స్వీట్ సిటీ ఓ మధురానుబంధం.. | Hyderabad a Sweet city of relation between us | Sakshi
Sakshi News home page

స్వీట్ సిటీ ఓ మధురానుబంధం..

Published Tue, Jul 29 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM

స్వీట్ సిటీ ఓ మధురానుబంధం..

స్వీట్ సిటీ ఓ మధురానుబంధం..

ఓల్డ్ సిటీ టు హైటెక్ సిటీ వరకు అతిథులను ఆకట్టుకోవడంలో బెస్ట్ సిటీ హైదరాబాదే. పర్యాటకులనే కాదు.. పని మీద వచ్చి వెళ్లే వ్యాపారవేత్తలకు సీటీ అంటే ఇష్టం. లాభాలు పండించే కల్పతరువని కాదు.. మనోభావాలను పలకరించే ఆత్మీయ లోగిలి ఈ నగరం. అందుకే కోవె (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్) జాతీయ స్థాయి సమావేశానికి హైదరాబాద్ వచ్చిన పొరుగు రాష్ట్రాలకు చెందిన మహిళా వ్యాపారవేత్తలు ‘ వియ్ లవ్ హైదరాబాద్’  అంటున్నారు. మూడు రోజులుగా గ్రాండ్ కాకతీయలో జరుగుతున్న సమావేశాలకు హాజరైన మిహ ళలు హైదరాబాద్‌తో తమ అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు.
 
 స్నేహితుడి ఇల్లు
 ఢిల్లీ నుంచి వేరే ఏ సిటీకి వెళ్లినా మన ప్రాంతం కాదనే ఫీలింగ్ వస్తుంది. కానీ హైదరాబాద్ పేరు చెబితే ఓ స్నేహితుని ఇంటికి వెళ్లిన ఫీలింగ్. పారిశ్రామికంగా సిటీ ముందంజలో ఉన్నా.. కొత్తవారికి రెడ్ కార్పెట్ ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడి మనుషుల మనసులే కాదు.. వాతావరణం కూడా సూపర్బ్‌గా ఉంటుంది. హైదరాబాదీలకు జెలసీ ఉండదు. అప్పుడప్పుడూ కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తుంటాం. మంచి టూరిస్ట్ ప్లేస్. ఫుడ్  చాలా బాగుంటుంది. ఢిల్లీకి వెళ్తూ  చాలాసార్లు దమ్ కా బిర్యానీ పార్సిల్ చేయించుకుని తీసుకెళ్లిన సందర్భాలూ ఉన్నాయి.
 - కవితా అగర్వాల్, పుల్కిత, శిల్ప, న్యూఢిల్లీ
 
 అది సిటీ గొప్పతనం
 ఇండియాని ఒక్క రోజులో చూడాలనుకునే వారు.. హైదరాబాద్ చుట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ అన్ని జాతులు, మతాల వారు ఉంటారు. వేరే నగరాల్లో ఉన్నా.. ఇక్కడున్న వారి ముఖాల్లో .. ‘మై హైదరాబాదీ’ అన్న ఫీలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గొప్పదనం వారిది కాదు.. ఈ ప్రాంతానిది, ఈ వాతావరణానిది. హైదరాబాద్ ఎప్పుడొచ్చినా షాపింగ్‌కు వెళ్తుంటాం. మాల్స్‌తో పాటు ఓల్డ్‌సిటీ కూడా ఒక రౌండ్ కొడతాం. భారీ మాల్స్‌లో కనిపించే అన్ని ఫ్యాషన్స్.. ఓల్డ్‌సిటీలోని చిన్నచిన్న షాపుల్లో కూడా దర్శనమిస్తాయి. ఫ్యాషన్ అప్‌డేట్‌లో సిటీ నంబర్ వన్ అంటాం.
 - రూపారాణి, సెలీనా, గాయిత్రి
 బెంగళూరు

 
 వస్తే వారం ఇక్కడే
 హైదరాబాద్ వస్తున్నామంటే.., స్నేహితులు, బంధువులు పెద్ద లిస్ట్ చేతిలో పెట్టేస్తారు. ఓల్డ్‌సిటీలోని లాడ్ బజార్ నుంచి మొదలు పెడితే జీవికే మాల్ వరకూ ఉంటుంది మా షాపింగ్. సింగిల్ డే ట్రిప్ అనేది ఎప్పుడూ ఉండదు. కనీసం వారం రోజులకు ప్లాన్ చేసుకుంటాం. హైదరాబాద్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి మాట్లాడాలంటే.. వెరీ పాజిటివ్ నేచర్. ఓపిక కూడా ఎక్కువే. త్వరగా బయటకు అడుగు పెట్టరు, కానీ సాధించి తీరుతారు.
 - కళ్యాణి, భారతి
 చెన్నై

 
 గర్వంగా ఫీలవుతాం
కోవె సమావేశాల్లో భాగంగా.. మహిళా పారిశ్రామికవేత్తలం అందరం ఎప్పుడూ ఏదో ఒక నగరంలో కలుస్తూనే ఉంటాం. మేమంతా ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు ఒక టూర్‌కి వెళ్లిన ఫీలింగ్. కానీ అందరూ సీటీకి వస్తున్నారంటే.. మాత్రం మాకు పండగే. పైగా వచ్చిన వాళ్లంతా మన నగరాన్ని తమ ప్రాంతంగా భావించడం గర్వంగా అనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి హైదరాబాద్‌కి మించిన ప్రాంతం మరొకటి లేదంటూ వారిచ్చే కితాబులు మాలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి.
 - కల్పనారావ్, మధు చాంద్, అర్చన, లలితా ఆలూరి,
 మహేశ్వరి, స్వరూప
 హైదరాబాద్
 -  భువనేశ్వరి
 ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement