Helpers Union
-
ఐక్యతతో మరిన్ని విజయాలు
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కాకినాడ సిటీ : స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వం సంఘాన్ని చీల్చాలని చేస్తున్న ప్రయత్నాలను చైతన్యంతో ఎదుర్కొని ఐక్యతతో మరిన్ని విజయాలు సాధించుకుందామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు నిచ్చింది. వేతనాల పెంచుతూ జీఓ విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ యూనియన్ విజయోత్సవ సమావేశం గురువారం సుందరయ్యభవన్‌లో జరిగింది. అనంతరం సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడీల పోరాట ఫలితంగానే జీఓ నంబర్ 8 వచ్చిందన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసిన విధంగా 2015 నుంచి కాకుండా ఏప్రిల్ నుంచి అమలు చేయడం వల్ల అంగన్వాడీలు 7 నెలల వేతనాన్ని కోల్పోయారన్నారు. చలో విజయవాడలో పాల్గొన్న అంగన్వాడీలను తొలగించాలని ఇచ్చిన మెమోనంబర్ 5557ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అంగన్వాడీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇదే కొనసాగితే ఆందోళనలు చేపడతామన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.వీరలక్ష్మి, ఎస్కే ఫాతిమా పాల్గొన్నారు. -
వైఎస్సే ఆదుకున్నారు...
అంగన్వాడీల ఆందోళన బాట అమీర్‌పేట: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అంగన్వాడీ కార్యకర్తలను ఆదుకున్నారని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వారు పట్టించుకోవడం లేదని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్ సమస్యల పరిష్కారంతో పాటు తెల్లరేషన్ కార్డు, పింఛన్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అమీర్‌పేటలోని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట సోమవారం వారు ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. తమ వేతనాలను పెంచాలని, గతంలో మాదిరిగా వితంతు, వికలాంగుల పింఛన్లు ఇవ్వాలని కోరా రు. మహిళలు కార్యాల యం లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నిం చగా, పోలీసులు అడ్డుకున్నారు. యూనియన్ నాయకులతో పాటు 10 మంది కార్యకర్తలను లోపలికి అనుమతించారు. దీం తో వారు వెళ్లి జాయింట్ డెరైక్టర్ పి.సంధ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను ఏకరవు పెట్టారు. దీనిపై జేడీ స్పందిస్తూ సమస్యలను క మిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హ మీ ఇచ్చారు. కార్యక్రమంలో యూ నియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.నిర్మల, పి.జయలక్ష్మి, సీఐటీయూ, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం.వెంకటేష్, మల్లేష్, జయపాల్‌రెడ్డి, నర్సమ్మ, మహేశ్వరి, అజయ్‌బాబు, మల్లీశ్వరి, బేబి, భారతి, లక్ష్మి, బాలమణి పాల్గొన్నారు. -
అంగన్వాడీల పోరుబాట
నేడు కలెక్టరేట్ వద్ద ఆందోళన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ విజయవాడ : ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో అంగన్వాడీ సిబ్బంది పోరాటానికి నడుం బిగించారు. ముందుగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వడంతో జిల్లాలో అంగన్వాడీ సిబ్బంది గురువారం తమ విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు సమాయత్తమయ్యారు. జిల్లాలో 3,500 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వాటిలో దాదాపు ఏడు వేల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లుగా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 2013 ఫిబ్రవరిలో 13 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేశారు. అప్పటి ప్రభుత్వం వర్కర్‌కు, హెల్పర్‌కు ఒక్కొక్కరికి రూ.800 చొప్పున వేతనం పెంచుతామని, సమ్మె కాలంలో వేతనం ఇస్తామని, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పిస్తామనే ఒప్పందంతో సమ్మెను విరమింపజేసింది. అప్పట్లో రాష్ట్రస్థాయి అధికారులు ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చినా హామీలు అమలు చేస్తామని చెప్పారు. సమ్మెకాలంలో వేతనాలకు కోత గత ప్రభుత్వ హామీ నేటివరకు కార్యచరణకు నోచుకోలేదు. అప్పట్లో సమ్మె చేసిన 13 రోజుల వేతనాలు కూడా కోత వేశారు. ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్‌కు రూ.4,200, హెల్పర్‌కు రూ.2,200 చొప్పున వేతనాలు ఇస్తున్నారు. ఒప్పందం ప్రకారం రూ.800 చొప్పున వేతనం పెంచాలని, సమ్మె కాలంలో కోత విధించిన వేతనాలు వెంటనే చెల్లించాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించే ప్రైవేటు భవనాలకు షరతులు లేకుండా అద్దె ఇవ్వాలని, ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వోద్యోగులకు ఇచ్చేవిధంగా ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. తమను పూర్తికాలపు ఉద్యోగులుగా పరిగణించి సర్వీసు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టారు. ఈ ఆందోళనకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎన్నికల హామీ నిలబె ట్టుకోవాలి మా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆందోళన చేస్తున్నాం. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో ప్రకటించినవిధంగా అంగన్వాడీ సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలి. గత సమ్మె కాలంలో కోత విధించిన వేతనాలు వెంటనే చెల్లించాలి. వేతనాలు పెంచాలి. అంగన్వాడీలందరూ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలి. - సుప్రజ, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు -
సమస్యలు పరిష్కరించాలి
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కారించాలని కోరుతూ అంగన్వాడీ సిబ్బంది సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సమస్యలను పరిష్కరించాలని కొంతకాలంగా పోరాటం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిచ్చింది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు ఉదయానికే కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నాయకులు ఎ.విజయమ్మ, ఎం.ఉమామహేశ్వరి మాట్లాడుతూ, ఐసీడీఎస్‌తో పాటూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వాములైన తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. పెంచిన జీతం ఇంతవరకు అమలు చేయలేదన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రసూతి సెలవులతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. అంగన్వాడీల ధర్నా విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ పీడీ శ్రీనివాస్ సిబ్బంది వద్దకు వచ్చి సమస్యలు విన్నారు. సమస్యలపై చర్చించేందుకు యూనియన్ నాయకులతో జాయింట్ మీటింగ్ పెడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు విజయ, పి. జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.