hindi diwas
-
Hindi Diwas: ‘హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోం’
బెంగళూరు: ఒకవైపు హిందీ దివస్ దినోత్సవాన్ని(సెప్టెంబర్ 14న) దేశవ్యాప్తంగా బీజేపీ ఘనంగా నిర్వహిస్తోంది. అదే సమయంలో.. వ్యతిరేకత కూడా చాలాచోట్ల వ్యక్తం అవుతోంది. కర్ణాటకలో హిందీ దివస్‌కు వ్యతిరేకంగా జేడీఎస్(జనతాదల్ సెక్యులర్) ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా.. జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తీవ్రస్థాయిలో కేంద్రంపై ధ్వజమెత్తారు. ‘‘హిందీని బలవంతంగా రుద్దితే చూస్తూ ఊరుకోం. భారతీయులను విడదీయాలని బీజేపీ చూస్తోంది. కేవలం ఒక భాషను ప్రచారం చేయడం వల్ల దేశ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోంద’’ని ఆయన విమర్శించారు. ఇదిలా ఉంటే.. ప్రజల సొమ్ముతో ఇలాంటి వేడుకలు నిర్వహించకూడదంటూ సీఎం బసవరాజ్ బొమ్మైకి కుమారస్వామి ఇదివరకే ఓ లేఖరాశారు. బలవంతంగా హిందీ భాషా దినోత్సవం వేడుకలు జరపడం కన్నడ ప్రజలను అవమానించడమే అని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు కన్నడ భాష ప్రాధాన్యత గురించి రాష్ట్రంలో జోరుగా చర్చ కూడా నడిచింది. అయినప్పటికీ.. కర్ణాటకలో హిందీ దివస్ వేడుకలు జరుగుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: ‘బీజేపీది అశాంతివాదం’ -
హిందీ దివస్: మాతృభాషను మరువరాదు
కోల్‌కతా: హిందీ దివస్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని భాషలను, సంస్కృతులను సమానంగా గౌరవించాల్సిన అవసరముందని ఆమె ఈ సందర్బంగా పేర్కొన్నారు. ‘హిందీ దివస్ సందర్భంగా నా శుభాకాంక్షలు. అన్ని భాషలను, సంస్కృతులను మనం సమానంగా గౌరవించాల్సిన అవసరముంది. మనం ఎన్నో భాషలను నేర్చుకోవచ్చు కానీ, మాతృభాషను మరువరాదు’ అని ఆమె ట్వీట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హిందీ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తదితరలు హిందీ దివస్ సందర్భంగా ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ఏకీకృత భాషగా హిందీని అమలు చేయడం ద్వారా దేశ పౌరులందరినీ ఏకతాటిపైకి తీసుకురావచ్చన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, డీఎంకే ప్రెసిడెంట్ స్టాలిన్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. చదవండి: అమిత్ షా వ్యాఖ్యలు షాకిచ్చాయ్ -
షా వ్యాఖ్యలు షాకిచ్చాయ్..
న్యూఢిల్లీ: ఏకీకృత భాషగా హిందీని అమలు చేయడం ద్వారా దేశ పౌరులందరినీ ఏకతాటిపైకి తీసుకురావచ్చన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అమిత్ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సైతం ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘బలవంతంగా హిందీ భాషను రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ మేం నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాం. ఈ రోజు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మాకు షాక్ ఇచ్చాయి. ఈ వ్యాఖ్యలు దేశ ఐక్యతను దెబ్బతీస్తాయి. అమిత్ షా తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని స్టాలిన్ పేర్కొన్నారు. తీవ్ర ఆందోళనకు గురిచేసిన షా వ్యాఖ్యలపై ఎల్లుండి పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చర్చించి.. తదుపరి కార్యాచరణ చేపడతామని స్టాలిన్ పేర్కొన్నారు. శనివారం హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ..భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. అదే విధంగా..‘ భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. ప్రతీ భాష దేనకదే ప్రత్యేకతను కలిగి ఉంది. అయితే ప్రపంచంలో భారత్ గుర్తింపు కోసం ఒక భాష మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు దేశాన్ని ఒక్కటిగా ఉంచే భాష ఏదైనా ఉందంటే అది హిందీ మాత్రమే. స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ, వల్లభబాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చాలంటే మాతృభాషతో పాటు హిందీ భాష వాడకాన్ని పెంచాలి’ అని ట్విటర్ వేదికగా భారత ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. చదవండి: దేశమంటే..హిందీ, హిందూ, హిందుత్వ కాదు: ఒవైసీ -
దేశమంటే..హిందీ, హిందూ, హిందుత్వ కాదు: ఒవైసీ
న్యూఢిల్లీ : ఏకీకృత భాషగా హిందీని అమలు చేయడం ద్వారా దేశ పౌరులందరినీ ఏకతాటిపైకి తీసుకురావచ్చన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. దేశమంటే కేవలం హిందీ, హిందూ, హిందుత్వ కాదని.. వాటి కంటే ఎంతో భారత్ ఎంతో విశాలమైందని పేర్కొన్నారు. ఈ మేరకు...‘ భారతీయులందరి మాతృభాష హిందీ కాదు. భరతభూమిపై ఎన్నెన్నో మాతృభాషలు ఉన్నాయి. వాటిలోని భిన్నత్వాన్ని, అందాన్ని తెలుసుకునేందుకు కాస్త ప్రయత్నించండి. భారత రాజ్యాంగంలోని 29వ అధికరణ తమకు నచ్చిన భాష మాట్లాడేందుకు, సంస్కృతీ సంప్రదాయాలు పాటించేందుకు అవకాశం కల్పిస్తుంది. హిందీ, హిందూ, హిందుత్వ కంటే ఇండియా చాలా పెద్దది’ అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. కాగా శనివారం హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ..భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. అదే విధంగా..‘ భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. ప్రతీ భాష దేనకదే ప్రత్యేకతను కలిగి ఉంది. అయితే ప్రపంచంలో భారత్ గుర్తింపు కోసం ఒక భాష మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు దేశాన్ని ఒక్కటిగా ఉంచే భాష ఏదైనా ఉందంటే అది హిందీ మాత్రమే. స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ, వల్లభబాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చాలంటే మాతృభాషతో పాటు హిందీ భాష వాడకాన్ని పెంచాలి’ అని ట్విటర్ వేదికగా భారత ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. Hindi isn't every Indian's "mother tongue". Could you try appreciating the diversity & beauty of the many mother tongues that dot this land? Article 29 gives every Indian the right to a distinct language, script & culture. India's much bigger than Hindi, Hindu, Hindutva https://t.co/YMVjNlaYry — Asaduddin Owaisi (@asadowaisi) September 14, 2019 -
రాజ్‌భాష పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: హిందీ దివస్‌ను పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌భాష పురస్కారాలను ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు హన్సరాజ్ గంగారాం, కిరణ్ రిజిజు పాల్గొన్నారు. హిందీ భాష వృద్ధికి కృషి చేసినందుకు గానూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి పురస్కారాలు ప్రదానం చేశారు. పురస్కారాలు అందుకున్నవారిలో వి.ఉదయ్ భాస్కర్ (హైదరాబాద్, బీడీఎల్), విష్ణుభగవాన్ శర్మ (ఎస్బీఐ, హైదరాబాద్), హోంనిధి శర్మ (బీడీఎల్, హైదరాబాద్), హర్ దయాళ్ ప్రసాద్ (ఎస్బీఐ, హైదరాబాద్), సుగుణ (విశాఖ స్టీల్ ప్లాంట్) తదితరులు ఉన్నారు. హిందీ నేర్చుకొనే వారి సౌలభ్యం కోసం ‘లీలా’మొబైల్ యాప్‌ను రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రారంభించారు. -
సీఎం హిందీ దివస్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ‘హిందీ దివస్’ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 14న హిందీ దివస్ జరుపుకుంటున్న సందర్భంగా హిందీ భాషాభిమానులకు, ప్రపంచవ్యాప్తంగా హిందీ మాట్లాడే వారికి ఆయన అభినందనలు తెలిపారు. సీఎంకు వివాహ ఆహ్వానాలు.. ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తన కుమారుడు రవీంద్ర వివాహానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ వివాహపత్రికను అందజేశారు. అలాగే ఎన్టీవీ చైర్మన్ నరేంద్రచౌదరి, డాక్టర్ రంజిత్‌రెడ్డి తమ కూతుళ్ల వివాహ ఆహ్వానపత్రికలను వేర్వేరుగా ముఖ్యమంత్రికి అందజేశారు. -
జాతి సమైఖ్యతకు ప్రతీక ‘హిందీ’
- నేడు హిందీ దివాస్ భారతదేశ జాతి సమైక్యతకు ప్రతీకగా హిందీ భాష నిలుస్తోంది. విభిన్న భాషల సమాహారంగా ఉన్న భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సాధించే సమయంలో గాంధిజీ ఎక్కువగా హిందీలోనే మాట్లాడేవారు. జాతి మొత్తం ఆ భాషను సులువుగా అర్థం చేసుకునేది. అందుకే 1949 సెప్టెంబర్ 14న హిందీని జాతీయభాషగా రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రజల మధ్య సద్భావన, సంస్కతిని కాపాడడంలో హిందీకి అధికార భాష హోదానిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) రూపొందించారు. అప్పటి నుంచి హిందీ రాజ‡భాషగా హోదాను సంతరించుకుంది. ‘దేవనాగరీలిపి’గా పేరొందిన హిందీని ఎందరో మహాకవులు, రచయితలు సుసంపన్నం చేశారు. వారిలో అనంత వాసులూ ఉన్నారు. వివిధ సేవా కార్యక్రమాలతో పాటు హిందీ ప్రచారానికి తమ వంతు కషి చేస్తూ రాజభాషను అందరికీ దగ్గర చేస్తున్నారు. విద్యార్థి దశనుంచే హిందీపై మక్కువ విద్యార్థి దశనుంచే హిందీపై మక్కువ పెంచుకునేలా ఆ భాషలోనే బోధించేలా ప్రభుత్వం సన్నాహాలు చేయాలి. తెలుగుభాషకు ప్రాధాన్యత కల్పించినట్లు హిందీభాషకు కూడా ప్రాముఖ్యత అందించాలి. ఆంగ్లంపై వ్యామోహాన్ని తగ్గించి జాతీయభాష హిందీని నేర్చుకుని మాట్లాడేలా చొరవచూపాలి. ప్రతి పరీక్షల్లో హిందీభాషలో క్వాలీఫై మార్కులు వస్తేచాలని చెబుతుంటారు. అలా కాకుండా హిందీలో వచ్చిన మార్కులను అన్ని సబ్జెక్టులతోపాటు లెక్కిస్తే హిందీభాషపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది. – వేణుగోపాలాచార్యులు, హిందీ పండిట్ బోధనా భాషగా హిందీని చేర్చాలి జాతీయభాష అయిన హిందీని విస్మరించడం శోచనీయం. ప్రభుత్వం స్పందించి బోధనాభాషగా హిందీని పెట్టి ఆంగ్లంపై ఉన్న వ్యామోహాన్ని తగ్గించాలి. ఇటీవల హిందీ నేర్చుకునేందుకు విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. ఉద్యోగాలు కూడా ఆంగ్లభాష కాకుండా హిందీ వచ్చినవారికే కల్పించేలా ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు చేపట్టాలి. – ఎం.రియాజ్ బాషా, ఉపాధ్యాయుడు, వెల్దుర్తి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల రచనల్లో మేటి డా.జూటూరు షరీఫ్ అనంత కీర్తిని జిల్లా ఎల్లలు దాటించిన హిందీ ప్రచారకులలో జూటూరు షరీఫ్ ఒకరు. ద్విభాషా కవిగా గుర్తింపు పొందిన ఆయన హిందీ పండితునిగా ప్రస్తుతం ధర్మవరం మండలం చిగిచెర్లలో పనిచేస్తున్నారు. భాషా ప్రచారానికి గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. కెరే జగదీష్ రచించిన ‘రాత్రి సూర్యుడు’ రచనకు షరీఫ్ అనువాదం చేసిన ‘నిశిధికీ సూర్య్’ ఎందరినో ఆలోచింపజేసింది. ముఖ్యంగా కబీర్ అకాడమీని స్థాపించి ఎంతో మంది విద్యార్థుల చేత భాషా ప్రవీణ పరీక్షలను రాయిస్తూ హిందీ పట్ల అభిమానాన్ని పెంచుతున్నారు. హిందీ జాతీయ సదస్సుల్లో అనంత తరుపున తరచుగా వెళ్లే షరీఫ్ మాట్లాడుతూ ‘ జాతీయ స్థాయిలో జాతీయ సమైఖ్యతకు ప్రతిరూపంగా నిలిచిన హిందీభాషను చిన్నచూపు చూడొద్దంటారు. సేవకు ప్రతి రూపం ఆరు పదులు దాటిని తరగని ఉత్సాహంతో పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనే సూర్యనారాయణరెడ్డి హిందీ భాషా ప్రచారకునిగానే కాకుండా రచయితగా కూడా మంచి పేరుగడించారు. ‘భారతీయ మైత్రికి ప్రతిబింబమైన హిందీని అందరూ అభ్యసించాలి. దేశంలో అతి ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ. వారి సాహిత్యాన్ని సంస్కతీ ఆచార వ్యవహారాలను తెలుసుకోవడానికి హిందీభాషే చక్కటి వారధి. అంతేగాక ఇతర భాషలను నేర్చుకోవడం, గౌరవించడం ద్వారా ఉత్తమ పౌరులుగా దేశసమగ్రతకు పాటుపడతామన్న సద్భావం అందరూలోనూ రావాలి’ అని ఈ సందర్భంగా సూర్యనారాయణరెడ్డి అన్నారు.