సరఫరా కావ డం లేదు. డిమా ండ్‌కు సరఫరాకు మధ్య 500-600 మెగవాట్ల కొరత ఉండటంతో చేసేది లేక గృహాలకు ప్రతి రోజూ ఆరు గంటల పాటు అధికారిక విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. తగ్గిన భూగర్భ జలాలు గ్రేటర్ పరిధిలో గతేడాది జూలై చివరి నాటికి సగటున 7.39 మీటర్ల లోతున భూగర్భ జలాల జాడ దొరకగా.. ఈసారి 9.59 మీటర్ల లోతున భూగర్భ జలాలు లభ్యమౌతున్నాయి. అంటే గతేడాది కంటే భూగర్భజల మట్టాలు సగటున 2.2 అడుగుల లోతునకు తగ్గాయి. అత్యధికంగా ఉప్పల్ మండలంలో 4.40 అడుగులు, సైదాబాద్ మండలంలో 4.15 అడుగుల మేర భూగర్భజలమట్టాలు తగ్గాయి. ఇక అమీర్‌పేట్, ఆసిఫ్‌నగర్, బండ్లగూడా,ై ఖెరతాబాద్, మారేడ్‌పల్లి, నాంపల్లి, కుత్భుల్లాపూర్, సరూర్‌నగర్, బాలానగర్, మల్కాజ్‌గిరీ, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలాల్లో గతేడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టాలు తగ్గముఖం పట్టినట్లు భూగర్భ జలశాఖ తాజా నివేదిక వెల్లడించింది. విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పుల వల్ల బస్తీల్లో అనేక మంది దగ్గు, జ్వరం, డయేరియా, డిఫ్తీరియా బారిన పడుతున్నారు. నగరంలోని ఫీవర్ ఆస్పత్రికి సాధారణ రోజుల్లో ప్రతి రోజూ సగటున 500-700 మంది బాధితులు వస్తే, ఒక్క సోమవారం రోజే 1050 మంది రోగులు చేరారంటే పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వీరిలో అత్యధిక మంది వైరల్ ఫివర్‌తో బాధపడుతున్న వారే. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులే కాదు, చిన్నచిన్న క్లీనిక్‌లు సైతం రోగులతో కిక్కిరిపోతున్నాయి. పెరుగుతోన్న పగటి ఉష్ణోగ్రతలకు వీధి కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తూ ప్రయాణికులను, వీధుల్లో ఆడుకుంటున్న చిన్నారులను కాటేస్తున్నాయి. సోమవారం ఒక్క రోజే 45 కుక్కకాటు కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తేటతెల్లం చేస్తోంంది. -
రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత
విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండల తీవ్రత ఆదివారం కూడా కొనసాగింది. ముఖ్యంగా రాయలసీమలో ఈ తీవ్రత అధికంగా ఉంది. ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు రాయలసీమలోనే నమోదయ్యాయి. చిత్తూరులో 42 డిగ్రీలు, కర్నూలు, అనంతపురంలలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు కోస్తా ప్రాంతంలోని నెల్లూరులోనూ భానుడు ప్రతాపం చూపాడు. ఇక్కడ ఆదివారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెంటచింతల, నందిగామల్లోనూ 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవగా.. కావలిలో 40, విశాఖపట్నంలో 38.2, కాకినాడలో 36, మచిలీపట్నంలో 38, బాపట్లలో 37 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఏప్రిల్ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వేడి వాతావరణం, పొడిగాలుల ప్రభావం మరింతగా ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్రపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారు తెలిపారు.