రోడ్ డెవలపర్స్‌కు ‘నిధుల’ వెసులుబాటు!
న్యూఢిల్లీ: రహదారుల డెవలపర్స్‌కు మరిన్ని నిధులు అందుబాటులోకి వచ్చే కీలక నిర్ణయాన్ని కేంద్రం బుధవారం తీసుకుంది. దీని ప్రకారం- బిల్డ్‌ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (బీఓటీ) ప్రాజెక్టులను పూర్తయిన రెండేళ్ల తరువాత డెవలపర్లు నూరుశాతం విక్రయించే వీలుంటుంది. తద్వారా వచ్చిన నిధులను ఇతర ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ ఆమోదంతో రూ.4,500 కోట్లు అందుబాటులోకి వస్తాయిని అంచనా.
ఆర్బ్రిట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం..
కాగా వాణిజ్య వివాదాల తక్షణ పరి ష్కారం లక్ష్యంగా కేబినెట్ ఆర్బ్రిట్రేషన్ చట్ట సవరణలకు ఆమోదముద్ర వేసింది.