వైఎస్సే ఆదుకున్నారు...
అంగన్‌వాడీల ఆందోళన బాట
అమీర్‌పేట: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అంగన్‌వాడీ కార్యకర్తలను ఆదుకున్నారని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వారు పట్టించుకోవడం లేదని తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్ సమస్యల పరిష్కారంతో పాటు తెల్లరేషన్ కార్డు, పింఛన్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అమీర్‌పేటలోని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట సోమవారం వారు ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. తమ వేతనాలను పెంచాలని, గతంలో మాదిరిగా వితంతు, వికలాంగుల పింఛన్లు ఇవ్వాలని కోరా రు.
మహిళలు కార్యాల యం లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నిం చగా, పోలీసులు అడ్డుకున్నారు. యూనియన్ నాయకులతో పాటు 10 మంది కార్యకర్తలను లోపలికి అనుమతించారు. దీం తో వారు వెళ్లి జాయింట్ డెరైక్టర్ పి.సంధ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను ఏకరవు పెట్టారు. దీనిపై జేడీ స్పందిస్తూ సమస్యలను క మిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హ మీ ఇచ్చారు. కార్యక్రమంలో యూ నియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.నిర్మల, పి.జయలక్ష్మి, సీఐటీయూ, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం.వెంకటేష్, మల్లేష్, జయపాల్‌రెడ్డి, నర్సమ్మ, మహేశ్వరి, అజయ్‌బాబు, మల్లీశ్వరి, బేబి, భారతి, లక్ష్మి, బాలమణి పాల్గొన్నారు.