Hindu organizations
-
జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం
లక్నో: జ్ఞానవాపి కేసుపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను తిరస్కరించింది. మసీదు ఆవరణలోని శృంగార గౌరి ప్రతిమకు పూజలు చేసేందుకు అనుమతించాలని హిందూ సంఘాలు వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈనెల 22 నుంచి హిందూ సంఘాల పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని అంజుమన్ ఇంతజామియా కమిటీ తెలిపింది. మరోవైపు వారణాసి కోర్టు తీర్పును హిందూ సంఘాలు స్వాగతించాయి. ఇదీ కేసు.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని తటాకంలో శివలింగాకారం బయటపడిందని, హిందూ నేపథ్యం ఉన్న కారణంగా అక్కడ పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ అక్కడ వీడియో సర్వే నిర్వహించింది కూడా. అయితే.. అది శివలింగం కాదంటూ మసీద్ కమిటీ వాదిస్తోంది. ఆపై సుప్రీం కోర్టుకు చేరిన ఈ వ్యవహారం.. తిరిగి వారణాసి కోర్టుకే చేరింది. కమిటీ రిపోర్ట్ సీల్డ్ కవర్లో వారణాసి కోర్టుకు చేరగా.. అదీ, వీడియో రికార్డింగ్‌కు సంబంధించిన ఫుటేజీలు బయటకు రావడంతో కలకలం రేగింది. చదవండి: ఎట్టకేలకు.. సోనాలి ఫోగట్ కేసులో కీలక పరిణామం -
లక్షమందితో రేపే ధర్మసభ
ముంబై/లక్నో/అయోధ్య: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం హిందూ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఆలయ నిర్మాణం ప్రారంభంపై చర్చించేందుకు విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆదివారం అయోధ్యలో భారీ ధర్మసభను నిర్వహించనుంది. 1992 డిసెంబర్ 6వ తేదీన వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేసిన సమయంలో హాజరైనంతమంది కరసేవకులు ధర్మసభకు వచ్చే వీలుంది. నేడు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే తమ కార్యకర్తలతో కలిసి అయోధ్యకు రానున్నారు. నేతలకు చోటులేదు ధర్మసభకు దాదాపు లక్షమంది కరసేవకులు హాజరవుతారని వీహెచ్‌పీ తెలిపింది. ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే, రాజకీయ సభ కాదని వీహెచ్‌పీ తెలిపింది. ‘ఇక్కడే రామమందిర నిర్మాణ తేదీని ఖరారు చేస్తాం. ధర్మసభతో ఆలయ నిర్మాణంలో ఆఖరి అడ్డంకి తొలగిపోతుంది. దీని తర్వాత ఎటువంటి సభలు, ర్యాలీలు, నిరసనలు, చర్చలు ఉండబోవు’ అని స్పష్టం చేసింది. వేదికపై రాజకీయ నేతలకు చోటులేదని వీహెచ్‌పీ తెలిపింది. ‘ధర్మసభ ప్రధాన వేదికపై కేవలం సాధువులు మాత్రమే కూర్చుంటారు. రాజకీయ నేతలెవ్వరికీ ప్రవేశం లేదని తెలిపింది. ‘ధర్మసభ, ర్యాలీకి లక్షమందికిపైగా వస్తారని భావిస్తున్నాం. ఆర్డినెన్స్ లేదా పార్లమెంట్లో బిల్లు తేవడం ద్వారా మందిర నిర్మాణం చేపట్టేందుకు ఈ కార్యక్రమం ద్వారా కేంద్రానికి గట్టి సంకేతం పంపుతాం’ అని వీహెచ్‌పీ ప్రాంతీయ నిర్వాహక కార్యదర్శి చెప్పారు. 25న నాగ్‌పూర్, బెంగళూరుల్లో, డిసెంబర్ 9న ఢిల్లీలో ఇలాంటి ర్యాలీలు చేపట్టనున్నారు. 17 నిమిషాల్లో కూల్చేశాం.. 1992లో రామ భక్తులు అయోధ్యలో బాబ్రీ మసీదును 17 నిమిషాల్లోనే కూల్చివేశారు. గుడి కోసం ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రభుత్వం ఇంకా ఎంత సమయం తీసుకుంటుందని శివసేన నిలదీసింది. ‘ ఆ మసీదును 17 నిమిషాల్లో కూల్చేశారు. అప్పటి నుంచి ఆ ఖాళీ అలాగే ఉంది. ఆర్డినెన్స్ పత్రాలు తయారు చేసేందుకు, రాష్ట్రపతి భవన్ నుంచి యూపీ అసెంబ్లీకి అవి చేరేందుకు ఎంత సమయం పడుతుంది. అక్కడా ఇక్కడా ఉన్నవి బీజేపీ ప్రభుత్వాలే కదా? అని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. మందిరం కోసం ఆర్డినెన్స్ తేవాలనీ, నిర్మాణ తేదీని ఖరారు చేయాలని శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో డిమాండ్ చేసింది. ‘అయోధ్యలో ప్రస్తుతం రామరాజ్యం లేదు. ఉన్నది సుప్రీంకోర్టు రాజ్యం. మా యాత్రపై పెడార్థాలు తీయడం మానేసి, గుడి కట్టే తేదీ తేల్చండి’ అని కేంద్రాన్ని కోరింది. -
జై బజరంగభళీ
సాక్షి నెట్వర్క్/శివ్వంపేట: జిల్లా వ్యాప్తంగా హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హిందూ సంస్థల కార్యకర్తలు భారీ హనుమాన్ విగ్రహాలతో పట్టణాలలో ప్రదర్శన నిర్వహించారు. ప్రసిద్ధి చెందిన చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయానికి శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందస్వామి వచ్చారు. పూర్ణకుంభ స్వా గతం అందుకున్న ఆయన.. వర్షాలు సమృద్ధిగా కురవాలనే సంకల్పంతో 108 కలశాలతో స్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సైన్స్ కంటే మన పూర్వీకులు ప్రవేశపెట్టిన ఆచారాలు, పద్ధతులు చాలా గొప్పవన్నారు. తల్లిదండ్రులను గౌరవించని వారు సమాజంలో ఉండటానికి అ నర్హులన్నారు. తల్లిదండ్రులతోపాటు గురువు, వైద్యు డు, పాలకులను గౌరవించాలన్నారు. ప్రస్తుతం వర్షాలు లేనందున ప్రతి ఒక్కరు పచ్చదనం పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. హిందూ ధర్మాన్ని కించపరిచేలా పలువురు మాట్లాడుతున్నారని, అది సరికాదన్నారు. చాకరిమెట్ల ఆలయ పరిసరాల్లో గోశాల ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉందని, అందుకు ఎమ్మెల్యే సహకరించాలలన్నారు. ♦ సంగారెడ్డి పట్టణంలో పది అడుగుల ఆంజనేయస్వామి విగ్రహంతో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ ఆకట్టుకుంది. ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి ప్రారంభించారు. ♦ అందోలులో ప్రహ్లాద్ అనే వ్యక్తి హనుమంతుడి వేషధారణ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనడం ఆకర్షించింది. ♦ సిద్దిపేటలో హిందు స్వాభిమాన్ యాత్రను ఘనంగా నిర్వహించారు. రంగధాంపల్లి గ్రామ శివారు పంచవటి హనుమాన్ దేవాలయం నుంచి 12అడుగుల భారీ విగ్రహం తో పట్టణ పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు.