Hima bindhu
-
ఏసీబీ జడ్జిపై పోస్టు పెట్టిన వ్యక్తి అరెస్ట్
సాక్షి, నంద్యాల: స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. సోషల్ మీడియాలో యెల్లో బ్యాచ్ అడ్డగోలుగా రెచ్చిపోయింది. ఆయనకు సంబంధించి పలు పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన న్యాయమూర్తులపైనా అనుచిత పోస్టులు చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. అయితే దర్యాప్తు క్రమంలో ఇందులో బాబు మద్దతుదారుల కంటే టీడీపీ నేతల పాత్రే ఎక్కువుందని తేటతెల్లమవుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఓ టీడీపీ నేత అరెస్ట్ అయ్యారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడికి రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు జడ్జిని అవమానిస్తూ పోస్టులు పెట్టాడు ఓ వ్యక్తి. అయితే అతన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్‌గా ధృవీకరించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. ఓ ప్రైవేట్‌కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు ఖాజా హుస్సేన్. ఈ క్రమంలో.. విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి హిమబిందును టార్గెట్ చేసి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేశాడు. టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి హోదాలోనే పోస్టులు చేసినట్లు అంగీకరించాడతను. అరెస్ట్ చేసిన నంద్యాల పోలీసులు.. ఇవాళ కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంది. మరోవైపు జడ్జిలపై అనుచిత పోస్టులు, ట్రోలింగ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ వేసింది ఏపీ హైకోర్టులో. ప్రభుత్వం తరపున ఏపీ శ్రీరామ్ ‘‘ఉద్దేశపూర్వక క్యాంపెయిన్ జరిగిందని.. జడ్జిలను, వాళ్ల కుటుంబ సభ్యులనూ వదలకుండా ట్రోలింగ్ చేశారని, ఈ క్రమంలోనే అనుచిత పోస్టులు పెట్టార’ని వాదించారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సదరు 26 మంది అకౌంట్లను పరిశీలించి.. నోటీసులు జారీ చేయాలని ఏపీ డీజీపీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. బుద్దా వెంకన్నతో పాటు సోషల్ మీడియా పేజీల ముసుగులో ఉన్న టీడీపీ నేతలకు నోటీసులు జారీ కానున్నాయి. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ సైతం జడ్జిలపై అనుచిత కామెంట్ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి.. కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
ఇంకా లభించని హిమబిందు ఆచూకీ
-
బ్యాంకులకు 3,316 కోట్ల ఎగవేత
సాక్షి, హైదరాబాద్: నకిలీ పత్రాలు సృష్టించి జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని చెల్లించకుండా మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయింది), కార్పొరేషన్ బ్యాంక్‌ల కన్సార్షియం నుంచి వీఎంసీ డైరెక్టర్లు భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు. కానీ తిరిగి చెల్లించకపోవడంతో.. ఇప్పుడు బకాయిల మొత్తం ఏకంగా రూ. 3,316 కోట్లకు చేరింది. దీనితో కన్సార్షియం బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడానికి వీఎంసీ డైరెక్టర్లు నకిలీ పత్రాలు సృష్టించారని తెలిపాయి. ఈ నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఆ సమయంలోనే తమకు బీఎస్ఎన్ఎల్ లిమిటెడ్ నుంచి రూ.262 కోట్ల మేరకు బకాయిలు రావాల్సి ఉందని, ఆ డబ్బులు వచ్చిన తర్వాత రుణాలు చెల్లిస్తామని డైరెక్టర్లు నమ్మబలికారు. అయితే వీఎంసీకి బీఎస్ఎన్ఎల్ నుంచి రావాల్సిన మొత్తం రూ.33 కోట్లు మాత్రమేనని తేలింది. ఈ క్రమంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గత నెల 20వ తేదీన వి.హిమబిందు, వి.సతీష్, వి.మాధవి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పత్రాలు, 40 ఎక్సటర్నల్ హార్డ్ డిస్క్‌ల్లో నిక్షిప్తమైన డిజిటల్ డేటాతో పాటు, ఆరు మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. కాగా వీఎంసీ సంస్థ కన్సార్షియం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను అనుబంధ సంస్థలకు తరలించినట్లు ఆడిట్ నివేదికల్లో బయటపడిందని ఈడీ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బీఎస్ఎన్ఎల్ నుంచి టెండర్లు దక్కించుకోవడంలో పీఐఎస్‌ఎల్ అనే సంస్థకు ఎలాంటి పాత్ర లేకపోయినా మూడు శాతం కమీషన్‌ను వీఎంసీఎల్ చెల్లించినట్లు తేలిందని వివరించింది. పీవోఎంఎల్ కోర్టులో హాజరు హిమబిందు రూ.692 కోట్ల మేరకు డమ్మీ లెటర్ ఆఫ్ క్రెడిట్ లు (ఎల్వోసీ) సృష్టించినట్లు ఈడీ పేర్కొంది. విదేశాల్లో త మ బంధువులు నడిపిస్తున్న సంస్థలకు పెద్ద మొత్తంలో నిధు లు మళ్లించినట్లు తెలిపింది. దర్యాప్తునకు సహకరించ లేదని, విదేశీ లావాదేవీల గురించి అవాస్తవాలు చెబుతున్న నేపథ్యం లో ఆమెను అరెస్టు చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ కోర్టు లో హాజరుపర్చినట్లు ఈడీ తెలిపింది. కోర్టు ఈనెల 18వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించినట్లు వివరించింది. -
బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసు: ఉప్పలపాటి హిమబిందు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : రూ.1700 కోట్ల బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో ఉప్పలపాటి హిమబిందును ఈడీ అరెస్ట్ చేసింది. వీఎమ్‌సీ సిస్టమ్స్ కంపెనీ డైరెక్టర్లు నకిలీ పత్రాలు సృష్టించి పలు బ్యాంకుల నుంచి రుణాలు పొందిన సంగతి తెలిసిందే. నకిలీ పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.539 కోట్లు.. ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్ నుంచి రూ.1207 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీఎమ్‌సీ కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లపై కేసు నమోదైంది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ముగ్గురు డైరెక్టర్లు ఉప్పలపాటి హిమబిందు, రామారావు, రమణపై కేసు నమోదు చేసింది. ఉప్పలపాటి హిమబిందును అరెస్ట్ చేసి, మిగిలిన ఇద్దరికి లుక్ అవుట్ నోటీసులు ఇచ్చింది. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
పెనుకొండ: మండలంలోని కొండంపల్లి సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హిమబిందు (20) అనే ఇంజనీరింగ్ విద్యార్థిని దుర్మరణం చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకెళితే.. కొత్తచెరువు మండలం ఎర్రబల్లికి చెందిన భాస్కరరెడ్డి వ్యవసాయంతో పాటు, ఆటో నడుపుతూ కుమార్తెను ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో కుమార్తె ఇంటి వద్దే ఉండగా విద్యార్థిని అనారోగ్యంగా ఉండటంతో పెనుకొండకు చికిత్స నిమిత్తం ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో బండ్లపల్లికి చెందిన బాలాజీ, చెర్లోపల్లికి చెందిన ముత్యాలప్పలు ఆటోలో పెనుకొండకు ఎక్కారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో కొండంపల్లి సమీపంలోని బీఈడీ కళాశాల వద్దకు రాగానే పెనుకొండ నుంచి వేగంగా వచ్చిన ఇండికా కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హిమబిందు అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని తండ్రి భాస్కరరెడ్డి, ముత్యాలప్పను పోలీసులు అనంతపురానికి తరలించారు. బాలాజీ స్వల్పగాయాలతో బయట పడ్డాడు. హిమబిందు మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కారు యజమాని లక్ష్మీనారాయణ మందు సేవించి వేగంగా కారును నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హిమబిందు కేసులో మరో ముగ్గురి అరెస్టు
పటమట, న్యూస్‌లైన్ : జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించిన సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచి మేనేజర్ సాయిరాం భార్య హిమబిందు దారుణహత్య కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు బుధ వారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిం దితులను రెండురోజుల కిందట అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పటమట పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మరో ముగ్గురు నిందితుల అరెస్టు విషయాన్ని డీసీపీ రవిప్రకాష్ తెలియజేశారు. అరెస్టయిన వారిలో నగరానికి చెందిన ఎలక్ట్రిషియన్ జనపాల కృష్ణ(24), మంగళగిరి లో అట్టలు తయారు చేసే కంపెనీలో పనిచేసే పలువూరి దుర్గారావు అలియాస్ కయ్యా(21), చికెన్ షాపులో పనిచేసే రామలింగేశ్వరనగర్‌కు చెందిన లంకపల్లి రమణ(22) ఉన్నారన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సాయిరాం కుటుంబం నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోని మరో ఫ్లాట్ యాజమాని వద్ద యనమలకుదురు గ్రామానికి చెందిన మహ్మద్ సుభాని(27) కొంతకాలంగా కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతని స్నేహితులు పటమటకు చెందిన కారు డ్రైవర్ సోమన గోపీకృష్ణ(24), ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే జనపాల కృష్ణ(24), దుర్గారావు అలియాస్ కయ్యా(21), లంకపల్లి రమణ(22), మరో 35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తితో కలిసి తరచూ సుభాని పని చేసే అ పార్ట్మెంట్ వద్దకు వచ్చేవారు. అక్కడ ఉండే షాపుల వద్ద కలుసుకుని మాట్లాడుకునేవారు. హిమబిందు ఒంటరిగా ఇంట్లో ఉంటుందని సుభాని వారికి తెలిపాడు. ఆమెపై లైంగికదాడి చేయాలని వారంతా నిర్ణయించుకున్నారు. పథ కం అమలులో భాగంగా 15వ తేదీ ఉదయం 11 గంటలకు సుభాని, గోపి, రమణ, కృష్ణ, దుర్గాప్రసాద్, మరో వ్యక్తి మొత్తం ఆరుగురు అపార్ట్మెంట్ వద్ద కలుసుకున్నారు. అనంతరం సుభా ని, గోపి, మరో నిందితుడు అపార్ట్మెంట్ మూడో ఫ్లోర్‌లోకి వెళ్లి హిమబిందు ఉంటున్న ఫ్లాట్ తలుపులు తట్టారు. సుభాని తెలిసిన వాడు కావడంతో ఆమె తలుపులు తీసింది. కింది పోర్షన్లో నీళ్లు రావడం లేదు, మరమ్మత్తు చే యాలని చెప్పగా, ఆమె అంగీకరించింది. అనంతరం పడకగదిలో నుంచి ఎటాచ్డ్ బాత్రూమ్లోకి వెళ్లిన నిందితులు ముగ్గురూ పైపులు మరమ్మత్తు చేస్తున్నట్లుగా నటించారు. ఆమె మంచం వద్ద నిలబడి ఆదమరుపుగా ఉండగా అకస్మాత్తుగా దాడి చేశారు. ఒకరి తరువాత ఒకరు లైంగికదాడి చేశారు. తరువాత కింద నుంచి వచ్చిన దుర్గారావు, లంకపల్లి రమణ, జనపాల కృష్ణ కూడా ఆమెపై లైంగికదాడి చేశారు. ఈ విషయం బయట పడుతుందని భావిం చిన నిందితులు ఆమె గొంతు నులిమి హత్య చేశారు. సుభాని పని చేస్తున్న కారు యజమాని కుటుంబం వేరే ఊరు వెళ్లడంతో ఆ ఫ్లాట్ తాళా లు అతడి వద్దే ఉన్నాయి. హిమబిందు మృతదేహాన్ని సుభాని పనిచేసే కారు యజమాని ఫ్లాట్ వంటగదిలోకి ఈడ్చుకుంటూ వెళ్లారు. తరువాత హిమబిందు ఫ్లాట్‌లోకి వెళ్లి బీరువాలో ఉన్న బం గారు నగలు, వెండి వస్తువులు, నగదు దొం గిలించి పారిపోయారు. మరుసటి రోజు 16వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత అందరూ కలిసి అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. హిమబిందు మృతదేహాన్ని ఎవరూ చూడకుండా కిందకు దించి, దగ్గరలో ఉన్న బందరు కాలువలో పడేశారు. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు మృతురాలి దుస్తులు, చెప్పులు, సెల్‌ఫోన్ తీసుకుని ఆమె మరొకరితో వెళ్లిపోయినటు ఆధారాలు సృష్టిం చారు. ఆమె కిడ్నాప్‌నకు గురైనట్లు కూడా డ్రా మా ఆడారు. 17వ తేదీన హిమబిందు మృతదేహం కాలువలో దొరకడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సుభాని తదితరులపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారి కిరాతకం వెలుగులోకి వచ్చిం ది. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి బంగారు చంద్రహారం, వెంకటేశ్వరస్వామి బం గారు ఉంగరాలు రెండు, ఒక పగడపు ఉంగరం, లాకెట్టు కలిగిన పగడాల బ్రాస్లెట్, చిన్నపాటి బంగారు చైన్, వెండి యంత్రం, వెండి పసుపు కుంకుమ సెట్, వెండి కుంకుమ భరిణె, వెండి చెవి రింగులు, వెండి బుట్టలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు నరరూప రాక్షసులని, వారిని కఠినంగా శిక్షించాలని ఆయన వ్యాఖ్యానించారు. సమావేశంలో సెంట్రల్ ఏసీపీ లావణ్యలక్ష్మి, పటమట సీఐ రవికాంత్, ఎస్సైలు జనార్దన్, లోవరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
హిమబిందును హత్యకేసులో హంతకులను ఉరి తీయాలి
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్:హిమబిందును హత్యచేసిన బలరామిరెడ్డిని ఉరి తీయాలని రాయలసీమ పరిరక్షణ సమితి విద్యార్థి ఫెడరేషన్ (ఆర్పీఎస్ఎస్ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్పీఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బాధి త కుటుంబీకులతో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆర్పీఎస్ఎస్ఎఫ్ జిల్లా నాయకుడు శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బి.శ్రీరాములు మాట్లాడుతూ మహిళలపై కామాంధులు పెట్రేగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హిమబిందు కేసును సమగ్రంగా విచారణ చేయాలని, నేరస్థులపై కఠినచర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హిమబిందు లాగా మరొకరు బలి కాకూడదనుకుంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే మిగతా వారిపై కూడా చర్యలు తీసుకోవాలని, అలాగే హిమబిందు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షం లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ధర్నా వద్ద హిమబిందు ను తలచుకుని తల్లి మధుమతి విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. ధర్నాకు ముందు రాజ్‌విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు బాధిత కుటుంబీకులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ రఘురామిరెడ్డికి వినతిపత్రాలు సమర్పించారు. కుటుంబానికి ఆర్థిక సహాయం అందిం చి, నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్పీఎస్ఎస్ఎఫ్ నాయకులు రామలింగారెడ్డి, నగర నాయకులు వినయ్, చంద్రమౌళి, రవి, రఘు, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.