heavy vehicle
-
Photo Feature: అబ్బో.. 120 టైర్ల బండి
మల్కాపురం(విశాఖ పశ్చిమ): చిన్నపాటి వాహనంపై అదే స్థాయి వాహనం ఎక్కించడం కొన్నిసార్లు చూసి ఉంటాం. కానీ సుమారు 120 టైర్ల గల భారీ వాహనంపై అంతే స్థాయిలో ఉన్న మరో భారీ వాహనం ఎక్కించి తరలించిన దృశ్యాన్ని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హెచ్‌పీసీఎల్(విశాఖ రిఫైనరీ) విస్తరణ పనులకు అవసరమైన భారీ యంత్ర పరికరాలు, క్రూడ్ కోలామ్, రియాక్టర్లను ఈ భారీ వాహనాలపై తరలిస్తున్నారు. చదవండి: చిన్నపాటి నొప్పికి కూడా ఆ మందులు వాడుతున్నారా? అయితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే.. -
భారీ వాహనం.. బహుదూరపు ప్రయాణం
ఈ భారీ వాహనం ఏదో రాకెట్‌ను తీసుకువెళ్తున్నట్టు కనిపిస్తోంది కదా..? కానే కాదు. అది ఆయిల్ ప్లాంట్‌లో వాడే ఓ భారీ పరికరం. దాన్ని గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి తరలిస్తున్నారు. పరికరం పెద్దది కావడంతో దానికి తగ్గట్లే 106 టైర్లున్న భారీ వాహనంలో తీసుకెళుతున్నారు. 20 రోజుల క్రితం గుజరాత్లో బయల్దేరిన ఈ వాహనం మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని 65వ నంబర్ జాతీయ రహదారి మీదుగా ప్రయాణించింది. రోడ్డు మీద ఇంత పెద్ద వాహనం కనిపించడంతో అందరూ ఆసక్తిగా చూశారు. కాగా, ఈ భారీ వాహనాన్ని నడిపేందుకు ముగ్గురు డ్రైవర్లు, మరో ఏడుగురు సిబ్బంది ఉన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
రియల్ మోడల్
చేస్తున్నది చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా అన్నది ముఖ్యం కాదు, గౌరవంగా జీవించడం ప్రధానం అని నిరూపిస్తున్న ఓ యువతి తనకు తాను వేసుకున్న బతుకు బాట ఇది. టెన్త్, ట్వల్త్ క్లాసులతోపాటు బీటెక్‌లో కూడా మంచి గ్రేడ్ తెచ్చుకుని ఇప్పుడు సివిల్స్‌కు ప్రిపేరవుతున్న ఇరవై నాలుగేళ్ల శ్రీష్మ టిప్పర్ లారీ డ్రైవర్‌గా పని చేస్తోంది! రోజుకు ఆరు లోడ్లు దింపి తిరిగి తన సివిల్స్ పరీక్షల కోసం ప్రిపేరవుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ పనులు చేస్తున్నారా అని అడిగిన వాళ్లకు ఆమె చెప్పే సమాధానం ఒక్కటే. ‘మా నాన్నకు సహాయం చేయడం కోసమే’ అని చెప్తోంది. ఇలాంటి రోల్ మోడల్ పాత్రలు సినిమాల్లోనే కనిపిస్తుంటాయి. శ్రీష్మ మాత్రం రియల్ మోడల్. శ్రీష్మ తండ్రి పురుషోత్తమన్ సిమెంట్ వ్యాపారి. వాళ్లది కేరళలోని కున్నూరు. కరోనా కారణంగా ఆయన వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. తల్లి శ్రీజ ప్రైవేట్ స్కూల్ టీచర్. కరోనా సమయంలో పాఠశాలలు తెరవకపోవడంతో ఆమెకు కూడా జీతాలు సరిగా రావడం లేదు. కరోనా కష్టకాలాన్ని దాటడానికి శ్రీష్మ టిప్పర్ స్టీరింగ్ పట్టుకుంది. చిన్నప్పుడు ఇష్టంగా నేర్చుకున్న డ్రైవింగ్ ఇప్పుడు తమ కుటుంబాన్ని సరైన దారిలో నడిపిస్తోందని చెబుతోంది శ్రీష్మ. ‘‘అప్పుడు నేను ఐదవ తరగతి. అమ్మకు డ్రైవింగ్ నేర్పించాడు నాన్న. నేను కూడా నేర్చుకుంటానని మొండికేశాను. డ్రైవింగ్ నేర్పించాడు కానీ ఇప్పుడే లైసెన్స్ ఇవ్వరు కాబట్టి నడపడానికి వీల్లేదని గట్టిగా చెప్పేశారు అమ్మానాన్న. నాకు డ్రైవింగ్ వచ్చినా సరే నడపడానికి వాహనం ఇచ్చేవాళ్లు కాదు. దాంతో పద్దెనిమిదేళ్లు వచ్చిన తర్వాత నా కల నెరవేర్చుకున్నాను. టూవీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ పరీక్షలు పాసయ్యి లైసెన్స్‌లు తెచ్చుకున్నాను. అంతటితో సంతృప్తి చెందలేదు. హెవీ వెహికల్ లైసెన్స్ కోసం బస్సు, లారీ కూడా నడిపాను. హెవీ వెహికల్ పరీక్షకు హాజరైన వాళ్లలో అమ్మాయిని నేనొక్కర్తినే. మగవాళ్లు నన్ను విచిత్రంగా చూశారు. అప్పుడు నా వయసు 21. నాకు చదువు రాలేదేమోనని, పెద్ద ఉద్యోగాలకు అవకాశం లేకపోవడంతో డ్రైవింగ్‌కి వచ్చానని కూడా అనుకున్నారు వాళ్లు. బస్సులు, లారీలు నడపడం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్లు నవ్వారు, బీటెక్ చదువుతూ ఉద్యోగాల గురించి ఆలోచించకుండా లారీలు నడపడమేంటని బాగా ఎగతాళి చేశారు. నేర్చుకునేటప్పుడే కాదు, ఆరు నెలల కిందట నేను గ్రావెల్ రవాణా టిప్పర్ లారీ తోలుతున్నప్పుడు కూడా అలాగే చూశారు. ఇప్పుడు మాత్రం ఈ పని వెనుక ఉన్నది ఉద్యోగం రాక కాదు, నాన్నకు సహాయం చేయడానికని వాళ్లకు అర్థమైంది. వాళ్లకు అర్థం కాకపోయినా నేనేమీ పట్టించుకోను. నాన్నకు ఆర్థిక కష్టం వచ్చినప్పుడు నేను సహాయంగా నిలిచానా లేదా అన్నదే నాకు ముఖ్యం. నేను హెవీ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్స్ మాత్రం చాలా సంతోషపడ్డారు. అమ్మాయిలు చేయలేని పని చేస్తున్నందుకు ప్రశంసించేవాళ్లు. కొంతమంది తమకూ నేర్పించమని అడిగి మరీ డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ గ్రేట్ అంటూ ప్రోత్సహిస్తున్నారు. రేపటి రోజున నా చదువుకు తగిన మరో ఉద్యోగం సంపాదించుకోగలను. అలాగని నా చదువుకు తగిన ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఈ రోజును నిర్వీర్యంగా గడిపేయడం నచ్చదు. ప్రతిదీ గౌరవప్రదమైన ఉద్యోగమే. ఏ పనినీ తక్కువగా చూడకూడదు. నాకు డ్రైవింగ్ ఇష్టం కాబట్టి ఈ పని చేస్తున్నాను’’ అన్నది శ్రీష్మ. అవును.. మా అమ్మాయే శ్రీష్మలో పరిస్థితిని తనకు తానుగా చక్కదిద్దుకోగలిగిన నైపుణ్యం ఉందని, తండ్రిగా సంతోషపడుతున్నానని చెప్పాడు పురుషోత్తమ్. టిప్పర్ తోలే అమ్మాయి మా అమ్మాయేనని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ‘‘ఒకసారి టిప్పర్ లారీ చిత్తడి నేలలో కూరుకుపోయింది, తాను బెంబేలు పడకుండా స్థానికుల సహాయంతో బండిని బయటకు తీసి లోడు గమ్యాన్ని చేర్చింది. డ్రైవింగ్ చేస్తున్న కారణంగా తన ప్రిపరేషన్‌కు అంతరాయం కలగనివ్వడం లేదు. ప్రిపరేషన్ కొనసాగిస్తోంది. చదువుకున్న అమ్మాయి కుటుంబం కోసం తండ్రికి సహాయం చేయాలనే మంచి ఆలోచనతో టిప్పర్ నడుపుతోందని తోటి మగ డ్రైవర్లు కూడా శ్రీష్మను అభిమానంగా, గౌరవంగా చూస్తున్నారు’’ అని చెప్పారాయన. -
మని‘షి’ తలచుకుంటే కానిది ఏదీ లేదు..
హెవీ వెహికిల్ డ్రైవింగ్ నేర్పిస్తామని ఆర్టీసీ వారు ప్రకటన ఇవ్వడమే ఆలస్యం.. రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువలా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. ఆనక చూస్తే అందులో ఒకే ఒక్కదానిపై యువతి సంతకం ఉంది. నిజమేనా.. అని అధికారులు ఆశ్చర్యపడేలోపే ఆ యువతి చక్కగా శిక్షణ కూడా పూర్తి చేసుకుంది. మని‘షి’ తలచుకుంటే కానిది ఏదీ లేదని నిరూపించింది. తండ్రిలోని సైనికుడి తెగువకు తన తెలివిని జత చేసిన ఈ యువ ఇంజినీర్ ఇప్పుడు సిక్కోలు యువతులకు ఆదర్శంగా నిలిచింది. హెవీ వెహికిల్ డ్రైవింగ్ నేర్చుకున్న అతికొద్ది మహిళల్లో తన పేరునూ జత చేసుకుంది. సిక్కోలుకు చెందిన చల్లా ఆశ.. ఇలా తన ఆశను నెరవేర్చుకున్నారు. సాక్షి, శ్రీకాకుళం: డ్రైవింగ్ అంటే ఆడవారు ఆమడ దూరంలో ఉండాలనే ఛాందసం ఇంకా సమాజంలో ఉంది. దాన్ని ఛేదించుకుంటూ ఇ ప్పటికే చాలా మంది బైకులు, ఆటోలు, కార్లను రయ్‌మంటూ పోనిస్తున్నారు. కానీ హెవీ వెహికిల్ డ్రైవింగ్ మాత్రం మగాళ్ల సామ్రాజ్యం లాగానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడో సిక్కోలు మహిళ ఆ సామ్రాజ్యంలోకి ప్రవేశించింది. తానూ సారథినేనంటూ విజయవంతంగా హెవీ వెహికిల్ శిక్షణ పూర్తి చేసింది.ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ ఇటీవల హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణ పొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు మగవారితోపాటు ఒక మహిళ కూడా దరఖాస్తు చేసుకుంది. ఆ యు వతి సిక్కోలుకు చెందిన వారు కావడం అందరికీ గర్వ కారణం. (పెళ్లి కోసం దాచిన 9 లక్షలు బూడిద) ఆమె పేరు చల్లా ఆశ. విద్యాభ్యాసం బీటెక్ (ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్). తండ్రి చల్లా వెంకటరావు ఆర్మీలో హానరీ సుబే దార్ మేజర్(రిటైర్డ్). తల్లి చల్లా దమయంతి. గృహిణి. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో తప్ప మరే జిల్లాలో కూడా హెవీ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకునేందుకు మహిళలు ముందుకు రాలేదు. దీంతో ఆ మహిళకు శిక్షణ ఇచ్చిన వారు ఎంతో సంతోషించారు, ప్రోత్సహించారు. హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో 40 రోజుల శిక్షణను విజయవంతంగా ముగించుకుని హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో సర్టిఫికెట్ పొందిన మొట్టమొదటి మహిళగా ఆమె నిలిచారు. ఆశ 8వ తరగతి చదివేటప్పటి నుంచే మైదానంలో ద్విచక్రవాహనం డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణ పొంది ఎంతో మంది యువతకు మార్గదర్శకంగా నిలిచారు. ఆమె మాటల్లో.. ‘డ్రైవింగ్‌లో నాకు స్ఫూర్తి నాన్నే. ఫస్ట్ క్లాస్‌లో ఉన్నపుడు సైకిల్ కొనిచ్చారు. తర్వాత నాన్న టీవీఎస్ మోపెడ్ కొన్నారు. ఆ సమయంలో కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ డ్రైవింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాను. 8వ తరగతి చదివే సమయంలో మామయ్య వద్ద పల్సర్ బైక్ ఉండేది. మామయ్యను ఒప్పంచి దానిపై డ్రైవింగ్ నేర్చుకున్నాను. 2012లో ఇంటర్మీడియెట్‌లో నాన్న ఆశించిన మార్కులు కంటే ఎక్కువ మార్కులు (900 అనుకుంటే 952 మార్కులు) సాధించడంతో నాన్నే స్వయంగా పల్సర్ బైక్ కొనిచ్చారు. 2016లో బీటెక్ ఫైనలియర్ చదివేటప్పుడు కార్ కొనడంతో కారుడ్రైవింగ్ నేర్చుకున్నాను. ఈ ఏడాది జూలై లో నే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా తీసుకున్నాను. హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ సమయంలో ఎంతో నేర్చుకున్నాను. (ఒక్కడు.. గ్రామాన్ని మార్చాడు!) హెవీ వెహికల్ డ్రైవింగ్ చాలా క్లిష్టమైనది. ఓర్పు, నేర్పుతో కూడుకున్నది. ట్రాఫిక్‌లో ఏవిధంగా డ్రైవింగ్ చేయాలి, ట్రాఫిక్ రూల్స్, టెక్నికల్ పాయింట్లు, బ్రేక్ డౌన్ సమయంలో మెకానికల్‌గా ఏ విధంగా చేయాలి, లైసెన్స్ ఏవిధంగా పొందాలి తదితర విషయాలను క్షుణ్ణంగా నేర్చుకున్నాను. ఈ 40 రోజుల శిక్షణ నాకు ఎంతగానో ఉపయోగపడింది. ఈ క్రెడిట్ మొత్తం నాన్నకే దక్కుతుంది. డ్రైవింగ్ నేర్చుకుంటానంటే నాన్న నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పొందేందుకు చేరిన సమయంలో నన్ను ఎంతోమంది కలిశారు. ఈ డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల కలిగే ఫలితాలను వారికి వివరించాను. వారిలో కూడా డ్రైవింగ్‌పై ఆసక్తి కలిగేలా చేశాను. హెవీ వెహికల్ డ్రైవింగ్ సమయంలో శిక్షకుడు వర్మ నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. పూర్తిస్థాయిలో మెలకువలు నేర్పించారు.’ అంటూ సారథిగా తన అనుభవాన్ని వివరించారామె. -
ఆటో, సెప్టిక్ ట్యాంక్ ఢీ, ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మాదాపూర్ డీమార్ట్ సమీపంలోని చౌరస్తావద్ద ప్రయాణికులతో వెళుతున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన సెప్టిక్ ట్యాంక్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతిచెందాడు. ఆటో డ్రైవర్ మహేష్ సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
మైండ్ బ్లోయింగ్