high percentage
-
అమెరికా సీరియల్ కిల్లర్ స్కోరు 50 పైనే!!
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన సీరియల్ కిల్లర్‌గా పేరుపడ్డ శామ్యూల్ లిటిల్(79)... హతమార్చిన వారి స్కోరు 50 పైనేనట. దర్యాప్తు అధికారుల ఎదుట చెప్పినదాని ప్రకారం శామ్యూల్ ఏకంగా 93 హత్యలకు పాల్పడ్డాడు. అయితే, అతడు చెప్పిన ఆధారాల ప్రకారం 50 హత్యల్లోనే అతడి ప్రమేయం ఉంది. హతుల్లో అత్యధికులు మహిళలే. ఇవన్నీ 1970–2005 మధ్య చేసినవే. కొందరి మృతదేహాలు ఇప్పటికీ దొరకలేదు. మూడు హత్యలకు శిక్ష పడటంతో 2014లో శామ్యూల్ జైలు పాలయ్యాడు. ‘ఎప్పటికీ దొరకనని శామ్యూల్ అనుకునేవాడు. అన్ని హత్యల గురించీ దర్యాప్తు చేస్తున్నాం’ అని ఎఫ్‌బీఐ అధికారి క్రిస్టీ పలాజొలో చెప్పారు. శామ్యూల్ ఒకప్పుడు బాక్సర్. 2012లో కెంటకీ పోలీసులకు అతడు దొరికిపోయాడు. -
ఈసారి ఓట్ల సునామీ!
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇంత వరకు జరిగిన నాలుగు దశల పోలింగ్ సరళి ఇక ముందు జరిగే మూడు దశల్లోకూడా కొనసాగితే ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని తాజా అధ్యయనం అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతవరకు నాలుగు దశలు పూర్తయ్యాయి. ఇంకా మూడు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఆ దశల్లో పోలింగు శాతం ఇప్పటి కంటే ఒక శాతం పెరిగినా స్వతంత్ర భారతంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదయిన ఎన్నికలుగా ఈ ఎన్నికలు చరిత్ర సృష్టిస్తాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో వెల్లడయింది. ఈ ఎన్నికల్లో 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని అంచనా. ఇంత వరకు జరిగిన నాలుగు దశల్లో 67శాతం ఓట్లు పోలయ్యాయని, 2014 ఎన్నికల్లో ఇది 67.6 శాతంగా ఉందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. వచ్చే మూడు దశల్లో పోలింగ్ ఒక శాతం పెరిగినా ఇదే అత్యధిక పోలింగు శాతమవుతుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, గుజరాత్, కర్ణాటకల్లో ఈ సారి పోలింగ్ శాతం గత 57 ఏళ్ల కంటే ఎక్కువగా ఉందని, 1962 నుంచి చూస్తే ఇదే అత్యధికమని ఎస్బీఐ నివేదిక తెలిపింది. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో 30 ఏళ్లలో ఇదే ఎక్కువ పోలింగ్ శాతం. ప్రజలకు వారి హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన పెరిగిందనడానికి పోలింగ్ శాతం పెరగడమే నిదర్శనమని నివేదిక వ్యాఖ్యానించింది. ఈసారి ఎన్నికల్లో వృద్ధులు, మహిళలే కాక యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని పేర్కొంది. అస్సాం, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్(రూరల్), రాజస్థాన్(రూరల్)లలో 18–25 ఏళ్ల ఓటర్లు పోలింగులో ఎక్కువగా పాల్గొన్నారని, వీరి పోలింగు శాతం జాతీయ సగటు పోలింగు శాతం కంటే ఎక్కువగా ఉందని నివేదిక వివరించింది. -
బడభాగ్ని
నెల్లూరు(పొగతోట) : జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్న మొన్నటి వరకు చలి, మంచు ప్రభావంతో పెద్దగా ఎండ తీవ్రత అనిపించలేదు. ఒక్కసారిగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల దృష్ట్యా 5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తరచూ నిలిచిపోవడంతో ఎండకు, ఉక్కపోతకు ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల అవస్థలు వర్ణనాతీతం. రాబోయే వారం రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కానున్నాయి. గతేడాది ఏప్రిల్ 17వ తేదీ 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే 2018 ఏప్రిల్ 17వ తేదీ 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమయ్యాయి. రాబోయే వారం రోజుల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి భానుడి ప్రభావం ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటే ప్రజలు బయపడిపోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి నగరంలోని ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వ్యాపార సంస్థలు వినియోగదారులు రాకపోవడంతో బేరాలు లేక ఎదురు చూపులు చూస్తున్నారు. సినిమా థియేటర్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు ప్రజలతో కిక్కిరిసి పోతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడంలేదు. సాయంత్రం 6.30 గంటల తర్వాత చల్లగాలు వీస్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. నగరంలో 38.5 డిగ్రీలు నమోదైతే ఉదయగిరి ప్రాంతంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, విపత్తుల నివారణ సంస్థ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే కానీ బయటకు రావదంటున్నారు. ఉదయం 9 సాయంత్రం 6 గంటల తర్వాత ప్రయాణాలు చేయాలని సూచిస్తున్నారు. మంచినీరు, మజ్జిగా అధికంగా తీసుకోవాలంటున్నారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా గొడుగు వేసుకోవాలంటున్నారు. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
ఇంగ్లిష్ మీడియం విద్యార్థులదే హవా
హైదరాబాద్ సిటీ: పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల సరాసరితో పోల్చితే ఇంగ్లీష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతం ఎక్కువగా నమోదైంది. మొత్తంగా 77.56 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఇంగ్లీష్ మీడియంలో మాత్రం 82.41 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక తెలుగు మీడియంలో 73.32 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు స్కూళ్లతోపాటు ప్రభుత్వ సక్సెస్ స్కూళ్లు, గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గతేడాదితో పోల్చితే తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగింది. గత ఏడాది తెలుగు మీడియం విద్యార్థులు 2,50,073 మంది పరీక్షలకు హాజరు కాగా అందులో 2,08,023 మంది (83.18 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అదే ఇంగ్లీష్ మీడియంలో 2,36,998 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,11,723 మంది (89.34 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోల్చితే ఈసారి రెండు మాధ్యమాలలో ఉత్తీర్ణత శాతం తగ్గినా ఇంగ్లిషు మీడియంలో చేరి పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య పెరిగింది. మీడియం వారీగా పరీక్షలకు హాజరైన ఉత్తీర్ణులైన విద్యార్థుల వివరాలు.. మీడియం హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణులు ఉత్తీర్ణతశాతం తెలుగు 2,44,448 1,79,221 73.32 ఇంగ్లిషు 2,56,363 2,11,281 82.41 ఉర్దూ 11,713 7034 60.05 ఇతర 949 731 77.03 మొత్తం 5,13,473 3,98,267 77.56