Heroine Trisha
-
నిర్మాతతో మొరాకో టూర్లో హీరోయిన్ త్రిష! (ఫొటోలు)
-
హీరోయిన్ త్రిష అందం వెనకున్న సీక్రెట్స్ తెలుసా?
ప్రముఖ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అయినా ఇప్పటికీ స్టార్ హీరోయన్‌గా తన ఛరిష్మాను కంటిన్యూ చేస్తోంది. కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ త్రిషకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది.16 సంవత్సరాల వయస్సులో మిస్ మద్రాస్ టైటిల్ ను గెలుచుకున్న త్రిష తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. వర్షం సినిమాతో స్టార్‌డమ్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘అతడు’ ‘స్టాలిన్’ వంటి చిత్రాలతో వరుస హిట్స్‌ని ఖాతాలో వేసుకుంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన త్రిష కెరీర్ మధ్యలో కాస్త డల్ అయిన త్రిష మళ్లీ ఈ మధ్యనే ‘పొన్నియన్ సెల్వన్' చిత్రంతో యువరాణి కుందవై పాత్రలో నటించి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ కంటే త్రిషకే ఎక్కువ పేరు వచ్చింది. నాలుగు పదుల వయసులోనూ ఇరవైఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుందంటూ త్రిష అందానికి సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోయారు. మరి ఇంత అందంగా కనిపించడానికి త్రిష ఏం చేస్తుంది అని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే.. ''గ్రీన్ టీ.. లేదా గ్లాసుడు గోరు వెచ్చని నీటిలో కాసిన్ని నిమ్మ చుక్కలతో నా ‘డే’ మొదలవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మిస్ అవను. నా మెన్యూలో జంక్ ఫుడ్‌కి చోటు లేదు. కంటి నిండా నిద్ర కరువయ్యే చాన్స్ లేదు. మొత్తమ్మీద డిసిప్లిన్ లైఫ్ స్టయిలే నా బ్యూటీ సీక్రెట్''! అంటూ పేర్కొంది. -
పొన్నియిన్ సెల్వన్‌తో క్రేజ్.. త్రిషకు మరో సూపర్ ఛాన్స్
ప్రస్తుతం నటి త్రిష క్రేజ్ మామూలుగా లేదు. దర్శకుడు మణిరత్నం పుణ్యమా అంటూ పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవై పాత్రలో నటించే అవకాశం ఈమె తలుపు తట్టింది. అంతే ఆ చిత్ర తొలి భాగంలో నటి ఐశ్వర్య రాయ్ కంటే కూడా ఎక్కువ పేరు తెచ్చుకుంది. పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రం కూడా విజయం సాధించడంతో త్రిష తన హవాను మరోసారి కొనసాగిస్తోంది. ప్రస్తుతం నటుడు విజయ్‌కి జంటగా లియో చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా ది రోడ్ అనే లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం ఈ బ్యూటీ చేతిలో ఉంది. త్వరలో అజిత్ కథానాయకుడిగా నటించనున్న విడాముయర్చి చిత్రంలో కూడా హీరోయిన్గా త్రిష పేరే వినిపిస్తోంది. కాగా తాజాగా మరో లక్కీ చాన్స్ త్రిష వరించింది. అలాగే మరో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోంది. చదవండి: కాంతార తరహాలో.. ఆది పినిశెట్టి హీరోగా కొత్త చిత్రం ఇంతకుముందు పలు భారీ చిత్రాలను నిర్మించిన వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరి గణేష్ నిర్మిస్తున్న నూతన చిత్రంలో నాయకిగా ఈ బ్యూటీ నటించనుంది. దీనికి గౌరవ్ నారాయణ దర్శకత్వం వహించనున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్లో రూపొందునున్న ఈ చిత్రంలో ముఖ్య ముఖ్యపాత్రల కోసం ప్రముఖ నటులను సంప్రదిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. త్వరలోనే చిత్ర షూటింగ్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. -
విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు.. త్రిష షాకింగ్ కామెంట్స్
స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. 40కి చేరువవుతున్నా ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా సత్తాచాటుతుంది. ఇటీవలె లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కుందవై పాత్రలో నటించి మెప్పించింది. ఐశ్వర్యరాయ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. అయితే ప్రమోషన్స్‌లోనూ ఐష్‌ను డామినేట్ చేసేలా త్రిష ఎంతో అందంగా కనిపించింది. ఈ క్రమంలో త్రిష పెళ్లి విషయం మరోసారి తెరమీదకి వచ్చింది. తాజాగా ఈ విషయంపై త్రిష మాట్లాడుతూ.. 'నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదని చాలామంది అడుగుతుంటారు. కానీ వాళ్లు అడిగే విధానం నాకు అస్సలు నచ్చదు. త్రిష ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అని అడగడం ఓకే కానీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నించడం కరెక్ట్ కాదు. ఇది నా వ్యక్తిగతం. పెళ్లెప్పుడు అంటే చెప్పలేదు. ఎందుకంటే నాతో జీవితాంతం కలిసి ఉండే వ్యక్తొ దొరకాలి. నా ఫ్రెండ్స్, సన్నిహితుల్లో చాలామంది పెళ్లి చేసుకొని సంతృప్తిగా లేరు. పిల్లల కోసమో, కుటుంబం కోసమో కలిసుంటున్నారు. ఇంకొంత మంది ఇప్పటికే విడాకులు తీసుకున్నారు. అలా మధ్యలో ముగిసిపోయే బంధాలు నాకు వద్దు. అందుకే నా పెళ్లి ఆలస్యం అవుతోంది' అంటూ త్రిష చెప్పుకొచ్చింది. -
విజయ్‌తో త్రిష.. 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు
హీరో విజయ్‌తో హీరోయిన్ త్రిష మరోసారి జోడీ కట్టనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ‘మాస్టర్’ (2021) తర్వాత విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుందని టాక్. ఆల్రెడీ ఈ చిత్రంలో సమంత ఓ హీరోయిన్గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ మూవీలో మరో హీరోయిన్ పాత్రలో త్రిష యాక్ట్ చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. లోకేష్ అండ్ టీమ్ ఇప్పటికే త్రిషను సంప్రదించారట. కాగా ‘గిల్లి’ (2004), ‘తిరు పాచ్చి’ (2005), ‘ఆతి’(2006), ‘కురివి’(2008) చిత్రాల్లో విజయ్, త్రిష కలిసి నటించారు. తాజా సినివలో మరోసారి వీరిద్దరూ నటిస్తే దాదాపు 14 సంవత్సరాల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది. మరి.. విజయ్‌తో త్రిష ఐదోసారి జోడీ కడతారా? వే చూడాలి. -
అలాంటివాళ్లంటే అసహ్యం
పదిహేనేళ్ల కెరీర్.. 34ఏళ్ల వయసు... మామూలుగా అయితే చాలామంది కథానాయికలు ఈపాటికి రిటైర్ అయిపోతారు. కానీ, త్రిషలాంటి తారలు మాత్రం జోరుగా దూసుకెళ్లగలుగుతారు. ప్రస్తుతం ఈ చెన్నై బ్యూటీ చేతిలో అరడజను సినిమాలున్నాయి. హ్యాపీగా ఉండటానికి ఇంతకన్నా ఏం కావాలి? అంటున్నారు త్రిష. ఇంకా బోలెడన్ని విషయాలు చెప్పారు. ► కథానాయికగా మీ ఇన్నేళ్ల సక్సెస్‌కు కారణం? నా అభిమానులు, మంచి స్క్రిప్ట్స్, దర్శకులు నా మీద పెట్టుకున్న నమ్మకం. ► ఇన్నేళ్ల కెరీర్లో ఎదురైన అత్యంత కష్టమైన సంఘటన? వరుసగా 120 రోజులు వర్షంలో షూటింగ్ జరిపాం. అప్పుడు ఇబ్బంది పడ్డాను. ► రెమ్యునరేషన్, స్క్రిప్ట్, హీరో.. సినిమా సైన్ చేయడానికి మీ ప్రాధాన్యం? స్క్రిప్ట్, స్టార్ క్యాస్ట్, రెమ్యునరేషన్... ఇది ఆర్డర్. ► ఫెయిల్యూర్ నుంచి బయటపడటానికి ఏం చేస్తారు? ఆత్మపరిశీలన చేసుకుని మరింత కష్టపడేలా ప్లాన్ చేసుకుంటాను. ► జీవితంలో మీరు గర్వంగా ఫీలైన సందర్భం? నంది, ఎన్డీటీవీ అవార్డ్స్ తీసుకున్నప్పుడు. ► ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు? హుందాగా ఉండేవాళ్లంటే ఇష్టం. కపటవేషగాళ్లు, అవసరానికి వాడుకుని వదిలేసేవాళ్లంటే పరమ అసహ్యం. ► వన్‌సైడ్ లవ్ గురించి చెబుతారా? వన్ సైడ్ లవ్వా.. దాని గురించి నేను చెప్పలేను. ఎందుకంటే నేనెప్పుడూ వన్ సైడ్ లవ్ చేయలేదు. ► వయసులో పెద్ద అమ్మాయి చిన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడంపై మీ అభిప్రాయం? వాళ్ల మనస్తత్వాలు కలిసి, అన్నీ పర్ఫెక్ట్గా కుదిరితే ఓకే. బాగానే ఉంటుంది. ► చెన్నైలో మీ ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్? మై హోమ్ థియేటర్. ► మీ ఫేవరెట్ వర్కవుట్స్? బాక్సింగ్, యోగా. ► సమస్యలను ఎదుర్కోలేనప్పుడు ఏం చేస్తారు? మా అమ్మగారి సహాయం తీసుకుంటా. -
రాజకీయ నేతగా త్రిష!
ఈ ఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగనున్న వేళ హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి వచ్చారా? ఏంటి? రాజకీయ నాయకుల ఫక్కీలో నమస్కారం పెడుతున్న త్రిష బొమ్మలు గోడల మీద కనిపించడంతో తమిళనాట ఇప్పుడు అందరూ అదే అనుకుంటున్నారు. విషయమేమిటని ఆరా తీస్తే, ఆ పోస్టర్లు, గోడ మీద రాతలన్నీ త్రిష కొత్త సినిమాలోని పాత్రకు సంబంధించినవట! ధనుష్ సరసన తొలిసారిగా త్రిష నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా పేరు - ‘కొడి’. అంటే తమిళంలో ‘జెండా’ అని అర్థం. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాత కూడా ధనుషే. ఇందులో ఆయన తొలిసారిగా అన్నదమ్ముల పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రెండో హీరోయిన్గా షామిలి నటిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష పేరు ‘రుద్ర’ అనీ, ఇందులో ఒక ఘట్టంలో ఎన్నికల్లో పోరాడే రాజకీయ నాయకురాలిగా ఆమె కనిపిస్తారనీ కోడంబాకమ్ కబురు. మొత్తానికి, కథానాయిక త్రిష ఇప్పుడు కెరీర్లో కొత్త దశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు గ్లామర్ పాత్రల్లో కనిపించిన ఆమె ఇప్పుడు కొత్త తరహా పాత్రల వైపు మొగ్గుచూపుతున్నారను కోవచ్చు. ఈ చెన్నై సుందరి ఇటీవల నటిస్తున్న సినిమాలు, చేస్తున్న పాత్రలే అందుకు ఉదాహరణ. కమలహాసన్ ‘చీకటి రాజ్యం’లో పోలీసు అధికారిగా, ఈ మధ్యే ‘కళావతి’ (తమిళ మాతృక ‘అరణ్మణై-2’)లో భీతిల్లిన హీరోయిన్గా, తెలుగు- తమిళాల్లో రూపొందుతోన్న హార్రర్ థ్రిల్లర్ ‘నాయకి’ చిత్రంలో 1980ల నాటి ఫ్యాషన్‌లో కనిపించే నాయికగా - ఇలా మునుపటి కన్నా భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. వీటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు ధనుష్ సినిమాలో రాజకీయ నేతగా కనిపించడం విశేషం. వెరసి, ప్రేమ, పెళ్ళి వ్యవహారాలన్నీ పక్కనపెట్టేశాక, ఈ అందగత్తె కొత్త తరహా పాత్రల పైనే దృష్టి పెడుతున్నారనుకోవాలి. అదీ ఒకందుకు మంచిదే!