helicopter emergency landing
-
వీడియో: కేదార్నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన ప్రమాదం
డెహ్రాడూన్: కేదార్నాథ్ ఆలయం ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. భక్తులను కేదార్నాథ్ ధామ్‌కు తీసుకెళ్తున్న హెలికాప్టర్లో సాంకేతికలోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా హెలికాప్టర్ ఒడిదుడుకులకు లోనై భూమిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భక్తులు సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.వివరాల ప్రకారం.. భక్తులను కేదార్‌ధామ్‌కు తీసుకువెళ్తున్న ఒక హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతికలోపం తలెత్తడంతో పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. కేదార్నాథ్ ధామ్‌కు 100 మీటర్ల ముందు ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. Today morning at Kedarnath Helipad. Really superb handling. pic.twitter.com/oKMSwqIffR— Vaibhavi Limaye (@LimayeVaibhavi) May 24, 2024 ఈ సందర్బంగా హెలికాప్టర్ ఒడిదుడుకులకు లోనైంది. ఒకానొక సమయంలో హెలికాప్టర్ భూమిని బలంగా ఢీకొట్టింది. అనంతరం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమమంలో హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. భక్తులు కూడా పైలట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హెలికాప్టర్ ల్యాండింగ్ సందర్భంగా అది తమ మీద పడిపోతుందేమోనన్న భయంతో ఆలయం వద్ద ఉన్న భక్తులు పరుగు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. #Kedarnath #KedarnathVideo #Chardhampic.twitter.com/eMJ5EPZUVn— Pahadi Voice (@HimalayanRoars) May 24, 2024 -
సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
షిల్లాంగ్: వాతావరణం అనుకూలించకపోవటంతో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. షిల్లాంగ్‌లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో హెలికాప్టర్ దిగాల్సి ఉండగా.. వాతావరణం అందుకు అనుకూలించలేదు. దీంతో ఉమియామ్ సరస్సు సమీపంలో ల్యాండింగ్ చేశారు పైలట్లు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు సీఎం కాన్రాడ్ సంగ్మా. తురా నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఈ సంఘటన ఎదురైనట్లు పేర్కొన్నారు. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన యూనియన్ క్రిస్టియన్ కాలేజీ క్యాంపస్‌లోని పర్యావరణాన్ని ఆస్వాదించానని పేర్కొన్నారు సంగ్మా. తమను సురక్షితంగా కిందకు చేర్చినందుకు హెలికాప్టర్ కెప్టెన్, పైలట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎంత సాహసం! వాతావరణం అనుకూలించక ఉమియామ్‌లోని యూసీసీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. క్యాంపస్‌లోని అందమైన ప్రకృతిని ఆస్వాదించాను. యూసీసీ సిబ్బందిని కలిశాను. అక్కడి క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం చేశాను.’ అని రాసుకొచ్చారు సంగ్మా. What an adventure! •Emergency Landing at UCC, Umiam due to bad weather •Enjoyed the beautiful scenery in the Campus •Met with staff of UCC •Lunch in UCC Canteen The weather is truly unpredictable. Thank the Captain & Pilot for bringing us back safely. pic.twitter.com/D4rMAzGYhC — Conrad Sangma (@SangmaConrad) November 2, 2022 ఇదీ చదవండి: గోవాలో ఇకపై ఈ పనులు చేస్తే భారీగా జరిమానా -
యూపీ సీఎం యోగికి తృటిలో తప్పిన ప్రమాదం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. సీఎం యోగి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను వారణాసిలో ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేశారు. అయితే, సీఎం యోగి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాల ప్రకారం.. రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం యోగి.. వారణాసికి వెళ్లారు. కాగా, ఆదివారం వారణాసిలోని రిజర్వ్ పోలీస్ లైన్స్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్లో లక్నోకు బయలుదేరారు. ఈ క్రమంలో హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో పైలెట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. అనంతరం సీఎం యోగి, సిబ్బందిని వేరే హెలికాప్టర్లో లక్నోకు తరలించినట్టు జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్‌రాజ్ శర్మ చెప్పారు. కాగా, శనివారం నాడు వారణాసిలో పర్యటించి అభివృద్ది పనులు, శాంతిభద్రతలను సీఎం యోగి సమీక్షించారు. ఆదివారం నాడు లక్నోకు బయలుదేరే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. UP CM Yogi Adityanath's helicopter made an emergency landing at Varanasi airport after a bird-hit incident today. The CM and his staff are safe and will be travelling to Lucknow by another aircraft: DM Varanasi (file pic) pic.twitter.com/ucjR9cZdaH — ANI UP/Uttarakhand (@ANINewsUP) June 26, 2022 -
ప్రాక్టీస్ సమయంలో వింత అనుభవం.. మళ్లీ బుక్కైన రసెల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022) ఏ ముహూర్తానా మొదలైందో కానీ.. చిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతవారం రసెల్‌ను విధి ఆడుకున్న తీరు అంత తొందరగా ఎవరు మరిచిపోలేరు. ఎవరూ ఊహించని రీతిలో రనౌట్ అయిన ఆండ్రీ రసెల్ మరోసారి బుక్కయ్యాడు. ఈసారి రనౌట్ మాత్రం కాదులెండి..హెలికాప్టర్ రూపంలో రసెల్‌ను భయపెట్టింది.బీపీఎల్‌లో భాగంగా చిట్టోగ్రామ్‌లోని ఎంఏ ఆజీజ్ స్టేడియంలో రసెల్ సహా తమీమ్ ఇక్బాల్, మోర్తజా, మహ్మద్ షెహజాద్‌లు సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. చదవండి: Andre Rusell: రసెల్‌తో ఆడుకున్న 'విధి'.. క్రికెట్ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం ఇదే సమయంలో స్డేడియంలో ఒక హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దీంతో రసెల్ సహా మిగిలిన ఆటగాళ్లు ఏం జరిగిందోనని భయపడిపోయారు. విషయం ఏంటని ఆరా తీయగా.. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే దీనికి ముందు ఎయిర్వేస్ అధికారులు జిల్లా కమిషనర్‌తో పాటు స్పోర్ట్స్ అసోసియేషన్‌తో మాట్లాడారు. వీరి చొరవతో..చట్టోగ్రామ్ స్టేడియం అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారని తెలిసింది. ఆ తర్వాత అంబులెన్స్‌లో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ విషయం ఆటగాళ్లకు తెలియక కాస్త కంగారుపడ్డారు. అయితే ఈ విషయాన్ని బీపీఎల్ తన ట్విటర్లో షేర్ చేయగా..''పాపం రసెల్‌ను నిజంగా ఏదో వెంటాడుతుంది.. మళ్లీ బుక్కైన రసెల్.. బీపీఎల్‌లో ఈ ఏడాది ఏది కలిసిరావడం లేదు..'' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: BBL 2021-22: రసెల్ సునామీ ఇన్నింగ్స్.. సిక్సర్లతో ఊచకోత..! Helicopter lands suddenly in Chattogram when Andre Russell, Tamim Iqbal were practicing 😲#BPL2022 #AndreRussell #TamimIqbal #Cricket pic.twitter.com/9TpwavCTQ5 — SportsTiger (@sportstigerapp) February 1, 2022 -
సీఎం హెలికాప్టర్ ఎమర్జన్సీ ల్యాండింగ్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రమాదం తప్పింది. సోమవారం సిద్ధరామయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. కర్ణాటక సీఎం.. హోంమంత్రి పరమేశ్వర, మరో ముగ్గురితో కలసి శ్రావణబెళగలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు హెలికాప్టర్లో బయల్దేరారు. కాగా హెలికాప్టర్ బయలుదేరిన కొద్దిసేపటికే పక్షి ఢీకొనడంతో పైలట్ వెంటనే బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పక్షి ఢీకొనడం వల్ల హెలికాప్టర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొద్ది నిమిషాల తర్వాత సీఎం బృందం అదే హెలికాప్టర్లో శ్రావణబెళగలకు బయల్దేరి వెళ్లింది.