చిత్తూరు (అర్బన్): దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే కార్మికులు, కర్షకులకు న్యాయం జరిగిందని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పీవీ.గాయత్రీదేవి పేర్కొన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం చిత్తూరు నగరంలోని న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఆవరణలో వైఎస్సార్ టీయూసీ ఆధ్వర్యంలో సం బరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్మికులకు పంచిపెట్టారు. గాయత్రీదే వి మాట్లాడుతూ వైఎస్ సీఎంగా ఉన్నపు డు కార్మికుల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. వారి భద్రత కోసం బీమా, కార్మికుల పిల్లలకు ప్రత్యే క చదువులు, రుణాలు లాంటివి అమ లు చేశారని గుర్తు చేశారు.
ఆయన మరణానంతరం వచ్చిన నాయకులు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నార ని విమర్శించారు. కార్మికులంతా ఐక్యం గా ఉద్యమించి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌టీయూసీ అధ్యక్షు డు రమేష్, ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రారెడ్డి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, విద్యార్థి విభాగం అధ్యక్షులు షేరూఖాన్, పార్టీ కార్యకర్తలు ప్రభాకరరెడ్డి, పయణి, పిచ్చాండి, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్‌తోనే కార్మిక సంక్షేమం
Published Sat, May 2 2015 4:11 AM | Last Updated on Sat, Aug 11 2018 5:44 PM
Advertisement