Yogi Adityanath Helicopter Makes Emergency Landing In Varanasi After Bid, Details Inside - Sakshi
Sakshi News home page

Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Published Sun, Jun 26 2022 11:20 AM | Last Updated on Sun, Jun 26 2022 11:56 AM

Yogi Adityanath Helicopter Makes Emergency Landing - Sakshi

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. సీఎం యోగి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను వారణాసిలో ఎమర్జెన్సీగా ల్యాండింగ్‌ చేశారు. అయితే, సీఎం యోగి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో అప్రమత్తమైన పైలెట్‌ వెంటనే అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం యోగి.. వారణాసికి వెళ్లారు. కాగా, ఆదివారం వారణాసిలోని రిజర్వ్‌ పోలీస్‌ లైన్స్‌ గ్రౌండ్‌ నుంచి హెలికాప్టర్‌లో లక్నోకు బయలుదేరారు. ఈ క్రమంలో హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో పైలెట్‌ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. అనంతరం సీఎం యోగి, సిబ్బందిని వేరే హెలికాప్టర్‌లో లక్నోకు తరలించినట్టు జిల్లా మేజిస్ట్రేట్‌ కౌశల్‌రాజ్ శర్మ చెప్పారు.

కాగా, శనివారం నాడు వారణాసిలో పర్యటించి అభివృద్ది పనులు, శాంతిభద్రతలను సీఎం యోగి సమీక్షించారు. ఆదివారం నాడు లక్నోకు బయలుదేరే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement