himachal pradesh floods
-
HYD: హిమాచల్ వరదల్లో చిక్కుకున్న ఉస్మానియా డాక్టర్లు!
సాక్షి, హైదరాబాద్: వాతావరణంలో నెలకొన్న అనూహ్య పరిణామాలతో ఉత్తర భారతాన్ని ఎడతెరిపి ఇవ్వని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎటు చూసినా వరద పోటెత్తిన దృశ్యాలు.. మనుషులు, వాహనాలు, భవనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల ధాటికి 72 మంది మృతిచెందగా.. 10 మంది అదృశ్యమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఉస్మానియాకు చెందిన ముగ్గురు వైద్యులు హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్ వరదల్లో ఉస్మానియాకు చెందిన డాక్టర్ బానోత్ కమల్‌లాల్, డాక్టర్ రోహిత్ సూరి, డాక్టర్ శ్రీనివాస్‌లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామానికి చెందిన మరింత సమాచారం అందాల్సి ఉంది. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన ఓ ఫ్యామిలీ సైతం ఉత్తరాది భీకర వర్షాల్లో చిక్కుకుపోగా.. ఆదివారం నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. అయితే.. చివరికి వాళ్లు సురక్షితంగా నగరానికి తిరుగు పయనమైనట్లు తేలింది. మంత్రి హరీష్ ఆరా ఢిల్లీ పర్యటనలో భాగంగా.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో మంత్రి హరీష్ రావు భేటీ కానున్నారు. కృష్ణా నది ట్రిబ్యునల్, నీటి ప్రాజెక్టుల అంశాలపై కేంద్రమంత్రితో చర్చించనున్నారాయన. అదే సమయంలో.. హిమాచల్ వరదల్లో ఉస్మానియా వైద్యులు చిక్కుకుపోయిన పరిణామంపై వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరా తీశారు. వైద్యులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారాయన. ఇదీ చదవండి: హిమాన్షు పెద్ద మనసు.. కోటి రూపాయలతో.. -
భారీ ప్రవాహంతో కుప్పకూలిన బ్రిడ్జి
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆ ప్రవాహ వేగానికి బెయిలీ బ్రిడ్జి ఒకటి మధ్యలో కూలిపోయింది. సమీపంలోని రోహ్టంగ్ టన్నెల్ ప్రాజెక్టుకు నిర్మాణ సామగ్రి తరలించడం కోసం ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి మీద లారీ వెళ్తుండగా కూలిపోయింది. డ్రైవర్‌ను వెంటనే రక్షించారు. బెయిలీ బ్రిడ్జి ఉన్నట్టుండి కూలిపోయింది గానీ, ఇందులో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని రోహ్తంగ్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బ్రిగెడియర్ డీఎన్ భట్ తెలిపారు. రాబోయే నాలుగైదు రోజుల్లో బ్రిడ్జిని పునరుద్ధరిస్తామని, కొట్టుకుపోయిన లారీని కూడా బయటకు తీస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు రావడంతో పాటు కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో ఈ ప్రాంతంలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. లెహ-మనాలి మార్గంలో ఉన్న రోహ్తంగ్ పాస్ వద్ద తలపెట్టిన 8.8 కిలోమీటర్ల రోహ్తంగ్ సొరంగం దేశంలోనే అతి పొడవైన సొరంగం అవుతుంది. మంచు కారణంగా ఆరు నెలల పాటు రోహ్తంగ్ పాస్‌ను మూసేస్తారు. సొరంగం నిర్మాణం పూర్తయితే ఏడాది పొడవునా రోహ్తంగ్ పాస్ మార్గాన్ని తెరిచే ఉంచేందుకు అవకాశం ఏర్పడుతుంది. -
నిలువునా కూలిపోయిన వంతెన!
హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో భారీ వర్షాలకు ఓ వంతెన కూలిపోయింది. భారీగా వరదనీరు ప్రవహిస్తుండటంతో 44 ఏళ్ల క్రితం కట్టిన ఈ వంతెన మధ్యలో భాగం మొత్తం కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియోను ఎవరో సెల్‌ఫోనులో చిత్రించారు. వంతెన మొత్తం పొడవు 160 మీటర్లు ఉంటుంది. అందులో క ఒంత భాగం సహా దాని పిల్లర్లు కూడా మొత్తం పడిపోయి వరదల్లో కొట్టుకుపోయాయి. మొత్తం 76 మీటర్ల మేర వంతెన, పది పిల్లర్లు వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని నూర్పూర్ తాలూకాకు, పొరుగునే ఉన్న పంజాబ్ రాష్ట్రానికి మధ్య రాకపోకలు సాగించడానికి ఈ వంతెనే ప్రధానమైన ఆధారం. అదృష్టవశాత్తు వంతెన కూలిన సమయంలో దాని మీద ఎవరూ రాకపోకలు సాగించకపోవడంతో ఎవరూ గాయపడలేదు. పిల్లర్లకు బీటలు వారినట్లు గుర్తించిన అధికారులు బుధవారం నుంచే దానిమీద రాకపోకలను నిలిపివేశారు. పది రోజుల క్రితం ముంబై-గోవా జాతీయ రహదారిపై బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఓ వంతెన కూలిపోయి రెండు బస్సులు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.