ప్రస్తుతం నటి త్రిష క్రేజ్ మామూలుగా లేదు. దర్శకుడు మణిరత్నం పుణ్యమా అంటూ పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవై పాత్రలో నటించే అవకాశం ఈమె తలుపు తట్టింది. అంతే ఆ చిత్ర తొలి భాగంలో నటి ఐశ్వర్య రాయ్ కంటే కూడా ఎక్కువ పేరు తెచ్చుకుంది. పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రం కూడా విజయం సాధించడంతో త్రిష తన హవాను మరోసారి కొనసాగిస్తోంది.
ప్రస్తుతం నటుడు విజయ్‌కి జంటగా లియో చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా ది రోడ్ అనే లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం ఈ బ్యూటీ చేతిలో ఉంది. త్వరలో అజిత్ కథానాయకుడిగా నటించనున్న విడాముయర్చి చిత్రంలో కూడా హీరోయిన్‌గా త్రిష పేరే వినిపిస్తోంది. కాగా తాజాగా మరో లక్కీ చాన్స్ త్రిష వరించింది. అలాగే మరో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోంది. చదవండి: కాంతార తరహాలో.. ఆది పినిశెట్టి హీరోగా కొత్త చిత్రం
ఇంతకుముందు పలు భారీ చిత్రాలను నిర్మించిన వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరి గణేష్ నిర్మిస్తున్న నూతన చిత్రంలో నాయకిగా ఈ బ్యూటీ నటించనుంది. దీనికి గౌరవ్ నారాయణ దర్శకత్వం వహించనున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్లో రూపొందునున్న ఈ చిత్రంలో ముఖ్య ముఖ్యపాత్రల కోసం ప్రముఖ నటులను సంప్రదిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. త్వరలోనే చిత్ర షూటింగ్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment