High tech city
-
హోలీ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న యూత్
-
మాదాపూర్: ప్రేయసిపైనే అత్యాచారం.. ఆపై దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపైనే అత్యాచారం చేసి.. ఆమె ప్రాణం తీశాడో ప్రియుడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాలుప్రసాద్ అనే యువకుడు హైటెక్‌సిటీ ఔట్‌పోస్ట్ వద్ద తన ప్రేయసిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు నిందితున్ని సీసీటీవీ కెమెరాల ఆధారం పట్టుకొని అరెస్ట్ చేశారు. తనతో కాకుండా నరేష్ అనే యువకునితో సన్నిహితంగా ఉంటుందనే అక్కసుతోనే తను ఆమెను అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు పోలీసులు ముందు లాలుప్రసాద్ ఒప్పుకున్నాడు. -
హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో జరిగిన స్వల్ప అగ్ని ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం స్టేషన్లో వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు ఎగిరి పడ్డాయి. దీంతో మంటలు చెలరేగటంతో... వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు వెల్డింగ్ పనులు చేస్తున్న వారికి స్వల్ప గాయాలు కాగా వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించి వీడియో .... -
నగరానికి ‘ఐటీ’హారం!
- హైటెక్‌సిటీ తరహాలో మరో భారీ టవర్ - చిన్న ఐటీ కంపెనీల కోసం నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం - మాదాపూర్ పరిసరాల్లో ఏర్పాటుకు నిర్ణయం.. రాబడుల ఆధారంగా కంపెనీల స్థాయి నిర్ధారణ - కార్పొరేట్ ప్రాంగణాలకు మిన్నగా మౌలిక సదుపాయాల కల్పన - మూలధనం కోసం రుణసాయం అందించేలా చర్యలు.. కొత్తగా మరిన్ని - ఐటీ పార్కుల అభివృద్ధికి సర్కారు నిర్ణయం - ‘ఔటర్’ చుట్టూ ఐటీ కారిడార్ - నూతన ఐటీ విధానంలో ప్రకటించనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: నగరాన్ని దేశ ఐటీ రాజధానిగా మార్చాలని సంకల్పించుకున్న ప్రభుత్వం... చిన్న ఐటీ కంపెనీలకు ఊతమిచ్చేలా భారీ ఐటీ టవర్లను నిర్మించనుంది. హైటెక్‌సిటీలోని సైబర్ టవర్స్ తరహాలో ఈ భారీ టవర్లను నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఐటీ కంపెనీలకు అనువైన ప్రాంతంగా పేరొందిన మాదాపూర్, నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి పరిసరాల్లోనే ఈ కొత్త టవర్లను నిర్మించాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారంలో ఆవిష్కరించనున్న నూతన ఐటీ విధానంలో దీనికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. చిన్న కంపెనీలకు పెద్దపీట: పెద్ద ఐటీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా పేరొందడంతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కానీ ఈ రంగంలోని ఉద్యోగుల్లో 70 శాతం వరకూ చిన్న, సూక్ష్మ ఐటీ కంపెనీల్లోనే ఉన్నారు. రాష్ట్ర ఐటీ రంగంలోనూ చిన్న ఐటీ కంపెనీల పాత్ర విశేషంగా ఉందని సర్కారు గుర్తించింది. రాష్ట్రంలో దాదాపు 500కు పైగా చిన్న కంపెనీలున్నాయి. ఆ రంగం నుంచి రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయంలో వాటిదే ప్రధాన పాత్ర. అయితే చిన్న ఐటీ కంపెనీలు తమకుండే ఆర్థిక స్తోమతతో సొంత ప్రాంగణాలను సమకూర్చుకోలేకపోతున్నాయి. చాలా వరకు అద్దె/లీజుకు తీసుకున్న భవనాల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఐటీ విధానంలో చిన్న కంపెనీలకు చేయూతనిచ్చే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. అందులో భాగంగా చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలకు లీజు/అద్దె రాయితీ ప్రకటించనుంది. ప్రత్యేకంగా చిన్న కంపెనీల ఏర్పాటు కోసమే ఐటీ టవర్లను నిర్మించాలని నిర్ణయించింది. చిన్న కంపెనీలకు ఆఫీసు స్థలం కేటాయించడంతో పాటు కంపెనీల బ్రాండ్‌కు ప్రాచుర్యం పెంపొందించేందుకు ఐటీ టవర్లు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ఉన్న కార్పొరేట్ ఐటీ హబ్‌లను తలపించేలా వీటిలో మౌలిక సదుపాయాలను కల్పించనుంది. కంపెనీల సమావేశాలకు వీలుగా కాన్ఫరెన్స్ హాల్, వైఫై సదుపాయం, కేఫ్ ఇతర మౌలిక వసతులు ఉండేలా డిజైన్ చేయనుంది. రూ.10 కోట్లలోపు టర్నోవర్ ఉంటే.. రూ.50 లక్షలకన్నా ఎక్కువగా-రూ.10 కోట్లలోపు టర్నోవర్ ఉన్న ఐటీ కంపెనీలు, యూనిట్లు, ఎంటర్‌ప్రైజెస్‌ను చిన్న, సూక్ష్మ ఐటీ కంపెనీలుగా పరిగణించనుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం... తయారీ రంగంలో రూ.5 కోట్లలోపు, సేవారంగంలో రూ.2 కోట్లలోపు పెట్టుబడి పెట్టే కంపెనీలను చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలుగా పరిగణిస్తారు. అయితే ఇతర రంగాలతో పోలిస్తే సాపేక్షంగా ఐటీ రంగంలో పెట్టుబడి తక్కువగా ఉంటుంది. అందువల్ల రాబడులను ఆధారంగా చేసుకుని చిన్న, సూక్ష్మతరహా కంపెనీలకు ప్రభుత్వం కొత్త నిర్వచనాన్ని పొందుపరచనుంది. పెట్టుబడికి సాయం.. చిన్న కంపెనీల వృద్ధికి ప్రధాన అవరోధం మూలధనం. కొంతమేర ఆర్థిక సాయం అందిస్తే చిన్న కంపెనీలు సైతం క్రమేణా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పెట్టుబడి కోసం ఆర్థిక సాయం చేసే చర్యలపై కొత్త విధానంలో దృష్టి సారించనుంది. జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, రుణ సంస్థలు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌తో చిన్న ఐటీ కంపెనీలకు రుణసాయం అందించేలా సమన్వయం కుదిర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వివిధ దేశాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేసి చిన్న కంపెనీలకు అండగా ఉండేలా ఈ సాయం అందించనుంది. ఔటర్ వెంట ఐటీ కారిడార్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఐటీ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్ పరిసరాల్లోనే ఐటీ పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది. ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్)లో భాగంగా ఆదిభట్ల, పోచారం ప్రాంతాల్లో ఐటీ పార్కుల ఏర్పాటు ఆరంభ దశలో ఉంది. వీటితో పాటు ఔటర్ పరిసరాల్లో ఐటీ పార్కులకు అనువైన స్థలాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. వాటిని ప్రత్యేక ఐటీ జోన్లుగా గుర్తించనుంది. వీటితో పాటు టీఎస్ఐఐసీ స్థలాల్లోనూ ఐటీ పార్కులను నెలకొల్పనుంది. ఐటీ పార్కులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలకు పలు రాయితీలు అందించనుంది. వీటితో పాటు ఈసిటీ, మహేశ్వరం సమీపంలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి రెండు పార్కులను నెలకొల్పనుంది. -
ఆ కారు మరో రెండు కార్లను ఢీకొట్టింది
హైదరాబాద్: నగరంలోని హైటెక్ సిటీ ప్లై ఓవర్ పై ఆదివారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసం కాగా, పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సిటీలో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్.. నిఫ్ట్
హైటెక్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి.. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ - నిఫ్ట్’. హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ సమీపంలోని నిఫ్ట్ క్యాంపస్ కూడా జాతీయ స్థాయిలో సుపరిచితమైన సంస్థ. ఫ్యాషన్ రంగంలో వినూత్న కోర్సుల్లో శిక్షణకు కేరాఫ్ ఈ ఇన్స్టిట్యూట్. ఫ్యాషన్ టెక్నాలజీలో యాక్సెసరీస్ డిజైన్ మొదలు నిర్వహణ నైపుణ్యాలు అందించే ఫ్యాషన్ మేనేజ్మెంట్ వరకు పలు కోర్సులను అందిస్తున్న నిఫ్ట్ విశేషాలు.. ఆధునిక ప్రపంచం.. అత్యాధునిక అభిరుచులు.. కాళ్లకు ధరించే షూస్ నుంచి కళ్లజోడు వరకు వినూత్నమైన డిజైన్లను కోరుకుంటున్న వినియోగదారులు. వ్యక్తుల రోజువారీ అవసరాల్లో భాగంగా మారిన అనేక వస్తువుల డిజైనింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో శిక్షణనందిస్తున్న సంస్థ... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. కేంద్ర టెక్స్టైల్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ ఇన్స్టిట్యూట్గా 1986లో ఢిల్లీలో ప్రధాన క్యాంపస్‌గా ఏర్పాటైంది. ఇప్పుడు ఈ విద్యాసంస్థ దేశవ్యాప్తంగా 15 క్యాంపస్‌ల ద్వారా ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది. 1995లో ప్రారంభమైన నిఫ్ట్-హైదరాబాద్ క్యాంపస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. బ్యాచిలర్స్ డిగ్రీ నుంచి పీజీ వరకు పలు కోర్సులను అందిస్తూ ఫ్యాషన్ రంగ ఔత్సాహికులకు చక్కటి వేదికగా నిలుస్తోంది. కలర్‌ఫుల్ కెరీర్‌కు మార్గం వేస్తోంది. బ్యాచిలర్ టు పీజీ: ప్రస్తుతం నిఫ్ట్ - హైదరాబాద్ క్యాంపస్‌లో.. డిజైన్ విభాగంలో అయిదు కోర్సులు (ఫ్యాషన్ డిజైన్; ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్; ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్ యాక్సెసరీస్; ఫ్యాషన్ కమ్యూనికేషన్; నిట్ వేర్ డిజైన్).. టెక్నాలజీ విభాగంలో ఒక కోర్సు( బీటెక్ - అపరెల్ ప్రొడక్షన్) బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫ్యాషన్ కమ్యూనికేషన్ కోర్సు వినూత్నమైందిగా పేర్కొనవచ్చు. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రంగాల్లో రాణించడానికి అవసరమైన స్కిల్స్ అందించే ఈ స్పెషలైజేషన్‌ను పూర్తి చేస్తే డిజైన్ రంగంతోపాటు ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ జర్నలిజం, గ్రాఫిక్ డిజైన్ తదితర కమ్యూనికేషన్ విభాగాల్లోనూ మంచి కెరీర్‌ను సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. పీజీ స్థాయిలో ఎంబీఏకు తత్సమానమైన మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సు కూడా నిఫ్ట్- హైదరాబాద్ క్యాంపస్‌లో ఉంది. బోధనలో సృజనాత్మకత: ఫ్యాషన్ టెక్నాలజీ అంటే సృజనాత్మకతకు పెద్దపీట వేసే రంగం. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిఫ్ట్-హైదరాబాద్ క్యాంపస్‌లో బోధనలోనూ సృజనాత్మకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులే కొత్త డిజైన్లను ఆవిష్కరించేలా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కల్పించే విధంగా శిక్షణనిస్తున్నారు. ఈ క్రమంలో స్టూడెంట్-ఫ్యాకల్టీ నిష్పత్తిని 20:1గా నిర్దేశించి ప్రతి విద్యార్థిపై దృష్టి పెట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యం: ఫ్యాషన్, డిజైన్ రంగాల్లో అకడమిక్ శిక్షణ మిగతా కోర్సులతో పోల్చితే భిన్నమైంది. విద్యార్థులు నిరంతరం సృజనాత్మకత, పరిశీలన దృక్పథంతో అడుగులు వేయాలి. కేవలం క్లాస్ రూం, లైబ్రరీ, లేబొరేటరీలకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు కూడా నిఫ్ట్ ప్రాధాన్యమిస్తోంది. నిరంతరం కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫ్యాషన్ షోలను నిర్వహిస్తోంది. ఆర్ అండ్ డీ ప్రాజెక్ట్: నిఫ్ట్- హైదరాబాద్ క్యాంపస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను కూడా చేపడుతోంది. కేంద్ర చేనేత శాఖ ఆమోదం పొందిన పాలరాతి బొమ్మల రూపకల్పన; సిల్వర్ ఫిల్‌గ్రీ ప్రాజెక్ట్ వంటివి ఇందుకు ఉదాహరణలు. అంతేకాకుండా ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని పలు పరిశ్రమలకు అవసరమైన లోగో డిజైన్, ఉద్యోగుల యూనిఫాం డిజైన్ వంటి మరెన్నో ప్రాజెక్ట్‌లు కూడా చేపట్టింది. వీటిలో ప్రత్యక్షంగా పాల్పంచుకునేందుకు విద్యార్థులకూ అవకాశం కల్పిస్తోంది. ప్లేస్‌మెంట్స్ ఖాయం: నిఫ్ట్‌లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ ఖాయం. ప్రతి ఏటా నవంబర్ / డిసెంబర్లో నిర్వహించే క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్‌లో అర్వింద్ మిల్స్, రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్, స్నాప్ డీల్, టాటా ఇంటర్నేషనల్ వంటి ప్రముఖ కంపెనీలెన్నో పాల్గొంటున్నాయి. లక్షల్లో వార్షిక వేతనాలను అందిస్తున్నాయి. 2013 ప్లేస్‌మెంట్స్‌లో పీజీ ప్రోగ్రామ్ అభ్యర్థుల్లో అత్యధికంగా రూ.15 లక్షలు, బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లలో అత్యధికంగా రూ.9 లక్షల వార్షిక వేతన ప్యాకేజీని నిఫ్ట్ - హైదరాబాద్ సెంటర్ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. సగటున పీజీ బ్యాచ్‌లో రూ.3.69 లక్షలు, బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లో 2.99 లక్షల వార్షిక వేతనం లభించింది. ఫ్యాషన్ కమ్యూనికేషన్ ఉత్తీర్ణులకు ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, హెడ్‌లైన్స్ టుడే వంటి మీడియా సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు లభించాయి. అత్యాధునిక సదుపాయాలు: టీచింగ్, లెర్నింగ్ కోణంలో నిఫ్ట్-హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఆడియో-విజువల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లేబొరేటరీ, లైబ్రరీల ద్వారా విద్యార్థులకు నిరంతర అధ్యయన మార్గాలను అందిస్తోంది. అంతేకాకుండా ఫ్యాషన్ రంగంలోని అత్యంత ఆదరణ పొందుతున్న డిజైన్ల రూపకల్పన శైలిని ప్రత్యక్షంగా తెలుసుకునే విధంగా ఆయా వస్తువులను రిసోర్స్ సెంటర్లో అందుబాటులో ఉంచుతోంది. ప్రవేశానికి మార్గం.. నిఫ్ట్ ఎంట్రెన్స్: నిఫ్ట్ 15 క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం ప్రతి ఏటా జాతీయస్థాయిలో నిఫ్ట్ ఎంట్రెన్స్ (యూజీ/పీజీ) నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ ఆధారంగా కేంద్రీకృత కౌన్సెలింగ్ విధానంలో క్యాంపస్‌లు, సీట్ల కేటాయింపు ఉంటుంది. వెబ్సైట్: www.nift.ac.in/hyderabad/ సృజనాత్మకత ఉంటే.. ‘‘ఫ్యాషన్ రంగంలో అవకాశాలు కోరుకునే వారికి, తగిన సృజనాత్మకత ఉన్న వారికి సరైన వేదిక నిఫ్ట్. హైదరాబాద్ క్యాంపస్ ఏర్పాటైన కొన్నేళ్లలోనే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందుతోంది. విద్యార్థులకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లభించడానికి అనువైన వాతావరణం హైదరాబాద్‌లో ఉంది. నగరంలోని విభిన్న జీవన శైలులు గల వ్యక్తులు, అభిరుచులను ప్రత్యక్షంగా వీక్షించి.. తద్వారా తాజా పరిస్థితులకు సరితూగే విధంగా డిజైన్లు రూపొందించే అవకాశం విద్యార్థులకు లభిస్తోంది’’ - ప్రొఫెసర్ ఎన్. రాజారాం, డెరైక్టర్, నిఫ్ట్ - హైదరాబాద్ -
స్వీట్ సిటీ ఓ మధురానుబంధం..
ఓల్డ్ సిటీ టు హైటెక్ సిటీ వరకు అతిథులను ఆకట్టుకోవడంలో బెస్ట్ సిటీ హైదరాబాదే. పర్యాటకులనే కాదు.. పని మీద వచ్చి వెళ్లే వ్యాపారవేత్తలకు సీటీ అంటే ఇష్టం. లాభాలు పండించే కల్పతరువని కాదు.. మనోభావాలను పలకరించే ఆత్మీయ లోగిలి ఈ నగరం. అందుకే కోవె (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్) జాతీయ స్థాయి సమావేశానికి హైదరాబాద్ వచ్చిన పొరుగు రాష్ట్రాలకు చెందిన మహిళా వ్యాపారవేత్తలు ‘ వియ్ లవ్ హైదరాబాద్’ అంటున్నారు. మూడు రోజులుగా గ్రాండ్ కాకతీయలో జరుగుతున్న సమావేశాలకు హాజరైన మిహ ళలు హైదరాబాద్‌తో తమ అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. స్నేహితుడి ఇల్లు ఢిల్లీ నుంచి వేరే ఏ సిటీకి వెళ్లినా మన ప్రాంతం కాదనే ఫీలింగ్ వస్తుంది. కానీ హైదరాబాద్ పేరు చెబితే ఓ స్నేహితుని ఇంటికి వెళ్లిన ఫీలింగ్. పారిశ్రామికంగా సిటీ ముందంజలో ఉన్నా.. కొత్తవారికి రెడ్ కార్పెట్ ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడి మనుషుల మనసులే కాదు.. వాతావరణం కూడా సూపర్బ్‌గా ఉంటుంది. హైదరాబాదీలకు జెలసీ ఉండదు. అప్పుడప్పుడూ కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తుంటాం. మంచి టూరిస్ట్ ప్లేస్. ఫుడ్ చాలా బాగుంటుంది. ఢిల్లీకి వెళ్తూ చాలాసార్లు దమ్ కా బిర్యానీ పార్సిల్ చేయించుకుని తీసుకెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. - కవితా అగర్వాల్, పుల్కిత, శిల్ప, న్యూఢిల్లీ అది సిటీ గొప్పతనం ఇండియాని ఒక్క రోజులో చూడాలనుకునే వారు.. హైదరాబాద్ చుట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ అన్ని జాతులు, మతాల వారు ఉంటారు. వేరే నగరాల్లో ఉన్నా.. ఇక్కడున్న వారి ముఖాల్లో .. ‘మై హైదరాబాదీ’ అన్న ఫీలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గొప్పదనం వారిది కాదు.. ఈ ప్రాంతానిది, ఈ వాతావరణానిది. హైదరాబాద్ ఎప్పుడొచ్చినా షాపింగ్‌కు వెళ్తుంటాం. మాల్స్‌తో పాటు ఓల్డ్‌సిటీ కూడా ఒక రౌండ్ కొడతాం. భారీ మాల్స్‌లో కనిపించే అన్ని ఫ్యాషన్స్.. ఓల్డ్‌సిటీలోని చిన్నచిన్న షాపుల్లో కూడా దర్శనమిస్తాయి. ఫ్యాషన్ అప్డేట్లో సిటీ నంబర్ వన్ అంటాం. - రూపారాణి, సెలీనా, గాయిత్రి బెంగళూరు వస్తే వారం ఇక్కడే హైదరాబాద్ వస్తున్నామంటే.., స్నేహితులు, బంధువులు పెద్ద లిస్ట్ చేతిలో పెట్టేస్తారు. ఓల్డ్‌సిటీలోని లాడ్ బజార్ నుంచి మొదలు పెడితే జీవికే మాల్ వరకూ ఉంటుంది మా షాపింగ్. సింగిల్ డే ట్రిప్ అనేది ఎప్పుడూ ఉండదు. కనీసం వారం రోజులకు ప్లాన్ చేసుకుంటాం. హైదరాబాద్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి మాట్లాడాలంటే.. వెరీ పాజిటివ్ నేచర్. ఓపిక కూడా ఎక్కువే. త్వరగా బయటకు అడుగు పెట్టరు, కానీ సాధించి తీరుతారు. - కళ్యాణి, భారతి చెన్నై గర్వంగా ఫీలవుతాం కోవె సమావేశాల్లో భాగంగా.. మహిళా పారిశ్రామికవేత్తలం అందరం ఎప్పుడూ ఏదో ఒక నగరంలో కలుస్తూనే ఉంటాం. మేమంతా ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు ఒక టూర్‌కి వెళ్లిన ఫీలింగ్. కానీ అందరూ సీటీకి వస్తున్నారంటే.. మాత్రం మాకు పండగే. పైగా వచ్చిన వాళ్లంతా మన నగరాన్ని తమ ప్రాంతంగా భావించడం గర్వంగా అనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి హైదరాబాద్‌కి మించిన ప్రాంతం మరొకటి లేదంటూ వారిచ్చే కితాబులు మాలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి. - కల్పనారావ్, మధు చాంద్, అర్చన, లలితా ఆలూరి, మహేశ్వరి, స్వరూప హైదరాబాద్ - భువనేశ్వరి ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ -
‘అభయ’కు ముందూ దారుణాలు?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో గత నెలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభయను కిడ్నాప్ చేసి ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల దురాగతాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులైన వరంగల్‌కు చెందిన వెడిచెర్ల సతీష్, అతడి స్నేహితుడు నెమ్మడి వెంకటేశ్వర్లును సైబరాబాద్ పోలీసుల ఇటీవల న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొన్ని వాస్తవాలు వెలుగు చూశా యని సమాచారం. అభయపై అత్యాచారానికి కొన్ని నెలల ముందు మరో నేరం చేసినట్లు నిందితులు బయటపెట్టారు. సతీష్, వెంకటేశ్వర్లు ఓ రోజు వింగర్ వాహనంలో వెళ్తుండగా అర్ధరాత్రి రోడ్లను శుభ్రం చేస్తున్న స్వీపర్‌ను అపహరించి అందులో తిరుగుతూనే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే బాధితురాలు ఫిర్యాదు చేయకపోవడంతో రికార్డుల్లోకి ఎక్కలేదు. ఇప్పుడు ఆమెను గుర్తించడం, సాక్ష్యాధారాలు సేకరించడం కష్టం కావడంతో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిసింది.